New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే కావాలి ❤️ – 5

నువ్వే కావాలి ❤️ – 5

“ఏంటి సార్ అది?” అనగానే “నేను ఇలా నీకు హెల్ప్ చేస్తున్న విషయం ఆఫీసులో ఎవరికీ చెప్పకూడదు” అనగానే రాజీ ఊపిరి పీల్చుకొని “అలాగే సార్” అనగానే “ఇంకొకటి ఆఫీస్ లో రిజిస్టర్ అయి ఉన్న నా మొబైల్ కంపెనీ వాళ్ళు తెలియకుండానే అనానిమస్ ఆప్స్ డౌన్లోడ్ చేసి ఉంటారు… నాకే కాదు ప్రతి ఎంప్లాయ్ కి… కాబట్టి నేనెవరికీ హెల్ప్ చేసిన లేదా నేను ఎలాంటి సీక్రెట్స్ బయటికి రెవీల్ చేసినా కూడా అదంతా కంపెనీ మేనేజ్మెంట్ డేటాలో సెక్యూర్ అవుతుంది కాబట్టి నేను నీకు నా దగ్గర ఉన్న మరొక పర్సనల్ నెంబర్ ఇస్తాను… నాకు తెలిసి ప్రస్తుతం నీ దగ్గర ఒకటి ఫోన్ నెంబర్ ఉంటుంది” అనగానే అవును అన్నట్టుగా తలాడించింది…

 

“కాబట్టి ఒక్క 300 నీది కాదు అనుకుంటే వెళ్లేదారిలో సిమ్ తీసుకుని ఆక్టివేట్ చేయించుకో… అది పర్సనల్ నెంబర్ గా పెట్టుకుంటావా ప్రస్తుతం నీ దగ్గర ఉన్నది పర్సనల్ నెంబర్ గా పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం” అని చెప్పి ఏదో అనిపించినంతగా ఆమె వైపు చూసాడు…

 

“వద్దు వద్దు ఇప్పుడు నీ రెస్యూమ్ లో బయట రిసెప్షన్ దగ్గర నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉంటావు కాబట్టి అందులో నీ మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి అదే బేసిక్ నెంబర్ గా రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి కొత్త నెంబర్ నీ పర్సనల్ నెంబర్ గా పెట్టుకో. నువ్వు ఇక్కడ ఇచ్చిన నెంబర్ అంటే నీ దగ్గర ఉన్న ఎక్సిస్టింగ్ నెంబర్ నుంచి మాత్రం నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేయకూడదు” అన్నాడు…

 

దాంతో రాజీ సరే అని చెప్పడంతో “మనమేదో ఇల్లీగల్ పనిచేస్తున్నామని కాదు గాని కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి… ఇక్కడ మేనేజ్మెంట్ దృష్టిలో అందరూ ఎంప్లాయిస్ ఒకటే… ఎవరు ఎవరికి హెల్ప్ చేసుకున్న ఎవరు ఎవరికి సీక్రెట్స్ అమ్ముకున్న తెలుసుకోవడానికి ఈ ఏర్పాటు కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను” అన్నాడు…

 

“ఇట్స్ ఓకే సార్… నాకు అర్థమైంది” అని చెప్పడంతో “నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకో” అని చెప్పడంతో “సరే సరే మరి వర్క్ లో ఈరోజు జాయిన్ అవ్వమంటారా లేదా రేపా” అంది…

 

“నువ్వు ఇప్పుడే జాయిన్ అయితే అందరికీ డౌట్ వస్తుంది… ఇంకా నీ ఎంప్లాయిమెంట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ నీకు ఇవ్వలేదు కాబట్టి నేను మా వాళ్ళతో మాట్లాడి రేపు లేదా ఎల్లుండి నీకు జాబ్ కి సంబంధించిన ఆఫర్ లెటర్ పంపించమని చెప్తాను…ఆ తర్వాతే నువ్వు రావాలి” అన్నాడు….

