New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తండ్రికి తగ్గ తనయుడు – 1

తండ్రికి తగ్గ తనయుడు – 1

 పార్ట్ :1 

ఇంటికి వెళ్ళిన తిరుపతికి మినిస్టర్ చూసిన చూపుకి అతను బాగున్నారా అని అడిగిన దానికి నన్ను గుర్తు పట్టాడా? లేదా? అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో

రవణ కాఫీ తాగండి అని ఇస్తుంది . ఆలోచించటం ఆపి ఎలా ఉంది కాలేజ్ మరియు మన అబ్బాయి ఫస్ట్ రావటం అని అంటుంటే తను బాగా పొంగిపోయి మన వాడికి అచ్చం నీలాంటి తెలివి తేటలే వచ్చాయి అని చెప్తుంది  .

 

 

ఇంటికి వచ్చి గురూజీ చెప్పిన మాటల్ని తిరుపతి మీద కోపంతో నా తండ్రిని దూరం చేసిన వాడిని వాడి కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తాను అని చెప్తుంటే వాళ్ళ అమ్మ వున్న ఒక్కడివి కూడా లేకుండా పోతే నేను ఎలారా బతికేది అని లభోదిభోమని ఏడుస్తుంది , అమ్మ నాకు ఏమి కాదు నా వెనుక గురూజీ , మన వాళ్ళు ఉన్నారు , ఇంకా ప్రభుత్వంలో మనోళ్లు ఉన్నారు అమ్మ నువ్వు బయపడకు నాకు ఏమి కాదు అసలు ఏమి జరిగింది చెప్పమని గట్టిగా అడుగుతాడు దానికి అయిపోయిన దాని గురించి ఆలోచించటం వేస్ట్  గతాన్ని మార్చలేనప్పుడు తెలుసుకొని ఏం లాభం  మార్చాలి అంటే ముందు నువ్వు మారు గురూజీతో తిరగటం మాని నీ బిజినెస్ నువ్వు చూసుకో రా , నీకు తెలిసిందే నిజం కాదు మీ నాన్న కూడా అంత మంచి వాడు కూడా కాదు నా మాట విని నువ్వు మారు లేదా నేను మారాల్సి వస్తాది అని చెప్పి వెళ్ళిపోతుంది కోపం లో వున్న వాడికి ఇవి ఏమి బుర్రకి ఎక్కవు , అమ్మ నిజం చెప్పటం లేదు పైగా నాన్నని తప్పు అంటుంది మంచిగా ఉండి తెలుసుకోవాలి తర్వాత నేను ఎంతో చూపించాలి అనుకుంటాడు . 

 

 

 

 

మొదటి రోజు కాలేజీలో కి వెళ్ళిన వినోద్ కి గణేష్ , డేనియల్ అని ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు , వాళ్ళలో గణేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే తను కూడా ఇదే కాలేజీ లో సిఎస్సి చేరుతుంది , అలా ముగ్గురు కలిసి క్యాంటీన్ కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకొచ్చే టైమ్ కి

రవళి ( గణేష్ ) మరదలు కూడా జాయిన్ అయ్యి ఫుడ్ లాగించేసి క్లాసెస్ కి వెళ్ళి బయటకి వస్తారు ఇంటికి పోవటానికి , గణేష్ వాళ్ళు హాస్టల్ లో ఉంటే డేనియల్ వాళ్ళది ఇల్లు వినోద్ కూడా కాలేజీ హాస్టల్ లో ఉండేది . అలా రూంకి వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్న తో కాలేజీ కబుర్లు ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే ఇంతలో అక్క వస్తె హాయ్ చెప్పి నిద్రకి ఉపక్రమిస్తాడు . 

 

 

పేపర్లో పడిన ఫొటోస్ని చూసి ఒక గ్రూప్  హైదరాబాద్ కి నెక్స్ట్ డేనే బయలుదేరి గాలింపు మొదలు పెడతారు , ఈ గ్రూప్ కి గురూజీ గ్రూప్ కి మినిస్టర్ కి గ్రూప్ కి సంబంధం ఉండదు  . ఎంత ఎక్కువ పేరు ఉంటే అంత ఎక్కువ మంది శత్రువులు అన్నట్టు . వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్ గ్యాంగ్ వాళ్ళు. వీళ్లలో 3 రకాలు వాళ్ళు ఉంటారు 

1. వాళ్ళ టార్గెట్స్ని కనిపెట్టి వాళ్ళ బలం , బలహీనతలు, దినచర్య మొత్తం రెక్కీ చేసి రెడీ చేయటం . 

