కొన్ని రోజులు సాఫీగా గడిచాయి. రాహుల్ ట్యూషన్ పని మొదలుపెట్టాడు. వారానికి మూడు రోజులు సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు పదో తరగతి పిల్లలకు మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పటిలాగే మామూలుగా ప్రవర్తిస్తాడు. నాన్నకు తెలియకుండా, అమ్మకు అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉంటాడు.