New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ మొగుడు – 3

రౌడీ మొగుడు – 3

 

 

 

 

 

 

అది మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి పదం ముందు వెళ్లి మనం ఇందుని అడాప్ట్ చేసుకుంటున్నట్టు పేపర్స్ రెడీ చేయించాలి లేదంటే ఇద్దరికి ప్రమాదమే అన్నారు భాస్కర్ గారు 

 

పదండి అని సుమలత గారు భాస్కర్ గారు అక్కడి నుంచి లాయర్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు 

 

ఇక్కడ ఇంటికి వచ్చిన దేవా కార్ ఆపి ఇందు రెక్క పట్టుకుని కార్ లోనుంచి బయటకి లాగి తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు 

 

వదులు నన్ను వదులు అని అరుస్తూ ఉంది ఇందుమతి 

 

ఏయ్ ఇప్పుడు గాని నీ నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వచ్చినా జీవితంలో మాట్లాడకుండా చేస్తాను అని విసురుగా తనని నేల మీదకి పడేశాడు 

 

ఊహించని ఈ చర్యకి అమ్మ అంటూ కింద పడింది. ఇందు 

 

బాడీగార్డ్స్ వెనక హేమ తీసుకొని వస్తే హేమ వైపు చూస్తూ తనని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు దేవా 

 

హౌ డేర్ యు టూ చీట్ మీ ఈ దేవాన్ష్ నాయుడు నే బోల్తా కొట్టించాలి అని చూస్తావా హేమ పీక పట్టుకుని గాల్లోకి లేపాడు దేవా 

 

అది చూసిన హేమ వదులు అంటూ తన బలం మొత్తం ఉపయోగించి దేవా చేతి మీద కొడుతుంటే కనీసం చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదు దేవా కీ 

 

హేమ కి ఊపిరి అసలు ఆగడం లేదు కాళ్లు గిలగిలా కొట్టేసుకుంటుంటే కళ్ళు తేలిపోతున్నాయి ఊపిరి ఆగిపోతుంది అన్న క్షణాన్న తనని విసురుగా ఇందు పక్కకి విసిరేటంతో ఇందు పక్కకి వచ్చి పడింది మీ బాబు దీన్ని వాడి కూతురుగా దత్తత తీసుకొని నాకు కావాల్సిన 500 ఎకరాలు దీని పేరు మీదకి మార్చకపోతే ఇద్దరికీ కలిపి ఒకేసారి పాడే కడతాను అని విసురుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవా 

 

సారీ ఇందు నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను సారీ అంది హేమ 

 

ఏం మాటలే అవి అలా ఏం లేదు జరిగిందేదో జరిగిపోయింది అయినా నువ్వు కానీ కలగన్నావా ఏంటి ఇలా జరుగుతుంది అని అంది ఇందు 

 

ఇందు అని తనని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది హేమ 

 

@@@@@@@ 

 

 

నీకు చెప్పాను కదా రా హిందూ నువ్వు అనుకునేలాంటి అమ్మాయి కాదు అని అది నిన్ను ప్రేమించదు అని కానీ నువ్వే అది నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళాం ఇప్పుడేమైంది అడిగాడు సూర్య బెస్ట్ ఫ్రెండ్ దీపక్ 

 

రేయ్ అది ఏ పరిస్థితుల్లో అలా చేసిందో తెలియదు కదరా నాకు ఇప్పటికీ పూర్తి నమ్మకం ఉంది నా ఇందు బంగారం రా దాని గురించి ఎప్పుడూ ఏ మాటను మాట్లాడకు నువ్వేమైనా మాట్లాడితే నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడానికి నేను ఎక్కువ సేపు ఆలోచించను అన్నాడు సూర్య బాధగా 

 

ఇప్పుడు అది మిస్ ఇందుమతి కాదురా మిస్సెస్ దేవాన్ష్ నాయుడు అర్థమవుతుందా వాడు మనిషి రూపంలో తిరిగా ఒక రాక్షసుడు వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి భార్య పిల్లలు ఇలాంటి ఎమోషన్స్ ఉండవు రా 

 

ఒకవేళ వాడికి గాని ఇందు మనసులో నువ్వు ఉన్నావు అని తెలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను చంపేస్తాడు అలాంటి రాక్షసుడు వాడు అన్నాడు దీపక్ సూర్య ని హెచ్చరిస్తూ 

 

రేయ్ నా ఇందు లేని జీవితం నాకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే రా అది లేని జీవితంలో నేను బ్రతికి ఏం సాధిస్తాను చచ్చిపోయిన నాకు సంతోషమే అన్నాడు సూర్య 

 

సూర్య నువ్ ఇలా బాధపడుతూ ఉంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు రా ప్లీజ్ రా అర్థం చేసుకో సూర్య అన్నాడు దీపక్ 

 

లేదురా ఇందులో వేరే ఇంకేం లేదు ఆల్రెడీ అంతా జరిగిపోయింది నేనైతే తనని డిస్టర్బ్ చేయను కానీ ఒకవేళ తను వాడి నుంచి దూరం అవి నా జీవితంలోకి రావాలి అనుకుంటే కచ్చితంగా తనని నేను వెల్కం చేస్తాను అప్పుడు మాత్రం ఎవరు మమ్మల్ని దూరం చెయ్యలేరు అన్నాడు సూర్య బలంగా 

 

రేయ్ నీకు నేనేం చెప్తున్నాను కొంచమైనా అర్థమవుతుందా నేను ఏం చెప్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావ్ రా అడిగాడు దీపక్ 

 

ఆ మాటకి సూర్య ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతే 

 

దీపక్ కూడా సూర్యా వెనకే వెళ్ళాడు 

 

 

 

 

——–continues…………..

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ

 

 

నెక్స్ట్ ఎపిసోడ్ లో :- 

 

 

ఇక్కడ సుమలత గారు భాస్కర్ గారు ఆఫీస్ కి వెళ్లి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం బాడీ మొత్తానికి మరుసటి రోజుకి ఇందుమతి నీ కూడా లీగల్ గా అడాప్ట్ చేసుకుంటున్నట్టు సర్టిఫికెట్స్ సృష్టించి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని దేవా ఇంటికి స్టార్ట్ అయ్యారు 

 

దేవా ఇంటి బయటే ఆగిపోయారు ఇద్దరు 

 

వాచ్ మాన్ వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకొని దేవా కి కాల్ చేశాడు 

 

ఒక ఐదు నిమిషాలకి వెళ్ళండి అని డోర్స్ ఓపెన్ చేయడంతో ఇద్దరు లోపలికి వెళ్లారు