తండ్రికి తగ్గ తనయుడు – 2
పార్ట్ 2 :
పార్ట్ : 3
మొత్తం మూడు గ్రూపులు హైదరాబాద్ లో వేట మొదలు పెడుతున్నాయి వాటిలో
1 . కాంట్రాక్ట్ కిల్లర్స్ గ్యాంగ్
2. మినిస్టర్ గ్యాంగ్
3. మాఫియా గ్యాంగ్
గురూజీ గ్యాంగ్ మాత్రం చాపకింద నీరులా సైలెంట్ గా పని కానిస్తుంది ఎవ్వరికి అనుమానం రాకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పాస్ చేస్తుంది అంతే కానీ డైరెక్ట్ గా ఎటాక్ చేయరు వాళ్ళు వాళ్ళకి ఆర్డర్స్ పై నుండి రావాలి లేదంటే స్లీపింగ్ మోడ్ లో ఉంటారు .
ఆల్రెడీ కాంట్రాక్ట్ కిల్లర్స్ గ్యాంగ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు , వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనీ ఇస్తారు లేదంటే మనిషినే లేపేస్తారు .
మినిస్టర్ గ్యాంగ్ కి కావాల్సింది ఒకటే అది కూడా డిఎన్ఎ టెస్ట్ కోసం మాత్రమే . పోతే మాఫియా గ్యాంగ్ మాత్రం తిరుపతి ఫ్యామిలీలో మొదటిగా వాళ్ళ కొడుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని కూతుర్ని కిడ్నాప్ చేసి తిరుపతిని చిత్రహింసలు పెట్టి చంపటం వాళ్ళ లక్ష్యం . దానికి అనుగుణం గానే హైదరాబాద్ కి వచ్చి లోకల్ పొలిటీషియన్ అయిన లాలా తో మాట్లాడి తన వాళ్ళు ఉండటానికి వాళ్ళకి ఎలాంటి సమాచారం అయిన ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో లాలా కి సలాం చేసేవాళ్ళు కొంత మంది వీళ్ళకి సహాయం చేయటానికి రెడీ అవుతారు .
తిరుపతి పాస్ చేసిన సమచారం చూసి ప్రైవేట్ సెక్యూరిటీ కాలేజీ లో వాచ్మెన్ గా & కొంతమంది లెక్చరర్ గా జాయిన్ అవుతారు . కాలేజీలో సడన్ గా ఇలా జరుగుతుంటే మేనేజ్మెంట్ స్టాఫ్ ను మారుస్తున్నాము సెక్యూరిటీ టైట్ గా ఉండాలి అమ్మాయిలకి అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని కవర్ చేస్తుంది .
వినోదికి కాలేజ్ హాస్టల్ నచ్చక తన ప్రాక్టీస్ కి ప్లేస్ లేదు కాబట్టి ఊరికి చివర్లో ఒక ఇల్లు తీసుకుంటాడు
చూడగానే తనకి నచ్చేస్తుంది ఎందుకు అంటే కింద అంత షాప్స్ కోసం రెండు రూమ్లు పైన ఒక 1bhk రూమ్ మిగతాది చుట్టూరా గోడలు కట్టి వదిలేసిన ప్లేస్ అవ్వటం వలన తన ప్రాక్టీస్ కి ఉండటానికి బాగుంటుంది అని తీసుకుంటాడు . రూమ్ తీసుకున్న సంగతి ఇంట్లో అమ్మకి చెప్తాడు నాన్నకి చెప్పాడు భయపడతాడు అని రోజులగానే కాలేజీ కి వెళ్ళి రావటం ప్రాక్టీస్ చేసుకోవటం యధావిధిగా జరుగుతువుంటుంది.
వినోద్ కోసం కాలేజీ లో జాయిన్ అయిన కిల్లర్ బ్యాచ్ అబ్బాయిలకి వినోద్ హాస్టల్ కాలి చేసి బయటకి వెళ్ళాడు బయట ఇల్లు తీసుకున్నాడు అని తెలిసి వాళ్ళ హెడ్ కి చెప్తే మీరు కూడా అక్కడకి షిఫ్ట్ అవ్వండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు . సాయంత్రం సమయాన బయటకి వెళ్ళిన ముగ్గురికి అక్కడ ఒకటే రూమ్ వుండటం కింద షాపింగ్ రూమ్ కావటం వల్లన రూమ్ దొరకదు , ఇక్కడ కాలేజీలో ఫ్రెండ్షిప్ కుదరదు సో అబ్బాయిలు ప్లాన్ బి కి రెడీ అయితే ఇప్పుడే అమ్మాయిలు ఆట మొదలు పెడతారు .
