తండ్రికి తగ్గ తనయుడు – 3
part 3 :
బస్ ఎక్కిన వినోద్ ఉదయం లేచిన దగ్గర నుండి రూంకి లాక్ వేసి కాలేజీ నుండి రూమ్ కి వచ్చె వరకు ఏం జరిగింది అని కళ్ళు మూసుకొని ఫ్రేమ్ బై ఫ్రేమ్ గుర్తుచేసుకుంటూ ఉంటాడు . అప్పుడు గుర్తుకి వస్తుంది రూమ్ కి లాక్ వేశాను ఎవరో ఓపెన్ చేశారు అని ఆలోచిస్తూ నిద్రపోతాడు .
హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన వినోద్ ని చూసి తిరుపతి ఎలా ఉన్నావ్ నాన్న , బాగా తగ్గిపోయావ్ తినటం లేదా హాస్టల్ లో ఫుడ్ బాగా లేదా అని కుశల ప్రశ్నలు అడుగుతాడు , మద్యలో రవణ వచ్చి ఇప్పుడే ఇంటికి వచ్చాడు కొద్దిగా గ్యాప్ ఇస్తే వాడు రెస్ట్ తీసుకొని మీకు అన్ని విషయాలు చెప్తాడు అని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రా నాన్న నేను నీకు టిఫిన్ రెడీ చేస్తాను అని కొడుకుని రూంలోకి పంపి ఆమె కిచెన్ లోకి పోతుంది, బారెడు పొద్దు ఎక్కిన ఇంకా ముసుగు తట్టి నిద్ర పోతున్న కూతుర్ని తిడుతూ వంట చేస్తుంటుంది , అవి ఏమి పట్టించుకోకుండా సుబ్బు ప్రశాంతం గా కునుకు తీస్తుంటుంది , రూమ్ లోకి వెళ్ళి అక్క అని గట్టిగా కేక వేసేసరికి ఉలిక్కిపడి సుబ్బు ఏమైందో అని గబా గబా పైకి వస్తారు అమ్మానాన్న సుబ్బు ఏంట్రా నువ్వు వస్తె వచ్చావు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు , ఎందుకు వచ్చావు రా హాయిగా నిద్ర పోయే దానిని చెడగొట్ట డానీకా , నువ్వు లేవు నీ డ్యూటీ అమ్మ తీసుకుంది ఎప్పుడూ ఉదయాన్నే లేవాలి అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి అని ఒకటే గోల , చెప్పు నాన్న నువ్వు అయిన అంటుంటే , మీ నాన్న చెప్తాడులే నువ్వు లేచిరా ముందు అని నువ్వు ఫ్రెష్ అయిరా నాన్న అని 5 నిముషాల్లో అందరూ కిందకి వస్తె టిఫిన్ పెడతాను లేదంటే నేను పొలానికి పోతాను అని కిందకి వస్తుంది . తనతో పాటు తండ్రికుతురు కూడా కిందకి పోతారు . పోగానే నువ్వు వెళ్లి మొహం మీద కొద్దిగా నీళ్ళు అయిన చల్లుకొని రా అంటుంది. రేపో మాపో పెళ్ళి చేసుకొని అత్తారింటికి పోవాల్సిన దానివి ఇలా ఉంటే ఎలా అని చివాట్లు పెడుతుంటే ఆపు అమ్మ రోజు చెప్పి చెప్పి నీకు విసుకు రావటం లేదు నేను మారటం లేదు తప్పు యాడ జరిగింది అంటావ్ అని వాళ్ళ అమ్మని కూల్ చేస్తుంది .
అప్పుడే ఫ్రెష్ అయి కిందకి వచ్చిన వినోద్ అమ్మ టిఫిన్ పెట్టు తినేసి అలా ఊరిమీదకి వెళ్ళేసి ఊరు చూసి ఫ్రెండ్స్ తో మాట్లాడేసి వస్తానని చెప్తాడు . అందరు కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేసి అమ్మానాన్న పొలానికి వెళ్ళిపోతే వినోద్ ఊరు మీదకి వెళ్తాడు . మధ్యాహ్నం అన్నం తీసుకుని వెళ్ళిన సుబ్బు అమ్మానాన్నతో అడుగుతుంది నాన్న నేను మన ఊరిలోనే ఊరు చివర ఉన్న మన పొలం దగ్గర ఎరువులు ఎరువులు షాప్ పెడదాం అనుకుంటున్నాను దానికి మీరు ఏమంటారు నాకు కూడా ఏదో ఒకటి చేయాలని ఉంది అని తన మనసులో మాట బయట పెడుతుంది దానికి ఊరు బయట ఎందుకు తల్లి ఊర్లోనే పెట్టుకో ,లేదంటే మన జిల్లాలో పెట్టుకోమని చెప్తాడు వద్దు నాన్న ఊరు బయటనే అయితే బాగుంటుంది .
