జ్వాల 🔥 – 1
ఉదయం 10 గంటల సమయం …
ఒక అద్దాల మేడ వంటి ఇళ్ళు.. ఆ ఇళ్ళు ఎటువైపు చూసినా ఖరీదైన ఫర్నిచర్, ఎంతో విలువ చేసే వాల్ పెయింటింగ్స్, ఎంతో మోడరన్ ఇంటీరియర్ తో మిల మిల మెరిసిపోతుంది…
ఆ ఇంటి సెకండ్ ఫ్లోర్ లోని మెయిన్ బెడ్ రూమ్ లో ఒక ఇరవై అయిదు ఏళ్ల అబ్బాయి మెత్తని పరుపు మీద బెడ్ షీట్ నిండుగా కప్పుకుని మరీ నిద్ర పోతు ఉన్నాడు….
అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంది…
నిద్రలో ఉన్న అతను ఆ రింగ్ సౌండ్ కి డిస్టర్బ్ అయి చిన్నగా అటు ఇటు ఇబ్బందిగా కదులుతున్నాడు.
ఫోన్ రింగ్ అయి రింగ్ అయి కట్ అయిపోయింది…
ఫోన్ రింగ్ సౌండ్ ఆగిపోవడంతో ఆ అబ్బాయి మళ్ళీ ఒక పక్కకి తిరిగి హాయిగా బజ్జుంటాడు..
అతను పడుకున్న నిముషానికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంది…ఈ అబ్బాయి మాత్రం కళ్ళు తెరవకుండా నిద్రలోనే విసుగ్గా అటు ఇటు దొర్లుతూ ఉన్నాడే తప్ప పైకి లేవడం లేదు..
ఇక్కడ అతను లేవడం లేదు ఆ ఫోన్ మోగడం ఆగను లేదు….ఇతను ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో అవతల వాళ్ళు పదే పదే కాల్ చేస్తూనే ఉన్నారు…
ఫోన్ అలా నాన్‌స్టాప్ గా మోగుతూ ఉండడంతో ఇతనికి నిద్రాభంగం కలిగి మెల్లిగా కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుని అతని ఫోన్ చేతిలోకి తీస్కుని కాల్ లిఫ్ట్ చేస్తాడు….
ఇతను కాల్ లిఫ్ట్ చేయగానే అవతల నుండి ఓ నలుగురు హలో “క్రిష్” హ్యాపీ బర్త్‌డే రా అని ఎంతో హుషారుగా చెప్తారు.
వాళ్ళు అలా చెప్పగానే క్రిష్ నిద్ర మత్తులోనే థాంక్స్ రా అని చెప్తాడు.
క్రిష్ వాయిస్ విన్న వాళ్లకి క్రిష్ ఇంకా నిద్ర లేవలేదని అర్ధం అయి ఏంట్రా బర్త్‌డే బాయ్ ఇంకా బెడ్ కూడా దిగినట్టు లేవు వాయిస్ అంత లో గా వినిపిస్తుంది అంటారు..
హ రా నేను ఇంకా పడుకునే ఉన్నాను మీరే కాల్ చేసి నా నిద్రని డిస్టర్బ్ చేసారు ఇడియట్స్ అంటాడు క్రిష్ కాస్త కోపంగా…
ఓహో పుట్టినరోజు నాడు ఇంకా తెల్లార లేదా బాబు నీకు…టైమ్ ఎంత అయిందో చూసావా 10.30 అవుతుంది….
ఇంకా పడుకోవడం ఏంటి? బర్త్‌డే బాయ్ అంటే ఎంత ఆక్టివ్ గా ఉండాలి చెప్పు వేకప్ మై డియర్ బాయ్ అంటూ నవ్వుతూ…నువ్వు లేచి ఫాస్ట్ గా రెడీ అయి ఇంట్లో నీ సెలెబ్రేషన్స్ కంప్లిట్ చేసుకుంటే కదా మాతో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసేది అంటారు..
హ్మ్ ఐ నో ఇడియట్స్ మీరు నాకు కాల్ చేసింది బర్త్‌డే విషెస్ చెప్పడానికి కాదు… నేను ఇచ్చే పార్టీ కోసం అని అంతేగా అంటాడు క్రిష్…
హహహ నువ్వు ఎలా అయినా అనుకోరా మాకు నో ప్రాబ్లమ్ ఇంతకీ ఈవెనింగ్ ఎక్కడ కలుద్దాం అంటారు ఫ్రెండ్స్ నలుగురు హుషారుగా ..
ఇంకెక్కడికి మనం ఎప్పుడు వెళ్లే పబ్ లోనే మీట్ అవుదాం…అక్కడే పార్టీ ఎంజాయ్ చేద్దాం అంటాడు క్రిష్..
హ్మ్ ఓకే రా మేము ఈవెనింగ్ పబ్ దగ్గర వెయిట్ చేస్తుంటాం నువ్వు వచ్చేయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేస్తారు…..
