New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 4

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 4

“నువ్వు ఇవ్వవు అని తెలుసు… కానీ నేనే తీసుకుంటాను” అని అఖిల్ సరదాగా అంటూ సత్యను బెడ్‌పై కూర్చోబెట్టి తన దగ్గరికి తీసుకుంటాడు.

 

ఆమె నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకుంటూ, మెడపై ప్రేమగా ముద్దులు పెడుతూ తనని ఆటపట్టిస్తూ ఉంటాడు.

 

నెమ్మదిగా ఆమెను దగ్గరికి తీసుకొని పెదవులపై చిన్నగా కిస్ చేస్తాడు.

 

సత్య కూడా సిగ్గుపడుతూ అతని వైపు చూస్తూ ఉంటుంది.

 

అలా ఇద్దరూ కొద్దిసేపు ప్రేమగా ఒకరినొకరు దగ్గరగా హగ్ చేసుకొని, తమ మధ్య ఉన్న ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటారు.

 

అంతలో బయట నుంచి అత్తయ్య, మావయ్య వాళ్ల మాటలు వినిపించడంతో ఇద్దరూ వెంటనే సర్దుకుని ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి వస్తారు.

 

వాకింగ్‌కి వెళ్లిన వాళ్లు కూడా అప్పటికే ఇంటికి వచ్చేస్తారు.

 

“ఏమైంది… ఇంతసేపు రూమ్‌లోనే ఉన్నారు?” అని అత్తయ్య అడగడంతో,

 

“ఏం లేదు అత్తయ్య… కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం” అని సత్య నవ్వుతూ చెప్తుంది.

 

అలా కొంచెంసేపు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు.

 

తర్వాత సత్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్లి, ఫ్రెష్ అయ్యి త్వరగా రెడీ అయి వాళ్ల దగ్గరికి వస్తుంది.

 

రావడంతోనే పూజ మందిరానికి వెళ్లి దేవుడికి దీపారాధన చేసి, పూజ చేసి అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటుంది.

 

పూజ కంప్లీట్ అయిన తర్వాత హాల్లోకి వస్తుంది.

 

“మీరందరూ కూడా ఫ్రెష్ అవ్వండి” అని సత్య చెప్తుంది.

 

వెంటనే కిచెన్‌లోకి వెళ్లి అందరి కోసం ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది.

 

అందరూ జ్యూస్ తాగిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి ఎవరి రూమ్‌లోకి వాళ్లు వెళ్లిపోతారు.

 

సత్య కూడా జ్యూస్ తాగి, నైట్ డిన్నర్ కోసం కిచెన్‌లోకి వెళ్తుంది.

 

డైలీ నైట్ అందరూ చపాతీ, చోలే కర్రీ తింటారు. అందుకే ఈరోజు కూడా చపాతీ, చోలే కర్రీ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్లిపోతుంది.

 

చపాతీ పిండి కలిపి ఒక పక్కన పెట్టుకుంటుంది.

 

మరోపక్క చోలే కర్రీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేస్తున్న సమయంలో పిల్లలిద్దరూ వచ్చి,

 

“మమ్మీ… నీకు హెల్ప్ చేయమా?” అని అడుగుతారు.

 

“వద్దు నాన్నా… మీరు నానమ్మ వాళ్లతో పాటు టైమ్ స్పెండ్ చేయండి” అని చెబుతుంది సత్య.

 

“మర్చిపోయాను… మీరు హోంవర్క్ కూడా చేయలేదు కదా. డాడీ ఉన్నారు కదా… డాడీతో హోంవర్క్ చేయించుకోండి. వెళ్లి హాల్లో కూర్చోండి” అని చెప్తుంది.

 

“అలాగే మమ్మీ” అని పిల్లలిద్దరూ చెప్పి హోంవర్క్ చేయడానికి వెళ్లిపోతారు.

 

అఖిల్ వాళ్లది చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అఖిల్, సత్య, పిల్లలిద్దరూ మాత్రమే ఉంటారు.

 

అఖిల్‌కి ఒక అక్క కూడా ఉంది. అక్కకి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

బావకి సొంతంగా బట్టల ఫ్యాక్టరీ ఉంటుంది. అక్క కూడా బావకి హెల్ప్‌గా ఉంటుంది.

 

అఖిల్ వాళ్ల ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటారు.

 

అఖిల్ వాళ్ల అక్క సుప్రియ వాళ్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారు.

 

ఇద్దరూ ఒకే ఊర్లో ఉండడంతో ఒకరి ఇంటి నుంచి మరొకరి ఇంటికి వెళ్లడానికి దాదాపు హాఫ్ ఎన్ అవర్ టైమ్ పడుతుంది.

 

అలా అప్పుడప్పుడు రెండు ఫ్యామిలీలు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 

సత్య వాళ్ల అమ్మానాన్న ఇద్దరూ సత్య పెళ్లి అయిన తర్వాత జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయారు.

 

సత్య ఒక్కగానొక్క కూతురు కావడంతో, వాళ్ల అమ్మానాన్నకి సొంతంగా ఉన్న పొలాలను సత్య పేరు మీద రాసి పెట్టారు.

 

అఖిల్ వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏమీ కాదు… కొంచెం డబ్బున్న ఫ్యామిలీనే.

 

కానీ అందరూ చాలా నార్మల్‌గా ఉంటారు. ఎక్కువగా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ ఫ్యామిలీలో ఎవరూ లేరు.

 

అందరూ ప్రేమ, ఆప్యాయతలతో కలిసి ఉంటారు.

 

ఇంకా సత్య చపాతీ పిండి తీసుకొని చపాతీలు చేస్తూ ఉంటుంది.

 

తనకి హెల్ప్ చేయడానికి అత్తగారు కూడా కిచెన్‌లోకి వస్తారు.

 

“వద్దు అత్తయ్యగారు… నేనే చేస్తాను. మీరు వెళ్లి కూర్చోండి” అని సత్య చెప్తుంది.

 

“పర్లేదు తల్లి… పొద్దున్నే అటు హడావిడిగా చేస్తావు కదా. అసలే మమ్మల్ని ఏ పని చేయనివ్వవు. ఏదో కొంచెం హెల్ప్ చేస్తాము” అని అంటారు.

 

“పర్లేదు అత్తయ్యగారు… మీరు పెద్దవాళ్లు కదా నేను చూసుకుంటాను. మీరు వెళ్లి కూర్చోండి” అని సత్య చెప్తుంది.

 

తనని ఇంక పని చేయనివ్వదని అర్థమవడంతో, అత్తగారు అక్కడే ఒక టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా కోడలితో మాట్లాడుకుంటూ ఉంటారు.

 

అలా సత్య చపాతీలు చేస్తూ, అత్తగారితో మాట్లాడుకుంటూ ఉంటుంది….

 

ఇంట్లో అందరూ కలిసి ఉండడంతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది…

 

నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్…

 

మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు.. 🥰🥰🥰

 

చదివి వెళ్లిపోకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. 🙏🙏🙏

 

బై

 

మీ Chinni ❤️