దానికి తిరుపతి అమ్మ నువ్వు అంత పెద్ద చదువు చదివి ఎరువులు షాప్ ఎందుకు తల్లి మా కోసం అని చెప్పేసి నువ్వు నీ జాబ్ కూడా మానేసి వచ్చేసావు సో ఇప్పుడు నువ్వు పట్నం వెళ్లి ఏదో ఒక జాబ్ అన్న చేయొచ్చుగా తల్లి అంటే , వద్దు నాన్న నేను ఇక్కడే ఉండి ఎరువుల షాప్ పెడతాను , ఇక్కడ రైతులకి ఏం ఉపయోగమో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి నేను షాప్ పెడదామనుకుంటున్నాను దానికి మీరేమంటారు నానా అని చెప్పేసి అడుగుతుంది దానికి తిరుపతి ఓకే అని చెప్పేసి అంటాడు ఓకే తల్లి అక్కడ అయితే అక్కడ అయితే రూమ్ కట్టి ఇచ్చేస్తాను మరి అంటే లేదు నాన్న ఆ రూము చాలా పెద్దగా ఉండాలి ముందు ఎరువులు వెనుక ల్యాబ్ కట్టి నేను కొన్ని ప్రయోగాలు చెయ్యాలి . ఏ పంట వేస్తే ఎలాంటి తెగులు వస్తున్నాయో వాటికి ఎలాంటి మందులు వాడాలో వాటికోసం నేను ప్రయోగాలు మొదలు చెయ్యాలి అని అంటుంది దానికి ఓకే అమ్మ అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు తిరుపతి .
********** ********
ఇక్కడ కాలేజీల్లో మాఫియా గ్యాంగ్ ని లోకల్ గుండాలని కొట్టిపడేసిన విషయం లోకల్ లీడర్ అయినా లాలా ద్వారా మాఫియా వాళ్ళకి తెలిసిపోతుంది . ముంబై మాఫియా నుంచి వచ్చిన దావూద్ గ్యాంగ్ వాళ్ళు వినోద్ మీద కాలేజీలో గొడవకి వెళ్తే , చోటా డాన్ కిషన్ మనుషులు వినోద్ రూమ్లో దొంగలించిన వస్తువులతో వాళ్లు ముంబై తిరిగి వెళ్ళిపోతారు . దావూద్ గ్యాంగ్ వాళ్ళని కొట్టిన విషయం వాళ్ల లీడర్ ( బిలాల్ ) ద్వారా దావూద్ కి చేరుతుంది , దావూద్ అడుగుతాడు ఒక్కడే అందర్నీ కొట్టాడా లేకపోతే మన వాళ్ళని కొట్టిన వాళ్ళు ఎవరు తిరుపతి కొడుక్కి అంత ధైర్యం అంత కెపాసిటీ ఉందా మనవాళ్లను కొట్టే అంత వుందా అని , దావూద్ రైట్ హ్యాండ్ అయినా బిలాల్ ని అడుగుతాడు దానికి బిలాల్ భాయ్ ఒక్కడు కొట్టాడో లేకపోతే ఎవరు కొట్టారు తెలియదు కానీ లాలా ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మన వెల్ ట్రెయిన్డ్ లైకాన్ టీంని తీసుకొని నేను హైదరాబాద్ వెళ్తాను అక్కడ జరిగింది ఏంటో తెలుసుకొని మీకు చెప్తాను భాయ్ అప్పటి వరకు మీరు టెన్షన్ పడకండి ఎలాంటి నిర్ణయం తీసుకోమాకండి అని లైకాన్ టీంని తీసుకుని బిలాల్ హైదరాబాద్ వెళ్లడానికి పైనమవుతాడు . ఇక్కడ వినోద్ రూమ్ నుండి దొంగలించిన వస్తువులను ముంబైకి వెళ్లి చోట డాన్ కిషన్ కి ఇస్తారు . కిషన్ తన కొడుకు రోషన్ కి ఇచ్చి మనకి తెలిసిన డాక్టర్ రావత్ కి చెప్పి dna టెస్ట్ చేపించమని చెప్తాడు .
