దరి చేరవా ప్రేమ – 2
దరి చేరవా ప్రేమ 2 💞💞💞
త్వరగా రెడీ అవ్వు తల్లి ..! ఎంత సొంత అత్త అయిన లేట్ అవితే బాగొద్దు కదా ..!
ప్రకాష్ గారు కూతురి నుదిటి మీద పెట్టుకుని రూమ్ నుండి వెళ్ళి పోతారు
బుజ్జి ఇంకా పెళ్లి చూపుల కన్నా ముందే గ్రాని ఎక్కడ కర్రతో పెళ్లి చేస్తుందో అనే భయంతో పరూగో పరుగు వాష్ రూమ్లోకి …
వేణి గారు వచ్చేటప్పటికి బుజ్జి చక్కగా తల్లార స్నానం చేసి వెట్ హెయిర్ ఆరబెట్టుకుంటూ ఉంది ..
వేణి వస్తూనే ..
బుజ్జి స్నానం చేసేసావా ..! ఇలా రా జడ అల్లుతా ..
సరే ..! అని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ..
వేణి గారు తడి ఆరేలా చక్కగా దువ్వి జడ వేస్తూ ఉంటే ..
అమ్మా..! అనే బుజ్జి గారంగా పిలిచిన … ఏదో ఆలోచనలో ఉన్న వేణి గారూ పలకరు …
బుజ్జి మళ్ళీ గట్టిగ అమ్మ అనేసరికి అమ్మా ..?
తేరుకుని .. హ ..! చెప్పు
అమ్మా..! మ..రి.. మ..రీ ..అ..ది
బుజ్జి ..! సాగదీయకుండా విషయం ఏంటో చెప్పు ..!
నాకున్న చిట్టి మైండ్లో బోలెడు ఆలోచనలు గిర గిర తిరుగుతున్నాయి … అడిగా క తిట్టను అంటేనే అడుగుతాను ..
సరే లే ..! అడుగు ఏంటి అంతా నీ పీతా బుర్రలో మెదిలిన సందేహం ..
అదేనమ్మా..! ఇంత సడెన్గా బావకి నాకు పెళ్లి చూపులు ఏంటి ..!
సడెన్గా ఏముందే ..! ఎప్పుడు ఒక వారం ముందు అనుకున్నదే కదా ..!
అబ్బా..! అమ్మా..! అదే అంతా సడెన్గా ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా పప్పా ( నిన్న ప్రకాష్ అని మళ్ళీ ఈ రోజు పప్పా అంటుంది ఈ తిక్కలిది అనుకుంటున్నారా ..! మేడం గారు మూడు , నాలుగు నీ బట్టి తండ్రిని ప్రకాష్ అని , పప్పా అని ఇలా ఇంకా చాలా ఉన్నాయి అబ్బో🙄🙄🙄 మన బుజ్జి పాప దగ్గర చాలా ఉంది ముందు ముందు మికే తెలుస్తుంది 🙄🙄🙄) వోట్ నాకే ఉండేది .. కానీ బావతో పెళ్లికి నన్ను అంతలా ఎందుకు ఒప్పించారు .. అసలు ఇంతా సడెన్గా పెళ్లి చూపులు ఏంటి ..? అది కనీసం నా ఇష్టం ఆడకుండా … పప్పా నాకు ఇష్టం లేని ఏ పని చెయ్యరు .. అలాంటి ఆయన ఇలా నాకు బావతో పెళ్లి ఏంటి ..? అయిన ఎప్పుడో మనతో విడిపోయింది అత్త ఫ్యామిలీ అని నాతో చెప్పారు మళ్ళీ ఇప్పూడి ఈ పెళ్లి తంతంగం ఏంటో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు .. అసలు అత్త అనే పేరు తప్ప వాళ్ళని ఎప్పుడు చూసిందే లేదు .. అసలు వాల్లు నాకు గుర్తు కూడా లేరు .. పప్పా ను అడుగుదాం అంటే ఆయనని అడగలేకున్నా నాకు ఇష్టం లేకున్నా పప్పా కోసం ఒప్పుకున్నా కానీ ..
