New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల 🔥 – 2

జ్వాల 🔥 – 2

వెళ్తున్న కూతురిని చూస్తూ తన పేరెంట్స్ ఒకింత బాధగా నీకు ఈ వయసులోనే ఎన్ని బాధ్యతలు తల్లి అనుకుంటారు….

 

బ్యాక్ టు క్రిష్…

 

క్రిష్ ఇంటి నుండి బయటకి వచ్చి కార్ లో పబ్ కి వెళ్తాడు…క్రిష్ వెళ్లేసరికి తన నలుగురు ఫ్రెండ్స్ పబ్ బయట అతని కోసం వెయిట్ చేస్తుంటారు…

 

 

క్రిష్ రాగానే నలుగురు నవ్వుతూ క్రిష్ దగ్గరకి వచ్చి హగ్ చేస్కుని ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్డే క్రిష్ అంటారు…క్రిష్ చిన్న స్మైల్ తో థాంక్యూ ఆల్..పదండి లోపలకి వెళ్దాం అంటూ ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లోకి వెళ్తాడు…

 

అక్కడ తన ఫ్రెండ్స్ ముందుగానే క్రిష్ కోసం అరేంజ్ చేయించిన కేక్ తెప్పించి ముందుగా క్రిష్ తో కేక్ కటింగ్ చేయించి బర్త్డే పార్టీ స్టార్ట్ చేస్తారు..

 

కేక్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఎంతో హ్యాపీగా వాళ్లకి కావాల్సిన డ్రింక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు…డ్రింక్స్ వచ్చాక సరదాగా అక్కడ వున్న అమ్మాయిల ఫిజిక్ గురించి కామెంట్స్ చేసుకుంటూ, పక్కనే స్టేజ్ మీద డాన్స్ వేస్తున్న అమ్మాయిల్ని చూస్తూ మ్యూజిక్ నీ ఎంజాయ్ చేస్తు తాగుతుంటారు…

 

పెగ్ మీద పెగ్ లోపలకి వెళ్లేసరికి అబ్బాయిలకి అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్ కి డాన్స్ వేయాలనిపించి అందరు స్టేజ్ మీద కి వెళ్లి అక్కడ ఉన్న అమ్మాయిలతో పెయిర్స్ అయి చాలా సేపు డాన్స్ వేస్తారు….

 

ఆ డాన్స్ లో భాగంగా ఆ అమ్మాయిలని వాళ్లకి నచ్చినట్టు టచ్ చేస్తు స్టెప్స్ పేరుతో అక్కడ ఇక్కడ చేతుల్తో నొక్కేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు…

 

ఆ డాన్సర్స్ కి అదంతా అలవాటే అన్నట్టుగా వాళ్ళు కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా వీళ్ళతో కలిసి తెగ చిందులేస్తుంటారు…

 

అలా గంట, గంటన్నర ఆ అమ్మాయిలతో డాన్స్ వేసి అలసిపోయి స్టేజ్ దిగి వచ్చి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చుని మళ్ళీ డ్రింక్స్, బిర్యానీ తెప్పించుకుని తాగుతూ తింటూ ఉంటారు….

 

ఇదే టైం లో మరో చోట ఏమి జరిగిందో చూద్దాం రండి…

 

సాయిబాబా హాస్పిటల్స్…

 

సమయం రాత్రి 10.40 గంటలు….

 

డ్యూటీ డాక్టర్ హాస్పిటల్ అంత రౌండ్స్ వేస్తూ పేషంట్స్ నీ చెక్ చేసి వాళ్లకి అవసరమైన మందులు ఇచ్చి అవి ఎలా వాడాలో నర్స్ లకి చెప్పి తనకి ఏదో అర్జెంటు వర్క్ ఉందని ఇంటికి వెళ్ళిపోతుంది….

 

అక్కడ ఉన్న ఇద్దరు, ముగ్గురు నర్స్ లు డాక్టర్ చెప్పిన ప్రకారం పేషంట్స్ కి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ వేస్తూ ఉన్నారు…

 

అలా అన్నీ రూమ్స్ తిరిగి అందరిని చెక్ చేస్కుని వచ్చేసరికి ఇంకో గంట పట్టింది…

 

సో ఇప్పుడు టైం 11.40 అయింది…

 

అందరి పేషంట్స్ ని చెక్ చేయడం పూర్తవడంతో, ఆమె డ్యూటీ కంప్లీట్ అవడంతో ఒక నర్స్ ఇంటికి వెళ్ళిపోయింది…

 

మరో ఇద్దరు నర్స్ లు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు…

 

అందులో ఒక నర్స్ పక్కనే వున్న వాళ్ళని చూస్తూ ఏమే బుజ్జి డబ్బులు ఏవో కావాలి మీ బావకి ఇవ్వాలి అంటున్నావు కదా అడ్జస్ట్ అయ్యాయా మరి అని అడుగుతుంది…

 

 హా రా మన డాక్టర్ మేడం ఇచ్చారు..ఈవ్నింగ్ నే వాటిని మా బావ కి ట్రాన్స్ఫర్ చేసాను కూడా అని చెప్తుంది బుజ్జి …

 

ఓహ్ అవునా మంచిది…సమయానికి మేడం సాయం చేసిందన్నమాట… పోనిలే ఎలాగోలా నీ అవసరం తీరింది….

