డెవిల్స్ వైఫ్ – 1
డెవిల్స్ వైఫ్ ❤️
Part 1
సింఘానియా మాన్షన్….
భవనంలోని హాల్లో ఒక సోఫాలో పురోహితుడు కూర్చొని ఉన్నాడు…
అతని ముందు మూడు జాతకాలు ఉన్నాయి..
అతనికి ఎదురుగా అమర్ సింఘానియా, అతని భార్య గాయత్రి సింఘానియా ఉన్నారు..
అమర్ పురోహితుడి వైపు చూసి, “ఏమైంది పురోహితులుగారు.. ఎందుకు మీరేం మాట్లాడటం లేదు? నిన్న కూడా మా ముగ్గురు మనవళ్లు చావు అంచు నుండి తప్పించుకున్నారు, వాళ్లకే ఎందుకిలా జరుగుతోంది?”
అది విని పురోహితుడు ఆ మూడు జాతకాలను చాలా జాగ్రత్తగా చూసి, ఆ తర్వాత అమర్ వైపు చూసి, “చూడండి, మీ ముగ్గురు మనవళ్ల జాతకం బాగాలేదు అని నేను మీకు ఇంతకముందే చాలా సార్లు చెప్పాను.. దానివల్ల ఆ ముగ్గురికి ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది.. రాబోయే ఒక సంవత్సరంలో ఆ ముగ్గురి మరణం ఖాయం.”
పురోహితుడు చెప్పింది విని గాయత్రి ఏడుస్తూ, “అలా మాట్లాడకండి పురోహితులుగారు.. నా ముగ్గురు మనవళ్లే మా ప్రాణం.. కొన్ని సంవత్సరాల ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ లో నా కొడుకు, కోడలు చనిపోయారు.. ఇప్పుడు నా మనవడు, మనవరాలు నా జీవితం అయ్యారు.. ప్లీజ్ పురోహితులుగారు వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి..”
ఆ మాటలు విని పురోహితుడు ఆ మూడు జాతకాలను మళ్ళీ చూస్తాడు..
అప్పుడే వారందరికీ అక్కడికి ఎవరో వస్తున్న అడుగుల సౌండ్ వినిపించింది..
ఆ సౌండ్ విని పురోహితుడు తల ఎత్తి చూడగానే,
స్నాక్స్ ప్లేట్ పట్టుకుని ఒక అందమైన అమ్మాయి అటుగా వస్తూ కనిపించింది..
ఆమె స్కై బ్లూ కలర్ చుడిదార్ లో, హెయిర్ లీవ్ చేసి సింపుల్ గా చాలా అందంగా ఉంది.. ఆమె పెదవులపై చిరునవ్వు ఆమెను మరింత అందంగా చేసింది..
పురోహితుడు ఆ అమ్మాయిని చూసి చిన్నగా నవ్వాడు..
ఆమె ప్లేట్ ని టేబుల్ మీద పెట్టి, పురోహితుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది..
ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, పురోహితుడు గాయత్రి వైపు చూసి, “ఈ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు..
గాయత్రి పురోహితుడి వైపు తిరిగి, “ఈ అమ్మాయి పేరు అవని.. తను మా మనవరాలు ప్రజ్ఞకి ఫ్రెండ్.. ఆ అమ్మాయి అనాథ.. అందుకే ప్రజ్ఞ అవనిని మా ఇంటికి తీసుకువచ్చింది, ఇప్పుడు ఆమె మాతోనే ఉంటోంది.”
అది విని పురోహితుడు చిరునవ్వుతో, “అయితే మీ మనవళ్లకి ఉన్న ప్రమాదం తప్పిందని అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ అమ్మాయి శివుని భక్తురాలు, శివుడికి ఎంత పెద్ద ఆపదలనైనా ఆపగలిగే శక్తి ఉంది.. ఈ అమ్మాయి మీ మనవళ్ల జీవితాల్లోకి వస్తే, మీ మనవళ్లకి ఏం కాదు..”
ఆ మాటలకి అమర్, గాయత్రి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు..
అమర్ ఆలోచిస్తూ, “మీరు ఏం చెప్పుతున్నారు.. కానీ, మా ముగ్గురు మనవళ్లకు ఒకే అమ్మాయితో పెళ్లి ఎలా చేయగలం, అది తప్పు అవుతుంది కదా?”
పురోహితుడు సోఫాలో నుండి లేచి, “చూడండి, వేరే దారి లేదు.. మీ ముగ్గురు మనవళ్ల ప్రాణాలను కాపాడాలనుకుంటే, మీ ముగ్గురి మనవళ్లు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.. ఇంకా మీ ఇష్టం.” అని చెప్పి పురోహితుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు..
పురోహితుడు వెళ్ళిపోయిన తర్వాత, అమర్, గాయత్రి ఒకరినొకరు చూసుకున్నారు..
మరొ వైపు….