వేణి గారు కూతురి ప్రశ్నకి షాక్ అయ్యి ..
బుజ్జి ..! ఏంటే ..? ఈ పిచ్చి ప్రశ్నలు ..
ప్రశ్నలు కాదు అమ్మా ..! వారం నుండి నన్ను వేధిస్తున్న అంతులేని ఆలోచనలు …
ఏంటి ..! ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలి అంతే కదా ..!
హ ..!
నీకు అత్త ఫ్యామిలీ గురించి తెలియడానికి ఎప్పుడో మీ బావ చిన్నప్పుడు ఏదో మీ తాత గారితో , ఆయనతో మరిది గారితో చిన్న గొడవ అయింది మీ అత్త భర్తతో .. మీ అత్త నా భర్తనే అవమానిస్తున్నారా ఇంకా ఎప్పటికీ ఈ గడప తొక్కను అని అలిగి పుట్టింటి నుంచి వెళ్ళిపోయింది .. అప్పుడు నేను గర్భవతిని ఆ తర్వాత కొన్ని సంగటనలు వల్ల ఆ బాధ తోనే మీ తాత గారు కాలం చేశారు చెప్పేలోపు ..
”వేణి ” నిన్ను వాడు పిలుస్తున్నాడు చుడు అని గంభీరంగా కోపంగా అక్కడికి వస్తోంది సుశీలమ్మ …
సుశీలమ్మ చూసే చుపులకి భయపడి అక్కడే ఆగిపోతారు వేణి..
ఇంకా ఇక్కడే ఉన్నావే ..! వెళ్ళి కింద ఏర్పాట్లు చూడు దాని సంగతి చూస్తాను అని కంచు కంఠంతో చెప్పేసరికి
బుజ్జి ఛ..! ఈ ముసలిధి ఎప్పుడు ఇంతే ..! కరెక్ట్ టైమ్ కి అని విసుకుంటుంది ( కానీ అసలు అందులో ఉన్న డౌట్స్ మర్చిపోయింది ఈ తింగరిధి ..) అని అమ్మని భయపెట్టడం బాగా అలవాటు అయి పోయింది ఈవిడకి అని సడెన్గా బల్బ్ వెలిగి అవును అమ్మ ఏంటి మరిది గారు అంటుంది నాన్న ఒకరే కదా కొడుకు గ్రానీకి అనే ఆలోచనలో ఉండగా ..
ఏమ్మే ..! శివుడు తాడి చెట్టు లా పెరిగావు ..! ఇంకా జడ వేసుకోవడం కూడా రాదు ..! హవ్వ
అని బుగ్గ నోక్కుంకుంటూ అంది సుశీలమ్మ ..
నాని నా పేరు శివుడు .. విష్ణువు కాదు శివాన్షిక
అంతా పేరు నోరు తిరగక పోతే కాల్ మీ శివాని
అంతేకాని ఇలా బాయ్స్ నెమ్స్ట్ తో పిల్వకే తల్లి నీకు దన్నం పెడతా ..!
నువ్వు ఎన్నైనా చెప్పు … నీ కూతురికి నా పేరు వచ్చేలా పెట్టు అని మీ తాత గారి ఆకరి కోరిక ఆయన పేరు శివుడు అందుకే నీకు ఆ పేరు పెడతా .. నీ అలవాట్లు , నీ గుణగణాలు అన్ని మీ తాతవే అందుకేనేమో మీ తాత శివయ్యని చూస్తున్నట్టే ఉంటుంది .. అందుకే నేను అలా పిలుస్తానే పిచ్చి దాన అని కన్నీళ్ళ పర్యంతం అవుతారు సుశీలమ్మ …
బుజ్జి ఒసేయ్ …! గ్రానీ ఇందాకటి నుండి నా బుర్రలో ఒక డౌట్ గిర్రున తిరుగుతా ఉంది అడగనా ..?
నా దగ్గర నీకు మొహమాటం ఏంటే శివుడు ..?
అడుక్కో ..
