New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 2

జ్వాలా ప్రజ్వలనం – 2

 

 

 

చీకటిని పూర్తిగా నిషేధించిన ఆ లగ్జరీ సూట్ రూమ్‌లో గాలి కూడా ఎంతో నిశ్శబ్దంగా, బరువెక్కినట్లుగా కదులుతోంది…

 

నగరపు హోరు ఆ ఎత్తైన ఇరవై ఐదో అంతస్తు వరకు చేరలేదు ఏమో.. కింద మాత్రం ఉదయపు సూర్యకాంతిలో అందంగా మెరుస్తుంది హైదరాబాద్ మహా నగరం… 

 

కాని ఆ గదిలోని వున్నా ఒక వ్యక్తికి మాత్రం ఆ నగరం అంతా కూడా కేవలం ఒక టాయ్ ల్యాండ్‌లా చిన్నపిల్లలు ఆదుకునే ఆట వస్తువులానే అనిపిస్తుంది , అంతటి మహా నగరం తన పాదాల కింద నలిగిపోయే చిన్న ప్రదేశంలా కనిపిస్తోంది.. అతడికి…

 

ఆ గదిలోనే ఒకవైపు, వెలుతురు కూడా సోకని చీకటి మూలలో ఒక కుర్చీ వెనుకకు వేసి కూర్చున్నాడు ఒక వ్యక్తి..

 

చుట్టూ వున్నా గోడల నిండా అమర్చిన భారీ డిజిటల్ స్క్రీన్స్ మీద రకరకాల గ్రాఫ్స్, బయో-డేటా, జన్యు మార్పిడికి సంబంధించిన సంక్లిష్టమైన కోడింగ్స్ బ్లూ లైట్ తో ఎంతో ఆకర్షనీయంగా మెరుస్తున్నాయి..

 

వాటిని చూస్తుంటేనే తెలుస్తుంది అవి ప్రపంచ ఉనికిని సైతం మార్చేసే ప్రయోగాలా తాలూకు చిత్రాలు అని..

 

అక్కడే వాటి అన్నిటి మధ్యలో మెయిన్ స్క్రీన్ మీద డైరెక్ట్‌గా, ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది… 

 

జ్వాల గత ఆరు సంవత్సరాలుగా కష్టపడి రూపుదిద్దుకున్న ‘సెల్యులార్ రెసిలియెన్స్’ (కణాల నిరోధకత) ప్రాజెక్ట్ తీసిస్..

 

నిజమే అది జ్వాలా చేస్తున్న ప్రాజెక్ట్ నే..

 

మరోచోట ఖండాలు దాటి, వేల మైళ్ల దూరంలోని ఒక విదేశీ గడ్డపై నుండి ఈ మొత్తం గేమ్‌ను శాసిస్తున్నా మాస్టర్ మైండ్ తన ముందు వున్నా స్క్రీన్ మీద జరుగుతుంది అంతా కూడా చూస్తున్నాడు… 

 

బ్లాక్ సూట్ లో చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని మరోవైపు సిగార్ వెలిగిస్తూన్నా.. అతని కళ్లన్నీ ఆ స్క్రీన్ మీద ఉన్న జ్వాల రీసెర్చ్ ఫైల్స్ పైనే ఉన్నాయి..

 

ఎలాగైనా జ్వాలా రీసెర్చ్ పూర్తి చేసి ఆ రీసెర్చ్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి అని చూస్తున్నారు..

 

సరిగ్గా అదే క్షణంలో టేబుల్ మీద ఉన్న అతడి శాటిలైట్ ఫోన్ మోగడంతో ఫోన్ లిప్ట్ చేసిన అతడు.. అవతలి వైపు వున్నా వాళ్ళు ఏమ్ చెప్తున్నారో అని వింటున్నాడు మౌనంగా!

 

గుడ్ మార్నింగ్ బాస్.. ఆపరేషన్ జ్వాలా అండర్ గోయింగ్.. డైలీ జ్వాలా గారిని ఆవిడా ఫ్యామిలీని గమనిస్తూనే వున్నాము..

 

మన మనుషులు ఇద్దరు రోజు జ్వాలా గారి సర్రౌండింగ్స్ లోనే ఉంటూ ఆవిడా ప్రతికదలికని గమనిస్తున్నారు..

 

“బాస్… ఈ రోజు జ్వాలా మేడం తన తీసిస్ ప్రెజెంటేషన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. 

 

అలాగే మనం ఆశించినట్టే ఆమె డేటా తాలూకా మొదటి రెండు ఫేజ్‌ల బ్యాకప్ మన సర్వర్‌లోకి విజయవంతంగా వచ్చేసింది.. ల్యాబ్‌లో కూడా ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు!”

 

ఈ రోజు జ్వాలా గారి ప్రెసెంటేషన్ కంప్లీట్ అయినా తరువాత ఆవిడా మిగితా డాటాని డిపార్ట్మెంట్ సర్వర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు..

 

మెము మిగిలిన డాటని కూడా ఈ రోజు రాత్రికి మన సర్వర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం బాస్ అని అనడంతో..