ఇద్దరు అందమైన అబ్బాయిలు సోఫాలో కూర్చుని ఉంటే, వారి ముందు షార్ట్ లో ఒక అమ్మాయి ఉంది..
ఆమె ముందు ఉన్న వాళ్ళు నార్మల్ వ్యక్తులు కాదు, వాళ్లిద్దరూ ముంబైలో బిసినెస్ మ్యాన్స్ రాజ్‌వీర్, రణ్‌వీర్ సింఘానియా కావడంతో, ఆమె కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది..
తన ముందున్న అమ్మాయిని చూసి రణ్‌వీర్ కోపంగా, “నీకెంత ధైర్యం, నన్ను, మా అన్నయ్య నిన్ను ప్రేమించేలా చేయడానికి వచ్చావా, నిన్ను ఎవరు పంపారు?” అని చాలా కోపంగా అన్నాడు..
ఆ అమ్మాయి భయపడుతూ, “నన్ను ఎవరూ పంపలేదు, నేను మీ కంపెనీలో జాబ్ చేస్తాను.. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడ్డాను.. నేను చాలా ప్రయత్నించాను కానీ మిమ్మల్ని కలవలేకపోయాను.. ఎందుకంటే మీరు మీ ఆఫీస్ స్టాఫ్ తో ఎప్పుడూ మాట్లాడారు… ఈరోజు మీరు ఒక మీటింగ్‌కి వెళ్తుండగా, మీతో మాట్లాడటానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాను, అందుకే ఈ హోటల్‌కి వచ్చి మీ మీటింగ్ అయిపోయే వరకు వెయిట్ చేశాను… నన్ను చూశాక మీరు కూడా నన్ను ప్రేమిస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేయలేదు.. ఈ ఆలోచనతోనే నేను మీకు దగ్గర అవ్వాలి అనుకున్నాను.. కానీ మీరు… ప్లీజ్ నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను.. ప్లీజ్ నన్ను వెళ్లనివ్వండి.” అని ఆ అమ్మాయి వాళ్లిద్దరిని చాలా రిక్వెస్ట్ చేసింది…
ఆ అమ్మాయి చెప్పింది విని, రాజ్వీర్ సైడ్ స్మైల్ ఇచ్చి, “ఏంటి నిన్ను ఎవరు పంపించకుండానే నువ్వు మా దగ్గరకి వచ్చావా… మేము ఎవరినీ క్షమించం.” అని కోపంగా చెప్పి, అతను కోపంగా తన మేనేజర్‌ను పిలుస్తాడు.
రాజ్వీర్ వాయిస్ విని మేనేజర్ గౌరవ్ అతని దగ్గరకి వస్తాడు..
రాజ్‌వీర్ గౌరవ్‌తో కోపంగా, “ఈ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకువెళ్లి, మళ్లీ అబ్బాయిల వైపు చూడకుండా పనిష్ చెయ్, నేను చెప్పింది నీకు అర్థమైందా?”
రాజ్‌వీర్ చెప్పింది విని గౌరవ్ అర్ధం చేసుకుని అర్ధం అయింది అని తల ఊపి ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసుకువెళ్ళాడు..
కొద్దిసేపటి తర్వాత, రాజ్‌వీర్, రణ్‌వీర్ బయటకు వస్తారు..
వారిని చూసి, డ్రైవర్ వెంటనే కారు డోర్ ఓపెన్ చేసాడు..
ఇద్దరు కార్ ఎక్కుతారు..
డ్రైవర్ డ్రైవింగ్ సిట్ లో కూర్చుని, కారు స్టార్ట్ చేసి, కార్ ని ముందుకు పోనిస్తాడు..
రణ్‌వీర్ తన ల్యాప్‌టాప్‌ను ఆన్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు..
అదే సమయంలో రాజ్‌వీర్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు..
డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ మిర్రర్ లో నుండి రణ్వీర్, రాజ్వీర్ వైపు చూస్తూ ఉన్నాడు..
రణ్‌వీర్ ల్యాప్‌టాప్ వైపు చూస్తూ, “నా వైపు ఎందుకు చూస్తున్నావు, నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని డ్రైవర్ ని అడిగాడు…
డ్రైవర్ తడబడుతూ, “సార్, నా కొడుకుకి హెల్త్ బాగోలేదు.. వాడు హాస్పిటల్ లో ఉన్నాడు.” అని చెప్పాడు..
రణ్‌వీర్ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూనే, “అయితే నీకు డబ్బు కావాలా?”
డ్రైవర్, “లేదు సార్, గాయత్రి మేడమ్ డబ్బులు ఇచ్చేశారు.. నా కొడుకు హాస్పిటల్ లో ఉన్నాడు కానీ నేను వాడిని చూడలేకపోతున్నాను, నేను ఈరోజు లీవ్ తీసుకోవచ్చా?”
అది విని రణ్‌వీర్ కోపంగా, “కారు ఆపు” అని అన్నాడు…
ఆ మాట విని డ్రైవర్ వెంటనే కారును ఆపుతాడు..
