పెళ్లి చూపులు -21 భార్గవ్ భారతి ఇద్దరి మనసులో ఒక రకమైన బాధతోనే ఆ రాత్రిని గడిపేశారు.. మరుసటి రోజు చాలా బాధగా పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చుని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంది.. భార్గవ్ భారతి ఇద్దరూ కూడా పొలానికి వెళ్లిపోయారు. ఇక ఇంటిలో తన ఒక్కటే ఉంది కరెక్ట్ గా అప్పుడే పక్క ఇంటిలో ఉండే రాజి అనే ఆమె “”మహాలక్ష్మి!”” అని పిలుస్తూ ఇంటి లోపలికి వచ్చింది ఆ పిలుపుతో తేరుకుని తన ఆలోచనలు ఆపి…