New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరి చేరవా ప్రేమ – 3

దరి చేరవా ప్రేమ – 3

          దరి చేరవా ప్రేమ 3 💞💞💞

 

 

 ప్రకాష్ గారు అలా నైట్ మొత్తం బుజ్జి దగ్గరే ఉండి తనని చూస్తూ కూర్చుని ఉంటారు ..

బుజ్జి అలా పడిపోవడంతో ప్రకాష్ గారి చెల్లెలు 

విజయ్ తల్లి లత గారు …

 

అమ్మా..! ఏంటి ఇది అంతా ..? అసలు శివాని కి సడెన్గా ఏమైంది …? దానికి ఈ పెళ్లి ఇష్టమేనా అసలు ..? దానికి ఇష్టం లేకపోయినా మమ్మాలిని ఇక్కడికి తీసుకు వచ్చింది ఇలా అవమానించడానికా ..? అని కోపంగా తల్లిని నిలదీస్తుంది ..

 

సుశీలమ్మ ఉరిమి చూసేటప్పటికీ …

 

కొంచెం తడపడి …

 

అదే అమ్మా..! ఇలా రింగ్స్ మార్చుకునే టైంకు ఇలా అయింది కదా ..? అందుకే..? అని కొంచెం తగ్గి అడిగేసరికి …

 

 

లత ..! ఈ విషయం మనం రేపు మాట్లాడుకుందాం ..! ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడకండి అని కూతురి ఫ్యామిలీ వైపు చూసి …

 

 

నాన్న విజయ్ ..! పైన మీ కోసం రూమ్స్ రెడీ చేయించి ఉంచా ..! వెళ్ళి రెస్ట్ తీసుకోండి ..! 

మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం ..!

 

 

సరే ..! అని విజయ్ అందరినీ తీసుకుని వెళతాడు ..

 

 

  💞 💞 💞 💞 💞 💞 💞 💞 💞

అలా స్పృహ తప్పి పడి పోయిన అతన్ని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్లి అతన్ని రూమ్ లో పడుకో బెట్టారు తాతు ..

 

సర్వెంట్స్ లో ఒకరు డాక్టర్ కి కాల్ చేసి ఉండడంతో వితిన్ టైమ్ లో 

డాక్టర్ వచ్చి చెక్ చేసి ..

 

 

జయరామ్ గారు ..! మీతో కొంచెం మాట్లాడాలి 

అలా పక్కకి వెళ్దామా ..? 

 

సరే ..! అని వెళ్తారు ..

 

 

మావయ్య.. మీకు చాలా సార్లు చెప్పాను రుద్ర మెంటల్ కండిషన్ చాలా వీక్ గా ఉంది ..! అలాగే తనకి ఆ అమ్మాయికి సంభందించిన విషయాలు ఏవీ గుర్తు చెయ్యద్దు అని … తన బ్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అయితే తన బ్రెయిన్ లో బ్లడ్ క్లాత్ అయే చన్సేస్ ఎక్కువుగా ఉన్నాయి అని ఆరోజే చెప్పాను కానీ మీరు చాలా కేర్లెస్ గా ఉన్నారు వాడికి ఇప్పటికే ఇలా స్ట్రెస్ ఎక్కవై ఇలా అవ్వడం చాలా సార్లు జరిగింది … ఇలా వన్ మోర్ టైమ్ జరిగితే వాడిని కాపాడడం మన చేతుల్లో లెన్నట్టే ఇంకా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది ఏమో..

 

లేదు కిరణ్ ..! వాడి విషయంలో చాలా కేర్ గా ఉంటున్నాం .. ఈ రోజు ఏ రోజో మర్చిపోయావా ..! ఆ బాధ మర్చిపోలేక వాడు 

తాగుడికి బానిస అయ్యాడు .. అని బాధపడుతూ ఉంటారు తాతు ..