శివాని గుర్రుగా చూస్తూ … నీకు మా నాన్న కాకుండా ఇంక్కో కొడుకు ఉన్నాడా ..? మరి ఇంతకాలం ఈ విషయం నాకెందుకు తెలియనివ్వలేదు ..? ఉంటే ఆయన ఎక్కడ ఉన్నట్టు ..? ప్రెసెంట్ ఆయన మనతో ఎందుకు లేరు ..? అసలు ఆయనకి సంబంధించిన ఫోటో కూడా ఏమి లేదు ఏంటి ఇక్కడ మన దగ్గర ..? ఇంకా ఏదో అడగ్గా బోతే …
సుశీలమ్మ బుజ్జి ప్రశ్నలకి అవాక్కయి ఒక్కింత కంగారుగా … శివుడు ఆపవే ..! ఏదో ప్రశ్నల పత్రం మింగేసినట్టు అలా చెప్పుకుంటూ పోవడమెనా ..? పక్క వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వవా ..? అని గయ్యిమంటుంది మన బుజ్జి బేబీ మీద …
బుజ్జి బుంగ మూతి పెట్టుకుని …
ఇది మరీ బాగుంది ..! ఏమి చెయ్య మంటావు ..? నీకు తెలుసు కదా నాకు డౌట్ వస్తే అది క్లియర్ అయ్యేదాకా నాకు మనః శాంతి గా ఉండదు అని … నా సంగతి పక్కన బెట్టి టాపిక్ డైవర్ట్ చేయమాకూండ అసలు విషయానికి వద్దాం .. అమ్మ మరిది గారు అంది అంటే నాకు చిన్నాన్న ఆయన సంగతి చెప్పు …
ఇంకా బుజ్జికి ఏదైనా డౌట్ వస్తే తీరేదాకా వదలదు అనే విషయం సుశీలమ్మ బాగా ఎరుక.. ( సుశీలమ్మ మనసులో ఈ విషయం దీనికి ఎప్పటికన్నా తెలుస్తుంది ఇప్పుడు తప్పించుకుంటే ఈ విషయం మిద దానికి
అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది అది నమ్మేలాగా చెప్పాలి దాచిన ఈ ఎప్పటికైనా తెలుస్తుంది …
నిట్టూర్చి.. అవునే..? శివుడు నాకు ఇంకొ కొడుకు వున్నాడు వాడి పేరు అజయ్ కానీ …
అవునా…? మరి అయన ఇప్పుడు ఎక్కడ యున్నారు ఇన్నాళల్లో ఒక్కసారికూడా ఎందుకు రాలేదు …
బ్రతికి ఉంటేనే కదా మన్నల్ని చూడడానికి రావడానికి చనిపోయి చాలా సంవత్జ్స్ర్తాలు అయింది …
ఆ మాటకి బుజ్జి షాక్ అయి …
ఏమంటున్నావు ..! నాని బాబాయి చనిపోవడం ఎన్టీ..? ఎలా జరిగింది ..?
వాడు మీ తాతగారికి తెలియకుండానే పెల్లి చేసుకున్నాడని ఇంట్లొ నుంచి గెంటేశారు .. అప్పటీకే ఆ అమ్మాయి తల్లి కాబోతుంది అని తెలిసింది… తరువాత కొన్నాళ్ళకి వాడికి ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలిసి వెళ్ళాం కాని ఆ అమ్మాయి అదే వాడి భార్య పాపా పుట్టగానే చనిపోయింది …
అజయ్ బార్య తన్న వల్లే భర్త ఫ్యామిలి దూరం అయింది అని బాధపడుతూ ఉండేది ఆ బెంగతోనే ఆరోగ్యం క్షీణించి చనిపోయింది మా
వల్లే తనకి అలా అయిందని మా మిద ద్వేషం పెంచుకుని పాప తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు తర్వాత కొన్నాలకి వాడు ఒక ఏక్సిడెంట్ లో చనిపోయాడు అని తెలిసింది …
మరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది..? మనతో ఎందుకు లేదు …
ఊహించని ఆ ప్రశ్నకి ఒకసరిగా సుశీలమ్మ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏవో ఏవో జ్ఞాపకాలు మనసును చుట్టుముట్టి మనసు మీద దాడి చేయడం మొదల పెట్రింది అప్పటికే టెన్షన్ అన్ని వెరిసి …
నాని ..! నిన్నే ఆ అమ్మాయి గురించి చెప్పు అంది బుజ్జి …
సుశీలమ్మ ఒక్కసారిగా వెన్నక్కి తులిపడబోతే బుజ్జి చూసింది కాబట్టి సరి …
నాని నాని అంటూ సుశీలమ్మ బుగ్గను తడుముతున్నా బుజ్జి ఆవిడ పలకపోయేసరికి కంగారుగా డాడీ ..! అంటూ పెద్ద పెద్దగా ఏడ్వడంతో …
బుజ్జి ఏడుపు కిందికి వినిపించి …
ప్రకాష్ గారు ఏంటి ..? బుజ్జి గొంతులా ఉంది ఏమైందో అని కంగారుగా పైకి వెళ్తారు వెనకే వేణి గారు కూడా ..
