New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 3

జ్వాలా ప్రజ్వలనం – 3

వైట్ కోట్, బ్లూ జీన్స్, మెడలో ఐడీ కార్డ్, కళ్లలోని తీక్షణత చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో ఎంతో హుందాగా కనిపిస్తోంది.. జ్వాలా 

 

“హాయ్ జ్వాలా! ఈరోజు నీ ప్రెజెంటేషన్ కదా? ఆల్ ది బెస్ట్ డియర్.”అంటూ ఎదురుగా వచ్చింది తన కో సైంటిస్ట్ నందిని..

 

“థాంక్యూ నందూ! అని అంటూ.. నందిని హాగ్ చేసుకున్న జ్వాలా.. హ్మ్మ్ మరి మన రీసెర్చ్ తీసిస్ సక్సెస్ అయితే ఈసారి ట్రీట్ మాత్రం నీ తరఫున నుండి ఉండాలి.”అంటూ నవ్వింది జ్వాలా..

 

 

 

“అమ్మో! ప్రాజెక్ట్ నీది, ట్రీట్ మాత్రం నాదా? బాగుంది తల్లి నీ న్యాయం!”అంటూ నందిని కూడా నవ్వడంతో ఇద్దరూ నవ్వుకుంటూనే కలిసి ల్యాబ్ వైపు వెళ్లారు..

 

నందిని తన వర్క్ ప్లేస్ కి వెళ్లగా జ్వాలా తన కాబిన్ లోకి వెళ్తుంది..

 

ఆ బయో – జెనిక్స్ ల్యాబ్ లోపల అంతా వైట్ అండ్ బ్లూ లైటింగ్‌తో, క్లిష్టమైన కెమికల్ అనలైజర్స్, మైక్రోస్కోప్స్ మరియు సూపర్ కంప్యూటర్లతో నిండి ఉంది.. 

 

జ్వాల తన క్యాబిన్‌కి వెళ్తుండగా, ఆమె సీనియర్ కొలీగ్ మరియు క్లోజ్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ జ్వాలాకి ఎదురు వస్తాడు.. 

 

జ్వాలా సిద్దార్థ్ ని చూడగానే ఫార్మాల్ స్మైల్ చేయగా సిద్దార్థ్ కూడా నవ్వుతూ.. హ్మ్మ్ లుక్స్ లైక్ లిటిల్ బిట్ టెన్స్డ్.. అని అంటూ..

 

ప్రాసెంటేషన్ కోసం బయపడుతున్నావా జై! అని అడుగుతాడు..

 

జ్వాలా సిద్దార్థ్ మాటలకి ప్లేసెంట్ గా నవ్వుతూ అలాంటిది ఏమ్ లేదు అని అంటూనే.. హ్మ్మ్ లిటిల్ బిట్.. ఈ ప్రెసెంటేషన్ మీదనే నా రీసెర్చ్ తీసిస్ అప్రూవల్ డిపెండ్ అయి ఉంటుంది కదా సిద్దు..

 

ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వర్క్ ఇది.. 90% ప్రాజెక్ట్ ఫినిష్ కూడా అయ్యింది విత్ ప్రాక్టికల్ ప్రూఫ్స్.. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ లో ఎలాంటి లూప్ హోల్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని చెక్ చేస్తూనే వున్నాను..

 

బట్ సైన్స్ లైక్ అ మ్యాజిక్ సిద్దు.. ఎప్పుడు ఎలాంటి మీరాకిల్ జరిగి లైఫ్ సేవ్ అవుతుందో చెప్పలేం.. అలాగే మనం చేసె చిన్న మిస్టేక్స్ వల్ల కూడా లైఫ్ ఎలా పోతుందో చెప్పలేం..

 

ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు కూడా అలానే ఆక్సిడెంటల్ గా డిస్కౌవర్ చేసినవే అని అంటూంది..

 

జ్వాలా మాటలకి సిద్దు చిన్నగా నవ్వుతూ.. హ్మ్మ్ యూ ఆర్ రైట్ జే! కాని మనం అనుకున్న పని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని ఎదురించగలం..

 

సాదించాలి అనే తపన వుంటే ఎన్ని సార్లు అపజయం పొందిన చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.. అప్పుడు గెలుపు ఎప్పుడు మన వైపే ఉంటుంది.. అని జ్వాలాలో కొంచం ధైర్యం నింపుతూ.. 

 

ఎనీ వే ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి కాన్ఫిడెంట్ గా సెమినార్ మీద దృష్టి పెట్టు.. అసలే ఈ సెమినార్ కోసం ప్రముఖ దేశాల నుండి చీఫ్ సైంటిస్ట్స్ కూడా వస్తున్నారు అని విన్నాను.. అని అనటంతో..

 

సిద్దు మాటలతో తనలో వున్నా టెన్షన్ కొంచం తగ్గడంతో జ్వాలా చిన్నగా స్మైల్ చేస్తూ.. హ్మ్మ్ థాంక్స్ బ్రో అని అంటుంది..