 

ఆ వ్యక్తి పెదవులపై ఈవిల్ స్మైల్ వస్తుంది..

 

“హ్మ్మ్ గుడ్… వెరీ గుడ్… మై బాయ్స్ కానీ ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది..

 

ఆ సైంటిస్ట్ జ్వాలా తన మేధస్సుతో ప్రపంచాన్ని రక్షించాలనుకుంటోంది… 

 

కానీ అదే మేధస్సుతో మనం ఈ ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చుకోబోతున్నాం.. అని అంటూ తను ఇంకేం చేయాలో చెప్పిన అతడు.. తన మనుషులకి ఏదో ప్లాన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు..

 

అతనికి ఎదురుగా వున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న జ్వాలా ఫోటోని చూస్తూ.. ప్రపంచానికి ఒక గొప్ప శాస్త్రవేత్తగా అవ్వాలి అనుకుంటున్నావా మిస్ జ్వాలా..

 

కాని నీ ఆశయాన్ని నేను నా కలగా మార్చుకుంటాను.. నిన్ను నా నీడగా చేస్తాను.. నీడకి ఉనికి అంటూ ఉండదు జ్వాలా అని ఈవిల్ స్మైల్ చేస్తాడు..

 

అతడి చుట్టూ జ్వాలా లాంటి ఎందరో సైంటిస్ట్ లా రీసెర్చ్‌ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న చీకటి ప్రయోగాల తాలూకా ఫలితాలు కనిపిస్తుంటె వాటిని చూస్తూనే.. నవ్వుతూ..

 

హైదరాబాద్ లో వున్నా తన అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు.. అతడు.. ఇల్లీగల్ గా ట్రయిల్ చేస్తున్న జ్వాలా ప్రొజెక్ట్ ని మానిటర్ చేస్తున్న అసిస్టెంట్ తన బాస్ నుండి వస్తున్న కాల్ కి కంగారు పడుతూనే కాల్ లిప్ట్ చేస్తాడు..

 

జ్వాలా తన ప్రయోగాలా ద్వారా మనుషుల ప్రాణాలను రక్షించాలని తపన పడుతుందో.. ఆమె యొక్క అదే ప్రయోగంను వాళ్ళు వాళ్ళ అవసరం కోసం వాడుకుంటున్నారు…

 

జ్వాలా యొక్క ‘కణాల నిరోధకత’ ఫార్ములాను మరియు.. అదే ఫార్ములాను రివర్స్ చేసి , రెండు వేరు వేరు ప్రయోగాలను ఒక రహస్య అండర్‌గ్రౌండ్ ల్యాబ్‌లో ఇల్లీగల్ బయో-ట్రయిల్స్ చేస్తున్నారు..

 

కాని వాళ్ళకి ఆ రెండు విధానాలలోను అనుకున్న ఫలితాలు రాక పొగ… ఆ ప్రయోగశాలలో సాధారణ మానవ కణాలపై ఆ ఫార్ములాను ప్రయోగించినప్పుడు… 

 

ఆ కణాలు సాధారణంగా కోలుకోకుండా ఓవర్ హీట్ ఎఫెక్ట్ కి బూడిదైపోతున్నాయి.. సెల్ రిగైన్ అని జ్వాలా అనుకున్న ప్రాజెక్ట్ లో వాళ్ళు విజయం సాధించలేక పోతున్నారు..

 

అలాగే జ్వాలా ప్రాజెక్ట్ ని రివర్స్ చేసి.. మెల్లిగా మెల్లిగా కణాలను చంపేసే సెల్ డెత్ ని కూడా వాళ్ళు పూర్తి చేయలేక పోతున్నారు..

 

 వాళ్ళ లక్ష్యం క్షణాల వ్యవధిలో మనుషుల కణాలలో వున్నా డీఎన్‌ఏను పూర్తిగా కుళ్ళిపోయేలా చేసే అత్యంత శక్తివంతమైన ‘బయో-వెపన్స్’ ని తయారు చేయాలని ఆ సిండికేట్ తెరలేపింది..

 

ఒకవైపు జ్వాలా తన రీసెర్చ్ వల్ల ప్రాణాలు పోయాలి అనుకుంటే.. మరోవైపు అదే రీసెర్చ్ తో వీళ్ళు ప్రాణాలు తియ్యాలి అని అనుకుంటున్నారు..

 

బాస్ నుండి వస్తున్న కాల్ లిప్ట్ చేసిన అసిస్టెంట్ భయంగానె తమ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు అనే విషయం చెప్పి.. తన బాస్ ఏమ్ అంటాడో అని అతడి ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తుంటాడు..

 

కొన్ని నిమిషాల మౌనం తరువాత సో.. మనం సక్సెస్ అవ్వాలి అంటే కేవలం జ్వాలా ప్రాజెక్ట్ డాటా మాత్రమే సరిపోదు మిస్ జ్వాలా కూడా మన అండర్ లోనే ఉండాలి అని అంటూ..

 

అసిస్టెంట్ కి ఏదో ప్లాన్ చెప్పి ఆ ప్లాన్ ని రెండు రోజుల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరొమాటకి తావు ఇవ్వకుండా ఆ బాస్ కాల్ కట్ చేస్తాడు..