అక్కడ కూతురూ చేతిలో పడిఉన్న తల్లిని చూసి కంగారుగా …
అమ్మా..! అమ్మా..! లే..! బుజ్జి ఏమైంది అమ్మకి
బాధతో పుడుకు పోయిన గొంతులో అంటారు ప్రకాష్ గారు ..
తెలీదు డాడీ ..! సడెన్గా ఇలా అయింది అని ఏదో గుర్తుకు వచ్చిన దానిలా నా వల్లే నానికి ఇలా అయింది అని గుక్క పెట్టీ ఏడుస్తుంది …
వేణి గారు కూతురిని ఒదారుస్తుంటే …
ప్రకాష్ గారు డాక్టర్ అవ్వడంతో తల్లికి బి.పి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి పడుకోబెడతారు …
బుజ్జి ఏడుస్తుంటే గుండె తరుక్కుపోయి ..
భార్యకి తల్లిని అప్పగించి …
బుజ్జి నీ తీసుకుని వేరే రూమ్లోకి వెళ్తారు ..
ఇప్పుడు చెప్పు బుజ్జి ..! ఏమైంది అసలు నాని నీతో ఏమంది..?
బుజ్జి ఏడుస్తూనే నానికి తనకి జరిగింది మొత్తం పూస గుచ్చినట్టు చెపుతు నా వల్లే నానికి బాబాయ్ గుర్తుకు వచ్చినట్లు ఉన్నారు అందుకే అలా అయింది …
బు జ్జు లు ఎందుకు రా ఏడుస్తున్నావు ..? ఇందులో నీ తప్పు ఏమున్నది నాన్న ..? నువ్వు అలా అనుకోకు మర్చిపోతే కదా వాడిని గుర్తు చెయ్యడానికి అమ్మా ఇలా అవుతుందనే రా ..! మీ బాబాయ్ ఫొటోస్ ఉంటే తన గురించి ఆలోచనలతో ఇలా అవుతుందనే నీకు కూడా తన గురించి చెప్పలేదు … ఇంకెప్పుడు వాడి గురించి ఆలోచన కూడా రానివ్వకు అలాగే నాని దగ్గర కూడా ఎప్పుడు మాట్లాడని నాకు మాట ఇవ్వు
అంటారు సీరియస్ గా ..
( ప్రకాష్ గారికి బాగా తెలుసు బుజ్జి ఏదైనా విషయం అనుకున్నది అంటే అది తేలేవరకు అంతా ఇజిగా వదలదు దాని కోసం ఎంత రిస్క్ అయిన కూడా కేర్ చెయ్యదు అని అందుకే బుజ్జ్జిని కట్టడి చేయాలి అంటే ఇలా తన దగ్గర మాట తీసుకోక తప్పదు అని ఆలోచించారు)
సరే ..! అని మాట ఇస్తుంది ..
అక్కడ సుశీలమ్మకి స్పృహ వస్తే ఆవిడని మెల్లిగా బెడ్ కి జారేసి కూర్చొబేడుతుంది వేణి ..
