రావణ్ చెరలో సీత – 1
హైదరాబాద్ కి చాలా దూరంగా విశాలమైన స్థలంలో జరుగుతుంది ఒక వివాహం
అందమైన పచ్చని పొలాలు , కొబ్బరిచెట్లు చుట్టూతా ఉండడంతో అందరికీ పల్లెటూరి గాలి యొక్క హాయి అనుభూతి తెలుస్తుంది
అక్కడి వాతావరణం, బందోబస్తు చూస్తుంటే చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది వాళ్ళు చాలా ధనవంతులు అని
ఆ వివాహానికి అటెండ్ అవ్వడం కోసం కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి Ch. వరదరాజులు గారు వస్తుండడంతో చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు కూడా పోలీసులు బందోబస్తుగా నిలబడి ఉన్నారు
అప్పటికే చాలా మంది ప్రముఖులు, MLA , MP లాంటి రాజకీయవేత్తలు , ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుగా వచ్చి మొదటి లైన్ లో కూర్చుని ఉన్నారు
పెళ్లి కొడుకు తండ్రి జగపతిరావు గారు ఎంట్రన్స్ దగ్గర నిలబడి అతిథులు అందరినీ ఆహ్వానిస్తుంటాడు
పెళ్లి కూతురు తండ్రి మనోహర్ గారు పెళ్ళి పనులు చూసుకోవడంతో పాటు వచ్చిన అతిథులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటున్నాడు
అంతలోనే CM గారి కాన్వే రావడంతో అందరూ కూడా ముఖ్యమంత్రి గారి కోసం ఎంట్రన్స్ దగ్గరకు వస్తారు
సెక్యూరిటీ వెంటనే CM గారి కార్ దగ్గరికి వచ్చేసి నాలుగు పక్కల నిలబడి, చుట్టుపక్కల అన్ని క్లియర్ అని మెసేజ్ రాగానే ఒక ఆతను డోర్ తీయగానే వరదరాజులు గారు లోపలికి వస్తారు
జగపతిరావు గారు వెంటనే ఆయన్ని కౌగిలించుకుని ‘ నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది ‘ అని అంటాడు
వరదరాజులు ‘ మన రోహిత్ పెళ్ళి కదా ! రాకుండా ఎలా ఉంటాను ? ‘
జగపతిరావు ‘ సరే కానీ ఒక్కడివే వచ్చావు ! స్వామీజీ రాలేదా ? ‘
వరదరాజులు ‘ స్వామీజీకి ఏదో పని ఉంది అంట , పెళ్లి అయ్యాక ఒకసారి వచ్చి చూస్తాను అన్నారు ‘
జగపతిరావు ‘ ఈ పెళ్ళి కంటే ముఖ్యమైన పనా ? అందరం దీని కోసమే కదా ఎదురు చూసింది, దీని కంటే ముఖ్యమైన పని ఇంకేమైయుంటుంది ? ‘
వరదరాజులు ‘ ఏమో , నాకు కూడా తెలియదు…. పెళ్లిలో అయితే ఎలాంటి తేడా రాదు కదా ? ‘
జగపతిరావు ‘ అసలు రాదు , అన్ని మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి , ఈ పెళ్ళి ఆపాలంటే దేవుడు దిగి రావాలి ‘ అని నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు
మండపంలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ‘ అయ్యా ! పెళ్లికొడుకుని తీసుకురండి ‘ అని చెప్పగానే పెళ్లి కొడుకు స్నేహితులు అతన్ని తీసుకువస్తారు
వైట్ షర్ట్ అండ్ పంచె కట్టుకుని ఆరడుగుల ఆజానుబాహుడులా , నవ్వితే బుగ్గలు కందిపోయేంత తెల్లగా ఉన్నాడు పెళ్లి కొడుకు రోహిత్
రోహిత్ ని చూసి అమ్మాయిలు అందరూ కూడా కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయారు , కన్ను ఆర్పితే ఎక్కడ గ్యాప్ వస్తుందో అని కన్ను కూడా ఆర్పకుండా రోహిత్ నే చూస్తున్నారు
వరదరాజలు గారు పక్కన ఉన్న జగపతి రావు తో ‘ ఎంతైనా మన రోహిత్ అందగాడు రా ! వాడి ముందు హాలివుడ్ యాక్టర్ లు కూడా సరిపోరు ‘ అని అంటూ రోహిత్ ని చూసి ‘ హ్యాండ్సమ్ ‘ అని సైగ చేస్తాడు
రోహిత్ నవ్వుకుంటూ ‘థ్యాంక్స్ అంకుల్ ‘ అని తను కూడా సైగ చేస్తాడు
