New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
డెవిల్స్ వైఫ్ – 2

డెవిల్స్ వైఫ్ – 2

నైట్….

 

రాజ్‌వీర్, రణ్‌వీర్ రుద్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నారు..

 

అమర్, గాయత్రి వారికి ఎదురుగా కూర్చుని ఉంటే, అవని, ప్రజ్ఞ వాళ్లిద్దరి పక్కన కూర్చొని డిన్నర్ చేస్తున్నారు. 

 

అందరూ సైలెంట్ గా ఫుడ్ తింటున్నారు.. 

 

ఆ ముగ్గురితో అవని ఎప్పుడు మాట్లాడలేదు.. వారి కళ్ళలోకి కూడా చూసే దైర్యం లేదు ఆమెకి.. వాళ్ళ ముగ్గురు అంటే ఆమెకి చాలా భయం…

 

పురోహితుడు చెప్పిన విషయాన్ని తమ ముగ్గురు మనవళ్లకు ఎలా చెప్పాలో తెలియక, అమర్, గాయత్రి మౌనంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు…

 

 అప్పుడే రుద్ర తన తాతయ్య, నానమ్మల వైపు చూసి, “మీరిద్దరూ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు.?” అని అడిగాడు.

 

రుద్ర అడిగిన ప్రశ్నకి అందరూ అమర్, గాయత్రి వైపు తిరిగారు.. ఆ క్వశ్చన్ కి అమర్, గాయత్రి చాలా భయపడ్డారు..

 

 అమర్ రుద్ర వైపు చూసి, “నీకు చెప్పడానికి ఏం లేదు..” అని చిన్నగా అన్నాడు.. 

 

రణ్‌వీర్ అమర్ వైపు చూసి, “ఏం లేకపోతే మీ ఫేస్ లు ఎందుకు అలా ఉన్నాయి తాతయ్య.. మీరిద్దరూ ఎందుకు ఫుడ్ తినడం లేదు? చాలా సేపటి నుండి ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు.. మీకు ఇంకేమైనా తినాలనిపిస్తే, నేను చెఫ్‌ని పిలిచి మీకోసం వండమని చెప్తాను.” అని చెప్పాడు..

 

గాయత్రి రణ్‌వీర్‌ వైపు చూసి, “వద్దు రణ్వీర్ భోజనం బాగుంది… మాకు ఇంకేమీ వద్దు.. ఇదే చాలు,” అని చెప్పి, వాళ్లిద్దరూ తినడం ఫుడ్ తింటారు.. 

 

డిన్నర్ తరువాత అవని, ప్రజ్ఞ నిద్రపోవడానికి తమ రూమ్ కి వెళ్తుండగా, గాయత్రి వాళ్లిద్దరి దగ్గరకి వచ్చి, “మీరిద్దరూ ఆగండి, నేను మీతో మాట్లాడాలి.. అలాగే రణ్‌వీర్, రాజ్‌వీర్, రుద్రలతో కూడా మాట్లాడాలి.. మీరందరు సోఫాలో కూర్చోండి.” అని అంది..

 

ఆ మాటలు విని, వారందరూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు..

 

  గాయత్రి అమర్ వైపు చూడగానే, అతను అందరి వైపు తిరిగాడు.. 

 

 గాయత్రి రాజ్‌వీర్, రణ్‌వీర్, రుద్రల వైపు చూసి, “ఈరోజు మన పురోహితులు గారు మన ఇంటికి వచ్చి మీ ముగ్గురి జాతకాలను చూశారు.. ఆయన జాతకాలు చూసి వెళ్ళిపోయినప్పటి నుండి, నాకు మీ తాతయ్యకి చాలా టెన్షన్ గా ఉంది.”

 

గాయత్రి చెప్పింది విని రాజ్‌వీర్ ఆమె వైపు చూసి, “టెన్షన్ ఎందుకు.. పురోహితులు ఏం చెప్పారు నాని.?” అని అడిగాడు..

 

అమర్ డీప్ బ్రీత్ తీసుకుని,”పురోహితులు గారు మీ ముగ్గురి జాతకాలలోనూ ఏదో దోషం ఉందని చెప్పారు.. ఈ విషయం మీ ముగ్గురికీ కూడా బాగా తెలుసు కదా.. మీ ముగ్గురికీ ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది.. మీ ముగ్గురికి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది.. కానీ, రాబోయే ఒక సంవత్సరంలోగా మీ ముగ్గురి మరణం ఖాయమని పురోహితుడు చెప్పారు.”

 

గాయత్రి చెప్పింది విని రాజ్‌వీర్, రణ్‌వీర్, రుద్ర ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు.. 

 

ఆ మాట విని ప్రజ్ఞ, అవని చాలా భయపడ్డారు..

 

 ప్రజ్ఞ అమర్ వైపు చూసి, “తాతయ్య పురోహితుడు దీనికి పరిష్కారం చెప్పలేదా? అన్నయ్యలకి ఈ దోషం పోవడానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది కదా?”

 

అమర్ ప్రజ్ఞ వైపు చూసి, “పురోహితుడు పరిష్కారం చెప్పారు.. కానీ ఆ పరిష్కారం కష్టంగా, చాలా కఠినంగా కూడా ఉంది.. దాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు?”

 

అది విని ప్రజ్ఞ బాధగా తన అన్నయ్యలు తనకి దూరం అయిపోతారేమో అని చాలా బాధపడుతూ, “ప్లీజ్ పరిష్కారం ఏంటో చెప్పండి తాతయ్య చేద్దాం.?”

