New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మధురమే ఈ హృదయం – 5

మధురమే ఈ హృదయం – 5

కాసేపు అక్కడే ఎవరికీ కనపడకుండా దాక్కున్న అమ్మాయి అందరూ వెళ్లిపోయారని గ్రహించి చిన్నగా వెళ్లబోతున్న ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి…

 

 

మా నుంచి తప్పించుకోగలను అనే అనుకుంటున్నావా..? అని వికృతంగా నవ్వుతాడు ఒకడు…

 

 

వాడ్ని వెనక్కి తోసేసిన ఆ అమ్మాయి అక్కడ నుండి పక్కనే ఉన్న లేక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ వెనక వాళ్ళు వస్తున్నారేమో అని వెనక్కి చూస్తూ ముందుకు పరిగెడుతుంది…

 

 

చాలా సేపు అక్కడే నిలబడ్డ సిద్ లేక్ వైపే తిరిగుండి వెనక్కి నడుస్తూ ఉంటే ముందుకు పరిగెడుతున్న ఆ అమ్మాయి సిద్ వెనక వైపుగా వచ్చి తగులుతుంది…

 

 

పరధ్యానంలో ఉన్న సిద్ ఆమె తగిలేసరికి ముందుకు పడబోయి పాదం నేలను అదిమిపెట్టి పడకుండా కంట్రోల్ చేసుకుంటే ఆ అమ్మాయి అతడ్ని దాటుకొని ముందుకు పరుగు తీస్తుంది…

 

 

యు ఇడియట్ అనుకుంటూ వెనక్కి తిరిగిన సిద్ కి ఓ అమ్మాయిని వెంబడిస్తూ కనిపిస్తారు రౌడీలు…

 

 

హలో బాస్ అని వాళ్ళని ఆపిన సిద్ ప్రాబ్లెమ్ ఏంటని అడుగుతాడు…

 

 

అతడ్ని పై నుండి కింద వరకు చూసిన ఓ బలిసిన బాడీ నీకవసరమా అంటాడు పొగరుగా…

 

 

అతడి సమాధానం నచ్చక కు మీద ఓ పంచ్ ఇస్తాడు సిద్.. 

 

 

గిద్దడు రక్తం ముక్కు రంద్రాల నుండి కారి వాడికి దిమ్మ తిరిగితే వాడి తోటి జనులు సిద్ మీదకి దాడికి దిగుతారు…

 

 

అందర్నీ రెండు పంచులకే పడుకోపెట్టిన సిద్ కిందపడి మూలుగుతున్న వల్ల దగ్గరకు వెళ్ళి మోకాలి మీద చెయ్యి ఆనించుకుని కూర్చోని ఏంట్రా ప్రాబ్లెమ్ అంటాడు…

 

 

మేమెవరో నీకు తెలియదు.. తెలిస్తే మమ్మల్ని టచ్ కూడా చెయ్యలేవు అంటాడు వాళ్ళు మూలుగుతూ…

 

 

ఎవడివేంటి నువ్వు…??

 

 

సహదేవ్… సహదేవ్ అన్న మనిషులం…

 

 

ఆ పేరు విన్న సిద్ బృకుటి ముడిపడితే వెనక ఎవరూ రాకపోవడం తెలిసి వెనక్కి తిరిగి చూస్తుంది ఆ అమ్మాయి సిద్ రౌడీలని కొడుతున్నప్పుడు….

 

 

సిద్ మొహం కనపడగానే ముందు షాక్ అయ్యి తరవాత కంగారు ఎక్కువయ్యి ఆమె మొహం కనపడకుండా లీవ్ చేసున్న జుట్టుతో మొహం దాచుకొని అటుగా వస్తున్న ఆటోని ఆపుతుంది…

 

 

అక్క ఎక్కడికి వెళ్ళాలని పాన్ నములుతున్న ఆ ఆటో డ్రైవర్ తో తర్వాత చెప్తానని ఆటో ఎక్కేసి త్వరగా పోనివ్వమని కంగారు పెట్టిన ఆ అమ్మాయి ఆటో లో నుండి తల బయటకు పెట్టిన ఆ అమ్మాయిని చూస్తాడు సిద్…