సెమిస్టర్ ఎగ్జామ్స్ మొదలవ్వటంతో ఎవ్వరికి వాళ్ళు ప్రిపేర్ అవ్వటంలో బిజీగా గా ఉంటే ముగ్గురు అమ్మాయిలు గాసిప్ క్రియేట్ చేస్తారు వినోద్ కి లవర్ ఉంది అని అది కూడా ఒక సైడ్ నిజమే . ఒకసారి వినోద్ డాష్ ఇస్తాడే తనే ( శ్రీలక్ష్మి ) వినోద్ ను లవ్ చేస్తుంది కానీ చెప్పదు ఎందుకు అంటే వినోద్ అమ్మాయిలతో మాట్లాడడు ఎవరి గురించి పట్టించుకోడు . వినోద్ కి ఇద్దరే ఫ్రెండ్స్ వాళ్ళతోనే ఉంటాడు అప్పుడప్పుడు రవళి తో మాట్లాడుతాడు . ఇంకా ఎవరితో మాట్లాడడు ఇలా పుకారు పుట్టించటం కూడా ఒకందుకు మంచిదే అవుతుంది వినోద్ కి , శ్రీలక్ష్మి కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మాట్లాడుదాం అనుకోని
నిద్ర పోతుంది.
ఈ రోజు నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వటం తో ఎవరి రూమ్ ఎక్కడో తెలుసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేసి బయటకి వచ్చి తిని పోయి టైమ్ లో శ్రీలక్ష్మిని చూసి దగ్గరకి వెళ్ళి ఐ లవ్ యూ చెప్తాడు అందరికీ ఫ్యూజులు కట్ అవుతాయి . ని బిల్లు కూడా కట్టేసాను తిని ఇంటికి వెళ్ళి ఈ వారం ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వు సెం హాలిడేస్ అప్పుడు మాట్లాడతాను అంటాడు అప్పటికి తను ఈ లోకం లోకి రాదు
ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక వినోద్ ఇంటికి పోయే ముందల తనతో మాట్లాడటానికి తనని కాలేజీ పక్కడ ఉన్న గ్రౌండ్ దగ్గరకి రమ్మని చెప్తాడు , ఎప్పటి నుండో కాపు కాస్తున్న మాఫియా మనుషులకి లోకల్ గూండాలకి ఒంటరిగా దొరుకుతాడు తనని వెయ్యటానికి పోతున్న గూండాలకి అక్కడ వాచ్మెన్ రూపం లో వున్న ఇద్దరి మనుషుల్ని చూడగానే ఆగమని సైగ చేసి వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ అని అడుగుతాడు వాళ్ళు ఎవడో ఇక్కడ ఉంటే నీకు ఏమి రా వాళ్ళని తర్వాత చూద్దాం ముందు వచ్చిన పని కానివ్వు అని చెప్తూ గ్రౌండ్ లోనకి పోయేవాళ్ళకి అన్న వెనక దారి గుండా పోదాం వాళ్ళు వాచ్మెన్ కాదు అన్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ వెల్ ట్రెయిన్డ్ పర్సన్స్ అన్న వెనక ఇంకో దారి ఉంది అటు నుండి వెళ్దాం అని వాళ్ళని అటు నుండి ఎంటర్ అవ్వటానికి తీసుకెళ్తాడు .
శ్రీలక్ష్మి ఇంకా రాలేదు లేట్ అవుతుంది ఏమో అని ఫోన్ చేయబోతూ వద్దులే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుందో ఏమో అని అటు ఇటు తిరుగుతూ ఉంటే వెనుక గేట్ కనపడితే అటు వెళతాడు , ఎప్పటి నుండో వినోద్ ను గమనిస్తున్న కిల్లర్ గ్యాంగ్ వాళ్ళకి వినోద్ ఎక్కడకి వెళ్తున్నాడో అర్థం కాక ఒకడు బిల్డింగ్ ఎక్కి ఇంకొకడు బయట చెట్టు మీద ఇంకొకడు బండి వేసుకొని చక్కర్లు కొడుతుంటాడు . అప్పుడే వాళ్ళకి ఒక రౌడీల గుంపు లోనికి రావటం వాళ్ళు వినోద్ కోసమే అని గ్రహించి వాళ్ళ లీడర్ కి కాల్ చేస్తే వాడు మీరు చూడండి ఏమి చేయొద్దు అవసరం అయితే వాడితో ఫ్రెండ్షిప్ కి ఏదైనా మార్గం దొరుకుతుంది ఏమో చూడండి అని ఫోన్ పెట్టేస్తాడు
అలా గేట్ దగ్గరకి పోగానే శ్రీలక్ష్మి వాయిస్ వినిపించటం వలన వెనక్కి తిరుగుతాడు , వెంటనే వెనక నుండి ఇద్దరు రౌడీలు కాలితో తన్నగానే రెండు అడుగుల దూరం లో పడతాడు ఏమి జరిగిందో తెలిసే సరికి రౌడీలు చుట్టుముడతారు , శ్రీలక్ష్మి వినోద్ అని కేక వేస్తూ వినోద్ దగ్గరకి పరిగెడుతుంది వినోద్ ఆగు శ్రీలక్ష్మి నువ్వు వెళ్ళి అక్కడే కూర్చో ఇక్కడకి రాకు లేదంటే నువ్వు కాలేజీ లోకి పో నేను వస్తాను అంటాడు వెంటనే బ్రేకులు వేసిన బుల్డోజర్ లాగ తనని తాను కంట్రోల్ చేసుకొని ఆగి వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది . ఏమి రా మమ్మల్ని కొట్టి ఆ పిల్ల దగ్గరకి పోదాం అనేనా కల కంటున్నావా ఏమి అని అడుగుతారు .
