New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
💞 ఓయ్ హిట్లర్ గారు 💞 – 3

💞 ఓయ్ హిట్లర్ గారు 💞 – 3

 

 

 

 

 

 

 

థాంక్యూ సర్ అని బ్రైట్ గా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాను 

 

హమ్మయ్య మొత్తానికి ఒక పెద్ద గండం గట్టెక్కింది ఇక రేపు వచ్చి ఆ పెళ్లి కొడుకుని కూడా ఇలాగే సైడ్ కి తప్పించేస్తే అంతే చాలు నిహా ఈరోజు నీ తెలివి చాలా బాగా  పనిచేస్తుంది నువ్వు కూడా రోజురోజుకీ బాగా తెలివైన దానివి అయిపోతున్నావు అని నాకు నేనే పొగిడితోని తిరిగి వర్క్ లో పడిపోయాను మళ్ళీ టైం వేస్ట్ చేస్తున్నట్టు హిట్లర్ గాడికి కనిపిస్తే ఎక్కడ తిడతాడో అన్న భయంతో  

 

ఇక మా హిట్లర్ గాడు చెప్పినట్టే 8 వరకు కూర్చుని వర్క్ చేసుకొని అప్పుడు ఇంటికి బయలుదేరాను 

 

నేను లిఫ్ట్ లోకి వెళ్లేసరికి అమ్మ కాల్ చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను చిన్నగా కానీ లిఫ్ట్ లో మాత్రం అది కొంచెం పెద్దగా సౌండ్ గానే బయటికి వచ్చింది 

 

ఒసేయ్ ఎక్కడున్నావే? ఇంకా ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి ఆఫీసులో నుంచి బయలుదేరావా లేదా అంటూ అమ్మ నేను చెప్పేది కూడా వినకుండా వలస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది 

 

మాతాజీ కొంచెం సైలెంట్ గా ఉండు నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేశాను మా మేనేజర్ గారు లీవ్ శాంక్షన్ కూడా చేశారు కాకపోతే ఈరోజు వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయిపోయింది అంతే ఓకే అర్థమైందా అని చాలా ఓపికగా నిదానంగా అమ్మకి వివరిస్తూ చెప్పాను 

 

సర్లే వచ్చినప్పుడు ఒక ఐదు మూరలు మళ్ళీ పూలు తీసుకొని రా అంది అమ్మ 

 

మల్లెపూలు అంటే రెడ్ కలర్ లో ఉంటాయి అవేనా అడిగాను నవ్వు ఆపుకుంటూ 

 

అవే తీసుకుని రావే నిన్ను చంపి నీ డెడ్ బాడీ మీద వేస్తాను అంది అమ్మ కోపంగా 

 

అప్పుడు రేపు పొద్దున్న పెళ్ళికొడుకు ఏమైపోతాడు మమ్మీ. నన్ను చూసుకోవడానికి రావాలి కదా అన్నాను నేను మరింత నవ్వుకుంటూ 

 

ముందు నువ్వు ఇంటికి రావే ఇంటికొస్తే అన్ని వివరించి నేనే చెప్తాను నీకు అంది అమ్మ వెంటనే 

 

బాయ్ బాయ్ అని కాల్ కట్ చేసి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి ఆగడంతో బయటికి వచ్చి నేరుగా స్కూటీ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి బయటికి పరుగులు పెట్టించాను 

 

ఇంతకీ రేపు వచ్చే ఆ పెళ్లి కొడుకు మహానుభావుడు ఎవడో ఏంటో వాడి కోసం నేను రేపు ఏకంగా నా లీవ్ ని త్యాగం చేస్తూ వాడి కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకుని చేసేదేం లేక మళ్లీ పువ్వులు పెట్టుకొని వెళ్లకపోతే మమ్మీ తిడుతుంది అన్న భయంతో పువ్వులు కొనుక్కొని బుద్ధిగా మంచి పిల్ల లాగా ఇంటికి చేరిపోయాను 

 

వచ్చావా రా అని నేను రాగానే అమ్మ నన్ను పలకరించకుండా నా చేతిలో ఉన్న పూలు తీసుకొని ఎంత తీసుకుంది మురికి అడిగింది నా వైపు చూడకుండానే 

 

మురికి ఎంత తీసుకుందో తెలియదు కానీ మొత్తం ఆరుమూరలకి 300 తీసుకుంది అన్నాను నా కళ్ళకి ఉన్న స్పెట్స్ తీసి కళ్ళని తుడుచుకుంటూ 

 

ఏంటి ఏంటి మూర పువ్వులు 50 రూపాయలకే తీసుకొచ్చావా డబ్బులు అన్ని ఇలాగే వృధా చేయవే నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ అని మరొకసారి తిట్ల దండకం మొదలుపెట్టింది 

 

ఇంతలో నాన్న అక్కడికి వస్తు సరేలే పోనీ ఏదో చిన్న పిల్ల తెలియక చేసేసింది అంటూ నాకు సపోర్ట్ చేయడం చూసిన మా మమ్మీ ఇంకాస్త కోపంగా మారిపోతూ ఏంటి చిన్న పిల్ల రేపు పెళ్లి చూపులకి వస్తున్నారు అన్ని సెట్ అయితే ఒక నెల రోజుల్లో మీ కూతురు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తుంది అక్కడ కూడా ఇలాగే ప్రవర్తిస్తే దాన్ని ఏమనరు దాన్ని కానీ పెంచినందుకు మిమ్మల్ని నన్ను అంటారు అని అమ్మ ఈసారి నాన్నని కూడా కలిపి తిట్టడం మొదలుపెట్టింది 

 

మా డాడీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా అనవసరంగా తల్లి కూతుర్ల మధ్యలోకి వచ్చి నేను ఇరుక్కుపోయానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు మా డాడీ 

 

ఆ తిట్లని మనకి పెద్దగా అలవాటే కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా మామ మీ వైపు ఓకే చూపు చూసి తన ముగ్గు మీద ముద్దు పెట్టేసి ఆకలిగా ఉంది మమ్మీ ఏదైనా ఫాస్ట్ గా పెట్టేసేయ్ నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాను 

 

నేను ఆకలి అనేసరికి నన్ను తిడుతున్న తిట్లు అన్ని ఆపేసి కిచెన్ లోకి పరుగు పెట్టింది మా మమ్మీ 

 

ఏ అమ్మాయి నా అంతే కదా పిల్లలు ఆకలి అంటే వెంటనే అన్ని మర్చిపోతారు. మా మమ్మీ కూడా అంతే 

 

 

 

 

 

——–continues……………… 

 

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