Love you forever 💖 – 2
డబ్బు కోసం కూతురి నూరేళ్ళ జీవితాన్ని ఒక 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేస్తాడు ఒక తాగుబోతు తండ్రి…మరి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది….?
రాజేంద్ర ప్రసాద్ ఆ 20 ఏళ్ల అమ్మాయి నీ పెళ్లి చేసుకొని అక్కడ నుంచి కార్ లో అతని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు…..
అదే టైం లో …..
అతను ఎంతగానో ప్రేమించి , పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యింది అని తెలిసి బాధగా ఆమె కోసం ఆఫీసు నుంచి హాస్పటల్ కి స్టార్ట్ అయ్యాడు ఒక అబ్బాయి ….
అలా ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ కార్ వస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా ఆ అబ్బాయి కార్ వస్తూ ఉంటుంది…
అలా ఒక సిగ్నల్ దగ్గర జంక్షన్ లో అటు రాజేంద్ర ప్రసాద్ కార్ లో ఆ అమ్మాయి కూర్చొని ఉంటే….
ఇటు ఆ కార్ కి స్ట్రయిట్ గా ఆ అబ్బాయి కార్ ఉంటుంది….
కార్ లో తన లవర్ గురించి బాధపడుతూ ఉన్న అబ్బాయికి తన ముందు ఉన్న వైట్ కలర్ బెంజ్ కార్ చూడగానే ఎందుకో అతని మనసు అంతా అలజడిగా మారిపోయింది….
తనకి కావల్సింది ఏదో అతనికి అతి చేరువలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే తన ఎదురుగా ఉన్న ఆ కార్ నే చూస్తూ వుంటాడు….
అటు పక్క కార్ లో ఉన్న అమ్మాయి ఏడవడం చూసి చిరాకు పడుతూ ” అబ్బా …. జేష్ఠ ఎందుకు ఏడుస్తున్నావు…..? కొంచం సేపు సైలెంట్ గా కూర్చో ” అని అరిచ్చినట్టే చెప్పి ఎవరితోనో సీరియస్ గా కాల్ మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు….
దెబ్బకి జేష్ఠ మౌనంగా సౌండ్ రాకుండా ఏడుస్తూ మనసులో ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది తన జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేశాడు అని…..
వాళ్లు అలా వుండగానే సిగ్నల్ పడి అటు జేష్ఠ ఉన్న కార్ అండ్ ఇటు ఆ అబ్బాయి ఉన్న కార్ స్టార్ట్ అయ్యి అలా ఒకరి కార్ దగ్గరికి ఒకరు వచ్చి ……
ఒకదాన్ని ఒకటి పక్క పక్కనే పాస్ అయ్యి వెళ్తూ ఉండగా , పెళ్లి అప్పుడు జేష్ఠ తల మిద పెట్టిన జీలకర్ర బెల్లం కి ఉండే తమల పాకు.. విండో గ్లాస్ దించి ఉండడం వల్ల గాలికి ఎగిరి ఆ అబ్బాయి కార్ లో బ్యాక్ సీట్ లో పడుతుంది.
అలాగే ఆ అబ్బాయి కార్ లో ఉండే ఒక టిష్యూ పాపేర్ ఎగిరి వెళ్ళి జేష్ఠ ఒడిలో పడుతుంది…. ఆ టిష్యూ పేపర్ మిద ” ఐ లవ్ యూ అమ్మాడి…” అని రాసి ఉంటుంది.
అండ్ దానికి చివర ఇలా రాసి ఉంటుంది…
i will all ways there for you ……
అలా ఆ కార్లు రెండు క్రాస్ అయ్యి వెళ్తూ ఉండగా బ్లాక్ కాలర్ కార్ లో ఉన్న అబ్బాయి జేష్ఠ నీ చూడడానికి ట్రై చేస్తాడు….
కానీ అప్పుడే ఆ టిష్యూ పేపర్ తన ఒడిలో పడి కిందకి జారిపోవడం వల్ల జేష్ఠ ఆ పేపర్ కోసం కిందకి వంగింది….
అలా కిందకి ఒంగిన జేష్ఠ బ్లౌజ్ కొంచం కిందకు ఉండడం వల్ల , ఆమె తెల్లటి వీపు మిద ఉన్న నల్లని పుట్టు మచ్చ మెరుస్తూ కనిపిస్తూ ఉంటే… అలా దాన్ని చూస్తూ ఆ కార్ క్రాస్ చేసుకొని ముందుకి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి.
కిందకి వంగి ఆ టిష్యూ పేపర్ చేతిలోకి తీసుకొని కల్ల నీలతోనే చూస్తూ దాని మిద ఉన్న అక్షరాలు చదవగానే ఎందుకో జేష్ఠ కి అప్పటి వరకు లేని ధైర్యం , తనని ఎవరో కాపాడతారు అనే నమ్మకం వస్తుంది.
అసలు ఆ పేపర్ ఎక్కడ నుంచి వచ్చింది అని విండో నుంచి బయటికి చూస్తూ ఉండగా అక్కడ చాలా కార్లు వాళ్ళ కార్ నీ క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటాయి…
ఆ పేపర్ అసలు ఎలా తన కార్ లోకి వచ్చిందో అర్ధం కాక ఆ పేపర్ నీ తడుముతూ ఉంటుంది….
మరో పక్క ఆ అబ్బాయి కార్ లో పడిన తమల పాకు బ్యాక్ సీట్ నుంచి మళ్ళీ ఎగుర్తూ ముందు సీట్ లో ఉన్న అబ్బాయి తల మిద పడుతుంది…
ఆ అబ్బాయి అది గుర్తించకుండా జేష్ఠ నీ గుర్తు చేసుకుంటూ …. మరో పక్క అతను ప్రేమించిన అమ్మాయి హాస్పటల్ లో ఉంటే , అతనికి ఎందుకు వేరే అమ్మాయి గుర్తించి ఆలోచనలు వస్తున్నాయి అర్ధం కాక .. సతమతం అవుతు ఒక అరగంటకి హాస్పటల్ ముందు కార్ ఆపి ఫాస్టుగా లోపలికి వెళ్ళి …..
రిసెప్షన్ లో ఆ అమ్మాయి పేరు చెప్పి , అతను ప్రేమించిన అమ్మాయి రూం దగ్గరికి వెళ్ళే సరికి ఆ అమ్మాయి అమ్మ , నాన్న రూం బయట కూర్చొని ఏడుస్తూ ఉంటారు..
అంకుల్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆయన్ని హగ్ చేసుకొని మౌని కి ఇలా ఉంది అంకుల్ అని అడుగుతాడు చిన్న గొంతు తో….
కండిషన్ చాలా క్రిటికల్ అంటున్నారు పూర్నివ్… 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం అంటున్నారు…” అని ఏడుపు గింతుతో చెప్తారు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గారు.
పూర్నివ్ ఆయన్ని వదిలి ” మౌని కి ఏం కాదు అంకుల్ మీరు ధైర్యంగా ఉండండి ” అని చెప్పి…
అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్ ” అని అడిగాడు ….
To be continued……
అసలు బిన్న జీవితాలలో ఇమిడి ఉన్న ఈ ఇద్దరు ఎలా కలుస్తారు…? ఎప్పుడు కలుస్తారు…?
ఇంతకీ మన హీరో అండ్ హీరోయిన్ పేర్లు ఎలా ఉన్నాయి….?
ఇప్పుడు మౌని బ్రతుకుతుందా లేకపోతే చనిపోతుందా…?
Swipe left/right or tap the sides to turn pages