శివ, సాహిత్యలు ఆఫీస్ మీటింగ్ సక్సెస్ అయిన ఆనందంలో ఆఫీస్ నుండి బయటకు వచ్చి, రోడ్డు పక్కన ఉన్న ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆగారు. శివ బైక్ స్టాండ్ వేసి, “సరే రౌడీ.. ఈరోజు ఆఫీస్‌లో నా పెన్‌డ్రైవ్ తెచ్చి నా పరువు కాపాడావు కదా. నీకు ఇష్టమైన బెల్జియం చాక్లెట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాను తిను” అన్నాడు నవ్వుతూ.
“మరి ఏమనుకున్నావు బావా? నీ మరదలు ఎంత స్మార్టో నీకు ఇప్పుడైనా తెలిసిందా?” అంటూ సాహిత్య స్టైల్‌గా కళ్లజోడు తల మీద పెట్టుకుని పార్లర్ లోపలికి నడిచింది.