New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 2

గతం వెంటాడిన ప్రేమ 💔 – 2

అలా సిరి తన పేరు చెప్పాక సత్య తో , సత్య నైస్ టూ మీట్ యూ సిరి అని చెప్పి ఇక నుండి మనం ఫ్రెండ్స్ గా ఉందాం ఏమంటావ్, అని తన చెయ్యి ముందుకి చాపింది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.

సిరి కూడా తన చెయ్యి ముందుకి కి చాపి తన చేతిలో చెయ్యి వేసి జత కడ్తుంది. 
అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండంగా నెక్స్ట్ హౌర్ ల్యాబ్ అనేసి వాళ్లు లెక్చరర్ వచ్చి అందరిని ల్యాబ్ కి తీసుకెళ్తుంది.
ల్యాబ్ లో 3 హౌర్స్ అయ్యాక బైటికి వస్తారు సిరి,సత్య కలిసి. కాలేజీ టైం కూడా అయిపోవడం తో వాళ్ళు గేట్ బైటికి వస్తారు సత్య, సిరి వచ్చే టైం కి మన గౌతమ్ గ్యాంగ్ అందరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఒక్క గౌతమ్ తప్ప . 
వాళ్ళని చూడగానే ఆటోమేటిక్ గా భయం స్టార్ట్ అవుతుంది సిరి పాపకి మళ్ళీ రాగ్గింగ్ స్టార్ట్ చేస్తారేమో అనేసి. 
అది చుసిన సత్య ఓయ్ సిరి ఎందుకు అలా భయపడ్తున్నావ్ అని ఎవరు ఉన్నారు అక్కడ అనేసి అటు చూస్తుంది.
అక్కడ సీనియర్స్ కనిపిస్తారు వాళ్లని చూసి ఎందుకు భయపడ్తున్నావ్ నిన్ను ఎమన్నా అన్నారా అని  అడుగుతుంది సిరి ని.
సిరి పాప పొద్దున్న వీళ్లు చేసిన రాగ్గింగ్ మొత్తం పొల్లు పోకుండా (ఒక్క గౌతమ్ పేరు చెప్పడం తప్ప అన్ని) చెప్తుంది వెంటనే సత్య పాప కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది.
నిన్ను అలా అన్నారా రా వీళ్ళ సంగతి చెప్పుదాం అనేసి సిరి వద్దు అని చెప్తున్నా వినకుండా వాళ్ళ ముందుకి వెళ్ళి తన రెండు చేతులు నడుము మీద పెట్టుకోని వాళ్లని కొట్టేలా చూస్తూ ఉంటుంది.
వాళ్ళు ఎవరా అని చూస్తే అక్కడ సత్య తన పక్కన నేలా చూపులు చూస్తూ ఉన్న సిరి కనిపిస్తారు.
అక్కడే ఉన్న ప్రదీప్ రేయ్ ఇదేంటి రా ఇలా చూస్తుంది అని ప్రవీణ్ చెవిలో గొనుగుతాడు.
ప్రవీణ్ ఏమో రా అని ఏంటే అలా చూస్తునవ్ అంటాడు సత్య ని.
అలా ఏంటే అనే పాటికి మన పాప కి ఎక్కడో కాలి ఏంట్రా ఏ వే అంటున్నావ్ ఒళ్ళు ఎలా ఉంది అంటుంది.
ఒళ్ళంతా ఏమో తెలీట్లేడే తిమ్మిరి పట్టినట్టుంది కొంచం చూడు అంటాడు ప్రవీణ్ కొంటెగా.
రేయ్ నిన్ను అని ప్రవీణ్ మీదకి వెళ్తుంటే ప్రవీణ్,సత్య చెయ్యి మెలిపెట్టి ఏంటే చెయ్యి లేస్తుంది ఆ ఏంటి అంటాడు.
ఇదంతా చూస్తున్న సిరి అయ్యో సారీ సార్ ఎదో తేలిక చేసేసింది ఈ ఒక్కసారికి వదిలేయండి అంటది సిరి.
ఈ భయం చెయ్యి ఎత్తక ముందు ఉండాలి ఇప్పుడు కాదు అని సిరి వైపు చూస్తూ చెప్పి సత్య ని చూసి ఏంటే ఎక్సట్రాలు చేస్తున్నావ్ హా అంటాడు ప్రవీణ్.
రేయ్ బండ వెదవ వదలరా మా గౌతమ్ అన్నయ్య కి చెప్తా ఎక్కువ మాట్లాడితే అని అంటది సత్య.
సత్య గౌతమ్ ని అన్నయ్య అన్న వెంటనే సిరి పాప ఫ్యూస్ అవుట్ ఏంటి అన్నయ్య అనుకుంటది మనసులో అలా అనుకుంటున్నప్పుడే ప్రవీణ్ ఆహా చెప్తావా చెప్పవే చూస్తా అని అంటాడు. 
నన్ను వదలరా ముందు వదిలిన వెంటనే మా అన్న కి చెప్పకుంటే అప్పుడు అడగరా నన్ను అంటాది సత్య.
అవునా సరే ఉండేవే అని చెయ్యి అలాగే పట్టుకొని ఉండి గౌతమ్ కి ఫోన్ చేస్తాడు స్పీకర్ ఆన్ లో పెట్టి.
మన గౌతమ్ బాబు మంచి నిద్ర లో ఉన్నపుడే ఫోన్ మోగుతుంటే తిట్టుకుంటూ స్క్రీన్ పైన ప్రవీణ్ పేరు కనిపించిన వెంటనే అయిపోయావ్ రా నువ్ అని నా నిద్ర నే డిస్టర్బ్ చేస్తావా అనేసి తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి రేయ్ వెదవ ఫోన్ ఎప్పుడు చేయాలో తెలీదా వేల పాల ఉండక్కర్లేదా ఫోన్ చేయడానికి అని అవతల ప్రవీణ్ చెప్పేది వినకుండా నాన్ స్టాప్ గా 5 మినిట్స్ వాయించేసి మళ్ళీ తిడ్తుంటే రేయ్ బావ ఆగరా నాయన ఎందుకు చేసానో ముందు చెప్పనీ అని అంటాడు.
ఈ గ్యాప్ లో అన్నయ్య ఈ దున్న గాడు నన్ను కొడ్తున్నాడు రా అని వినపడ్తుంది సత్య గొంతు.
అంతే చెల్లి అలా చెప్పే పాటికి రేయ్ నా చెల్లి నే కొడతావా అయిపోయావ్ రా నా చేతిలో అని 20 మినిట్స్ అమ్మ సత్య నేను వస్తున్నా ఆగు అని మరో మాట కి ఆస్కారం లేకుండా ఫోన్ పెట్టేస్తాడు.
(నోట్ :- ఇక్కడ గౌతమ్ ఇంటికి వెళ్తునట్టు ఆల్రెడీ సత్య కి మెసేజ్ చేసాడు ) 
సిరి అక్కడ జరిగేదంత ఇంతింత గుడ్లు ఏస్కోని చూస్తుంది. 
సత్య ఇంకా అయిపోయావ్ రా నువ్వు ఇవాళ అని ప్రవీణ్ నుంచి విడిపించుకొని సిరి పక్కన వచ్చి నిలబడింది. 
పాపం ప్రవీణ్ బిక్క మొఖం ఏసుకొని చూస్తున్నాడు అలా.
కొనసాగుతుంది……..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.