రణ్‌వీర్ కారులోంచి బయటకు దిగుతాడు..
అతన్ని చూసి, డ్రైవర్ కూడా వెంటనే కారులోంచి బయటకు దిగి రణ్వీర్ కోపం చూసి భయపడుతాడు..
రణ్‌వీర్ అతని కళ్ళలోకి చూస్తూ, “నీ కొడుకు దగ్గరకి వెళ్ళు, రేపటి నుండి నువ్వు రానవసరం లేదు.. ఈరోజు నేను నీకు లైఫ్ లాంగ్ లీవ్ ఇస్తున్నాను, వెళ్లి నీ ఫ్యామిలీని చూసుకో..”
రణ్వీర్ చెప్పింది విని ఆ డ్రైవర్ అతని కాళ్లు పట్టుకుని, “వద్దు సార్, అలా మాట్లాడకండి.. నా జాబ్ పోతే నాకు వేరే పని దొరకదు.. నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ప్లీజ్ సార్.” అని ఆ డ్రైవర్ అతని రిక్వెస్ట్ చేసాడు…
అది చూసి రాజ్వీర్ డ్రైవర్ ని వెనక్కి నెట్టి, అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని, “రణ్‌వీర్ చెప్పింది నువ్వు వినలేదు.. ఈ రోజు నుండి నీకు లీవ్ ఇస్తున్నాము.. నువ్వు నీ ఫ్యామిలీని చూసుకో.” అని చెప్పి కారు స్టార్ట్ చేస్తాడు..
రణ్‌వీర్ రాజ్వీర్ పక్కన కూర్చుని డ్రైవర్ వైపు కోపంగా చూస్తాడు..
రాజ్వీర్ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు…
డ్రైవర్ ఏడుస్తూ వెళ్తున్న కార్ వైపు చూస్తాడు..
ఒక నిర్మానుష్యమైన ఇంటికి కొద్ది దూరంలో ఒక కారు ఆగింది.. అతను కారు దిగుతుండగా, కొంతమంది గార్డ్స్ ఆ కారుని చుట్టుముట్టారు..
అతను తన కారులోంచి దిగి తన గార్డ్స్ కి సిగ్నల్ ఇస్తాడు..
ఆ గార్డ్స్ వెంటనే గన్స్ తో ఇంటి వైపు షూట్ చేసారు.. కొద్దిసేపటికే, ఇంటి లోపల నుంచి కూడా గన్ తో షూట్ చేస్తారు ఎవరో..
కొంచెంసేపటికే, ఆ ఇంటి బయట ఉన్న గార్డ్స్ అందరూ చనిపోయారు..
అప్పుడే కొంతమంది ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి అతన్ని చుట్టుముట్టారు..
40 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి నవ్వుతూ బయటకు వచ్చి, ఆ అబ్బాయి వైపు చూస్తూ, “రుద్ర సింఘానియా, ఇక్కడికి వచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు చాలా ఇయర్స్ నుండి బ్రతికే ఉన్నావ్ కదా, ఇప్పుడు నువ్వు చస్తావు.” అని అన్నాడు.
రుద్ర సింఘానియా రణ్వీర్, రాజ్వీర్ కి తమ్ముడు…
రుద్ర నవ్వుతూ ఆ వ్యక్తి వైపు చూసి, “నన్ను చంపాలనుకున్న శేఖావత్ చచ్చిపోయాడు.. ఇప్పుడు నువ్వు చస్తావు. ఎందుకంటే రుద్ర సింఘానియాను చంపడం ఎవరి వల్ల కాదు.”
అది విని శేఖావత్ రుద్ర వైపు షూట్ చేస్తాడు..
రుద్ర సైడ్ కి జరగగానే, ఆ బుల్లెట్ అతని వెనుక ఉన్న గార్డ్ కి తగిలి, అతను అక్కడికక్కడే చనిపోయాడు..
రుద్ర తన గన్ ని చేతిలోకి తీసుకుని శేఖావత్ మనుషులందరిని షూట్ చేసాడు…
కొన్ని క్షణాల్లోనే శేఖావత్ మనుషులందరూ చనిపోయారు..
ఇప్పుడు శేఖావత్, రుద్ర మాత్రమే ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు..
ఇద్దరి ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ వారు తమ గన్స్ ని ఒకరి వైపు ఒకరు ఎయిమ్ చేసుకుని, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నారు..
అప్పుడే సడన్ గా గాలి చాలా ఎక్కువగా వీస్తుంది..
ఆ గాలిగి డెస్ట్ కళ్ళలోకి పడుతుంటే శేఖావత్ కళ్ళు మూసుకున్నాడు..
ఒక బుల్లెట్ అతని తలకి తగలడంతో, అతను వెంటనే చనిపోయాడు..
రుద్ర అతని వైపు ఒకసారి చూసి, తన కారు ఎక్కి, అక్కడి నుండి వెళ్లిపోయాడు..
To be continued….
Swipe left/right or tap the sides to turn pages