New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 3

గతం వెంటాడిన ప్రేమ 💔 – 3

గౌతమ్ అలా కాల్ కట్ చేసి కార్ కీస్ అందుకొని వెంటనే వాళ్ళ అమ్మగారికి చిన్న పని ఉంది వెంటనే వచ్చేస్తా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.
నిర్మల గారు ఏంటో వీడు వచ్చాడు మళ్ళీ వెంటనే వెళ్లిపోతున్నాడు అని నీటూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయారు.
గౌతమ్ కార్ రోడ్ మీద పరుగు పెట్టించి 20 మినిట్స్ లో ఉంటా అన్నవాడు 15 మినిట్స్ లో కాలేజీ బైట కార్ ఆపేసి కీస్ సెక్యూరిటీ కి ఇచ్చి పార్క్ చేయమని స్పీడ్ గా లోపలికి వెళ్ళాడు.
కళ్ళతోనే మొత్తం స్కాన్ చేసి మొఖం కోపం గా పెట్టుకొని వీళ్లు ఎటు ఉన్నారో చూసి  అటు వైపు వెళ్తు సత్య పక్కనే ఉన్న సిరి ని చూసి అప్పటి వరకు ఉన్న కోపం పోయి మొఖం మీద చిరునవ్వు అలా వచి పోయింది.
మళ్ళీ మొఖం సీరియస్ గా పెట్టుకొని ప్రవీణ్ ఉన్న సైడ్ వెళ్లి వాడి వైపు కాల్చేసేలా చూసాడు.
సత్య వాళ్ళ అన్నయ్య అలా ప్రవీణ్ సైడ్ వెళ్ళగానే వాళ్ల అన్నయ్య ని చూసి అన్నయ్య అనుకుంటూ వెళ్లి గౌతమ్ ని గట్టిగ హత్తుకుంది.
గౌతమ్ ప్రేమగా చెల్లి చుట్టూ చెయ్యి వేసి ఒక 2 మినిట్స్ సత్య వెళ్ళిపోదాం అని చెప్పాడు దానికి సత్య అలానే అన్నయ్య అని సిరి పక్కనే నిల్చుంది.
మళ్ళీ గౌతమ్ సీరియస్ గా ప్రవీణ్ ని చూస్తుంటే మనోడి ప్యాంట్ తడిచిపోతుంది ఏమో అన్నట్టు ఉన్నాడు.
గౌతమ్ ప్రవీణ్ మీదకి వెళ్లి ఏరా ఒళ్ళు ఎలా ఉంది నా చెల్లి జోలికే వెళ్ళంతా ధైర్యం ఒచ్చిందా అని అన్నాడు.
దానికి రేయ్ బావ నేను ఎదో సరదాగా అన్న మాట పూర్తి కాకుండానే వెంటనే ఏంట్రా అని వాడి చెయ్యి మెలిపెట్టాడు.
రేయ్ బావ నొప్పి రా వదులు ఒసేయ్ సత్య వదాలమని చెప్పవే అని అరిచాడు సత్య మీద. 
అంటే సత్య కన్నా ముందే గౌతమ్ ఏంట్రా అరుస్తునవ్ అంత బలిసిందా ఈ గౌతమ్ చెల్లి మీదే అరుస్తునవ్ ఆని వాడి చెయ్యి మీద పట్టు పెంచాడు.
రేయ్ నీ ఎంకమ్మ నొప్పి గా ఉంటే అరవకుండా సమ్మగా ఉంది అనాలా అని సత్యమ్మ కొంచం దయ చూపివే నీ “ప్రియుడి” మీద అని మొకం అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ ల పెట్టి అన్నాడు ప్రవీణ్.
పాపం సత్య కి కూడా భాదగా అనిపించి అయ్యో అన్నయ్య పోనీ లే వదిలేసేయి అని వాళ్ల అన్నయ్య చెయ్యి పట్టుకొని ఆపింది.
అరేయ్ బామ్మర్ది నా చెల్లి చెప్పింది అని ఆగుతున్న అని ప్రవీణ్ చెయ్యి వదిలేసాడు.
సత్య ని నోట్లో నోట్లో నే తిట్టుకొని నీ పని ఇప్పడు కాదె తర్వాత చెప్తా అని ఉరిమి చూసి మళ్ళీ ఎక్కడ గౌతమ్ చూస్తాడో అని మొకం ముచ్చు గా పెట్టుకొని నిల్చునాడు.
ఇదంతా ఎదో సినిమా చూస్తునట్టు నిల్చొని చూస్తుంది సిరి.
ఇంకా సత్య సిరి దగరికి వచ్చి సిరి చెయ్యి పట్టుకొని సిరి ని గౌతమ్ ముందు తీసుకువెళ్లి అన్నయ్య తిను సిరి నా బెస్ట్ఫ్రైండ్ సిరి తిను గౌతమ్ మా అన్నయ్య అంది.
సిరి గౌతమ్ ని చూసి నవ్వితే గౌతమ్ కి కడుపులో సీతకొక చిలికలు ఎగిరాయి ఆ నవ్వుకి.
గౌతమ్ ఫీలింగ్ చూసిన మిగితా వాలందరు ఒకేసారి దగ్గారు.
ఇంకా గౌతమ్ వాల వైపు చూసి సత్య ని చూసి వెళ్దామా అమ్మ అన్నాడు.
సత్య సరే అని సిరి ని చూసి అన్నయ్య ఒక మాట అని 2 సెకండ్స్ ఆగి అన్నయ్య సిరి ని కూడా ఇంటి దగ్గర దింపేసి వెల్దాము అంది.
దానికి సిరి సత్య వైపు అయ్యోమాయంగా చూస్తే గౌతమ్ సరే అన్నట్టు తాలూపితే సత్య సిరి వైపు చూసి తన చెయ్యి పట్టుకొని కార్ వరకు తీసుకెళ్ళింది కాదు కాదు ఈడ్చుకెళ్ళింది.
వాళ్లని చూసి గౌతమ్ నవ్వితే గౌతమ్ గ్యాంగ్ పాపం సత్య కి తెలీదు కాబోయే “వదిన” అని గౌతమ్ ని ఆటప్పటించడం మొదలుపెట్టారు.
వాళ్లకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి సత్య వెనక వెళ్లి కార్ ఆన్లాక్ చేసాడు వెంటనే సత్య సిరి ని కార్ లో కుధేసింది.
గౌతమ్ నవ్వుతూ చూస్తే సిరి గౌతమ్ వైపు కోపం గా చూస్తే గౌతమ్ కి సిరి మొకం చూసి ముచ్చట వేసింది ఆ క్షణం ముద్దు పెట్టుకోవాలనిపించింది.
ఇంకా కార్ స్టార్ట్ చేసాడు గౌతమ్……..
అలా గౌతమ్ కార్ స్టార్ట్ చేసి వెళ్తు కొద్దిగా దూరం వచ్చాక సత్య సిరి వైపు చూసాడు మిర్రర్ నుండి.
సత్య ఫోన్ చూస్తూ బిజీ గా ఉంటే సిరి బయటికి చూస్తూ ఉంటుంది.
ఇంకా ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ గౌతమ్ ఎక్కడ డ్రాప్ చెయ్యాలి నిన్ను అని అడుగుతాడు.
దానికి సిరి పాపకి వినిపించక మాట్లాడకపోవడం తో అమ్మ సత్య అని పిలుస్తాడు.
హా అన్నయ్య అని సత్య అనగా…..
కొనసాగుతుంది……..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.