నువ్వే కావాలి ❤️ – 4
“అన్న ఇక్కడే ఇక్కడే ఆటో ఆపు” అని చెప్పడంతో ఆటో అతను ఆటో ఆపడంతో “ఎంతయింది?” అనగానే “రెండు వందలు” అని ఆటో డ్రైవర్ చెప్పడంతో 200 అతని చేతిలో పెట్టి కంపెనీ వైపు తిరిగి నిలబడింది రాజి….
VK ఇండస్ట్రీస్ అని ఉన్న లోగో చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆమె లోపలికి వెళ్ళబోతుంటే “ఎవరమ్మా నువ్వు?” అని వాచ్మెన్ ఆపడంతో “ఇంటర్వ్యూ కి వచ్చాను” అని చెప్పడంతో “ఏది రెస్యూమ్ చూపించు” అంటూ రెస్యూమ్ చెక్ చేసి ఆమె నిజంగా ఇంటర్వ్యూకి వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపలికి పంపించాడు వాచ్మెన్…
లోపలికి వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి వెయిట్ చేయమని చెప్పడంతో ఆమె వెయిట్ చేస్తూ ఒక 40 నిమిషాలకు వచ్చిన తర్వాత “మిస్ రాజేశ్వరి… నెక్స్ట్ మీరే” అంటూ వచ్చి చెప్పడంతో థాంక్యూ అంటూ లేచి వెళ్లి ఇంటర్వ్యూ జరుగుతున్న క్యాబిన్ కి వెళ్లి పావుగంట పాటు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి బయటకు వచ్చింది….
ఇంతలో తన ఫ్రెండ్ వాళ్ళ అక్క పరిచయం చేసిన అబ్బాయి “ఇక్కడ రాజీ అంటే ఎవరు?” అంటూ అక్కడికి రావడంతో “నేనే” అంటూ రాజి ముందుకు రావడంతో “నీ సీనియర్ ఒక అమ్మాయి అక్కడ హెచ్ఆర్ తనకి పరిచయం అని చెప్పింది కదా అది నేనే” అన్నాడు….
దాంతో రాజీ వెంటనే సర్ప్రైస్ అవుతూ “గుడ్ మార్నింగ్ సార్” అనగానే “గుడ్ మార్నింగ్… నాతో పాటు రండి” అంటూ తన ఛాంబర్ కి తీసుకుని వెళ్లి సర్టిఫికెట్స్ ఇవ్వమన్నట్టుగా చేతిని ముందుకు పెట్టడంతో తన రెస్యూమ్ అతని చేతిలో పెట్టింది….
అతను మొత్తం చెక్ చేసి “నీ గ్రేడ్స్ అన్ని చాలా ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి….కాకపోతే కార్పొరేట్ వరల్డ్ లో బ్రతకాలంటే గ్రేడ్స్ ఒకటే సరిపోవు… స్కిల్స్ చాలా ఇంపార్టెంట్…. పైగా ఇక్కడ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే నువ్వు లేటెస్ట్ గా ఉన్న కంప్యూటర్ కోర్సులన్నీ నేర్చుకోవాలి…. కాబట్టి ప్రస్తుతానికి కంప్యూటర్తో పెద్ద పని లేకుండా మెయిన్ డిపార్ట్మెంట్ కాకుండా చిన్న డిపార్ట్మెంట్లో ఏదైనా వర్క్ చూస్తాను బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జ్ అయితే ఉంది కదా” అని అడగడంతో “ఉంది సార్” అని చెప్పింది…
“ఈమధ్య కాలేజెస్ స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం లేదని నాకు తెలుసు… త్రీ మంత్స్ లో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి…. ఈ లోపు నేను ఇచ్చిన జాబ్ చేసుకుంటూ నువ్వు ఈవినింగ్ టైంలో స్కిల్స్ నేర్చుకోవడానికి టైం కేటాయిస్తే త్రీ మంత్స్ లో జరగబోయే ఇంటర్వ్యూస్ లో మంచి ప్యాకేజీ తో జాబ్ వచ్చేలా నేను చేస్తాను… ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు జాబ్ కావాలి అంటున్నావ్ కాబట్టి ఒక 15000 ఉండే నార్మల్ లో లెవెల్ మేనేజ్మెంట్లో ఏదైనా జాబ్ చూస్తాను… కంప్యూటర్లో బేసిక్ వర్క్స్ చేస్తే సరిపోతుంది” అన్నాడు….
అందరికీ గొప్పగా చెప్పుకునేలా పెద్ద పొజిషన్లోకి వెళ్లాలని ఉన్న తనకి ఉన్న స్కిల్స్ కి ఇవ్వడం కష్టం కాబట్టి పైగా అతను తెలిసిన వాడు కాబట్టి ఏదో ఒకటి ఇస్తాను అంటున్నాడు కాబట్టి 15000 అట్లీస్ట్ లాస్ట్ సెమిస్టర్ లో తనకి కావాల్సిన మెటీరియల్ కి వాటికి ఉపయోగపడతాయి కాబట్టి ఒప్పుకోవాలని ఉన్నా సాయంత్రం వరకు జాబ్ చేసి మళ్ళీ సాయంత్రం నుంచి నైట్ వరకు స్కిల్స్ కోసం కంప్యూటర్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే తను ఎగ్జామ్స్ కి ఎప్పుడు ప్రిపేర్ అవాలో అర్థం కాక అయోమయంలో పడిపోవడంతో “ఏంటి ఏదైనా ప్రాబ్లం హా?” అన్నాడు అతను….
“మీ ఆఫర్ తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ లాస్ట్ సెమిస్టర్ కదా… ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలంటే నాకు కొంచమైనా టైం కావాలి కానీ ఇక్కడ ఫైవ్ వరకు కూర్చుని మళ్లీ ఫైవ్ టు ఎయిట్ నేను స్కిల్స్ గురించి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే చదువుకోవడానికి టైం ఉండదు. పోనీ లేట్ నైట్ చదవాలి అనుకున్న ఇక్కడ కంటిన్యూస్గా ఆఫీస్ వర్క్ ఇంకా అక్కడ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి నేను మానేజ్ చేయలేనేమో అనిపిస్తుంది” అంది….
“యు ఆర్ రైట్ కానీ నువ్వు చేస్తున్నది బీటెక్ కాబట్టి నువ్వు నేర్చుకునే కంప్యూటర్ కోచింగ్ లో వచ్చే చాలా టాపిక్స్ ఏ నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ లో కూడా వస్తాయి…. కావాలంటే ఎగ్జామ్స్ కి టెన్ డేస్ ముందు ఎలాగోలా లీఫ్ శాంక్షన్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను” అనగానే “నిజంగానా?” అని ఆమె సంతోషంగా అడగడంతో “నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడినే… నాకిలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేదని నేను చాలాసార్లు ఫీలయ్యాను కాబట్టి నాలాగా ఎవరు ఫీల్ అవ్వకూడదని నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను” అన్నాడు….
“థాంక్యూ సర్. మీ నుంచి నేను ఇంత కోపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు” అని రాజి సంతోషంగా చెప్పడంతో “బట్ వన్ కండిషన్” అనగానే కంగారుగా అతని వైపు చూసింది….
కంటిన్యూస్!!
Swipe left/right or tap the sides to turn pages