2. టార్గెట్స్ బలహీనతల్ని ఆసరా చేసుకొని బలి చేయటం ( మోసం , ప్రేమ , నమ్మకం )

3. టార్గెట్స్ మీదనే దృష్టి , వస్తారు వేస్తారు మాయం అవుతారు.

ఇప్పుడు వచ్చిన వాళ్ళు మొదటి రకం వాళ్ళు  , తిరుపతి ఫ్యామిలీ హైదరాబాద్ లో లేదు కాబట్టి కాలేజీలో అడ్రస్ తీసుకొని ముంబై కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు , ముంబై నుండి ఇమ్మీడియట్గా వీళ్ళకి కోడ్ వస్తుంది . 

కోడి పిల్లకి దానవేస్తూ లావు పెంచండి రేట్ రాగానే అమ్మేద్దాం అని కోడ్ వచ్చిన వెంటనే వెళ్ళి టక టక కాలేజీ బ్యాచ్ని రంగం లోకి దింపుతారు , ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు. 

అమ్మాయిలు ఉంటారు మామ కత్తిలా. ఆరుగురు వెల్ ట్రెయిన్డ్ ఇన్ గేమ్స్ కరాటే అండ్ తెలివి . అదే కాలేజీలో నెక్స్ట్ డేనే జాయిన్ అవుతారు ఇద్దరు ఒక గ్రూప్ ఇద్దరు ఒక గ్రూప్ లాగ , త్రీ బ్రాంచెసెస్ లో జాయిన్ అవుతారు .

 

 

 

వినోద్ ఉదయాన్నే లేచి యోగ మెడిటేషన్ తర్వాత స్నానం చేసి సూర్యనమస్కారాలు చేయడం అలవాటు . వినోద్ ఒంటరిగా ఎవరు లేకుంటే cyprus kick boxing 🥊 ప్రాక్టీస్ చేస్తుంటాడు .  కాలేజీకి రెడీ అయి నాన్న తో ఫోన్ మాట్లాడుతుంటే తిరుపతి కొన్ని విషయాలు చెప్తాడు , ఎవ్వరిని నమ్మకు,నమ్మినట్టు నటించు , ఎవ్వరికి నీ బలాలు బలహీనతలు చెప్పకు ఎవ్వరితో అయిన ఎంతలో ఉండాలో అంతే ఉండు అని చెప్తాడు , ఎప్పుడూ ఇలా చెప్పని నాన్న ఇలా చెప్తున్నాడు అంటే నేను ఇంకా చిన్న పిల్లాడిన లేదా కాలేజీకి వచ్చాను అనా లేదా ఏదైనా అమ్మాయి వెనుక పడతాను అనా అని ఆలోచిస్తూ వెళ్తూ ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు , సారీ చెప్పి వెళ్తాడు  ఇది అంత ఆరుగురు చూస్తూ ఉంటారు నాలుగు దిక్కుల నుండి .

 

 

మినిస్టర్ ఇంటికి వెళ్ళి రణధేవ్ అని గట్టిగా పిలిచి మీరు నాకు ఎందుకు అబద్దం చెప్పారు రా అని గదిస్తాడు  ఏమైంది నాన్న గారు అంటూ పక్కకి వచ్చి తల దించుకొని అడుగుతాడు , నువ్వు కాదురా తల దించుకోవాల్సింది నేను నీలాంటి వాడిని కన్న పాపానికి , నీకు ఏం చెప్పాను 20 సంవత్సరాల క్రితం గుర్తు ఉందా లేదా గుర్తు చేయనా తిరుపతిని చంపేసాం అని చెప్పి ఇప్పుడు నాకు మన:శాంతి లేకుండా చేస్తున్నారు కదరా  , లేదు నాన్న వాడిని వాడి పెళ్ళాం బిడ్డలు చనిపోవటం నా కళ్లారా  చూసాను నాన్న , మరి వీడు ఎవడు వాడు చనిపోతే    నాకు రెండు రోజుల్లో మొత్తం డీటెయిల్స్ కావాలి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నీ పేరు రానివ్వకు అంటాడు . 