 

ఆయన్ని ఓధార్చుతూ …

 

తాతయ్య..! మీరే ఇలా అయిపోతే మన రుద్ర సిట్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించండి ..

ఒక పక్క తల్లితండ్రులు , మరో వైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇద్దరి మరణలతో గుండె నిండా బాధని అనుభవిస్తున్న రుద్ర నీ ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించండి ..!

 

ఇప్పుడు ఏమ్ చెయ్యను కిరణ్ ..!

 

 

తాతయ్య..! మీకు చెప్పే అంతా వాడిని కాదు కానీ ఏ ప్రేమ వల్ల వాడు ఇలా అయ్యాడో అదే ప్రేమ వాడిని తిరిగి మార్చాలి ..

 

 

ప్రశ్నార్థకంగా చూస్తే ..

 

 

తన జీవికాలమంతా ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి ..? ఇప్పుడు అంటే మనం ఉన్నాం ఆ తర్వాత వాడిని ఎవరు అనే మాట అనేలోపు ..

 

 

అంటే ..! వాడి జీవితంలోకి ఇంకో అమ్మాయి రావాలి అనే కదా నువ్వు చెప్పాలి అనుకునేది ..

 

 

ఎస్ ..! ప్రేమ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు అని మీరే వాడికి ఎలాగోలా నచ్చచెప్పి పెళ్లికి ఓప్పించండి ..

 

 

నా మాట వింటాడు అనే నమ్మకం నాకు లేదు ..!

 

 

అలా అనకండి తాతయ్య ..! ఈ లోకంలో ఎవరి మాట అయిన వింటాడు అంటే అది మీది ..! తనది మాత్రమే కానీ తనె ఇప్పుడు మన మధ్యన లేదు ..

 

 

సరే ..! కిరణ్ నా మనవడు కూడా సంతోషంగా ఉండాలని నాకు ఆశగా ఉంది కానీ వచ్చే అమ్మాయి వీడిని అర్థం చేసుకుంటుందా..! వాడి గతం తెలిస్తే అసలు వాడితో ఏడడుగులు వెయ్యడానికి సిద్ధ పడుతుందా ..? 

 

మన కుమార్ అంకుల్ కూతురు అను ఉంది కదా ..! తనని మీరు చూసే ఉంటారు మన రుద్ర గురించి కూడా పూర్తిగా తెలుసు ఆ అమ్మాయి కి కూడా వీడు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి .. ఆ అమ్మయి అయితే వీడిని అర్థం చేసుకుంటుంది ..! పైగా తను వీడు తనని ప్రేమించడం లేదు అని తెలిసిన ఇంకా విడీనే ప్రేమిస్తుంది తాతయ్య ..!

 

 

సరే..! కిరణ్ ఆలోచిస్తాను ..! కానీ వాడిని ఒప్పించడానికి కొంచెం సమయం పడుతుంది ..

 

ఇంకా వెళ్తాను తాతయ్య ..! ఇప్పటికే టైం అయ్యింది ..

 

కిరణ్ వెళ్ళిపోయాక రుద్ర రూంలో మనవడి తల నిమురుతూ ఆలోచిస్తూ ఉంటారు తాత గారు ..

 

 

   💞 💞 💞 💞 💞 💞 💞 💞 💞

 లత రూమ్ లో కాలు కాలిన పిల్లిలా అసహనంగా తిరుగుతుంటే ..

 

లత భర్త సుందర్ …

 

 

ఏంటి ..! లత మన ప్లాన్ ఇలా ఫెయిల్ అయింది .. మనం ఒక్కటి అనుకుంటే యిక్కడ మరొకటి జరిగింది .. అసలు మన విజయ్ కి బుజ్జి తో పెళ్లి అవుతుంది అంటావా..! ఏమో జరుగుతుందనే నమ్మకం లేదు నాకు ..?

