New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
The Rude Husband – 1
The Rude Husband 3 min read

The Rude Husband – 1

సాయంత్రం 7 గంటలు…

 

హైదరాబాద్ నగరానికి కాస్త దూరంగా ఉన్న ఓ భారీ బంగ్లా ముందు బ్లాక్ కలర్ లగ్జరీ కారు వచ్చి ఆగింది.

 

అప్పటివరకు తమ పనుల్లో బిజీగా తిరుగుతున్న సర్వెంట్స్… కారు శబ్దం వినగానే ఒక్కసారిగా ఆగిపోయారు.

 

ఎవరి పని వాళ్లు అక్కడే వదిలేసి తలలు వంచుకుని నిలబడ్డారు.

 

ఆ ఇంట్లో అందరికీ ఒక విషయం బాగా తెలుసు…

 

అభినవ్ కోపంగా ఇంటికి వస్తే… ఆ రోజు ఆ ఇంట్లో నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది.

 

డ్రైవర్ వెంటనే దిగి వెనుక డోర్ తెరిచాడు.

 

కారు నుంచి బయటకు దిగాడు అభినవ్.

 

బ్లాక్ త్రీ పీస్ సూట్… ఆరడుగుల హైట్… జిమ్‌లో చెక్కినట్టున్న ఫిట్ బాడీ… చేతికి ఖరీదైన వాచ్…

 

ముఖంలో ఎప్పుడూ కనిపించే గంభీరత…

 

అతని నడకలోనే ఒక రకమైన అధికారం కనిపిస్తోంది.

 

ఎవరి వైపూ చూడకుండా నేరుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.

 

అతను లోపలికి వెళ్లిపోయాకే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

 

“హమ్మయ్య… ఈరోజుకి బతికిపోయాం!”

 

అని ఒక సర్వెంట్ మెల్లగా అనగానే… పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే అతన్ని మౌనంగా ఉండమన్నట్టు చూశాడు.

 

అభినవ్ మాత్రం ఎవరి మాటలూ పట్టించుకోకుండా మెట్ల వైపు నడిచాడు.

 

హాల్‌లో ఉన్నవాళ్లంతా అతన్ని చూసి మౌనంగా నిలబడ్డారు.

 

అప్పుడే…

 

డైనింగ్ టేబుల్ మీద వంటకాలు సర్దుతున్న సియా అతను వచ్చిన విషయం గమనించింది.

 

ఆమె ముఖంలో తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది.

 

“వచ్చేశారు…”

 

అని మనసులో అనుకుంటూ అతని వైపు చూసింది.

 

అతను ఒక్కసారి అయినా తనవైపు చూస్తాడేమోనని ఎదురుచూసింది.

 

కానీ…

 

అప్పటికే అభినవ్ మెట్లు ఎక్కి పైకి వెళ్లిపోయాడు.

 

ఆమె చిరునవ్వు కాస్త తగ్గింది.

 

అయినా వెంటనే తనను తాను సర్దుకుంది.

 

“భోజనానికి పిలిస్తే వస్తారేమో…”

 

అనుకుంటూ అతని వెనకాల మెట్లు ఎక్కింది.

 

ధడ్…!

 

తలుపు ఒక్కసారిగా బలంగా తెరుచుకుంది.

 

ఆ శబ్దానికి బయట ఉన్న స్టాఫ్ కూడా ఉలిక్కిపడి ఆ వైపు తిరిగి చూశారు.

 

అభినవ్ వేగంగా లోపలికి అడుగుపెట్టాడు.

 

చేతిలో ఉన్న సూట్‌కేస్‌ను కోపంగా బెడ్‌పై విసిరేశాడు.

 

మెడలో ఉన్న టైని ఒక్క లాగుతో తీసి పక్కనే ఉన్న సోఫాపైకి విసిరేశాడు.

 

ఖరీదైన ఇంటీరియర్‌తో, విదేశీ స్టైల్‌లో డిజైన్ చేసిన ఆ లగ్జరీ రూమ్…

 

కొన్ని క్షణాల క్రితం వరకు ప్రశాంతంగా కనిపించింది.

 

కానీ…

 

అభినవ్ లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆ గదిలోని నిశ్శబ్దానికే భయం వేసినట్టుగా అనిపించింది.

 

అతని ఊపిరి వేగంగా నడుస్తోంది.

 

దవడ గట్టిగా బిగిసిపోయింది.

 

పిడికిళ్లు తెల్లబడిపోయేంత బలంగా బిగుసుకున్నాయి.

 

కళ్లలో మండుతున్న కోపం…

 

గుండెల్లో ఉప్పొంగుతున్న బాధ…

 

ఏది ఎక్కువో అర్థం కాని స్థితిలో నిలబడ్డాడు.

