New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 1

గతం వెంటాడిన ప్రేమ 💔 – 1

భాగ్యనగరం 
ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి “ఓ అమ్మాయ్ ఇలా రా అని పిలిచారు ” ఇతడే ప్రవీణ్.
ఆ అమ్మాయి ముందుకి వెనకకి చూస్తుంది తననే నా అని 
“చూసింది చాలు లే,కానీ,పిలిచింది నిన్నే, ఇలా రా అన్నాడు” ప్రవీణ్ 
“వామ్మో నా కర్మ కాకుంటే వీళ్లకి నేనే కనిపించాలా ఇంత మందిలో” అని అనుకుంటూ చేసేదేం లేక అటువైపు నడిచింది.
అప్పటి వరకు తను చూడలేదు కానీ తనని ఒకరు చాలా ప్రేమగా చూస్తున్నారు ఎంతో ఇష్టంగా ఆరాధనగా. 
“వాళ్ళలో ఒకడు ఓయ్ అమ్మయి నీ పేరు ఏంటి అని అడిగాడు” కృష్ణ.
ఆ అమ్మాయి ఎం అనుకుంటో ఏమో కాని నా నా పే పే రు రు పేరు “సిరి” అని చెప్పింది వణికే స్వరం తో 
“వాళ్ళు ఓ అని నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టము కాని మాలో ఒకర్కి కిస్ చేసి వెళ్ళు అన్నాడు” రామ్ 
అప్పటికే ఆమెకి కాలు చేతులు వణుకుతున్నాయ్ ఇక అతను అలా చెప్పే పాటికి కళ్ళు తిరగడం ఒకటే తక్కువ.
ఆమే అలా భయపడడం చూసిన ఆ కళ్ళు అన్నవాడి చెవి మెలేసి రేయ్ సారీ చెప్పు అన్నడు బేస్ వాయిస్ తో 
అతను రేయ్ మామ నొప్పి రా వదులు అని గింజుకున్నా వదలకపోయే పాటికి రామ్ క్షమించండి అన్నడు సిరి తో.
“సిరి ఏం మాట్లాడలేదు” 
తను అలా సైలెంట్ గా ఉండేసరికి చెవి ఇంకా వదలకపోగా పట్టు పెంచాడు రామ్ నొప్పి తో అరుస్తుంటే అప్పుడు సిరి అయ్యో ఏం చేయకండి తనని నేను యేమి ఫీల్ అవ్వలేదు అని చెప్పింది.
ఇంతలో అక్కడ ఉన్నా ప్రవీణ్ సరే ఒక పని చేద్దాం ఇక్కడ ఉన్నా వాళ్ళలో ఒకరి పేరు ఊహించి చెప్పు నువ్వు నిన్ను ఇంకా ఏం అన్నాము అన్నాడు. 
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అందరి పేరు ఊహించి చెప్పింది కాని ఎవరిది కరెక్ట్ కాదు చివరికి ఆ కళ్ళ దగ్గర తన చూపు నిలిపి “గౌతమ్” అంది. 
అందరు ఆశ్చర్యపోయారు ( 😲 ఇలా అన్నమాట) 
గౌతమ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు తన మనసు ఆనందం తో ఉరకలేస్తుంది.
గౌతమ్ సిరి వైపు చూస్తు నువ్వు క్లాస్ కి వెళ్ళు అన్నాడు.
ఏం అనుకుందో ఏమో కాని సైలెంట్ గా వెళ్ళిపోయింది తను.
గౌతమ్ అందరి వైపు చూస్తు అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పినట్టు “తను నాది తన జోలికి ఎవరు రావడానికి వీళ్లులేదు ఒస్తే నాలోని రాక్షసుడిని చూస్తారు” అని చెప్పి వెళ్లిపోయాడు.
వాళ్ళలో ఉన్నా కిరణ్ రేయ్ వీడికి పైత్యం మామూల్గా లేదు గా చెయ్యాల్సింది ఏం లేదు కానీ పదండి రా పోదాం అన్నాడు.
అందరు వాళ్ళ బ్లాక్ (అంటే వీళ్లు సీనియర్స్ కదా జూనియర్స్ బ్లాక్ వీళ్లది సెపరేట్ అనమాట) కి వెళుతూ ఉంటే మధ్యలో వీళ్లకి గౌతమ్ కనిపిస్తాడు చెట్టు కింద కూర్చోని. 
ఇంకా వాళ్ళు గౌతమ్ దగ్గరికి వెళ్లి రేయ్ మామ ఇక్కడ ఉన్నవేంట్రా పద క్లాస్ కి టైం అవుతోంది అని అంటారు కానీ గౌతమ్ దానికి విరుద్ధంగా గా రేయ్ నేను క్లాస్ కి రావట్లేదు అంటాడు.
అందరు ఎందుకు రా అని ఒక్కసారి అంటారు. వాళ్లలో ఒక్కడైన ప్రదీప్ రేయ్ మామ మనం ఒచ్చేదే attendance కోసం రా ఇలా అంటే ఎలా రా అంటాడు.
గౌతమ్ అవును రా కాని నాకు రావాలని లేదు రా నాకు వేరే పని ఉండి వెళుతున్న అని వాళ్ళు అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోతాడు అక్కడ నుండి. 
అలా గౌతమ్ పార్కింగ్ ఏరియా కి వెళ్ళి తన కార్ తీస్కొని డైరెక్ట్ గా ఇంటికే వెళ్తాడు.