 

ఛీ ..! మీ ముసి నది నోటి నుంచి ఒక మాట మంచిగా రాదా ..? ఎప్పుడు అకుపక్షిలగా శుభం పలకరు .. అసలే ఏమి జరుగుతుందో అనే టెన్షన్ లో నేను ఉంటే మధ్యలో మీ గోల ఏంటి..? 

 

అంటే ..? ఈ పెళ్లి జరగదు అని నువ్వు కూడా ఫిక్స్ అయ్యవా ..!

 

 

అబ్బా..! అపుతరా ..? లేదా..? ఇంకోసారి ఈ పెళ్లి జరగదు అనే మాట మీ నోటి నుంచి వచ్చిందో మిమ్మలిని ఏమ్ చేస్తానో నాకు తెలీదు ..

 

అది కాదు లత ..! చూస్తే అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేనట్టు ఉంది కదా..! మరి మీ అన్నయ్య చేస్తాడు అంటావా తనకి ఇష్టం లేకుండా..? 

 

 

మా అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలీదు ..! అన్నయ్యకి నేను అంటే ప్రాణం పైగా 

మాట ఇచ్చడు కదా బుజ్జి నా ఇంటి కోడలు అని ప్రాణం పోయిన మాట తప్పని వంశం మాది … మిలా కాదు అర్థం అయిందా ..?

 

 

ఒక స్మాల్ డౌట్ అడగనా ..? 

 

 

ఏంటి ..? మళ్ళీ ఆసహనంగా ..

 

నిజానికి అప్పుడు జరిగిన గొడవకి నీ పుట్టిల్లు అంటేనే అసహ్యం కదా నీకు మరి ఇప్పుడు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నవవు ..!

పోనీ డబ్బు , ఆస్తి కోసమా అంటే నీకు డబ్బు మిద అంతా వ్యామోహం కూడా లేదు మరి ఎందుకు ఇది అంటా చేస్తున్నావు ..?

 

 

ముందు ముందు మీకే తెలుస్తుంది ..? ముందే చెప్పేస్తే థ్రిల్ ఏమి ఉంటుంది ..! అని ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి .. నాకు నిద్ర వస్తుంది ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి ..

 

సుందర్ భార్య ఆలోచన అర్థం కాక బుర్ర పికోడం ఎందుకులే అని .. హాయిగా ముసుకు తని పడుకున్నారు ..

 

 

    🔆 🔆 🔆 🔆 🔆 🔆 🔆 🔆 🔆

 

శివాని భారంగా కళ్ళు మత్తుకి మూతలు పడుతున్నా ఎలాగోలా ఓపిక తెచ్చుకుని మెల్లిగా లేచి కూర్చుని చుట్టూ ఉన్న నాని , పప్పా , అమ్మ .. రాత్రి అంతా నిద్ర లేకుండానే శివాని దగ్గర తనకి ఎప్పౌడు స్పృహ వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉన్నట్టు వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న అలసట ప్రస్ఫుటంగా తెలిస్తుంటే తన కోసం తన ఫ్యామిలీ తనే మీదే ప్రాణాలు పెట్టుకుని అని అర్థం అయి కళ్ళలో నీళ్ళు తిరిగి ..

 

 

మెల్లిగా పప్పా అని పక్కనే ఉన్న తండ్రి చేతిని పట్టుకుని చిన్నగా కదిపేసరికి …

 

 

ప్రకాష్ గారు కూతురి స్పర్శకి మేలుకుని ..

 

 

బుజ్జులు ..! ఇప్పుడు ఎలా ఉంది రా ..! పోనీ హాస్పటల్ కి వెళ్దామా ..!

 

 

ప్రకాష్ గారు ఇప్పుడు నాకు భానే ఉంది అనీ లేని ఓపిక తెచ్చుకుని గారాలు పోతూ అంటుంది తండ్రితో ..