 

 

మినిస్టర్ కొడుక్కి చెప్తాడు ఎలా ప్లాన్ అని 

నువ్వు ఒక సాధారణ మనిషి లాగ కలువు వాడి నుండి ఇంకొకరిని అలా లాస్ట్ వాడి వరకు నువ్వు వేషాలు మార్చుకుంటూ అందర్నీ గమనిస్తూ లాస్ట్ వాడిని డిటెక్టివ్ నీ కలవమను డిటెక్టివ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకు రాగానే మన టీమ్ కి చెప్పి కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా డిటెక్టివ్ నీ నువ్వు కలిసిన వాళ్ళ అందర్నీ లేపేయమను , దీనిలో ఎలాంటి తప్పు జరిగిన ముందు నువ్వు తర్వాత నేను ఇద్దరం లేకుండా పోతాము , నువ్వు దగ్గర ఉండి హాండిల్ చెయ్, నీ నెంబర్ ,నీ రూపం  నీ వేలిముద్రలు చివరకు ని కళ్ళు కూడా ఎవ్వరు చూడకూడదు ఫోటో తీసుకో కూడదు  జాగ్రత్త . మనం డీల్ చేస్తుంది తిరుపతితో , తిరుపతి కాకుంటే ఏమి కాదు అదే తిరుపతి అయితే ఆలోచిస్తేనే చావు భయం వేస్తుంది .

 

 

 

ముంబై మాఫియా సామ్రాజ్యంలో అప్పుడే ప్రకంపనలు మొదలు అవుతాయి , చోట డాన్ గా పిలవబడే కిషన్ , డాన్ ఆఫ్ ముంబై  దావూద్ కి కూడా విషయం తెలిసి విన్నది నిజామా కాదా అని వెరిఫికేషన్ కోసం న్యూస్ పేపర్ తెచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు ఇంకా ఎక్కడో డౌట్ ఉంటే కిషన్ మరియు దావూద్ టీమ్స్ కలిసి dna టెస్ట్ కి కావాల్సిన శాంపిల్ కోసం హైదరాబాద్ కి రెండు టీమ్స్ ని పంపుతాయి ఎవరికి వాళ్లుగా ఎంక్వైరీ చేయటానికి , ఈ విషయం మినిస్టర్ ద్వారా మాఫియాకు తెలిస్తే మాఫియా ద్వారా మినిస్టర్ కి విషయం తెలుస్తుంది , మినిస్టర్ కి తెలియదు వాళ్ళ ఇంట్లోనే మాఫియా స్పై మరియు పోలీస్ స్పై ఉన్నారు అని వీళ్ళతో పాటు మరో కరుడు కట్టిన మానవ బాంబు లాంటి మనిషి మినిస్టర్ ఇంట్లో ఉన్నట్టు 

 

ఇక్కడ ఊరిలో ఉండటం దేనికి మన కూడా హైదరాబాద్ వెళ్ళి అబ్బాయితో ఉందాం రవణ  అంటే దానికి రవణ ఇక్కడ పొలం పనులు పశువులు ఎలా అండి అక్కడకి వెళ్ళి మనం ఏం పనులు చేస్తాం ఇక్కడే ఉండి కుదిరితే నెలకు ఒకసారో రెండు సార్లో చూసి వద్దాం , వాడు చిన్న పిల్లాడు కాదు మనకు అలవాటు కావాలి కదా ఎప్పుడూ వాడు మన దగ్గర మనం వాడి దగ్గర ఉండలేం ఆలోచించండి అని పాక లోకి పోతుంది 

తిరుపతికి కొడుకు గురించి బాధ అలా అని పెళ్ళానికి నిజం చెప్పలేదు కొడుకు మీద బెంగ అని  , పాకలోకి వెళ్ళిన రవణ ఫోన్లో మెసేజ్ పంపుతుంది .

కలుగులోని ఎలుకలు తిండి కోసం బయటకి వచ్చాయి బోనులో సిద్ధం చేయండి.

ఓపిక పట్టలేని తిరుపతి సందేశం పంపుతాడు వాళ్ళ సెక్యూరిటీ టీం కి 

పిల్లోడు తప్పిపోయాడు ఒంటరిగా ఉన్నాడు కాపలా కాయండి .

 

 

మీరు నన్ను అనుసరించటం వలన కొత్త భాగాలు ప్రచురించినప్పుడు మీకు చదవటానికి మీ అభిప్రాయాల్ని చెప్పటానికి చాట్ రూమ్ లో కథకు సంబంధినవి మీరు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. మీరు కథకు సంబంధిన  ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు . 

 

 

ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి  కొత్తగా రాస్తున్నాను నేను మొదలు పెట్టింది ఇప్పుడే  కానీ బాగా రాయగలను కొంచం అలవాటు అయితే ఒకప్పుడు బాగా రాశాను అలవాటు తప్పింది . ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి దయచేసి