 

“ఓకే సర్ గాట్ ఇట్” అనగానే “యు మే లీవ్ నౌ” అని చెప్పడంతో “థాంక్యూ సర్” అని చెప్పి వెళ్ళిపోయింది రాజీ…

 

**********************

 

విరాట్ ఆరోజు మీటింగ్స్ మొత్తం అటెండ్ అయ్యాక మరొక గంట ఆఫీస్ టైం అయిపోవడానికి టైం ఉండడంతో తన ఛాంబర్ లో కూర్చున్న అతని దగ్గరికి మేనేజర్ రావడంతో “వాట్ ఈజ్ ఇట్?” అనగానే “సార్!!! మన కంపెనీ నుంచి ఎవరో కొత్తగా వచ్చే ఎంప్లాయిస్ కి హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది” అన్నాడు మేనేజర్…

 

“వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే” అని విరాట్ అడగడంతో “ఐ మీన్… పెద్దగా స్కిల్స్ లేని ఎంప్లాయిస్ ని ముందు పెద్దగా స్కిల్స్ అవసరంలేని జాబ్ లో పెట్టి ఆ తర్వాత వాళ్ళకి స్కిల్స్ నేర్పించడానికి స్కోప్ ఇచ్చి ఆ తర్వాత పెద్ద పోజిషన్స్ కి రెకమెండ్ చేస్తున్నట్టుగా తెలిసింది బట్ అది ఎవరో ఏంటో తెలియడం లేదు” అన్నాడు….

 

“ఒక రకంగా ఇది అవతల వాళ్ళకి సహాయం చేయడమే అయినా కూడా మేనేజ్మెంట్ దృష్టికి రాకుండా సీక్రెట్ గా ఇలాంటివి చేయడం కార్పొరేట్ రూల్స్ ని బ్రేక్ చేయడం లాంటిదే కాబట్టి అది ఎవరో ఏంటో కనుక్కోండి” అని చెప్పడంతో “అదే పని మీద ఉన్నాం సార్” అని చెప్పాడు మేనేజర్…

 

“హెల్ప్ చేసిన వాళ్ళు హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు శిక్షార్హులే” అనగానే “ఓకే సర్” అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతే విరాట్ మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసరికి కార్తీక్ వెయిట్ చేస్తూ ఉండడంతో “ఏంట్రా?” అన్నాడు విరాట్….

 

“మన శిరీష్ గాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంట… బ్యాచిలర్ పార్టీకి ఇన్వైట్ చేశాడు… వస్తావా?” అన్నాడు కార్తీక్…

 

“ఎందుకు అక్కడికి వెళ్లి పీతలాగా పిపాలు పీపాలు తాగడానికా?” అనగానే “అరే ఏదైనా ఫంక్షన్ కి పెళ్లిళ్లకు బిజినెస్ పార్టీలకి ఇలా బ్యాచిలర్ పార్టీస్ కి వెళ్ళినప్పుడే కదా ఫ్రీ మందు దొరికేది…. వెళ్దాం మామ” అన్నాడు….

 

“తాగి ఇంటికి వచ్చావని తెలిస్తే మావయ్య డాడీ ఉతికి ఆరేస్తారు” అనగానే “కనపడేలా ఎందుకు వస్తాం…. వాళ్ళు పడుకున్న తర్వాత వస్తాం…” అన్నాడు…

 

“అంత సీన్ లేదు డిన్నర్ టేబుల్ మీద అందరం కనిపించకపోతే కచ్చితంగా డాడీకి మామయ్యకి డౌట్ వస్తుంది” అన్నాడు….

 

“వాళ్ళు గుర్తు చేసుకోకపోతే నువ్వు ఫీల్ అయ్యేలా ఉన్నావ్ కదరా” అన్నాడు కార్తీక్ తల పట్టుకుని….

 

కంటిన్యూస్!!!