 

ఇంక నుండి మీ బావ పోరు నీకు ఉండదు… పెళ్లప్పుడు ఏదో కాస్త కట్నం డబ్బులు తక్కువ ఇచ్చారని అప్పటి నుండి ప్రతి రోజు మిమ్మల్ని నానా మాటలు అంటూ రోజు నీకు కాల్స్,మెస్సేజెస్ చేస్తు అడుగుతూనే ఉన్నాడు కదా….

 

ఏ రోజు అతను మీ ఇంటి సిట్యుయేషన్ కానీ, నీ బాధలు, బాధ్యతలు గాని పట్టించుకున్నది, ఆలోచించింది లేదు….

 

పైగా డబ్బులు తేలేదని మీ అక్కని నానా మాటలు అనడం,నీకు ఫోన్ చేపించి నిన్ను ఏడిపించడం చేస్తుండేవాడు….

 

ఈరోజు తో అతని డబ్బులు ఇచ్చేసావు కాబట్టి నీకు అతని గోల ఉండదనే అనుకుంటున్నాను.. నాకు ఇప్పుడు కొంచెం సంతోషం గా ఉందే నీకు వాడి గోల తప్పినందుకు అంటుంది బుజ్జి చేయి పట్టుకుని అభిమానంగా చూస్తూ….

 

ఆమె మాటలకి బుజ్జి చిన్నగా నవ్వుతూ హ్మ్ నాకు అవన్నీ అలవాటయి పోయాయి లేవే..కుటుంబం అన్నాక ఇలాంటివన్నీ తప్పవు.. అయినా నన్ను మాటలు అనింది మా బావే కదా ఏమి కాదులే.. బావ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఆయన ఒక మాట అంటే తరిగిపోయేది ఏముంది చెప్పు..

 

అయినా ఆయన మాత్రం ఏమడిగాడు ఆరోజు అక్క పెళ్ళిలో మేము ఇస్తామని చెప్పి పరిస్థితుల కారణం గా ఇవ్వలేకపోయినా కట్నం డబ్బులే కదా..

 

బహుశా అవి ఆరోజు మేము ఇచ్చేసి ఉంటే ఇన్ని రోజులు బావ మమ్మల్ని ఇన్ని మాటలు అనుండేవాడు కాదేమో… తప్పు మా వైపు ఉంది కాబట్టి బావని తప్పు పట్టలేం.. అది మా టైం అంతేలే అంటూ నిట్టూరుస్తుంది బుజ్జి….

 

 హ్మ్ ఏమి జరిగిన ఎవరేం చేసిన అన్నింట్లో పాజిటివ్ గా థింక్ చేయడం నీకే చెల్లుతుందే బుజ్జి… ఓన్లీ మనవైపు నుండే కాకుండా అవతల వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచిస్తావ్ నువ్వు గ్రేట్ బుజ్జి..అందుకే ఐ లైక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ సైడ్ హగ్ చేసుకుంటుంది ఆమె ఫ్రెండ్ నవ్వుతూ….

 

బుజ్జి కూడా తిరిగి హగ్ చేస్కుని ఐ ఆల్సో లైక్ యూ అంటూ స్మైల్ చేస్తుంది…

 

హ్మ్ సరే మరీ ఇంక నువ్వెళ్లు నీకు లేట్ అవుతుంది కదా ఎలాగూ నాకు ఈరోజు నైట్ డ్యూటీ కాబట్టి నేనుండక తప్పదు అని చెప్తుంది ఫ్రెండ్….

 

దాంతో ఓకే రా నేను స్టార్ట్ అవుతాను.. నువ్వు జాగ్రత్త అంటూ అక్కడ నుండి లేచి ఫ్రెండ్ కి బాయ్ చెప్పి నాలుగు అడుగులు వేస్తుంది హాస్పిటల్ బయటకి రావడానికి….

 

అప్పుడే ఒక ఆటో లో నుండి ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి హడావిడిగా కిందకి దిగుతారు..ఆటో లోపల ఒక ఆవిడ పురిటి నెప్పులకు తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంది…

 

ఆ వ్యక్తి ఆవిడని ఎత్తుకుని వచ్చేసాం మా హాస్పిటల్ కి వచ్చేసాం…ఇంకాసేపే ఓర్చుకో మా అంటూ తన భార్య వైపు బాధగా చూస్తూ చెప్తున్నాడు…

 

ఆవిడ తన భర్త వైపు చూస్తూ నొప్పికి తట్టుకోలేనట్టు భాధగా అరుస్తూనే కన్నీళ్లు కారుస్తుంది….