ఇంట్లోకి వెళ్లడం తోనే అమ్మ అమ్మ అని అరుస్తాడు గౌతమ్. 
తన అరుపు విని కిచెన్ లో ఉన్న నిర్మల గారు ఏంట్రా ఏమైంది కాలేజీ కి వెళ్లలేదా ఎందుకు అలా అరుస్తున్నావ్ అని అడుగుతారు.
అమ్మ నేను వెళ్ళాను కానీ బాగా తలనొప్పి గా ఉంది అందుకే వచ్చేసా అని అబద్ధం చెప్తాడు తల్లి తో
పాపం అసలే తల్లి మనసు కదా తలనొప్పి అనడం తోనే విలవిలాలడిపోయింది.
అయ్యో కన్నా అవునా అని పరుగున తన దగరికి వచ్చి ఇలా కూర్చో అని సోఫా చూపించి కూర్చోపెట్టి ఇప్పుడే వస్తారా ఉండు అని పరుగున కిచెన్ లోకి వెళ్లి ఒక పొయ్యి మీద కాఫీ ఇంకో పొయ్యి మీద నూనె వేడి చేసి గౌతమ్ కి కాఫీ ఇచ్చి నూనె తీసుకొని తలకి పట్టించి మసాజ్ చేసారు నిర్మల గారు
అలా చేసాక గౌతమ్ కి కొద్దిగా రిలాక్స్డ్ గా అనిపించి అమ్మ నేను పడుకుంటాను అని తన రూమ్ కి వెళ్లి బెడ్ కి అడ్డం గా పడుకుంటాడు మన గౌతమ్ బాబు.
నిర్మల గారు ఏమో ఎవరి కళ్ళు పడ్డాయో నా బిడ్డ మీద అని కిచెన్ కి వెళ్లి ఎండుమిర్చి కారం ఒక చేతిలో తీస్కొని ఇంకో చేతిలో చీపిరి పట్టుకొని గౌతమ్ రూమ్ కి వెళ్తారు.
బెడ్ మీద అడ్డం గా పడుకున్న గౌతమ్ దగరికి వెళ్లి వాటితో దిష్టి తీసేసి ప్రేమగా నుదిటి మీద ముద్దాడి బ్లాంకెట్ కప్పి బైటికి వచ్చేసి మళ్ళీ కిచెన్ లోకి వెళ్లి వంట చేయడం లో మునిగి పోతారు.
గౌతమ్ రూమ్ లో 
వాళ్ళ అమ్మ వెళ్లిన వెంటనే లేచి బెడ్ మీద కూర్చొని ఆ ఎందుకు నువ్వు నాకు చూడగానే నచ్చేసావ్ నిన్ను నేను అసలు మర్చిపోలేకపోతున్న నా మైండ్ లోకి నా పర్మిషన్ లేకుండానే వచ్చేసావ్ నా హార్ట్ ఐతే నీ దగ్గరే పెట్టేసుకున్నావ్.
ఆ సిరి ఫిక్స్ అయిపోయా ఈ గౌతమ్ విజయేంద్ర వర్మ పెళ్ళానివి నువ్వే mrs గౌతమ్ విజయేంద్ర వర్మ అని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయేలా చేస్తా అని అనుకోని అలా తన గురించి ఆలోచిస్తూ అలానే నిద్రకి ఉపక్రామిస్తాడు.
ఇక్కడ కాలేజీ లో
సీనియర్ క్లాస్సేస్ 
గౌతమ్ ఇంటికి వెళ్ళాక కాలేజీ బంక్ కొట్టలేక (అంటే attendance లేక ) కిరణ్, ప్రదీప్, ప్రవీణ్, కృష్ణ, రామ్ అందరు వాల సిఎస్ఈ (CSE) క్లాస్ కి వెళ్లి బుద్దిగా క్లాస్సేస్ అన్నిటికి అటెండ్ అయ్యి క్లాస్సేస్ విని attendance వేపించుకొని ఇంకా కాలేజీ బైటికి వస్తారు.
జూనియర్ క్లాస్సేస్ 
సిరి పాప ది ఈసిఈ (ECE) కాబ్బటి తన ఫ్లోర్ కి వెళ్లి తన క్లాస్ లో కూర్చుంటుంది. తనకి అది ఫస్ట్ క్లాస్ అవ్వడం తో ఎవరితో మాట్లాడాదు సిరి ఎందుకంటే మన పాపకి కొంచం భయం అలా తెలియని వాళ్లతో మాట్లాడాలి అంటే అందుకే తన పాటికి తను క్లాస్సేస్ వింటూ బుద్దిగా నోట్ చేసుకుంటుంది.
అలా 2 పీరియడ్స్ అయిపోయాక తన పక్కకి ఒక అమ్మాయి వచ్చి కూర్చొని హాయ్ ఐ యామ్ సత్య మరి నీ పేరు అని అడుగుతుంది 
దానికి సిరి పాప కూడా నవ్వుతు ఐ యామ్ సిరి అని చెప్పింది.
ఇది మన మొదటి కథ ఎలా ఉందో చెప్పి మీ విలువయిన సమయానికి నాకు కేటాయించి సమీక్షలు(comments) ద్వారా తెలుపండి.
(Note:- తప్పులు ఉంటె మన్నించగలరు నెమ్మదిగ నేర్చుకుంటా)
ఇట్లు మీ సిరి ❤️.