 

అమర్ గాయత్రి వైపు చూస్తాడు.. గాయత్రి కళ్ళతో అమర్ కి సైగ చేస్తుంది.. అతనికి కూడా ఏమి చెప్పాలో అర్థం కాదు.. 

 

రాజ్వీర్ కొంచెం కోపంగా అమర్ ని చూస్తూ, “ఏమైంది తాతయ్య, నాని.. మీరిద్దరూ ఏంటి ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు.. ఇప్పుడు పరిష్కారం ఏంటో చెప్పండి.. అసలు మేం ముగ్గురం ఇవన్నీ నమ్మం, మమ్మల్ని ముగ్గురినీ ఎవరూ చంపలేరు.. ఈ విషయం మీ ఇద్దరికీ కూడా తెలుసు.. మృత్యువు కూడా మా దగ్గరకు రాదు.. ఫస్ట్ మీరు ఏ విషయం అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.. వీటన్నిటిలో ఇన్వాల్ అవ్వద్దని మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను.. కానీ మీరిద్దరూ నా మాట వినరు.. సరేలే, ఇప్పుడు చెప్పండి.. పురోహితులు గారు ఏం చెప్పారు.. మేము మృత్యువు నుండి తప్పించడానికి ఆయన ఏ పరిష్కారం చెప్పారు..”

 

ఆ ప్రశ్నలకి గాయత్రి గట్టిగా ఊపిరి తీసుకుని, “మీ ముగ్గురూ పెళ్లి చేసుకోవాలని.. అది మిమ్మల్ని ఈ ప్రమాదం నుండి బయటపడేయగల అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని పురోహితుడు చెప్పారు.. అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి వస్తే, మీ ముగ్గురి దగ్గరకి మృత్యువు రాదని చెప్పారు.. మీకు ఏం జరగదని కూడా చెప్పారు…”

 

ఆ మాటలు విని రుద్ర, రాజ్‌వీర్, రణ్‌వీర్ ముగ్గురూ గట్టిగా నవ్వుతారు.. 

 

వాళ్ళు నవ్వడం చూసి అమర్ కోపంగా ముగ్గురిని చూస్తూ, “మీ ముగ్గురూ ఎందుకు నవ్వుతున్నారు, ఇక్కడ ఎవరైనా ఏమైనా జోక్ చెప్పారా.?” అని చాలా అంటే చాలా కోపంగా అడిగాడు…

 

రుద్ర నవ్వుతూ, “అయితే మేము ఏం చేయగలము తాతయ్య.. పురోహితుడు ఆ అమ్మాయి గురించి చెప్పారు.. మా పెళ్లి గురించి కూడా మాట్లాడారు, కానీ మనం అలాంటి అమ్మాయిని వెతకాలి కదా.. ఇంత పెద్ద సిటీలో అలాంటి అమ్మాయిని వెతకడం అసాధ్యం.. మేము ముగ్గురం ముగ్గురు అమ్మాయిలను వెతకాలి.. వన్ ఇయర్ కి ముగ్గురు అమ్మాయిలు దొరుకుతారని నాకు అనిపించడం లేదు.” 

 

ఆ మాటకి గాయత్రి కోపంగా రుద్రని చూస్తూ, “నేను ఒక అమ్మాయిని చూశాను.. మీ ముగ్గురికీ ఆ అమ్మాయి బాగా తెలుసు.. కానీ సమస్య ఏమిటంటే, మీరందరూ పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి కూడా ఆ అమ్మాయినే..”

 

అది విని రాజ్‌వీర్, రణ్‌వీర్, రుద్రల ఫేస్ లు గంభీరంగా మారాయి.. వారందరూ ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు..

 

రాజ్‌వీర్ గాయత్రిని చూస్తూ, “నాని, అస్సలు మీరు ఏం చెప్పుతున్నారు.? ప్లీజ్ అర్ధం అయ్యేలా చెప్పండి.?”

 

గాయత్రి ముగ్గురిని చూస్తూ, “అంటే మీ ముగ్గురూ ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.. ఆ అమ్మాయి మరెవరో కాదు అవని.. అవనిని చూసి పురోహితుడు చెప్పారు, మీ ముగ్గురినీ ప్రమాదం నుండి అవని మాత్రమే కాపాడగలదని.. మీ ముగ్గురూ అవనిని పెళ్లి చేసుకుంటే, మీ ముగ్గురి జాతకంలో ఉన్న దోషం తొలిగిపోతుంది అని చెప్పారు.. మీ జాతకంలోని గ్రహ దోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది.. అందుకే మీ ముగ్గురూ అవనిని పెళ్లి చేసుకోవాలి.. కానీ నేను ఒక్కసారి అవని నిర్ణయం కూడా వినాలి..?”

 

ఆ మాటలని అవని షాక్ తో కళ్ళు పెద్దవి చేసి అందరి వైపు ఆశ్చర్యంగా చూసింది.. గాయత్రి చెప్పింది విని నమ్మలేకపోయింది ఆమె.. 

 

ఈ ముగ్గురు రాక్షసులను తను ఎలా పెళ్లి చేసుకోగలదు? వాళ్ళను ఎదుర్కోవడానికి, వాళ్ళతో మాట్లాడానికే తను భయపడుతుంటే, గాయత్రి వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడుతోంది…

 

 రణ్‌వీర్ కూడా ఆశ్చర్యపోగా, ముగ్గురూ ఆశ్చర్యంగా ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు..

 

To be continued….