 

సిద్దు నవ్వుతూ.. ఇట్స్ ఓకే మా.. వెళ్ళు వెళ్ళు ఒకసారి రీసెర్చ్ డాటా చెక్ చేసుకో ప్రెసెంటేషన్ టైమ్ లో ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా అని అంటూ సిద్దు తన కాబిన్ లోకి వెళ్ళిపోతాడు 

 

వెళ్తున్న సిద్ధుని ఒక క్షణం పాటు అలానే చూసి జ్వాలా కూడా నేరుగా తన వర్క్‌స్టేషన్ దగ్గరికి వెళ్లి ల్యాప్‌టాప్ ఆన్ చేస్తుంది 

 

స్క్రీన్ మీద తన పరిశోధనకు సంబంధించిన గ్రాఫ్స్, సెల్ రియాక్షన్ రిపోర్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి.

 

అప్పుడే ఆమె వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది.

 

“మేడమ్! మీ సెల్యులార్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ ఈరోజు ఫైనల్ స్టేజ్‌కి వచ్చిందట కదా?”

 

అంటూ అడిగాడు అక్కడ పనిచేస్తున్న జూనియర్ రీసెర్చర్ శ్యామ్.. జ్వాలా అంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం.. ఎప్పుడు కూడా జ్వాలా చుట్టూ తిరుగుతూ ఆమె చేసె రీసెర్చ్ లా గురించి పొగడటమే పనిగా పెట్టుకుంటాడు..

 

శ్యామ్ మాటలకి శ్యామ్ వైపు చుసిన జ్వాలా “అవును శ్యామ్ .. కానీ నేను ఇంకా కొన్ని విషయాలు వెరిఫై చేయాలి.. సైన్స్‌లో మనం అనుకున్నది జరిగిందని సంతోషపడటం కంటే, జరగకూడనిది ఏది కూడా జరగకుండా చూసుకోవడం ముఖ్యం.”అంటూ తన స్క్రీన్ వైపు చూస్తూనె సమాధానమిచ్చింది.

 

ఆమె మాటలకు శ్యామ్ చిన్నగా నవ్వుతూ 

“అందుకే కదా మేడమ్, మీలా పనిచేయాలంటే మాకు కూడా చాలా ఓపిక కావాలి.” అని నవ్వుతూ అంటాడు..

 

“ఓపిక కాదు శ్యామ్ … అంకితభావం ఉండాలి.. మనం చేసె పరిశోధన వల్ల ఒక జీవితం సేవ్ అవ్వలే కాని.. 

ఏ ఒక్కరి ప్రాణం రిస్క్ లో పడకూడదు.. 

 

అందుకోసం మనం చేసె పని కష్టం అనుకోకుండా ఇష్టం తో చేయాలి.. చేస్తున్న పనిని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి అని.. అంటూ అతని భుజం మీద చిన్నగా తట్టి తన పనిలో నిమగ్నమైంది జ్వాలా..

 

మరోవైపు…

 

” రేయ్ వీర్… నీకు ఒక విషయం చెప్పాలి.” అని 

అంటూ ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వచ్చాడు రాహుల్.

 

అప్పటికే ఎదురుగా ఉన్న కంప్యూటర్ స్క్రీన్‌లో కొన్ని ఫైళ్లను పరిశీలిస్తున్న వీర్ అతని వైపు చూడకుండానే,

 

“ఏంట్రా? మళ్లీ ఏదైనా కొత్త ప్రేమకథ మొదలైందా?”

అని అడుగుతాడు..

 

” రేయ్ నీయబ్బ! నీకు ప్రతీదీ జోకే నేరా.. బాబు.. ఇక్కడ మ్యాటర్ కొంచం సీరియస్.. రా ” అని అనడంతో.. 

 

అంతా కొంపలు మునిగే సీరియస్ విషయం ఏంటో అని మనసులో అనుకుంటూ.. ” హ్మ్మ్ ఏంటి ఆ సీరియస్ మ్యాటర్ చెప్పు.. వింటాను .” అని అంటాడు వీర్ 

 

రాహుల్ వీర్ ని చూస్తూ ” అదే రా.. మన టార్గెట్ జ్వాలా మేడం గారు ఈరోజు తన రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది అంట.. కదా మనం కూడా అక్కడికి వెళ్లాలి.”అని అంటాడు..

 

రాహుల్ మాటలకి కోడ్ టైప్ చేస్తున్న వీర్ వేళ్లు కీబోర్డ్ మీద అలానే ఆగిపోతే 

 

“అక్కడికి మనం వెళ్లి ఏం చేయాలి రా ?” అయినా అది మన షెడ్యూల్ లో లేదు కదా అని అంటాడు వీర్ విసుగ్గా.. రాహుల్ ని అసహనంగా చూస్తూ.. 

 

వీర్ ఆ విసుగు అసహనం ఎందుకో రాహుల్ కి అప్పటికే అర్ధం అయినా.. అర్ధం కానట్టు..

 

అలా అంటావ్ ఏంట్రా.. జ్వాలా మేడం మన క్లయింట్ ఇచ్చిన టార్గెట్ ఆవిడా గారి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం గాథర్ చేయాలి కదా.. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కూడా..

