New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అనుకోని అతిధి 👻❤️ – 3

అనుకోని అతిధి 👻❤️ – 3

.r.
అతను అలా బెడ్‌రూమ్‌లోకి అడుగు పెట్టిన క్షణంలోనే… ఒక్కసారిగా ఇంటి కాలింగ్ బెల్ గట్టిగా మోగింది…!
****************
“ఈ టైంలో ఎవరు రా బాబు…” అంటూ కొంచెం అసహనంగా నిట్టూర్చుకుంటూ డోర్ వైపు నడవబోతుండగానే…
హాల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడి వాతావరణం ఏదో విచిత్రంగా అనిపించింది…
అప్పటికే హాల్‌లో ఓపెన్‌గా ఉన్న కిటికీ నుంచి చల్లటి గాలి మెల్లగా లోపలికి వస్తోంది…అది తుఫాన్‌లా ఉగ్రంగా వీచే గాలి కాదు… కానీ ఏదో తెలియని నిశ్శబ్దాన్ని తన వెంట తీసుకొచ్చినట్టు అనిపించే గాలి…
ఆ గాలి తాకిడికి కిటికీ కర్టెన్లు నెమ్మదిగా ఊగుతూ… అప్పుడప్పుడూ గోడను తాకి చిన్నగా శబ్దం చేస్తున్నాయి…టేబుల్ మీద ఉన్న పేపర్లు స్వల్పంగా కదులుతూ… గదంతా ఒక వింత నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా మార్చేస్తున్నాయి…
బయట ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉండడంతో… ఇంట్లోని లైట్స్ వెలుగే హాల్ మొత్తం కమ్మేసిన ఆ మసక చీకటిని తొలగించలేకపోతున్నాయి…
అలాంటి సమయంలో ఒక్కసారిగా మళ్లీ కాలింగ్ బెల్ మోగడంతో…ప్రేమ్  అడుగులు క్షణం ఆగిపోయాయి…
అది అసలే నైట్ టైం కాబట్టి ఎందుకో తెలియదు కానీ గుండెల్లో చిన్నగా ఓ తెలియని టెన్షన్ మొదలైంది…
చా నేనేంటి ఇలా బయపడుతున్నాను…. అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేసాడు..అంతే 
అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది…
ఇప్పటివరకు మెల్లగా వీచిన గాలి అకస్మాత్తుగా ఉధృతంగా మారి హాల్ అంతా గట్టిగా వీచడం మొదలుపెట్టింది…
తెరిచి ఉన్న కిటికీ ఆ గాలి వేగాన్ని తట్టుకోలేక “ధబ్… ధబ్…” అంటూ అటూ ఇటూ బలంగా కొట్టుకుంటోంది…
కర్టెన్లు గాలికి అదుపు తప్పినట్టుగా ఎగురుతూ… టేబుల్ మీద ఉన్న వస్తువులు కూడా స్వల్పంగా కదలడం మొదలయ్యాయి
అదే సమయంలో… ఇప్పటివరకు సాధారణంగా వినిపించిన కాలింగ్ బెల్ సౌండ్ కూడా ఒక్కసారిగా మరింత గట్టిగా, అసహనంగా మారింది….