అంతలో పంతులు గారు ” పెళ్లి కూతురుని తీసుకురండి ‘ అని అనగానే కొంత మంది స్నేహితులతో పెళ్లి కూతురు డోర్ ఓపెన్ చేసి కొబ్బరి కాయ పట్టుకుని వస్తుంది
అందరూ కూడా పెళ్లి కూతురు వైపే చూడడం మొదలుపెట్టారు , రోహిత్ కొంచెం తల ఎత్తి ఎదురు ఉన్నవాళ్ళని చూడగానే అందరూ కూడా పెళ్లి కూతురు వైపే చూస్తుండిపోయారు
రోహిత్ కూడా మనసులో ఎక్సైట్మెంట్ ఆపుకోలేక పెళ్లి కూతురు వైపు చూసాడు , ఒక్క క్షణం రోహిత్ కూడా ఈ ప్రపంచం నుంచి వేరు అయిపోయాడు
ఎర్రని రంగు పట్టుచీర కట్టుకొని, సింపుల్ గా జ్యూయలరీ వేసుకుని , ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసే నేత్రాలతో, స్వర్గలోకం నుంచి వచ్చిన దేవకన్య మాదిరి నడుచుకుంటూ వస్తున్న వైష్ణవి ని చూసి రోహిత్ లేచి నిలబడిపోయాడు
పంతులు గారు రోహిత్ ని చూసి ‘ బాబు మీరు లేవకూడదు ‘ అని అంటుంటే రోహిత్ కి ఈ లోకం ధ్యాసే లేదు, తన కళ్ళు కేవలం వైష్ణవి మీద మాత్రమే ఉన్నాయి
పంతులు గారు ఎంత పిలిచినా రోహిత్ పట్టించుకోకపోవడంతో తన స్నేహితుడు కరణ్ వెళ్ళి తనను కదిలిస్తాడు
రోహిత్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తాడు , అందరూ కూడా నవ్వుకుంటుంటే కరణ్ ని చూసి ‘ పరువు మొత్తం పోయినట్టేనా బావ ‘
కరణ్ ‘ నువ్వు ఇప్పుడు కూర్చోకపోతే ఉన్న కొంచెం పరువు కూడా పోతుంది, సైలెంట్ గా కూర్చో ‘ అని తనని కూర్చోబెడతాడు
రోహిత్ ఒక్కసారి తల పైకెత్తి వాళ్ళ నాన్న వైపు చూడగానే ఆయన లోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు , వరదరాజులు గారి వైపు చూస్తే ఆయన కూడా నవ్వుకుంటున్నాడు
రోహిత్ తల దించేసి మనసులో ‘ పరువు మొత్తం పోయింది కదరా ! ‘ అని అనుకుంటూ పెళ్లి కూతురు వైపు చూస్తాడు …… తను కూడా అతని వైపు చూసి నవ్వుతుంది
రోహిత్ ఆమెని చూసి కవర్ చేసుకోవడానికి ఒక నవ్వు నవ్వుతాడు
పంతులు గారు మంత్రాలు చదువుతుంటే రోహిత్ మనసులో ‘ ఈ పంతులు ఏంటి ఇంత మెల్లగా చదువుతున్నాడు , కాస్త త్వరగా చదివి తాళి కట్టించచ్చు కదా ‘ అని అనుకుంటాడు
రోహిత్ అలా అనుకున్నాడో లేదో పంతులు గారు మంత్రాలు చదవడం ఆపేసి రోహిత్ వైపు చూస్తాడు
సడెన్ గా పంతులు మంత్రాలు ఆపడంతో అందరూ కూడా వాళ్ళ వైపే చూస్తున్నారు
పంతులు గారు ఏం మాట్లాడకుండా ఉంటే రోహిత్ గొంతు సరిచేసుకుని ‘ వినబడిందా ? ‘ అని అడుగుతాడు
పంతులు గారు అవును అన్నట్టుగా తల ఊపుతాడు
అందరి ముందు రోహిత్ తల కొట్టుకోలేక ‘ సారీ ! మీరు కానివ్వండి ‘ అని అంటాడు
వీళ్ళ ఇద్దరిమధ్య ఒక క్లాత్ అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం పెట్టించాడనికి మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారు
పంతులు గారు ‘ బాబు జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టు నాయనా ‘ అని అనగానే రోహిత్ వెంటనే జీలకర్ర బెల్లం తీసుకుని వైష్ణవి తల మీద పెట్టబోతుంటే సడెన్ గా బయట ఉన్న కార్లు బ్లాస్ట్ అయ్యి గాల్లోకి లేస్తాయి
కార్లు బ్లాస్ట్ అవ్వగానే సగానికి సగం మంది భయపడి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు , కాసేపు అంతా కూడా గందరగోళం నెలకొంది
ఉండే కొద్ది గాలి చాలా బలంగా వీయడం మొదలుపెట్టింది, పైన ఏదో హెలికాప్టర్ సౌండ్ వినబడుతుంటే CM గారితో పాటు సెక్యూరిటీ అలాగే జగపతిరావు వాళ్ళు కూడా బయటకు వచ్చారు
CM సెక్యూరిటీ అంతా కూడా ఆ హెలికాప్టర్ వైపే వాళ్ళ గన్స్ ఎయిమ్ చేసి ఉంచారు
హెలికాప్టర్ కిందకి లాండ్ అయింది , హెలికాప్టర్ డోర్ తీసి బయట అడుగు పెడుతున్న వ్యక్తిని చూసి అక్కడ కొంత మంది గుండె ఆగినంత పనైంది
CM వరదరాజులు గారికి ఒక్క క్షణం మెదడు పనిచేయడం ఆగిపోయింది
జగపతి రావు కోపంగా ‘ ఎవడ్రా నువ్వు? ‘ అని అనగానే CM వరదరాజుల గారి నోటి నుంచి ‘ రావణ్ కేశవ్ …… గాడ్ ఆఫ్ శ్రీలంక ‘ అని అంటాడు
జగపతి రావు గారు కోపంగా ‘ ఎవడు అయితే ఏంటి? హే సెక్యూరిటీ…….. ఇంకా చూస్తారు ఏంటి , కాల్చేయండి వాడిని ? ‘ అని అరుస్తాడు
రావణ్ దిగి నడుచుకుంటూ ముందుకు వస్తుంటే అప్పటిదాకా రావణ్ వైపు ఎయిమ్ చేసిన గన్స్ ఇప్పుడు వాళ్ళ వైపు తిరిగాయి
తన సెక్యూరిటీనే తన వైపు గన్ ఎయిమ్ చేయడంతో షాకింగ్ గా రావణ్ వైపు చూస్తాడు
రావణ్ సిగరెట్ వెలిగించుకుని ముందుకు వెళ్తుంటే అతని చుట్టూ సెక్యూరిటీ గన్స్ పట్టుకుని నడుస్తున్నారు
జగపతి రావు కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే సెక్యూరిటీ ఒక అతను వచ్చి తన దగ్గర ఉన్న బాంబు పిన్ పీకేసి జగపతి రావు మీదకి విసిరేస్తాడు
జగపతి రావు భయంగా దాన్ని పక్కన పడేయబోతుంటే వరదరాజులు గారు వెంటనే ” దాన్ని పడేయకు , దాని లివర్ పట్టుకుని అలాగే నిలబడు , అది కింద పడింది అంటే చుట్టూ 2 కిలోమీటర్ల వరకు మొత్తం స్మశానం అవుతుంది ‘ అని అనగానే జగపతి రావు తన రెండు చేతులతో ఆ బాంబు లివర్ ని పట్టుకుని నుంచుంటాడు
ఆ సెక్యూరిటీ వచ్చి ‘ మీ నోటి నుండి ఇంకొక్క మాట వచ్చిన మీ నోట్లో కూడా ఇలాంటి బాంబే పెడతా , ఎక్కడ పడితే అక్కడ నోరు ఉంది కదా అని పారేసుకోకు , వచ్చింది ఎవరో తెలుసా? శ్రీలంక సింహం అక్కడ …… పది తలల రావణాసురుడి భక్తుడు , శ్రీలంకకి రెండో రావణుడు , జస్ట్ సైలెన్స్ ‘
రావణ్ డైరెక్ట్ గా పెళ్లి మండపం మీదకి వెళ్ళి వైష్ణవి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటే రోహిత్ అతని భుజం మీద చెయ్యి వేసి ఆపుతాడు
రావణ్ తల కొంచెం వెనక్కి తిప్పగానే వెంటనే రోహిత్ తలకు గన్ పెట్టి ఉంటుంది , రోహిత్ తిరిగి చూడగానే గన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు పంతులు గారు
రావణ్ ఒక చిన్న నవ్వు నవ్వి వైష్ణవి చెయ్యి పట్టుకొని లాక్కెళ్తాడు , తను వదిలించుకోవాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా రావణ్ చాలా గట్టిగా పట్టుకుని తీసుకెళ్తున్నాడు తనని
వాళ్ళందరి కళ్ళముందే రావణ్ ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటే ఒక్కరు కూడా కదల్లేకపోయారు
అప్పటిదాకా మన మనుషులే అని అనుకున్న వాళ్ళు కూడా సడెన్ గా గన్స్ పట్టుకుని అతని కోసం నిలబడ్డారు
రావణ్ ఆ అమ్మాయిని హెలికాప్టర్ లోకి ఎక్కించి తనని తీసుకుని హెలికాప్టర్ లో శ్రీలంకకి వెళ్ళిపోతాడు
ఇంకా ఉంది…….
మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన్నించండి
అప్డేట్ చదివిన , చదువుతున్న అందరికి కూడా చిన్న విజ్ఞప్తి, స్టోరీ నచ్చితే ఈ బుడ్డి రైటర్ ని సపోర్ట్ చెయ్యండి ప్లీజ్…
అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి ….
Swipe left/right or tap the sides to turn pages