జ్వాల 🔥 – 3
అది విన్న డాక్టర్ ఓహ్ అవునా అంటూ ఒక్క క్షణం పాటు ఆలోచించి ఓకే బుజ్జి యూ డోంట్ వర్రీ అబౌట్ థట్… ఇప్పుడు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పినట్టు చెయ్యి..నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది..
నేను ఎంతో మందికి డెలివరీ చేసే టైమ్ లో నువ్వు నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నానో పరిశీలనగా చూసావ్ గా…సో ఈరోజు ఆవిడకి నీ చేతుల్తో నువ్వే డెలివరీ చెయ్..
నేను లైన్ లోనే ఉంటాను.. నీకు ఏ చిన్న డౌట్ వచ్చిన నేను ఎక్సప్లయిన్ చేస్తాను నువ్వు డెలివరీ చేసేయి అని చెప్తుంది….
ఆ మాటకి బుజ్జి కంగారుగా ఏమంటున్నారు మేడం..నేను డెలివరీ చెయ్యాలా? నో మేడం.. నావల్ల ఏ చిన్న పొరపాటు జరిగిన రెండు ప్రాణాలు ప్రమాదం లో పడతాయి…నా వల్ల కాదు నేను అంత రిస్క్ చేయలేను అని చెప్తుంది ఒకింత భయం గా..
ఆమె మాటలు విని బుజ్జి డోంట్ టాక్ ఫూలిష్…నువ్వు నీ వల్ల వాళ్లకి ప్రమాదం జరుగుతుందేమో అనిభయపడుతున్నావ్..బట్ ఇక్కడ నువ్వో విషయాన్ని మర్చిపోతున్నావ్ ఇప్పుడు నేను అక్కడకి వచ్చి డెలివరీ చేసే అవకాశం లేదు….
అలా అని తనని వేరే చోటుకి పంపే అంత టైం లేదు.. సో ఇప్పుడు నువ్వు తనకి డెలివరీ చేయడం లేట్ చేసే కొద్దీ ఇద్దరి ప్రాణాలు ప్రమాదం లో ఉన్నట్టే నువ్వు అలా ఎందుకు ఆలోచించట్లేదు..
థింక్ ఒన్స్… అవతల ఒక తల్లి తన బిడ్డని ఈ లోకం లోకి తీసుకురావడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంది..
నొప్పిని భరించలేక నరకం అనుభవిస్తుంది…నువ్విలా ఆలోచిస్తూ ఆ తల్లి పెయిన్ ని ఇంకొంచెం ఎక్కువ చేయకుమా వెళ్ళు…వెళ్లి ఒక బిడ్డ కి ప్రాణం పోయి అంటూ బుజ్జి కి ధైర్యం చెప్పి లోపలకి పంపిస్తుంది..
బుజ్జి డాక్టర్ ఇచ్చిన ధైర్యం తో ఆ తల్లి పడే బాధను చూడలేక గుండె దిటువ చేసుకుని, తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ, మనసులోనే అందరి దేవుళ్ళకి నమస్కరించుకుని డెలివరీ రూం లోకి అడుగు పెడుతుంది…..
అక్కడ ఆ ప్రెగ్నెంట్ లేడీ నెప్పులు ఇంకా ఎక్కువ అయి వాటిని తట్టుకోలేక పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉంది…
ఆమె భర్త తన భార్య బాధని చూడలేక కన్నీరు పెట్టుకుంటున్నాడు…
వాల్ల బంధువులు కాసింత కంగారుగా ఏమ్మా నర్సమ్మా డాక్టర్ ఇంకా రాలేదు… మేము మా అమ్మాయి బాధను చూడలేక పోతున్నాం… త్వరగా మీ డాక్టరమ్మ కి ఫోన్ చేసి పిలిపించండి అని అడుగుతున్నారు..
వాళ్ళ కంగారుని చూస్తూనే ఏమి కాదమ్మా మా నర్స్ డాక్టర్ గారికి ఫోన్ చేయడానికే వెళ్ళింది..ఇప్పటికే మా డాక్టర్ గారు వస్తూ ఉంటారు మీరేం భయపడకండి.. క్షేమంగా డెలివరీ జరుగుతుంది అంటూ వాళ్లకి నచ్చ చెప్తూ ఉంది బుజ్జి ఫ్రెండ్ లత….
అప్పుడే మన బుజ్జి కంగారుగా లోపలకి వచ్చి తన ఫ్రెండ్ కి డాక్టర్ చెప్పిన మాటలు చెప్పి డెలివరీకి సిద్ధం చేయమని చెప్తుంది…
తరువాత వాళ్ళ బంధువులతో కూడా విషయం ఇది అని వివరంగా చెప్పి మీరేం కంగారు పడకండి..ఇదిగో మా మేడం లైన్ లోనే ఉన్నారు… సో నేను మా మేడం పర్యవేక్షణ లోనే మీ అమ్మాయికి డెలివరీ చేస్తాను అంటూ భయపడుతున్న వాళ్లకి నిదానంగా విషయం అర్ధం అయ్యేలా చెప్తుంది….