 

తండ్రి కుతూర్ల ముచట్లకి మెలుకువ వచ్చి వాళ్ల 

ప్రేమని అబ్బురంగా చూస్తూ ఉంటారు అత్త కోడళ్ళు ..

 

 

చూశారా అత్తయ్య ఈ తండ్రి కూతుళ్ళకి ఒకరికి ఒకరు ఉంటే చాలు ..! పక్కన సునామి వచ్చిన లెక్క లేదు ..

 

 

సుశీలమ్మ మనసుల దేవుడా ఈ తండ్రి కూతుళ్ళ మధ్యలో ఎటువంటి మనస్పర్థలు రాకుండా ఎల్లకాలం అలాగే ఉండేలా చూడు స్వామి ..? అని అని మనసు లోనే దేవుడికి ప్రార్థిస్తూ ..

 

 

వేణి ..! అది రెడీ అయ్యాక కొంచెం దానికి దిష్టి తీసేయ్ ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయి పిల్ల మీదా నిన్న అలా అయిపోయింది ..

 

 

వేణి గారు సరే..! అత్తయ్య అని 

 

అయ్యాయా తండ్రి కూతుర్ల ముచ్చట్లు ..

లేవండి ..! త్వరగా రెడీ అవ్వండి అని ఇద్దరినీ గదిమి ..

 

అమ్మా..! నేను కొంచెం సేపు పడుకుంటాను అని మొహం నీరసంగా పెట్టీ అంటుంది తల్లితో ..

 

 

వేణి గారు ..

 

బుజ్జి ..! మా అమ్మ కదు ..! ఇంట్లో అత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు ..?

 

 

ఏమి అనుకోరు మన అత్తే కదా..!

 

 

తను నీ మేనత్త మాత్రమే కాదు నీకు అత్త ఎంత మేనత్త అయిన మన లిమిట్స్ లో మనం ఉండాలి కదా రా బజ్జులు ..! లే త్వరగా ఫ్రెష్ అవ్వు ఓకేనా..

 

 

అని మీకు స్పెషల్ గా చెప్పాలా ..! అని భర్తను గదిలో నుంచి తరిమి ..

 

సుశీలమ్మ కూతురి ఫ్యామిలీ కిందకి రాకుండానే టిఫిన్స్ అన్ని వాళ్ల దగ్గరికే పంపి , అయ్యాక కిందకి రమ్మమ్మని కబురు పంపి ..

 

అందరూ హాల్లో అటెండ్ అయ్యారు ..

శివాని విజయ్ ఇద్దరు ఒకరికి ఒకరు దూరంగా కూర్చుని ఉంటే …

 

విజయ్ ,శివాని లను కొంచెం దగ్గర దగ్గరగా కూర్చోబెదుతుంది శివాని అత్త లత ..

 

బావ గారు , అమ్మా..! లత నన్ను క్షమించండి ..! నిన్న సడెన్గా మధ్యలో అలా అయింది అంటారు ప్రకాష్ గారు గిల్టీగా ఫీల్ అవుతూ ..

 

ప్రకాష్ గారు అలా వాళ్ళని క్షమించమని ఎవరని అడగని తండ్రి ఈ రోజు అలా అడిగితే ఆ బాధ తట్టుకోలేక బుజ్జి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ..

 

తన కళ్ళలో నీళ్ళు చూస్తే తండ్రి భరించలేడు అని ఎవరు గమనించకుండా కళ్ళు తుడ్చుకుంటుంటే విజయ్ శివాని చేతిని చిన్నగా ప్రెస్స్ చేస్తూ ఏడవకు అన్నట్టు సైగ లు చేస్తే ..

 

శివాని తన చేతిని అతన్ని చేతి నుండి సున్నితంగా విడిపించుకుని …

 

ఓకే అన్నట్టు చిన్నగా తల పంకిస్తుంది .. 

