New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Varma heart beat – 3
Varma heart beat 3 min read

Varma heart beat – 3

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విహాన్ ఒక్కసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు…

“ఎంత ధైర్యంగా కనిపించినా… లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా కన్నామా నువ్వు…..…” అని మనసులో అనుకున్నాడు… 

 

ఇంటికి చేరుకున్నాక కూడా విహాన్ కార్ ఆఫ్ చేయకుండా అవని వైపే చూస్తూ ఉండిపోయాడు.😍😍

 

 

కన్నామా నిన్ను ఇలా చేసిన వాళ్ళని వదిలి పెట్టాను అని స్టీరింగ్ ని గెట్టిగా పటుకుంటాడు………

 

 

 

కార్ లైట్‌లో ఆమె ముఖం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది.

అలసటతో సీటుకి ఆనుకుని ఇంకా నిద్రలోనే ఉంది అవని.

 

విహాన్ మెల్లగా నవ్వుకుని, “ఇంతసేపు ధైర్యంగా మాట్లాడింది… ఇప్పుడు చిన్నపిల్లలా నిద్రపోతుంది…” అని మనసులో అనుకున్నాడు.

 

ఆమె చేతికి వేసిన బ్యాండేజ్ వైపు చూసి కళ్లలో 🥺చిన్న బాధ కనిపించింది.

 

“నిన్ను ఇలా ఎవ్వరూ హర్ట్ చేయకూడదు అవని…ఇంకోసారి ” అని చాలా నెమ్మదిగా అన్నాడు.

 

అంతలో అవని మెల్లగా కళ్లుతెరిచింది.

తన ముందే విహాన్ చూస్తుండటం గమనించి కొంచెం ఇబ్బందిగా, “సారీ… నిద్రపోయానా?” అంది.

 

విహాన్ వెంటనే తన చూపు తిప్పుకుని, “ఇట్స్ ఓకే… మీ ఇల్లు వచ్చేసింది,” అన్నాడు.

 

 

 

మీకు ఇలా తెలుసు సార్ నా అడ్రస్ అని అడుగుతుంది….. తన bagకి హ్యాంగ్ అవుతున్న id కార్డు చూపిస్తాడు…… ఓహ్.. అని నావి తల కొట్టుకుంది…..

 

 

 

అవని కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దిగింది.

కొద్దిసేపు ఆగి తిరిగి కార్ దగ్గరకు వచ్చి,

“ఈరోజు… థ్యాంక్యూ,” అని చిన్నగా చెప్పింది.

 

 

 

 

విహాన్ చిరునవ్వుతో, “థ్యాంక్స్ చెప్పేంత ఏమీ చేయలేదు,” అన్నాడు.

 

ఇన్ఫక్ట్ నేను చెప్పాలి నీకు థాంక్స్ అంటాడు……

 

నో నీడ్ సార్ అని అంటుంది…… భై సార్ థాంక్ యు ఫర్ డ్రాప్పింగ్ అని అంటుంది…….

 

 

అవని వెళ్లిపోతుంటే… విహాన్ ఆమె వెళ్లే దారినే చూస్తూ ఉండిపోయాడు.

 

 

 

ఆ రాత్రి అతని హార్ట్ హెవీ అవుతుంది……..వెల్లకేయ్ దూరంగా ఇంకా ఎన్ని రోజులు ఇలా కనమ్మ నవల కావట్లేదు……. అని అనుకుంటూ…… కార్ స్టార్ట్ చేస్తాడు…….

 

 

 

 

అవని ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని మరో చేత్తో డోర్ బెల్ కొట్టింది….. 

 

కొద్దిసేపటికే డోర్ తెరిచిన ప్రియా ఆశ్చర్యంగా చూసింది.

 

“ఏమైంది రా ఇంత లేట్? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు… ఇంకా ఈ చేతికి ఏమైంది?” అంటూ టెన్షన్‌గా అడిగింది.

 

అవని అలసిపోయిన స్వరంతో లోపలికి నడుస్తూ.

 

“అరే… ఆ పోకిరిగాడే. చిన్న గొడవ అయింది,” అంది.

 

“వాట్? మళ్లీ ? అసలు వాడిమీద కంప్లైంట్ ఇవ్వాల్సింది!” అంటూ కోపంగా అంది ప్రియా.

 

అవని సోఫాలో కూర్చుంటూ చిన్నగా నవ్వింది.

 

“సరే వదిలేయ్… ఇప్పుడు దాని గురించి మాట్లాడే అంత ఓపిక లేదు…. 

ప్రియా ఇంకా ఏదో అడగబోతుండగా “సారీ ప్రియా…” అని చెప్పి

 

 

“నేను రూమ్‌లోకి వెళ్లి పడుకుంటా…” అని చెప్పి నెమ్మదిగా తన రూమ్‌లోకి వెళ్లింది అవని.

 

బెడ్ మీద పడుకున్న వెంటనే తనకి కళ్లే తెరవలేనంతగా నిద్ర ముంచుకొచ్చింది.

మెడిసిన్ ఎఫెక్ట్ వల……

తనకి తెలియకుండానే డీప్ స్లీప్‌లోకి వెళ్తుంది అవని…….

 

పొద్దున్నే కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచింది.

లేవడానికి ప్రయత్నించగానే బాడీ మొత్తం హెవీగా ఫీల్ అవుతోంది….. . 

 

తల తిరుగుతున్నట్టూ… ఒళ్ళంతా నీరసంగా ఉన్నట్టూ అనిపించింది.

 

 

అవని ఇంకా బెడ్ అంచునే కూర్చుని నీరసంగా ఉండగా…

 

అప్పుడే ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది.

స్క్రీన్ మీద పేరు చూసిన వెంటనే చిన్నగా నిట్టూర్చింది.

 

“సైకో మేనేజర్…” అని తనలోతానే అనుకుంది.

“ఇప్పుడే వచ్చి మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను… మీరే చేసారు,” అని మెల్లగా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది.

“గుడ్ మార్నింగ్ సార్…” అంటూ బలహీనంగా మాట్లాడింది అవని.

 

“మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా ఫీవర్‌గా ఉంది సార్… సో ఈరోజు ఆఫీస్‌కి రాలేను.”

 

అవతల నుంచి కొద్దిసేపు సైలెన్స్ వచ్చింది.

“సారీ అవని,” అంటూ మేనేజర్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

“నేను నీకు లీవ్ సాంక్షన్ చేస్తాను… but వెంటనే చేయలేను.”

 

అవని కనుబొమ్మలు ముడిచింది.

“నువ్వు ఒక క్లైంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇది వాళ్లతో లాస్ట్ మీటింగ్. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఇంకా ఆ క్లైంట్ మొత్తం నీ హ్యాండ్లింగ్‌లోనే ఉన్నాడు… so నేనేం చేయలేను. ప్లీజ్…

జస్ట్ హ్యాండిల్ ఇట్ ఫర్ టుడే…

 

“సార్… ప్లీజ్…” అంటూ అవని అలసిన స్వరంతో అంది.

“ఒక్క మీటింగ్ అవని. మీటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపో. కావాలంటే వన్ వీక్ లీవ్ తీసుకో… ఆ తర్వాత నేను మేనేజ్ చేస్తాను.”

అది విన్న అవని నిరాశగా కళ్లుమూసుకుంది.

 

 

“అరే…” అని మెల్లగా అనుకుని,

“ఓకే సార్… వస్తాను,” అంది.

 

కాల్ కట్ అయిన వెంటనే కొద్దిసేపు అలాగే కూర్చుంది.

“తప్పదు కదా…” ఒప్పుకున్నా పెళ్లికి వాయించక తప్పుతుందా…..అని తనలోతానే అనుకుని నెమ్మదిగా లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టింది… 

 

 

అవని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతుండగా, ప్రియా లోపలికి వచ్చింది.

 

“ఏమైంది? నిజంగానే ఆఫీస్‌కి వెళ్తున్నావా?” అంటూ దగ్గరకు వచ్చింది.

అవని ఏమీ మాట్లాడకపోవడంతో ప్రియా ఆమె నుదుటిపై చెయ్యి పెట్టింది.

 

“అబ్బా అవని! ఇంత జ్వరంగా ఉంది… ఎక్కడికి రెడీ అవుతున్నావ్ నువ్వు?” అంటూ టెన్షన్‌గా అడిగింది.

 

“క్లైంట్ మీటింగ్ ఉంది రా… తప్పదు. వెళ్లాలి,” అంది అవని.

 

ప్రియా అసహనంగా చూసింది.

 

 

“అట్లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయినా చేసి వెళ్లు.”

“తినాలనిపించడం లేదు…”

 

“సరే… అయితే ఈ జ్యూస్ అయినా తాగు,” అంటూ వెంటనే కిచెన్ నుంచి జ్యూస్ తీసుకొచ్చింది.

 

అవని బలవంతంగా గ్లాస్ తీసుకుని కొద్దికొద్దిగా తాగింది.

 

“థ్యాంక్స్…” అని చిన్నగా చెప్పింది.

కొద్దిసేపటికే క్యాబ్ బుక్ చేసుకుని కిందికి వచ్చింది అవని.

 

మీ మోనిషా ✨✨

 

 

కామెంట్స్ ప్లీజ్ 🤌🤌