********** ***********
కాంట్రాక్ట్ కిల్లర్స్ గ్యాంగ్ వాళ్ళు వినోద్ యొక్క ఫైటింగ్ స్కిల్స్ , సామర్థ్యం చూసి షాక్ లో నుండి బయటకి వచ్చి వాళ్ళ లీడర్ కి చెప్తారు, దానికి వాడు వాట్ అని ఆశ్చర్యపోతూ మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉన్నాడు అని ఇంతకి మీకు వాడితో స్నేహం ( అబ్బాయిలని ) అయిన , ప్రేమ ( అమ్మాయిలని ) అయిన చేయటం కుదురుతుందా కాదా అని అడుగుతాడు , దానికి అమ్మాయిలు చాలా ట్రై చేశాం కానీ కుదరటం లేదు కానీ వాడిని హాండిల్ చేయటం అంత ఈజీ కాదు అని చెప్తారు , వెంటనే నేను మన రెండో బ్యాచ్ నీ రంగంలోకి దింపుతున్నాను మీరు వాళ్ళకి ఎగైనెస్ట గా ఉండి రెండు టీమ్స్ లో ఎవరో ఒకరు వాడితో ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పి ఇదే విషయం మన రెండో టీం కూడా చెప్తాను అంటాడు , ఫైనల్గా ఒక విషయం చెప్తాను మర్చిపోకుండా వినండి అని ఫోన్ పెట్టేస్తాడు
ఏమి చెప్పాడో మీకు సిట్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను .
*********** ************
శ్రీలక్షి వినోద్ గురించి ఆలోచిస్తూ తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు కనీసం నన్ను చూడనుకూడా చూడలేదు మరి నాకెందుకు ఐ లవ్ యు చెప్పాడు అని ఆలోచిస్తుంటే బ్రెయిన్ అక్కడ జరిగిన సిట్యువేషన్ గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఎవరు ? వినోద్ ను ఎందుకు ఎటాక్ చేశారు , ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువ మాట్లడడు, గొడవకి పోడు, ఎవరి విషయాల్లో తల దూర్చడు మరి వాళ్ళు ఎవరు ? వినోద్ ఒక్కడే అంతమందిని అలా ఎలా కొట్టగలిగాడు ? వినోద్ ఎవరు? . నేను చూసిన వినోద్ ఈ వినోద్ ఒక్కరేనా కాదా అని ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కి టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకునేలోపు వాళ్ళ నాన్న తల్లి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు దానికి కాలేజీ లో జరిగింది చెప్తుంది అంతే కానీ తను ఐ లవ్ యు చెప్పింది వినోద్ ను వాటేసుకుంది చెప్పదు. చూడు తల్లి అమ్మాయి అందంగా ఉంటే ఎవరైనా వెంటపడతారు అందులోనూ నీ తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ నిన్ను ట్రాప్ చేస్తే లైఫ్ అంత సెట్ అవుతుంది అని కొంతమంది , బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగాలని కొంత మంది , నా పరువు తీయటానికి ప్రేమ పేరుతో నిన్ను లొంగదీసుకోవటానికి చాలా మంది వున్నారు తల్లి
గుంత కాడ నక్కల్లా కాపు కాసేవాళ్ళు . జాగ్రత్త తల్లి అని నిన్ను నమ్మాను తల్లి నమ్మకాన్ని పోగొట్టుకోకు అని వెళ్లబోతుంటే సారీ పప్పా అని హగ్ చేసుకొని నేను మీకు ఒకటి చెప్పాలి పప్పా అని
నేను కూడా ఐ లవ్ యు చెప్పాను ఇలానే హగ్ చేసుకున్నాను పప్పా అని చెప్తుంది . నాకు ఒకరు వీడియో పంపారు తల్లి , ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలియదు కానీ తెలుసుకుంటాను , ఒక వేళ వాడే వీడియో తీపించి పంపితే , భూమిమీద లేకుండా చేస్తాను తల్లి అని వెళ్ళిపోతాడు .
ఇక్కడ ఎందుకు శ్రీలక్ష్మి లవ్ చేస్తున్న వాళ్ళ నాన్న ఏమి అనలేదు అనే డౌట్ ఎవరికి అయిన వస్తె క్లారిఫికేషన్ ముందు వచ్చె ఎపిసోడ్స్ లో ఇస్తాను ఫ్రెండ్స్ .
ఏవైనా తప్పులు ఉంటే మన్నించండి .
నెక్స్ట్ ప్రోమోలో :
ప్రేమను ఫీల్ అవ్వాలి అంటే ఏదో ఉండాలి… ❤️ ఆ ప్రేమలో మనసు మునిగిపోయే ఓ అనుభవం ఉండాలి… ప్రేమంటే కేవలం మాటలు కాదు, మనసుని తాకే ఓ మధురమైన అనుభూతి… ❤️🔥 ప్రేమకు అర్థం తెలియాలి అంటే… ఒకరి చూపులో మనల్ని మనం చూసుకోవాలి, ఒకరి నవ్వులో మన సంతోషాన్ని వెతుక్కోవాలి, ఒకరి మౌనంలో కూడా మనకోసం దాగిన మాటల్ని వినగలగాలి… 🥹💞 ఎందుకంటే నిజమైన ప్రేమను పుస్తకాల్లో చదవలేం, మాటల్లో పూర్తిగా చెప్పలేం… దాన్ని మనసుతో అనుభవించాలి, హృదయంతో జీవించాలి… ❤️
Swipe left/right or tap the sides to turn pages