 

 

అన్నయ్య..! మన మధ్య క్షమాపణలు ఏంటి..! అయిన జరిగింది చిన్న విషయం ఇప్పుడు ఏమి అయింది అది ఏమైనా పరాయి పిల్ల నా మేనకోడలు నా రక్తం .. నువ్వు ఏలాంటి భయాలు ఏమి పెట్టుకోకు ..

 

 

ఆ మాటకి ప్రకాష్ గారు హ్యాపీగా ఫీల్ అవుతూ ..

 

 

చాలు ..! లత ఆ మాట అన్నావు అదే నాకు చాలా సంతోషంగా ఉంది .. అందుకే అమ్మా..! 

అమ్మా అత్త రావాలని నా కుతురికి కోరుకున్న ఆ దేవుడి నా మొర ఆలకించి నా తోబుట్టువునే నా బుజ్జి తల్లికి ఇచ్చాడు అని చాలా ఆనంద పడుతూ ఉన్నారు …

 

అయితే నిన్న రింగ్స్ మార్చుకోలేదు కదా అవి ఇప్పుడు పెట్రించేస్తే సరి అంటుంది సుశీలమ్మ ..

 

అన్నయ్య ఇంకా ఈ ఎంగేజ్ మెంట్ లు రింగ్స్ అవ్వీ అన్ని వద్దు ఒక నెలలోపు పెళ్లి చేసేదనికి డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తం పెట్టించేద్చాం ఏమి అంటావు ..?

 

 

ఆ మాటకి శివాని మనసు గాలిలో తేలిపోతున్నట్టనిపించింది .. కానీ డైరెక్ట్ గా పెళ్లి అనే మాట వినలేదు …

 

 

అంతా కంగారుగా ఎందుకే ..? అంటారు సుశీలమ్మ

 

అయిన పంతులు గారు చెప్తారు కబురు పెట్టాను అని అనుకుంటూ ఉండగనే పంతులు వస్తారు ..

 

రండి ..! పంతులు గారు మీ కోసమే చూస్తున్నాము అని ఆహ్వానిస్తారు పంతులిని 

సుశీలమ్మ ..

 

 

పంతులు ఇద్దరి జాతకం చూసి …

 

” వీళ్ళ జాతకాల దృష్ట్యా ఒక ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవమ్మ ..! “

 

పంతులు గారు ఇంక్కొససరి చూడండి ..! అని 

అంది లత ..

 

ఎన్ని సార్లు చూసినా మారదు తల్లి ..!

 

 

పంతులు గారు ఆరు నెలల తర్వాత ఉన్న ముహూర్తానికే లగ్న పత్రిక రాయండి అంది 

సుశీలమ్మ …

 

 

పంతులు సమయం చూసుకుని అమ్మా ..! ఈ రోజు అంటే ఉదయం నుంచి మరో మూడు నెలలు మూఢం అమ్మా..! ఇలాంటి రోజుల్లో ఏ శుభకార్యం మొదలు పెట్టిన అనుకొని అవాంతరం ఎదురు అవుతాయి తల్లి అంటారు అనునయంగా ..

 

 

సరే..! పంతులు గారు మీరు అంతలా చెప్పుతున్నారు కదా ..! మూడు నెలలు తర్వాతే పెట్టుకుందాం అని ఆయనకి సంభావన ఇస్తే సుశీలమ్మ ..

 

 

మంచిది అమ్మా..! ఇంకా వెళ్తాను అని ఆయన 

బయలుదేరాతరు ..

 

పాపం లత మొహం మాడిపోయిన పెసరట్టు లా ఉంది అనుకొనిధి అవ్వలేదు అనే కసి , కోపం కలిసి అవి ఎవరికి కనిపించకుండా దుమధుమలాడి పోతూ పైకి వెళ్లి పోయింది ..

 

లత ఫ్యామిలీ కూడా ఆ నైట్ కి వెళ్తాం అని 

 

 

   💞 💞 💞 💞 💞 💞 💞 💞 💞

 

 

ఇంకా ఉంది ..