 

కట్ అయినా కాల్ ని చూస్తూనే ఇప్పుడు తన బాస్ చెప్పిన ఆ పని అంతా సులువుగా అవుతుందా అని కొంచం భయంగానే జ్వాలాని ఎలాగైనా లాక్ చేయాలి అని తన బాస్ చెప్పిన ప్లాన్ నే ఇంప్లిమెంట్ చేస్తాడు అతడు..

 

మరి వాళ్ళు అనుకునేటట్టు గానే జ్వాలాని లాక్ చేయగలరా?

 

@@@ 

 

 

జ్వాలా వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసాక.. తన ఫ్రెండ్స్ ని మీట్ అయ్యి వస్తాను అని రాఘవన్ గారు కూడా బయటికి వెళ్తున్నట్టు చెప్పడంతో..

 

కూతురి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అని తను కూడా గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కుకుంటాను అని సుమిత్ర గారు కూడా ఆ రోజు బయటే గడిపేలా ప్లాన్ చేసుకుంటారు..

 

తల్లి, తండ్రుల షెడ్యూల్ వింటూనే మరోవైపు కావ్య నేను మాత్రం ఈ రోజు కాలేజీకి వెళ్లాలా అని ఆలోచిస్తూ.. 

 

అంతా అవసరం లేదు లే అమ్మవాళ్ళకి డౌట్ రాకుండా అటెండెన్స్ వేయించుకొని.. కాలేజీ స్పాన్సర్ తోనే తన అక్క ప్రెసెంటేషన్ ఇస్తున్న అదే సైన్స్ సెమినార్ కి అటెండ్ అవ్వాలి అని.. ప్లాన్ చేస్తుంది 

 

జ్వాలా సెమినార్ కి తను కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయినా కావ్య ఆ విషయం జ్వాలాకి చెప్పకుండా సర్ప్రైస్ చేద్దాం అనుకుంటుంది..

 

ఇక జ్వాలా కూడా కావ్యని కాలేజీలో డ్రాప్ చేసి తను ల్యాబ్ కి వెళ్తాను అని.. తల్లికి తండ్రికి చెప్పి.. చెల్లితో కలిసి కార్ లో స్టార్ట్ అవుతుంది..

 

జ్వాలా ఎప్పుడు అయితే వాళ్ళ స్ట్రీట్ ని దాటిందో అక్కడి నుండి రెండు బైక్స్ జ్వాలా కార్ ని కొంచం డిస్టెన్స్ లో ఫాలో చేస్తాయి.. ఇది రోజు జరుగుతున్న తంతే..

 

గంట తర్వాత… హైదరాబాద్‌లోని ప్రముఖ బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రం అయినా ‘బయో-జెనిక్స్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్’

నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ఉన్న బయో-టెక్నాలజీ సంస్థ అది..

 

అక్కడ వాతావరణం కొలహాలంగా ఉండగా ప్రముఖ సైంటిస్ట్ లా కార్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆగుతున్నాయి.

 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆ భవనం లోపలికి అడుగుపెడితే, ఎక్కడ చూసినా పరిశోధకులు, శాస్త్రవేత్తలు తమ పనుల్లో నిమగ్నమై కనిపిస్తారు.

 

 

 

అలాంటి ఆ భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న సెల్యులార్ బయాలజీ విభాగంలో మాత్రం అప్పటికే సందడి మొదలైంది.

 

కావ్యని కాలేజీలో డ్రాప్ చేసి, ల్యాబ్ కి వచ్చిన జ్వాల తన కార్ పార్క్ చేసి, మెయిన్ గేట్ దగ్గర బయోమెట్రిక్ స్కాన్ కూడా పూర్తి చేసుకున్నాక సెక్యూరిటీని విష్ చేసి లోపలికి వెళ్ళింది..

 

“గుడ్ మార్నింగ్ మేడమ్ జ్వాలా !”

 

అంటూ తనను పలకరిస్తున్న సహచరులకు చిరునవ్వుతో సమాధానం చెప్తూ లోపలికి అడుగుపెట్టింది జ్వాలా.

 

వైట్ కోట్, బ్లూ జీన్స్, మెడలో ఐడీ కార్డ్, కళ్లలోని తీక్షణత చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో ఎంతో హుందాగా కనిపిస్తోంది.. జ్వాలా 

 

“హాయ్ జ్వాలా! ఈరోజు నీ ప్రెజెంటేషన్ కదా? ఆల్ ది బెస్ట్ డియర్.”అంటూ ఎదురుగా వచ్చింది తన కో సైంటిస్ట్ నందిని..

 

“థాంక్యూ నందూ! అని అంటూ.. నందిని హాగ్ చేసుకున్న జ్వాలా.. హ్మ్మ్ మరి మన రీసెర్చ్ తీసిస్ సక్సెస్ అయితే ఈసారి ట్రీట్ మాత్రం నీ తరఫున నుండి ఉండాలి.”అంటూ నవ్వింది జ్వాలా..