అత్తయ్య ..! ఏమైంది..?
అజయ్ వాడి కూతురి గురించి అడిగింది …
మీరు అంతా చెప్పేశారా..?
లేదు ..! వాడి మరణం గురించి మాత్రమే చెప్పాను కానీ సడెన్గా వాడి గురించి , అమ్మాయి గురించి ఆలోచనా , బాధ ఎక్కువై ఇలా అయింది … బుజ్జి నీ ఈ విషయంలో ఇంకా ఏమి అనకు నువ్వు … బుజ్జి దగ్గర అసలు ఈ విషయమే ఎత్తకు అర్థం అయిందా ..? అని చిన్న వార్నింగ్ ఇస్తారు ..
హ్మ్మ్ ..అని తల ఉపుతారు ..
బుజ్జి , ప్రకాష్ గారు ఇద్దరు సుశీలమ్మ దగ్గరికి వెళితే ..
ఆవిడ మెల్లిగా కోడలితో ఏదో మాట్లాడుతూ ఉంటారు ..
అమ్మా..! ఎలా ఉంది పోని హాస్పిటల్ కి వెళ్దామా
వద్దు ..! నాన్న ఇప్పుడు బాగానే ఉంది
సరే ..! అమ్మ రెస్ట్ తీసుకో పెళ్లి చూపులు రేపు పెట్టుకుదాం ..
సుశీలమ్మ కంగారుగా …
ప్రకాష్ వద్దు సడన్ గా పెళ్లి చూపులు వద్దంటే ఎంత నీ చెల్లి కుటుంబం అయినా బాగోదు నాకు ఇప్పుడు బాగానే ఉంది .. పెళ్లి చూపులు సాయంత్రం కదా .. నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే అదే సరిపోతుంది.. దానికి మరి మళ్లీ పోస్ట్ పోన్ అది ఎందుకు ..
సరే ..! అమ్మ నీ ఇష్టం
శివాని గుమ్మం దగ్గర నిలబడి నాని వంక నా వల్లే ఇలా జరిగింది అనే భావనతో క్షమించండి అన్నట్టు చూస్తూ ఉంటే …
సుశీలమ్మ అది అర్థం చేసుకుని ..
శివుడు ..! ఏంటి అలా నిలబడిపోయి దిక్కులు చూస్తున్నావు ..!
నాని తనతో మామూలుగా మాట్లాడినందుకు బుజ్జి హ్యాపీ గా వెళ్ళి నాని నీ హత్తుకుని ..
బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది ..
సుశీలమ్మ బుగ్గ తుడుచుకుని ఈ ముద్దులు నాకు కాదు నీకు కాబోయే భర్త నీ బావకి పెట్టు…
ఎందుకో బుజ్జి కి సుశీలమ్మ మాటలు నచ్చక అసహనంగా ఫీల్ అయి ..
అయిన బావ ఏంటే ..!
అత్త కొడుకు బావ కాక మరి ఎమ్మని అన్నాలి ..
ఏమో నాకు తెలియదు నువ్వు మాత్రం ఆ మాట అనకు నాకు నచ్చలే ..
హబ్బో ..!
అయిన అత్త కొడుకుకి కాదు నా కాబోయే మొగుడికి పెడతా అయిన మొగుడికి బావకి చాలా తేడా ఉంటుంది అంది పెడసరిగా…
అబ్బో ..! ఏంటో ఆ తేడా ..!
నీ మనవడు , అత్త వాళ్ళు జస్ట్ పెళ్ళిచూపులకి మాత్రమే వస్తున్నారు … అంతే తప్ప డైరెక్ట్ పెళ్లి చేసుకోవడానికి కాదు .. అయిన నీ మనవడు నాకు నచ్చాలి అప్పుడు … నా మనసుకి నచ్చితే మాత్రమే డాడీ చేస్తాను అని అన్నారు .. అందుకే అప్పుడే అన్ని హోప్స్ పెట్టుకోకు ముసలి ..
అని వెళ్లిపోతుంది ..
