కలెక్టర్ హోదాలో తులసి కారు తన సొంత ఊరిలోకి ప్రవేశించింది. ఊరి పొలిమేరల్లోనే వందలాది మంది ప్రజలు ఆమెకు హారతులతో, పూలదండలతో ఘనస్వాగతం పలికారు. కారు దిగిన తులసి నేరుగా ఆనందరావు మాస్టారి దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుంది. అక్షర, వివేక్ “అమ్మ… అమ్మ…” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కలెక్టర్ డ్రెస్సులో ఉన్న అమ్మను గట్టిగా పట్టుకున్నారు. వారి కళ్లల్లో గర్వం కనిపిస్తోంది.