వలయం – 3
వలయం -3
“నా సంగతి సరే, ఇంతకీ ఉదయ్ కొత్త బిజినెస్ ఏదో పెట్టాలి అంటున్నాడు అన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది మీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ ఇప్పటికైనా తీరాయా” అని అడిగింది కల్పన..
“ఫ్యామిలీ ప్రాబ్లంస్ ఇంకా తీరలేదు, అమ్మవాళ్ళకి ప్రతివారం ఫోన్ చేస్తున్నాను కానీ నా ఫోన్ అటెండ్ చేయడం లేదు, చెల్లికి ఫోన్ చేస్తుంటే అమ్మ వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు అక్క నేను నీతో మాట్లాడుతున్నాను అని తెలిస్తే నా మీద కూడా కోప్పడతారు ఏమో అని భయం వేస్తుంది అని చెప్తుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయ్ ఏమో మనకి పిల్లలు పుడితే అంత సర్దుకుంటుంది అంటున్నాడు, కానీ పెళ్లి అయ్యి మూడు సంవత్సరాల దాటిన ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు ఏం చేయాలో తెలియటం లేదు” అని అన్నది నిధి..
“ఎక్కువగా ఆలోచించొద్దు లవ్ మ్యారేజ్ కదా, అది కాక వాళ్ళ పేరెంట్స్ పల్లెటూరి వాళ్ళు అక్కడ పట్టింపులు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీ పేరెంట్స్ కి లవ్ మ్యారేజ్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు. మీరు హ్యాపీగా ఉన్నారు అని వాళ్లకు కనిపిస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తారులే. మీ సంతోషం కంటే మీ పేరెంట్స్ కి ఏం కావాలి” అని నిధి భుజం తట్టి చెప్పింది కల్పన.
“ఏమో ఏం జరుగుతుందో ఎప్పుడు వాళ్ళు మా దగ్గరికి వస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాను” అని అన్నది నిధి..
“నీ ఎదురుచూపులు ఫలించే రోజు త్వరలోనే వస్తుందిలే” అని నవ్వుతూ అన్నది కల్పన.
“హాయ్ బావ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్..?” అని ఒక మెకానిక్ షెడ్ దగ్గర కనిపించిన ఉదయ్ ని తన స్కూటీ రిపేర్ కోసం వచ్చిన ఉదయ్ మరదలు అయినా రమ్య అడిగింది..
ఎవరు నన్ను పిలుస్తుంది అని అనుకుంటూ వెనక్కి తిరిగిన ఉదయ్ కి తన మరదలు రమ్య కనిపించడంతో నవ్వుతూ “ఎలా ఉన్నావ్ రమ్య..? బాగున్నావా..?” అని హ్యాపీగా చాలా రోజుల తరువాత తన ఫ్యామిలీ మెంబర్ ఒకరు కనిపించారు అన్న ఆనందంతో దగ్గరకు తీసుకొని అడిగాడు.
“నేను బాగున్నాను బావ నువ్వేంటి ఇక్కడ..? జాబ్ పోయింది బిజినెస్ లో నష్టపోయావ్.. ఇప్పుడు ఏం చేస్తున్నావ్..?” అని అడిగింది రమ్య..
రమ్య మాటలకి ఉదయ్ మనసు చివక్కమన్నా కూడా పట్టించుకోకుండా పైకి నవ్వుతూ “ఏదోలే చేస్తున్నానులే గాని నువ్వేంటి ఇక్కడ..?” అని అడిగాడు ఉదయ్.
“స్కూటీ రిపేర్ అయింది బావ అందుకే రావాల్సి వచ్చింది” అని అన్నది రమ్య.
“అవునా సరే నేను చెక్ చేస్తాను” అంటూ ఉదయ్ చెక్ చేసి, టైం పడుతుంది ఇక్కడే ఉంటావా, లేదంటే స్కూటీ ఇక్కడ పెట్టి తర్వాత వస్తావా..?” అని అన్నాడు ఉదయ్..
“నువ్వేదో మెకానిక్ అయినట్టు అలా మాట్లాడుతున్నావ్ ఏంటి బావ” అని అన్నది రమ్య..
ఉదయ్ నవ్వుతూ “నీ స్కూటీ ని మెకానిక్ చూడాల్సిన అవసరం లేదు, నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానంతో చెప్తున్నాను, కావాలి అంటే నువ్వు అనుకున్న ఆ మెకానిక్ కూడా వచ్చి ఇదే విషయం చెప్తాడు, రేపు రండి మేడం అని, కావాలంటే అడుగు” అని చెప్పి ఉదయ్ చేతులు కట్టుకుని రమ్య వైపు చూస్తుంటే,
రమ్య డౌట్ గా ఉదయ్ వైపు చూస్తూనే మెకానిక్ తో మాట్లాడింది.
అతను స్కూటీని రెండు నిమిషాలు చెక్ చేసి “టైం పడుతుంది మేడం ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలియటం లేదు మీరు స్కూటీ ఇక్కడ పెట్టి రేపు రాగలరా” అని అన్నాడు.