ఇక్కడ ప్రకాష్ గారు కూతురి మాటలకి బాధపడుతూ …
నన్ను క్షమించరా బుజ్జి ..! నీకు నచ్చిన నచ్చకపోయిన నా మేనల్లుడే నీ భర్త … నువ్వు
ఆ ఇంట్లో మాత్రమే సుఖంగా ఉండగలవు …
వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు .. అందుకే నీ అత్త పంతం వీడి నిన్ను త్టన కోడలికి చేసుకోవడానికి అంగీకరించింది …
అమ్మ కూడా నీ పెళ్ళితో మళ్లీ రెండు కుటుంబాలు కలుస్తాయని ఆనందంగా ఉంది …వాడి ప్రేమతో నిన్ను కచ్చితంగా తనని ప్రేమించుకునేల చేస్తాడు ..
అలా ఆరోజు సాయంత్రం పెళ్లి చూపులు కార్యక్రమం మొదలు అవుతుంది ..
అందరికీ అన్నీ నచ్చుతాయి ఒక మన బుజ్జి పాపకే అక్కడ జరిగేది చూస్తుంటే …
ఏంటి ..! వాడికి నేను నచ్చాను అంటా ఓ ఎగుసుకుని వచ్చేశాడు … అమ్మాయికి నచ్చానో లేదో అని తెల్సుకోకిందా ఏకంగా పెళ్లి కి రెడీ అయి పోయాడు ఎదవ పినుగు .. ఎబ్రసి వెధవ , ఇంకా ఇంకా హా … కాకులు దగ్గర పిండలు వెరుకునే సన్నాసి , అని గుర్తుకు రాకపోతే అప్పు తెచ్చుకొని మరి తిడుతుంది ..
(బుజ్జి తిట్లని వింటే అతన్ని పరిస్థితి ఏంటో మరి 🙄🙄)
అప్పుడే ..
బుజ్జి తో నేను మాట్లాడవచ్చ మావయ్య అని
హ్యాండ్ రైజ్ చేస్తాడు బుజ్జి బావ అలియాస్ పెళ్లి కొడుకు అలియాస్ బుజ్జి పాప అన్న వెధవ పీనుగు అలియాస్ విజయ్ ..
ఆ మాటకి బుజ్జి తల ఎత్తి అతన్ని చూసి ఎందుకో తనకి తెలియకున్డానే టెన్షన్ , భయంగా అనిపిస్తుంటే … పెళ్లి అనే ఫీల్ వల్ల అని తనకి తానే సర్ది చెప్పుకుని ..
తండ్రి బుజ్జి వంక చూస్తూ ..
బుజ్జి ..! బావకి గార్డెన్ చూపించు ..
సరే ..! అని బుద్ధిగా తల ఊపి తీసుకు వెళ్ళింది ..
విజయ్ మాట్లాడిన తనకే తెలియని ఒక భయం , టెన్షన్ అన్ని చుట్టి ఎప్పుడు లోడ లొడ వాగే నోటికి బ్రేక్ పడింది …
విజయ్ బుజ్జి టెన్షన్ పడుతున్నది అర్థ అయి ..
హై నా పేరు విజయ్ అని చొరవగా బుజ్జి చేతిని పట్టుకుంటాడు ..
బుజ్జికి ఇంకా భయం ఎక్కువై చేతిని వెన్నక్కి తీసేసుకుంది ..
విజయ్ చిన్నగా నవ్వుకుంటూ ..
బుజ్జి నీ టెన్షన్ నాకు అర్థం అయింది నీకు ఇష్టం లేకుండా నేను నీ లైఫ్ లోకి రాను … నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా అత్త , నాన్న చెప్పారు అని కాదు ఓకేనా .. అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునేంత వెధవ నీ కాదు .. ఒక అమ్మాయికి పెళ్లి గురించి చాలా డౌట్స్ , ఎలాంటి వాడో అనే భయం ఉంటుంది
..సో … నువ్వు టెన్షన్ పెట్టుకోకుండా కొన్ని రోజుల తరువాత పెళ్లి చెయ్యమని చెప్పుధాం
ఓకేనా ..! ఈ గ్యాప్ లో ఇద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకోవచ్చు .. ఒకరి ఇష్టాఇష్టాలు
తెలుస్తాయి .. నేను నిన్ను మీ నాన్న అంతా ప్రేమిస్తాను అని చెప్పను కానీ నా ప్రేమతో ఆ లోటు లేకుండా చెయ్యగలను ..