వీడియో కాల్ లో ఉన్న డాక్టర్ కూడా వాళ్ళతో మా నర్స్ నాతో పాటు ఎన్నో డెలివరీ లు చేసింది..సో మన విషయంలో మీకెలాంటి అనుమానం వద్దు…
మీరు కాస్త ఆ అమ్మాయిని సరిగా పడుకోపెట్టండి అని వాళ్లకి చెప్పి ఆ అబ్బాయి వంక చూసి బాబు మీరు కాసేపు బయటకి వెళ్ళండి…మీ వైఫ్ ని, మీ బేబీ ని సేఫ్ గా మీకు అప్పగించే పూచి నాది అంటూ అతనికి భరోసా ఇచ్చి అతన్ని లేబర్ రూమ్ నుండి బయటకి పంపుతుంది…
బంధువులు కూడా దగ్గర్లో ఏ హాస్పిటల్ లేదు వీళ్ళు చెప్పేది నిజమే ఈ అర్ధరాత్రి టైమ్ లో ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని తీస్కుని ఎక్కడని తిప్పలు పడతాం… డాక్టరమ్మా చెప్పినట్టు వినడమే మంచిది.. ఎలాగూ ఆమె ఫోన్ లో నుండి చెప్తా అంటుంది కదా అని వాళ్ళు కూడా లోపల భయం వున్నా అంత ఆ దేవుడి మీదే భారం వేసి బుజ్జి డెలివరీ చేయడానికి ఒప్పుకుంటారు….
దాంతో డాక్టర్ బుజ్జి, లత కాస్త ఊపిరి పీల్చుకుని ఫోన్ లో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇక్కడ బుజ్జి అలానే ఆవిడని చిన్నగా పైకి లేపి డాక్టర్ చెప్పిన పొసిషన్ లో కూర్చో పెట్టి,పొట్టని చిన్నగా ప్రెస్ చేస్తు ఆవిడకి మాటలు చెప్తూ ఒకవైపు ధైర్యాన్ని నూరిపోస్తూ ఆమెలో ఉన్న భయాన్ని పోగొడుతూ, మరోవైపు ఆమెని చిన్నగా పుష్ చేయమని చెప్తూ ఉంటుంది….
ఆమె నెప్పులకు కంట్లో నీళ్ళు తిరుగుతున్న తన బిడ్డ కోసం భరించక తప్పదు అన్నట్టు ఆ నొప్పిని పంటి బిగవున ఆపి బుజ్జి చెప్పినట్టు తన బలాన్ని మొత్తం కూడ తీసుకుంటూ చిన్నగా పుష్ చేస్తు ఉంది….
అది గమనిస్తున్న బుజ్జి హ్మ్ గుడ్ అలాగే ఇంకొంచెం గట్టిగా పుష్ చేయడానికి ట్రై చేయండి….లోపల ఉన్న మీ బేబీ మిమ్మల్ని చూడాలని చాలా ఆశ పడుతుంది…
మీరు కాస్త నొప్పిని ఓర్చుకుని మీ బేబీ కోసం ఇంకొంచెం బలాన్ని తెచ్చుకోండి ప్లీజ్ అంటూ ఆమె పొత్తి కడుపు దగ్గర రెండు చేతుల్తో చిన్నగా ప్రెస్ చేస్తు హ్మ్ మీరు పుష్ చేయండి హా అలానే ఇంకొంచెం అంటూ ఆవిడతో మాట్లాడుతూ తనకి ఏమి చేయాలో చెప్తూ ఎప్పటికప్పుడు మీ బిడ్డకి,మీకు ఏమి కాదు అనే భరోసాని ఇస్తూ ఒక ముప్పై నిముషాల అనంతరం ఎంతో శ్రమపడి, అందరి సాయంతో ఆమెకి డెలివరీ చేసి ఒక మగ బిడ్డ కి ప్రాణం పోసి ఈ లోకం లోకి తీసుకొచ్చింది బుజ్జి ..
ఆ బిడ్డ క్షేమంగా బయటకి రాగానే అందరు ఊపిరి పీల్చుకుని ఎంతో సంతోషపడ్డారు..
బుజ్జి మాత్రం ఫస్ట్ టైం తన చేతుల్తో ఒక బిడ్డని ఈ లోకం లోకి తీసుకురావడంతో ఎంతో ఉద్వేగానికి లోనైయి ఆ బిడ్డని ఎంతో అపురూపం గా చూస్తూ మెల్లిగా తన చేతుల్లోకి తీసుకుని వెల్కమ్ మై డియర్ బేబీ బాయ్ అంటూ నవ్వుతూ చెప్పి బేబీ చిన్ని చేతులను ముద్దాడి బిడ్డని అందరికి చూపించి తన తల్లి హృదయం మీద పడుకోబెడుతుంది…..