 

అసలు మన క్లయింట్ ఎందుకు జ్వాలా గారి డీల్ మనకి ఇచ్చారో అనేది కూడా తెలియాలి కదా అని అంటూ.. 

 

నా గెస్ అయితే జ్వాలా గారి రీసెర్చ్ కోసమే మేడంని టార్గెట్ చేసారు అనిపిస్తుంది అని అంటాడు ఏదో డికోడ్ చేసినట్టుగా!

 

వీర్ కుర్చీలో వెనక్కి వాలుతూ రాహుల్ వైపు చూస్తూ..

 

“రాహుల్! మనకు ఇచ్చిన పని కేవలం జ్వాలాను గమనించడం మాత్రమే.. అనవసరంగా ఆమె పరిశోధనలో జోక్యం చేసుకోవద్దు.. క్లయింట్ నుంచి పూర్తి సమాచారం వచ్చేవరకు మనం ఏ నిర్ణయమూ తీసుకోకూడదు.”అని అంటూ..

 

నువ్వు ఎందుకో ఈ డీల్ ని కొంచం పర్సనల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు అని అనడంతో..

 

రాహుల్ మనసులో వీడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ గూటకలు మింగుతూ.. నో నో మచ్చా అదేం లేదు రా..

 

అని అంటూ వెంటనే కావ్య గుర్తు రాగానే.. కావ్యను చూడాలని అనిపిస్తుంటే.. కావ్య కూడా కాలేజీ బంక్ కొట్టి జ్వాలా గారి సెమినార్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నట్టు తెలిసే వీర్ తో మనం కూడా ల్యాబ్ కి వెళ్దాం అని అడుగుతాడు..

 

ఆ విషయం ముందే గమనించిన వీర్ 

 

“ చూడు మామా.. మనం ఒక డీల్ మీద వర్క్ చేస్తున్నాం నువ్వు ఇలా ఆ అమ్మాయి వెనుక తిరిగితూ నీ వర్క్ ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నా చేతిలోనే నీకు ముడుతుంది ” అని హెచ్చరించడంతో,

 

రాహుల్ అలకగా.. నీ మనసులోకి కూడా ఎవరైనా వస్తే అప్పుడు నీకు కూడా తెలుస్తుంది లే అని గోణుక్కుంటూ.. హ్మ్మ్ నేనేం వర్క్ ని నెగ్లెక్ట్ చేయట్లేదు అని అంటాడు.. అలుకగా..

 

@@@

 

మధ్యాహ్నం 11 గంటలు…

 

బయో సైన్స్ పరిశోధనా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రెజెంటేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

 

అక్కడికి పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు, బయోటెక్నాలజీ నిపుణులు వచ్చి కూర్చున్నారు.

 

మరికొన్ని నిమిషాల్లో జ్వాలా తన పరిశోధనను అందరికి వివరించబోతోంది.

 

అప్పుడే హాల్‌లోకి ప్రవేశించారు వీర్ అండ్ రాహుల్ లు..

రాహుల్ యొక్క మడిపోయిన ఫేస్ చూడలేక.. అలాగె రాహుల్ అన్నట్టుగా జ్వాలా ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో పాటు ప్రొఫెషనల్ గా ఆమె గురించి తెలుసుకోవాలి అనే కారణంతో.. అక్కడికి రావడానికి ఒప్పుకుంటాడు వీర్..

 

రాహుల్ అండ్ వీర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ కోసం.. ఫేక్ ఐడిలతో వాళ్లిద్దరూ ఆ సంస్థకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఆడిట్ టీమ్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ గా తమని తము పరిచయం చేసుకుంటారు..

 

ఆలా ఇద్దరు లోపలికి రాగా వీర్ తన చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా పరిశీలిస్తుంటె., రాహుల్ మాత్రం ఆడిటోరియం లో వున్నా అందరి మధ్య కావ్య కోసం వెతుకుతున్నాడు.

 

చుట్టూ చూస్తూనే ఒక కంట రాహుల్ ని గమనిస్తున్నా వీర్ “రేయ్! ఏం వెతుకుతున్నావ్?”అంటూ మెల్లగా అడుగుతాడు..

 

రాహుల్ కొంచం తడబడుతూ ” అ.. అబ్బే ఏం లేదు మచ్చా… సెక్యూరిటీని చెక్ చేస్తున్నా.”అని అనడంతో 

 

వీర్ వెటకారంగా ఏంటి “నీ కళ్లతోనా?”

అని అనడంతో రాహుల్ మళ్ళీ అలుకమొహం వేసుకొని సైలెంట్ గా కూర్చుంటాడు 

 

రాహుల్ ని ఆలా చూసి వీర్ నవ్వుకుంటున్నప్పుడే అప్పుడే హాల్‌లోకి అడుగుపెట్టింది జ్వాలా..

 

ఆమెను చూడగానే వీర్ చూపు క్షణం పాటు ఆమె మీద నిలిచిపోయింది..