వినోద్ : నేను కల కంటున్నానా లేక మీరా అనేది చూద్దాం
రౌడీ గ్యాంగ్ : రేయ్ కుర్రాడు మరి ఆవేశంగా ఉన్నాడు రా వేసేసి పోదాం నైట్ మల్లా పార్టీ కి పోవాలా
వినోద్ : పార్టీకి పోలేరు కానీ మిమ్మల్ని హాస్పిటల్లో నేను పబ్ కి ఇది పక్కరా
రౌడీ గ్యాంగ్ : నలుగురం నాలుగు పక్కల పట్టుకొని లాగితే ఎ కీలుకి ఆ కీలు వస్తాది లాగండ్రా
వినోద్ : మీరు నాలుగు పక్కల ఉంటే మీ లోపల గుండ్రంగా ఉంది నేను సుడిగుండం లా ముంచేస్త
రౌడీ గ్యాంగ్ : రేయ్ చంపేయండి రా
వినోద్ : చూస్కో అయితే అని
ముందుకి గుండ్రంగా దూకి స్ట్రెయిట్ పంచ్ 👊 ( జబ్ ) ఒకటి ఇస్తే దూరం పడి లేవలేడు అలా దూకిన ప్లేస్ ఘడ్ మణి రాడ్ సౌండ్ , మళ్ళీ రివర్స్ లో క్రాస్ పంచ్ 👊 (క్రాస్) వెళ్ళి స్ట్రెయిట్ గా మొహానికి తాగాలి వాడు లేవడు , వాడి పక్కనొడికి అప్పర్ కట్ అంతే దవడ పక్కకి పోతుంది సైడ్ నా వున్న వాడికి ఎడమచేతితో పక్కటెముకుల దగ్గర పంచ్ (రేర్ హుక్) , ఇంకొకరికి కుడిచేతితో పక్కటెముకుల దగ్గర పంచ్ ( లీడ్ హుక్ ) ఇలా 8 మందిని పడగొట్టాక మాఫియా వాళ్ళ గ్యాంగ్ హెడ్ రాడ్స్ మరియు కర్రలతో కొట్టమంటాడు ,
వాళ్ళకి మాత్రం క్రాస్ హుక్ , హుక్ క్రాస్ అలా ఎలా పడితే అలా కొడతాడు మొత్తం మూడు నిమిషాల్లో 20 మందిని కొట్టడం చూసిన కిల్లర్ గ్యాంగ్ వాళ్ళు షాక్ లోకి పోతారు .
అప్పుడే అక్కడకి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ వస్తారు. సినిమా మొత్తం చూసి సినిమా పేరు అడిగినట్టు . హడావుడిగా వచ్చి ఏమైంది ఏంటి గొడవ అని అడుగుతారు జరిగింది మొత్తం శ్రీలక్ష్మి చెప్తుంది వాళ్ళని అక్కడ నుండి వెళ్ళమని చెప్పి పోలీస్ కేసెస్ కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ చూసుకుంటారు .
వినోద్ : నేను ఊరికి వెళ్తున్నాను వచ్చాక నీతో మాట్లాడుతాను అని చెప్పి వెళ్లబోతుంటే వెనుక నుండి ఐ లవ్ యూ అని చెప్పి వాటేసుకుంది . ఇది మొత్తం ఒకరు వీడియో తీస్తారు . ఇంటికి అర్జెంట్ గా వెళ్ళాలి అని నుదిటి మీద ముద్దు పెట్టీ బై చెప్పి వెళ్తాడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అక్కడ వాచ్మెన్ కి చెప్పేసి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఎవరో ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది కానీ దేని కోసమో తెలియదు అన్ని అలానే ఉంటాయి కానీ డోర్ దగ్గర తేడాగా ఉంటుంది ఇంట్లో బట్టల దగ్గర తన డౌట్ వస్తుంది కానీ డబ్బు బంగారం అలానే ఉంటాయి . నేను మరచిపోయే ఉంటాను అనుకోని బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్తాడు హైద్రాబాద్ నుండి .
ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి కొత్తగా రాస్తున్నాను నేను మొదలు పెట్టింది ఇప్పుడే కానీ బాగా రాయగలను కొంచం అలవాటు అయితే ఒకప్పుడు బాగా రాశాను అలవాటు తప్పింది . ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి దయచేసి .
Swipe left/right or tap the sides to turn pages