ఆ తల్లి బిడ్డని చూసుకుని అప్పటి వరకు పడ్డ బాధను మరచి ఆనందభాష్పలతో చూసుకుంటూ ముద్దులాడుతూ మురిసిపోతుంది..
బిడ్డ ఏడుపు విన్న తన తండ్రి కూడా తన భార్యకి డెలివరీ అయ్యి బిడ్డ పుట్టాడు అన్న శుభవార్తకి లత పర్మిషన్ తో లోపలకి వచ్చి భార్య, బిడ్డ ని క్షేమంగా చూసుకుని అప్పటి వరకు పడ్డ టెన్షన్ ని పక్కన పెట్టి ఇద్దరినీ పట్టుకుని ముద్దాడుతాడు….
తరువాత అందరు ఫోన్ లో ఉన్న డాక్టర్ కి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడిన బుజ్జి కి థాంక్స్ చెప్పుకుంటారు…
డాక్టర్ నవ్వుతూ ఇట్స్ ఓకే…అది మా డ్యూటీ అని వాళ్లకి చెప్పి బుజ్జి యూ డన్ యే గ్రేట్ జాబ్ రా..చూసావా నా వల్ల కాదు అని భయపడిన నువ్వే నాకంటే ఎంతో బాగా ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ, ఎంతో తెలివిగా నడుచుకుని క్షేమంగా కాన్పు చేసావ్..
ఐ నో బుజ్జి యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంట్ అంటూ బుజ్జి ని, ఆమెకి సాయం చేసిన లతని కూడా మెచ్చుకుని ఆ కపుల్స్ కి పేరెంట్స్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తుంది….
వాళ్ళు నవ్వుతూ థాంక్యూ మేడం అంత మీ దయ వల్లే అంటారు చేతులెత్తి దండం పెడుతూ….
డాక్టర్ చిన్న స్మైల్ ఇచ్చి టేక్ కేర్ అని చెప్పి బుజ్జికి బేబీని ఒకసారి పిల్లల డాక్టర్ తో చెక్ చేయించమని, బేబీ మదర్ కి ఏవో మెడిసిన్స్ ఇవ్వమని చెప్పి కాల్ కట్ చేస్తుంది…
కాల్ కట్ అవగానే బుజ్జి బేబీని తీసుకెళ్లి చెకప్ చేయింకొని వచ్చి అంతా బాగానే వుంది అని చెప్పి పేరెంట్స్ కి అప్పగిస్తుంది..వాళ్ళు ఎంతో హ్యాపీగా బేబీ నీ చూసుకుంటూ ఉంటారు…
అప్పటికే టైం అర్ధరాత్రి పన్నెండున్నర దాటుతుండడంతో బుజ్జి ఇంక వాళ్ళ బాధ్యత ఫ్రెండ్ కి అప్పగించి వాళ్ళతో బేబీ జాగ్రత్త మిమ్మల్ని ఈ నర్స్ చూసుకుంటుంది మీకే అవసరం వచ్చిన తనని పిలవండి తను ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్ కి మెడిసిన్స్ గురించి కూడా చెప్పి ఇంటికి బయలుదేరుతుంది..
****
అదే సమయంలో అక్కడ పబ్ లో తాగడం, డాన్స్ వేయడం అన్నీ పూర్తయిన క్రిష్ & బ్యాచ్ కూడా కార్ లో ఇంటికి వస్తూ ఉన్నారు…
బుజ్జి ఫ్రెష్ అయి హాస్పిటల్ నుండి బయటకి వచ్చి ఒకసారి చుట్టూ చూస్తుంది…అర్ధరాత్రి కావడం వల్లేమో రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది…
పైగా ఆ హాస్పిటల్ కాస్త సిటీ అవుట్ కట్స్ లో ఉండడంతో నార్మల్ టైమ్ లోనే జన సంచారం కాస్త తక్కువగానే ఉంటుంది..అలాంటిది ఇప్పుడు టైం చాలా అయి ఉండడంతో ఇంకా తక్కువగా ఉందన్నమాట….
ఎక్కడో ఒకటి అర లారీ లు ,కార్ లు , బైక్ లు వెళ్తున్నాయి…ఆ జనాలు లేని రోడ్డుని చూసిన బుజ్జి కి మనసులో కాస్త గాబరా మొదలయింది..
అసలే రోజులు బాలేవు.. ఇప్పుడు ఇక్కడ చూస్తే జనాలు కూడా లేరు…ఇప్పుడెలా అబ్బా ఇంటికి వెళ్లడం అంటూ కొంచెం భయం గానే ఏమైనా ఆటోలు దొరుకుతాయని కాసేపు అక్కడే వెయిట్ చేస్తుంది…
continued….
Swipe left/right or tap the sides to turn pages