“టింగ్ టాంగ్… టింగ్ టాంగ్…” అంటూ ఎవరో కావాలనే బెల్ మీద చెయ్యి వదలకుండా నొక్కుతున్నట్టుగా వినిపిస్తోంది…
ఆ శబ్దాలు, ఆ గాలి, ఆ మసక వెలుతురు… మొత్తం కలిపి హాల్‌లో ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని సృష్టించాయి…
“చా…! ఐనా ఈ కిటికీ నేను ఎప్పుడూ క్లోజ్‌గానే ఉంచుతాను కదా… మరి ఇది ఎలా ఓపెన్ అయింది…?” అంటూ ప్రేమ్ తనలోతానే అసహనంగా అనుకున్నాడు…
బయట నుంచి లోపలికి దూసుకొస్తున్న గాలి కారణంగా కిటికీ రెక్కలు గట్టిగా అటూ ఇటూ కొట్టుకుంటుండడంతో… తను కళ్లను చిన్నగా మూసుకుంటూ కష్టంగా ఆ కిటికీ దగ్గరకు వెళ్లాడు…
గాలి వేగం అంత ఎక్కువగా ఉండడంతో… ఒక్క అడుగు ముందుకు వేయడమే తనికి భారంగా అనిపిస్తోంది…
చివరికి కిటికీని రెండు చేతులతో బిగిగా పట్టుకుని… తన శక్తంతా ఉపయోగిస్తూ దాన్ని మూసేయడానికి ప్రయత్నించాడు…
కానీ ఆశ్చర్యంగా…
ప్రేమ్ ఎంత బలంగా తోసినా… ఆ కిటికీ ఒక్క ఇంచ్ కూడా కదలలేదు…
అది ఎవరో బయట నుంచి గట్టిగా పట్టుకున్నట్టుగా మొండిగా అలాగే నిలిచిపోయింది…
అదే సమయంలో కాలింగ్ బెల్ శబ్దం మరింత భయంకరంగా మారింది…
“టింగ్ టాంగ్… టింగ్ టాంగ్… టింగ్ టాంగ్…”
అంటూ వరుసగా మోగుతూనే ఉంది…
ఎవరో తీవ్ర ఆతృతతో… లేక కోపంతో… తలుపు బద్దలు కొట్టేంతగా బెల్ నొక్కుతున్నట్టుగా అనిపిస్తోంది…
ఒకవైపు కదలని కిటికీ… మరోవైపు ఆగని బెల్ శబ్దం…
ఇవి రెండూ కలిపి ప్రేమ్ గుండెల్లో తెలియని భయాన్ని మరింత పెంచేశాయి…
“అబ్బా… వస్తున్నా…! ఒక్క నిమిషం…” అంటూ ప్రేమ్ చిరాకుగా అరిచాడు…
అయినా కూడా ఆ కిటికీని మూసేందుకు ప్రయత్నించడం మాత్రం ఆపలేదు…
రెండు చేతులతో బిగిగా పట్టుకుని… తన శక్తినంతా ఉపయోగిస్తూ ఇంకా దాన్ని తోసే ప్రయత్నమే చేస్తున్నాడు…
అప్పుడే…
ఇప్పటివరకు చెవులు పగిలేలా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోయింది…
ఆ నిశ్శబ్దం అంత ఆకస్మికంగా రావడంతో ప్రేమ్ క్షణం ఏమైందో అర్థంకాక అలాగే నిలిచిపోయాడు…
అంతే…
ఏదో కనిపించని శక్తి పని చేసినట్టుగా…
ఇప్పటివరకు ఎంత ప్రయత్నించినా కదలని ఆ కిటికీ… ఒక్కసారిగా “ధమ్” అంటూ తనంతట తానే మూసుకుపోయింది…
ఆ దృశ్యం చూసి ప్రేమ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది…
కొద్ది సెకన్ల క్రితమే తన బలానికీ లొంగని కిటికీ… ఇప్పుడు ఎవరో బయట నుంచి లాగినట్టుగా ఒక్క క్షణంలో మూసుకుపోవడం తనికి పూర్తిగా అర్థం కాలేదు…తాను ఇంకా షాక్ లో ఉండగానే…..
హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది…..
ఆ నిశ్శబ్దమే ఇప్పుడు ప్రేమ్ కి మరింత భయంగా అనిపిస్తోంది…అసలే… ఇంట్లో.. ఒక్కరు కూడా… లేరు గా తనకు తోడుగా….
ఇక ఆ విండో ను చూస్తూ  షాక్ అవుతునే ఎంట్రన్స్ వైపు అడుగులు వేసాడు ప్రేమ్…..
ఆ టైం లో వచ్చింది ఎవరై ఉంటారు….🤔
మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఫాలో, రేట్, కామెంట్
ఫ్రెండ్స్ ❤️
                            కంటిన్యూస్….