రమ్య ఓకే అని అతనికి చెప్పి,
” అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు బావ, నీకు ఇదంతా ఎలా తెలుసు” అని ఆశ్చర్యంగా అడిగింది.
“ఏదో కొంచెం తెలుసు, చాలా రోజుల తర్వాత కనిపించావు కదా, పదా మన ఇంటికి వెళ్దాం” అని అన్నాడు ఉదయ్..
“హమ్మో నీతో కలిసి మాట్లాడాను అని ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అదే మీ ఇంటికి వచ్చాను అని తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్ నేను రాను” అని రమ్య భయంగా అన్నది.
ఉదయ్ బాధగా ఫేస్ పెట్టి “సరేలే మాతో మాట్లాడి నువ్వెందుకు ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, సరే నిన్ను డ్రాప్ చేస్తాను బైక్ ఎక్కు. ఎక్కడ ఉంటున్నావ్..?” అని అడిగాడు ఉదయ్.
“ఇక్కడ దగ్గర్లోనే హాస్టల్లో ఉంటున్నాను బావ” అని చెప్పి ఉదయ్ బైక్ ఎక్కి కూర్చుంది రమ్య.
ఇక ఉదయ్ కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ రమ్యకి మాత్రం ఉదయ్ ని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎంతగా బాధపడుతున్నాడో,
ఇప్పుడు తనని చూసి ఎగ్జిట్ అవుతూ నవ్వుతూ మాట్లాడినప్పుడే ఆమె అర్థం చేసుకుంది. తను రాను అంటే ఉదయ్ ఎంత బాధగా ఫీల్ అవుతున్నాడు అనేది కూడా అర్థం చేసుకుంది.
అయినా ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళ్తే అమ్మ వాళ్లకి ఎవరు చెప్తారులే, వెళ్దాం.. అక్క కూడా చాలా మంచిది అని అంటుంటే విన్నాను. వీళ్లిద్దరు ఎలా ఉంటున్నారో ఏంటో ఒకసారి వెళ్లి చూసి ఆ విషయం అత్తయ్య వాళ్ళకి చెప్తే కనీసం వాళ్ళయినా బావ దగ్గరకు వస్తారు కదా అని అనుకొని “బావ నేను మన ఇంటికి వస్తాను అక్కని చూస్తాను అప్పుడెప్పుడో పెళ్లికి ముందు నువ్వు ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు చూసాను, అది కూడా అందరూ కోపంతో ఉన్నారు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయాను అందుకని ఇప్పుడు వచ్చి అక్కతో కాసేపు టైం స్పెండ్ చేస్తాను” అని అన్నది రమ్య..
“నిజంగా వస్తావా..?” అని ఆనందం ఎక్సైట్మెంట్తో బైక్ ని పక్కకు ఆపి మరీ అడిగాడు ఉదయ్.
“నిజంగా వస్తాను బావ” అని రమ్య నవ్వుతూ చెప్పింది.
“థాంక్యూ రమ్య మన ఫ్యామిలీలో ఎవరు నాతో సరిగా మాట్లాడకపోతుంటే బాధగా అనిపించేది. ఇప్పుడు నువ్వు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది” అని వెంటనే రమ్యనే తన ఇంటికి తీసుకొని వచ్చాడు.
“ఐ యాం సారీ బావ నేను కూడా ఫస్ట్ నువ్వు అడిగిన వెంటనే రాను అన్నాను కదా ఇకపైన అలా చెప్పనులే” అని అన్నది రమ్య.
రా రమ్య అంటూ ఉదయ్ ఆమెను ఇంటి లోపలికి తీసుకొని వచ్చి “నిధి మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు” అని అన్నాడు ఉదయ్..
“ఎవరు వస్తారు మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతే కదా, అంతకుమించి ఎవరు వస్తారు మీరు ఇంత ఎక్సైట్మెంట్తో చెబుతున్నారు” అని కిచెన్ లో ఉన్న నిధి బయటకు వచ్చి చూసింది.
ఉదయ్ పక్కనే నవ్వుతూ ఉన్న రమ్యను చూసిన తర్వాత ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి. ఆ మరుక్షణం రమ్య అని పిలిచింది నిధి..
“అక్క నువ్వు నన్ను భలే గుర్తుపట్టావు, నేనైతే నిన్ను అసలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా, అప్పుడు ఎప్పుడో చూశాను. ఎలా ఉన్నావ్ అక్క” అంటూ నిధి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అడిగింది రమ్య..
“నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావ్..? నువ్వైనా మా ఇంటికి వచ్చావ్ హ్యాపీ” అని అన్నది నిధి..
రమ్య వెనక్కి తిరిగి ఉదయ్ వైపు చూసి “మీ ఇద్దరి జంట చాలా బాగుంది అక్క” అని అన్నది..
“ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్ ఏం చేస్తున్నావ్..?” అని నిది మాట్లాడుతూనే ఉంది.
రమ్య కూడా నిధితో కలిసిపోయి మాట్లాడుతుంది.
ఉదయ్ వాళ్ళిద్దరినీ చూస్తూ “నేను ఒకడిని ఇక్కడే ఉన్నాను మర్చిపోయారా..? అయినా ఇంటికి వచ్చిన అతిధికి ఏమైనా చేసి పెట్టాలి అని తెలియదా..?మాటలతోనే కడుపు నింపేస్తావా ఏంటి..?” అని అన్నాడు ఉదయ్.
“అయ్యో మర్చిపోయాను నీకోసం ఏం చేయమంటావ్ స్పెషల్ గా నువ్వు అడిగింది చిటికెలో చేసి పెడతాను” అని అన్నది నిధి..
“అయ్యో అక్క నాకోసం నువ్వు ఏమి స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో ఏమైతే చేసుకుంటారో అదే నాకు పెట్టండి తింటాను చాలు” అని అన్నది రమ్య..
“ఓకే ఇప్పుడే చేస్తాను” అంటూ నిధి కిచెన్ లోకి వెళ్లి ఫుడ్ ప్రిపరేషన్ లో బిజీ అయిపోయింది.
ఆ తర్వాత ముగ్గురు కలిసి కూర్చొని హ్యాపీగా తిన్నారు. నైట్ రమ్య అక్కడే పడుకుంది.
ఇద్దరు సంతోషంగా ఉండటం రమ్య తన కళ్లతో తాను చూసింది.
ఉదయం లేచి తన హాస్టల్ కి వెళ్ళిపోయింది రమ్య.
“మన ఇంటికి ఇలా ఒక మనిషి వస్తే ఎంత బాగుందో” అని నిధి అన్నది..
“బాగుంటుంది బాగుంటుంది పక్కన ఉన్న నన్ను పట్టించుకోవు కానీ..” అని అతను సాగదీస్తుంటే,
” చాల్లే సంబడం” అని అతడిని కొట్టి అన్నది నిధి..
“ఈరోజు సండే కదా స్పెషల్ గా ఏమైనా చేయొచ్చు కదా నిధి” అని గారాలపోతూ తన భార్యను అడిగాడు ఉదయ్..
“ఏం చేయమంటారో అయ్యగారు” అని ఆమె కూడా నవ్వుతూ అతని గడ్డం పట్టుకుని అడిగింది.
“ఏదైనా పర్లేదు ఒక స్వీట్, స్పెషల్ గా చికెన్ లో ఏదైనా రెసిపీ చేస్తే కడుపునిండా తినేస్తాను” అని అన్నాడు ఉదయ్..
“సరే అయితే నేను లడ్డు చికెన్ లాలీపాప్ చేస్తాను” అని కిచెన్ లోనికి వెళ్ళిపోయింది నిధి.
“నా మంచి భార్య” అని ఆమెకు వెనుక నుండి ఫ్లయింగ్ ఇస్తూ అన్నాడు ఉదయ్.
నిధి నవ్వుకుంటూ లడ్డుకి కావలసిన శెనగపిండి కలుపుకొని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటూ బిజీగా ఉంది.
కరెక్ట్ గా అప్పుడే నీరజ్ ఉదయ్ కి ఫోన్ చేశాడు.
“ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు” అని అడిగాడు.
“ఇంతకుముందు నువ్వు బిజినెస్ పెట్టాలి మనీ కావాలి నిధిని అడగలేక పోతున్నాను అన్నావు కదా, నేను ఒక స్పాన్సర్ తో మాట్లాడాను రా, నీ ఐడియాలజీ వాళ్లకు నచ్చితే మనీ ఇస్తాను అన్నారు. ఇప్పుడు నువ్వు హోటల్ కి రాగలవా..?” అని అతడు ఉంటున్న హోటల్ అడ్రస్ చెప్పి అడిగాడు నీరజ్.
“అవునా సరే అయితే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను” అని కనీసం నిధికి బయటకు వెళ్తున్నాను అనే విషయం కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోయాడు. లేట్ అయితే ఆ స్పాన్సర్ వెళ్ళిపోతాడేమో ఆ తర్వాత మనీ దొరకవు ఏమో అన్న ఎగ్జిట్ మెంట్ తో వెళ్లిపోయాడు.
నిధి తన భర్త కోసం ఇష్టంగా లడ్డు చేయడానికి పోయి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి గ్యాస్ వెలిగించింది.
అంతే ఒక్కసారిగా డబ్ మని గట్టిగా సౌండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
కొనసాగుతుంది
ప్లీజ్ స్టోరీ చదివిన తర్వాత కామెంట్ పెట్టండి అప్పుడే మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు తెలుస్తుంది స్టోరీ మీకు నచ్చుతుందో లేదో కూడా అర్థమవుతుంది.
Swipe left/right or tap the sides to turn pages