 

అతని కళ్లలో కనిపించింది కోపమే…

 

కానీ…

 

ఆ కోపం వెనుక దాగి ఉన్న గాయం ఎంత లోతుగా ఉందో…

 

ఆ గదిలోని గోడలకు కూడా తెలియదు.

 

అప్పుడే…

 

తలుపు మెల్లగా తెరుచుకుంది.

 

“అభినవ్…”

 

సియా స్వరం అతని చెవిలో పడిన క్షణమే…

 

అతని పిడికిళ్లు మరింత బిగుసుకున్నాయి.

 

ఒక్క క్షణం కళ్లను గట్టిగా మూసుకున్నాడు.

 

ఆ స్వరం వినడమే అతనికి అసహనంగా మారిపోయింది.

 

నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు.

 

ఆ చూపులో…

 

కోపం…

 

ద్వేషం…

 

బాధ…

 

అన్నీ కలిసిపోయి కనిపిస్తున్నాయి.

 

సియా మాత్రం భయంగా అతని వైపు చూసింది.

 

“భోజనం రెడీ అయింది… కింద అందరూ వెయిట్ చేస్తున్నారు… మిమ్మల్ని పిలవమన్నారు…”

 

ఆమె మాట పూర్తవకముందే…

 

“చాలు!”

 

అభినవ్ గట్టిగా అరిచాడు.

 

“ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవరు రమ్మన్నారు?”

 

అతని గళం వినగానే సియా ఒక్క అడుగు వెనక్కి వేసింది.

 

“నాకు కాస్త ప్రశాంతంగా ఉండనివ్వలేవా?”

 

“ప్రతిసారీ నా ముందుకు రావాల్సిందేనా?”

 

సియా మెల్లగా తలదించుకుంది.

 

“నేను… భోజనం కోసం మాత్రమే…”

 

“నీ భోజనం… నీ శ్రద్ధ… నీ నటన…

 

ఇవేవీ నాకు అవసరం లేదు.”

 

అతని మాటల్లోని ప్రతి అక్షరం ఆమె గుండెల్లో గుచ్చుకుంటోంది.

 

“నా కళ్ల ముందునుంచి వెళ్లిపో…

 

నిన్ను చూస్తుంటేనే…”

 

ఒక్క క్షణం ఆగాడు.

 

దవడ మరింత బిగిసిపోయింది.

 

“…నాకు అసహ్యం వేస్తోంది.”

 

అంతే…

 

పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్‌ను ఒక్కసారిగా నేలకేసి కొట్టేశాడు.

 

భళ్ల్…!

 

గాజు ముక్కలు గది అంతా చెల్లాచెదురయ్యాయి.

 

ఆ శబ్దంతో సియా ఉలిక్కిపడింది.

 

ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగినా… ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

 

నిశ్శబ్దంగానే వెనక్కి తిరిగి బయటకు నడిచింది.

 

మెట్లు దిగుతున్న సియా చేయి మెల్లగా తన పొత్తికడుపుపైకి వెళ్లింది.

 

ఆమె పెదవులపై చిన్న నవ్వు కనిపించింది.

 

“నా కోసం కాకపోయినా… నీ కోసం అయినా నేను బలంగా ఉండాలి చిన్నా…”

 

మనసులోనే అనుకుంది.

 

ఆమె కడుపులో పెరుగుతున్న ఆ చిన్న ప్రాణమే ఇప్పుడు ఆమెకు ఉన్న ఏకైక ఆశ.

 

డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడింది.

 

అభినవ్‌కి ఇష్టమైన వంటకాలన్నీ తన చేత్తో చేసింది.

 

అతను వచ్చి తింటాడని ఆశపడింది.

 

కానీ ఇప్పుడు…

 

ఆ వంటకాలన్నీ చల్లారిపోతున్నాయి.

 

ఆమె కళ్ల నుంచి ఒక కన్నీటి బొట్టు జారింది.

 

“నేను ఏ తప్పు చేయలేదు…

 

మరి ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు…?”

 

ఆ ప్రశ్నకు సమాధానం ఆమె దగ్గర లేదు.

 

కానీ…

 

ఆ సమాధానం దాగి ఉన్నది రెండు నెలల క్రితం జరిగిన ఒక రాత్రిలో…

 

రెండు నెలల క్రితం…

 

ఒక అందమైన ఉదయం…

 

అభినవ్, సియాల జీవితాల్లో ప్రేమ మాత్రమే నిండిన రోజులు అవి.

 

అప్పుడు అభినవ్ ఆమెను ఎంత ప్రేమించేవాడో…

 

ఆమె కోసం ఎంతగా మారిపోయాడో…

 

అసలు వాళ్ల ప్రేమకథ ఎలా మొదలైంది?

 

ఆ కథ తెలుసుకోవాలంటే…

 

రెండు నెలలు వెనక్కి వెళ్లాల్సిందే…

 

@@@@

 

this is my first story in this app. plz support