క్రిష్ కూడా బాయ్ చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి ఎలాగూ తన నిద్ర పాడవడంతో బెడ్ దిగి ఫ్రెష్ అవడానికి వాష్ రూం కి వెళ్తాడు…
అరగంటలో బ్రష్ & స్నానం పూర్తి చేసి తన రూం లోకి వచ్చేసరికి బెడ్ మీద తన బర్త్‌డే డ్రెస్స్ సిద్ధం గా ఉంటుంది..క్రిష్ డ్రెస్స్ నీ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆ డ్రెస్స్ వేస్కుని అందంగా రెడీ అయి కిందకి వెళ్తాడు….
అప్పటికే హాల్లో అందరు క్రిష్ కోసం ఎదురుచూస్తూ ఉండడంతో క్రిష్ రాగానే అందరు ఒక్కసారిగా మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే క్రిష్ అని గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతూ క్రిష్ కి విషెస్ చెప్తారు….
క్రిష్ అందర్నీ ఒకసారి చూసి థాంక్స్ ఆల్ ఆఫ్ యూ అంటాడు చిన్న స్మైల్ తో…
వాళ్ళందరూ కూడా నవ్వుతూ రా క్రిష్ ముందుగా నువ్వొచ్చి కేక్ కట్ చెయ్ మేమంతా ఎప్పటి నుండో నీకోసం వెయిటింగ్ అంటారు కేక్ దగ్గరకి రమ్మని పిలుస్తూ ….
క్రిష్ ఓకే అంటూ అక్కడకి వచ్చి ఇంట్లో వాళ్ళందరి ముందు కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తాడు..ఇంట్లో వాళ్లంతా కూడా ఎంతో హ్యాపీగా విషెస్ చెప్తూ క్రిష్ కి కేక్ తినిపించి గిఫ్ట్స్ ఇస్తారు..
నెక్స్ట్ క్రిష్ నీ తీసుకెళ్లి తన కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేసిన ఫుడ్ నీ క్రిష్ కి తినిపిస్తూ అతనితో పాటు అందరు తింటారు….
అలా టిఫిన్ లు పూర్తయ్యి కాసేపు సరదాగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసి ఏవో కొన్ని గేమ్స్ ఆడి ఈవెనింగ్ అవుతుంది అనగా ఇంట్లో వాళ్లకి ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి వాళ్ళు నాకోసం వెయిట్ చేస్తుంటారు అని చెప్పి, డ్రెస్స్ చేంజ్ చేసుకుని స్పెషల్ గా రెడీ అయి బయటకి వెళ్ళిపోతాడు….
ఇక్కడ ఇలా ఉండగా ఇదే రోజు మరో ఇంట్లో ఏమి జరిగిందో చూద్దాం రండి….
ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచి వాకిట్లో నీళ్ళు చల్లి ముగ్గు వేసి,అది పూర్తయ్యాక తన రూం కి వెళ్లి స్నానం చేసొచ్చి,దేవుని గదిలోకి వెళ్లి పూజ చేసి, ఆ తర్వాత కిచెన్ లోకి వచ్చి కాఫీ కలిపి తన అమ్మ, నాన్నల గదికి తీసుకెళ్లి వాళ్ళని నిద్ర లేపి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి ఇద్దరికీ కాఫీ గ్లాసెస్ ఇస్తుంది…
వాళ్లిద్దరూ లేచి చిరునవ్వుతో ఆ అమ్మాయిని చూస్తూ ప్రేమగా తల నిమిరి గుడ్ మార్నింగ్ చెప్తారు…
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆమెని చూస్తూ నువ్వు అప్పుడే లేచేసి పూజ పూర్తి చేయడమే కాక కాఫి కూడా పెట్టేశావా “బుజ్జి” అయినా నీకెందుకురా ఈ పనులన్నీ నేను చేస్తానుగా…ఇంటా బయట అన్నీ నువ్వే చేసి అలసిపోవడం ఎందుకు….
నీకు బయట ఎలాగూ కష్టపడడం తప్పదు.. ఇంట్లో కూడా ఈ పనులు ఎందుకుమా నేను ఎన్ని సార్లు చెప్పిన నా మాట వినకుండా అన్నీ పనులు చేస్తానంటావ్ నీకెందుకు తల్లి ఇంత కష్టం అంటుంది కూతురు కష్టాన్ని గుర్తించి కొంచెం ఫీల్ అవుతూ..
వాళ్ళ అమ్మ మాటలకి బుజ్జి చిన్నగా నవ్వుతూ అబ్బా అమ్మ నేనేం అంత కష్ట పడి పోవడం లేదులే అయినా నేను చేస్తుంది మనింట్లో పనులేగ నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావ్….
నేనేదో కష్టపడి పోతున్నానని ఆలోచించి ఫీల్ అవకుండా కామ్ గా కాఫి తాగి ఇద్దరు రెడీ అయి బయటకి రండి… నేను ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను అంటూ వాళ్ళు తాగిన కాఫీ గ్లాస్సెస్ తీస్కుని బయటకి వెళ్ళిపోతుంది…
వెళ్తున్న కూతురు ని చూస్తూ వాళ్ళ అమ్మ, నాన్నలు నీలాంటి కూతురు మాకు ఉండడం మా అదృష్టం తల్లి అనుకుంటారు….