 

వాళ్ళతో వచ్చిన ఆడవాళ్ళు అతనికి సాయంగా ఆవిడని పట్టుకుని కాసేపే తల్లి ఓర్చుకో.. మరి కాసేపట్లో పండంటి పాపనో బాబునో నీ ఒడిలో ఆడుకుంటూ ఉంటారు అంటూ మాటలు చెప్తూ ఆమెని సముదాయిస్తున్నారు….

 

అలా ఆవిడని ఎత్తుకుని డాక్టర్ డాక్టర్ అంటూ పిలుస్తూ పరుగులాంటి నడకతో బుజ్జికి ఎదురుగా వస్తారు..

 

బుజ్జి వీళ్ళ పిలుపులకి,ఆ ప్రెగ్నెంట్ లేడీ అరుపులకి పరుగున వీళ్ళ దగ్గరకి వచ్చి వీళ్ళని చూడగానే ఆమెకి పరిస్థితి అర్ధం అయింది….

 

వెంటనే అలెర్ట్ అయి పక్కన రూం లో ఉన్న స్టెచ్చర్ ని తీసుకొచ్చి ఆవిడ ని అందులో పడుకో పెట్టమని చెప్పి  ఆ వ్యక్తి పడుకోపెట్టగానే బుజ్జినే స్వయంగా ఆ స్టెచ్చర్ ని తోసుకుంటూ లేబర్ రూం కి తీసుకెళ్తుంది…

 

అక్కడకి తీసుకెళ్ళాక ఆవిడకి ధైర్యం చెప్తూ ఏమి టెన్షన్ పడకు అమ్మ… మీకేం కాదు కాసేపు ఓర్చుకోండి మీ బిడ్డ క్షేమంగా మీ గర్భాన్ని చీల్చుకుని ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడు..

 

మీరు అస్సలు కంగారు పడకండి అంటూ బీపీ అవి చెక్ చేస్తు అన్నీ నార్మల్ అని తెలిసాక కడుపు మీద చేతితో టచ్ చేసి చూసి తనకి ఫాల్ ఫైన్స్ కాదు డెలివరీ పెయిన్స్ ఏ అని క్లారిటీ వచ్చేసరికి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని ఫాస్ట్ గా వెళ్లి తన ఫ్రెండ్ అయిన నర్స్ నీ పిలిచి విషయం చెప్పి ఆవిడ దగ్గర ఉంచిన బుజ్జి పక్కకి వెళ్లి డాక్టర్ కి కాల్ చేస్తుంది…

 

బట్ ఎన్ని సార్లు చేసిన డాక్టర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు… దాంతో బుజ్జికి ఆ కంగారులో ఏం చేయాలో అర్ధం కాలేదు… అవతల నొప్పికి ఆ తల్లి పడే బాధను చూడలేకపోతుంది….

 

అలా అని డాక్టర్స్ లేకుండా మేము డెలివరీ ఎలా చేయగలం, పొరపాటున డెలివరీ టైమ్ లో ఏదన్నా కంప్లికేషన్స్ వస్తే తల్లి,బిడ్డ ఇద్దరికీ ప్రమాదమే అని ఎంతో టెన్షన్ పడిపోతు డాక్టర్ కి కాల్ ట్రై చేస్తూనే ఉంది..

 

ఆపకుండా ఓ పది, పదకొండు సార్లు చేసాక డాక్టర్ కాల్ లిఫ్ట్ చేసింది.. డాక్టర్ ఫోన్ ఎత్తగానే కంగారుగా మాట్లాడుతూ మేడం మన హాస్పిటల్ కి ఒక డెలివరీ కేస్ వచ్చింది….

 

ఆవిడకి పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి..ఆవిడ డెలివెరీకి సిద్ధం గా ఉంది మీరు అర్జెంటు గా హాస్పిటల్ కి రావాలి మేడం అని చెప్తుంది బుజ్జి….

 

మేడం బుజ్జి మాటలు వినగానే కొంచెం బాధగా అయ్యో బుజ్జి నేను ఇప్పుడు హైదరాబాద్ లో లేను… అర్జంట్ వర్క్ ఉండి వైజాగ్ వెళ్ళున్నాను రేపు మార్నింగ్ వరకు రాలేను.. ఇప్పుడెలా పాపం ఆవిడ పరిస్థితి బాలేదు అంటున్నావు అంటూ కొంచెం ఫీల్ అవుతుంది…

 

వెంటనే బుజ్జి ఎంతో కంగారుగా అయ్యో మేడం మీరు సిటీలో లేరా…మరి ఇప్పుడేం చేయమంటారు తనని వేరే హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పడానికి కూడా దగ్గర్లో హాస్పిటల్స్ లేవు గా….

 

ఇక్కడ నుండి ఒ ఇరవై కిలోమీటర్స్ దూరం లో ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి..బట్ అంత టైమ్ లేదు ఆవిడ కి ఇప్పటికే బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది, బిడ్డ కూడా పొజిషన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది మేడం అని కొంచెం బాధగా చెప్తుంది బుజ్జి….

 

continued….