 

 

సహదేవ్ అనే పేరు తలచుకుంటూ ఎరుపేక్కిన కళ్లతో విసురుగా వెనక్కి తిరిగిన సిద్ ఆటోలో వెళ్తున్న ఆ అమ్మాయిని  చూసి హే ఆగని ఆ అమ్మాయి వెనక పడతాడు…

 

 

అన్న త్వరగా పోనివ్వని తొందర పెడుతున్న ఆ అమ్మాయి ఆటో మిర్రర్ నుండి సిద్ పరిగెత్తడం చూసి ఓహ్ గాడ్ అని తల పట్టుకుంటుంది…

 

 

చాలా దూరం ఫాలో చేసిన సిద్ తన మొబైల్ లో ఆగకుండా మొగుతున్న ఫోన్ కి తన అది తన ప్రొఫిషనల్ కాల్ అని అర్థం అయ్యి ఆటో నెంబర్ నోట్ చేసుకొని కాలర్ ఐడి చూసి కాల్ అటెండ్ చేస్తాడు…

 

 

హలో సర్, ఇస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్…??

 

 

ఎస్ సిద్, లండన్ లో నేను అటెండ్ చెయ్యాల్సిన కేస్ ఒకటుంది..ప్రెసెంట్ నా హెల్త్ అంతగా బాగుండట్లేదు.. సో నువ్వు ఆ పేషెంట్ ని అటెండ్ అయ్యి కేస్ హ్యాండిల్ చెయ్యాలి…

 

 

ఇప్పుడు లండన్ వెళ్లే మూడ్ లో నేను లేనని చెప్పిన సిద్ ని ఆయన వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో అతడి ప్రాణాలు కాపాడిన మనిషిగా ఆయన మాట కాదనలేక ఓకే అంటాడు సిద్…

 

 

థట్స్ మై బాయ్..నువ్వు వెళ్తావని నాకు తెలుసు.. నీకోసం అక్కడ ఓ సర్ప్రైస్ ఉందని చెప్పి ఇంకో వన్ వీక్ లో నీ ప్రయాణం అని చెప్పి కాల్ కట్ చేసిన ఆయన నీ లైఫ్ లో మళ్ళీ సంతోషాలు రావాలి సిద్ అనుకుంటారు మనసులో…

 

 

❤️

 

 

ఇంట్లోకి డల్ గా వస్తున్న మరదలిని అప్పుడే ట్రిప్ అయిపోయిందా సమన్వి అని అడుగుతారు ప్రసన్న గారు…

 

 

అన్నయ్య కనిపించడని చెప్పాలని నోటి వరకు వచ్చింది కాని చెప్తే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయపడి ఏం లేదు వదిన కొంచెం హెల్త్ అప్సెట్ గా అనిపించి నేనే వచ్చేసానని చెప్తుంది సమన్వి …

 

 

అవునా ఏమైందని అడిగి నుదురు పట్టుకొని చూస్తున్న ప్రసన్న గారి ఒళ్ళో పడుకున్న సమన్వి వదిన నీకు ఎప్పుడైనా అన్నయ్యని చూడాలనిపించిందా అని అడుగుతుంది…

 

 

సిద్ ప్రస్తావన రాగానే ప్రసన్న కళ్లలో తడి చేరి సిద్ తో గడిపిన జ్ఞాపకాలన్నీ మెదిలి ఇప్పుడు నీకు సిద్ ఎందుకు గర్తొచ్చాడని అడుగుతుంది…

 

 

నీకెప్పుడు గుర్తు రాలేదా…??

 

 

సమన్వి నేను ఈ ఇంటికి ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చానో తెలుసా?? అప్పుడు నువ్వు, సిద్ చిన్న పిల్లలని ఇంకా ఏదో చెప్తునంతలో సమన్వి ఎప్పుడొచ్చావని అడుగుతారు ఓ పెద్దమనిషి…

 

 

ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మామయ్య…

 

 

సిద్ ని కలిసావ్ కదా.. ఎలా ఉన్నాడు..??

 

 

సమన్వి..??

 

 

అభి బాకీ హైన్.. ❤️