బుజ్జి వాళ్ళ పేరెంట్స్ రూం నుండి నేరుగా కిచెన్ లోకి వెళ్లి పూరీ, ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తుంది…ఆమె టిఫిన్ రెడీ చేసే లోపు తన పేరెంట్స్ రెడీ అయి బయటకి వస్తారు…
బుజ్జి వాళ్ళని చూసి టిఫిన్ టేబుల్ దగ్గరకి తెచ్చి పెట్టేసి వాళ్ళని కూర్చోపెట్టి టిఫిన్ వడ్డిస్తుంది…వాళ్ళమ్మ తను తింటూ బుజ్జి కి తినిపిస్తుంటే, వాళ్ళ నాన్నకి బుజ్జి తినిపిస్తుంది…
అలా ముగ్గురు కలిసి టిఫిన్ తినేస్తారు… నెక్స్ట్ బుజ్జి అన్నీ కిచెన్ లో సర్దేసి తన రూం కి వెళ్లి గబ గబ డ్రెస్స్ చేంజ్ చేస్కుని,తల దువ్వుకుని రెడీ అయి హ్యాండ్ బ్యాగ్ తో బయటకి వస్తుంది….
హాల్లో ఉన్న తన అమ్మ, నాన్నలకి బాయ్ చెప్పి రెండు అడుగులు ముందుకు వేస్తుంది…
అప్పుడు వెనక నుండి వాళ్ళ అమ్మ బుజ్జి ఒక్క నిముషం తల్లి..నీతో కొంచెం మాట్లాడాలి ఆగు.. ఏంటో నువ్వు అసలు మాకు నీతో మాట్లాడడానికి టైం కూడా ఇవ్వడం లేదు.. రోజు ఏదో ఒకటి చెప్పి మా నోరు నొక్కేస్తున్నావ్ .. ఈరోజు అయిన కాసేపు మాట్లాడేందుకు టైమ్ ఇవ్వు అని పిలుస్తుంది…
వెంటనే బుజ్జి వెనక్కి తిరిగి అమ్మ నువ్వు నాతో ఏమి మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు..నీ ప్రశ్నకి నా సమాధానం ఏంటో కూడా నీకు బాగా తెలుసు…
ఇంక అంతోటి దానికి రోజు మన మధ్య ఈ డిస్కషన్ అవసరమా చెప్పు..అవతల నాకు లేట్ అవుతుంటే ఇప్పుడు ఆ టాపిక్ అంత ఇంపార్టెంట్ నా?
నువ్వు దాని గురించి వదిలేసి పని చూసుకో బాయ్ అంటూ వాళ్ళ నాన్న వైపు తిరిగి చేయి ఊపుతూ వాళ్ళ అమ్మ అది కాదు తల్లి నేను చెప్పేది విను అంటున్న ఆ విషయం గురించి తప్ప ఇంకేదయినా మాట్లాడతాను అంటే వింటాను లేదంటే వెళ్తాను అంటుంది బుజ్జి రెండు చేతులు కట్టుకుని నిలబడి తల్లిని చూస్తూ….
హ్మ్ సరేలే నీకు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నేను మాట్లాడి ఏమి లాభం గాని మీ నాన్న గారికి మందులు అయిపోయాయి సాయంత్రం వచ్చేటపుడు తీస్కునిరా అంటూ ఇంకా మీ అక్క అంటూ ఏదో చెప్పబోయి చెప్పలేక బాధగా ఆగిపోతుంది బుజ్జి అమ్మ “సునీత “
దాంతో బుజ్జి వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చి ఆమె చేతులు పట్టుకుని అక్క నీకు ఫోన్ చేసి బావ కట్నం డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పింది అంతే కదా….
ఆ మాత్రం దానికి నువ్వు ఎందుకు అమ్మ ఇంత బాధ పడుతున్నావ్…నేను ఆల్రెడీ ఆ డబ్బులు ఏర్పాటు చేసానులే ఈవెనింగ్ లోపు బావకి పంపిస్తాను..
దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు..అన్నీ నేను చూసుకుంటాను.. నువ్వు నన్ను, నాన్నని చుస్కో చాలు అంటూ నవ్వుతూ తల్లి బుగ్గన ముద్దు పెట్టి, పక్కనే ఉన్న నాన్న చేతికి ముద్దు పెట్టి ఇద్దరికీ బాయ్ చెప్పి బయటకి వెళ్ళిపోయింది..
వెళ్తున్న కూతురిని చూస్తూ తన పేరెంట్స్ ఒకింత బాధగా నీకు ఈ వయసులోనే ఎన్ని బాధ్యతలు తల్లి అనుకుంటారు….
continued….
Swipe left/right or tap the sides to turn pages