విలన్ హస్బెండ్ – 25

Sravani Naramala

Author

రుద్రాన్ష్ తన చేతిలో బొకే పెట్టిన శ్రియ వైపు లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేసి తన వైపు బొకే వైపు మార్చి మార్చి చూస్తూ కాసేపటికి తన చూపు తిప్పేసి బొకే టేబుల్ మీద పెడుతూ తన టేబుల్ మీద ఉన్న మెనూ కార్డ్ తీసుకుని ఎమ్ ఆర్డర్ చేయాలా అని చూస్తూ ఉంటాడు…. రుద్రాన్ష్ చూసిన చూపుకు అంత ఏ. సి లో కూడా చమటలు పట్టిన తన ఫేస్ ను చీర కొంగు తో తుడుచుకుంటూ రుద్రాన్ష్ తనకు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్న శ్రియ కి రుద్రాన్ష్ తన వైపు కూడా చూడకపోవడం తో ఎక్కడలేని ఉక్రోషం పుట్టుకొస్తుంది…..

రుద్ర్ నా గురించి ఎమ్ థింక్ చేస్తున్నాడు తన కోసమే కదా నేను ఇంత బ్యూటీఫుల్ గా రెడీ అయి వచ్చాను ఎట్ లీస్ట్ నా వైపు చూసి బావున్నావ్ అంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను …. తన కోసం 2 అవర్స్ కష్టపడి రెడీ అయితే నా వైపు 2 మినిట్స్ కూడా చూడ్డం లేదు ఈ రోబో కి నా లవ్ గురించి ఎలా కన్వే చేయాలి చేసినా యాక్సెప్ట్ చేస్తాడా?? ఆంటీ ఏమో రుద్ర్ కి ఇండియన్ ట్రెడిషన్ అంటే ఇష్టం సో నువ్వు ఇండియన్ గర్ల్ లా రెడీ అయితే పక్కా ఇంప్రెస్ అవుతాడు అంది బట్ ఇక్కడ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు 😤😖