బుజ్జి కి విజయ్ మాటలు నచ్చి సరే ..! విజయ్ గారు
బుజ్జి విజయ్ అని ఎందుకు చక్కగా బావ అని
అన్నచ్చు కదా ..
బుజ్జి కొంచెం ఇబ్బందిగా ..
ప్లీజ్ విజయ్ గారు నేను అంతా త్వరగా మింగిల్ అవ్వలేను నన్ను కంపెల్ చెయ్యదు ..
విజయ్ బాధగ .. సరే ..! బుజ్జి నీ ఇష్టం కనీసం ఆ గారు గిరు కాకుండా విజయ్ అను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో ..
బుజ్జి ఇబ్బందిగానే సరే ..విజయ్ ..! వెళ్దాం అని లోపలికి వెళ్ళేటప్పటికి ..
అక్కడ ఫ్యామిలీ వీళ్ళ పరిమిషన్ లేదు అన్నట్టు తాంబూలాలు మార్చేసికుని …
వీళ్ళయుద్ధరి చేతుల్లో మార్చుకోమని రింగ్స్ పెడతారు ..
బుజ్జి కి అయోమయంగా ఉంటుంది … అన్నిటికీ మించి ఏదో తెలియని బాధ , తాను అనుకున్నది ఏదో తన నుంచి దూరం అవుతుందనే భయం , తన కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్టు ఇంక ఏవో ఏవో మదిలో
మేదిలి ఆ భారం అంతా ఎక్కువై స్ట్రెస్ తట్టుకోలేక బుజ్జి ఒకసారిగా తల పట్టుకుని నేలకి ఒరిగిపోతే …
ప్రకాష్ గారు కంగారుగా అమ్మ…బుజ్జి..! అంటూ ఎత్తుకుని తీసుకుని వెళ్లి ఆయన రూంలో బెడ్ పై పడుకోబెట్టి కంగారుగా అక్కడే ఉన్న ఇంజెక్షన్ చేస్తారు …
అందరూ ఒక్కసారిగా జరిగిందనికి షాక్ లో ఉండి పోయారు ..
ప్రకాష్ గారు అందరినీ బయటకి పపించేసి ..
కూతురి నుదుటిన ముద్దు పెట్టుకుని ..
బుజ్జి నన్ను క్షమించర ..! నా వల్లే నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్న అనే ఇలా తెచ్చుకున్నావు కదా తల్లి ..! నీ క్షేమం కోసం నేను ఏదైనా చేస్తాను రా ..! నీ పెళ్లి విషయంలో
మాత్రం నేను మారను … కూతురి చేతిని పట్టుకుని అక్కడే ఉండి పోతారు ..
💞 💞 💞 💞 💞 💞 💞 💞 💞
ఎలా ఉంది స్టొరీ టైటిల్ బాగుందా ..!
రింగ్ మార్చుకోడానికే బుజ్జి అంతా స్ట్రెస్ తీసుకుంది ..మరి విజయ్ ను తన జీవితంలోకి ఆహ్వానించగలదా..?😔😔😔😔
ప్రకాష్ గారు బుజ్జి నీ విజయ్ కే చెయ్యాలని నిర్ణయించుకున్నారు😭😭😭😭😭 మరి బుజ్జి మీద ఉన్న ప్రేమతో ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటారా..?
బుజ్జి దగ్గర తన ఫ్యామిలీ దాస్తున్న నిజాలు ఏంటి ..?
అసలు బుజ్జి విజయ్ ల పెళ్లి జరుగుతుందా..?
బుజ్జి ప్రేమ ఎవరిని దరి చేరుతుంది ..?
💖 💖 💖 💖 💖 💖 💖 💖
ఇంకా ఉంది …
Swipe left/right or tap the sides to turn pages