పరవశం – 1
“డీజే టిల్లు పేరు
వీని స్టయిలే వేరు
సోకేమో హీరో తీరు
కొట్టేది తీనుమారు…
డీజే టిల్లు కొట్టు కొట్టు
డీజే టిల్లు కొట్టు
బేసు జర పెంచి కొట్టు
బాక్సులు పలిగేటట్టు…
డీజే టిల్లు పేరు
వీని సౌండే వేరు
కట్ జేసి కొట్టిండంటే
దద్దరిల్లు డాన్సు ఫ్లోరు…”
అన్నా సాంగ్ తో ఫోన్ రింగ్ అవుతుంటే.. “అబ్బా పొద్దున్నే ఎవడ్రా..” అని అనుకుంటూ నిద్రమత్తులోనే కాల్ లిఫ్ట్ చేస్తాడు విజయ్.. అలియాస్ విజ్జు..
“ఎవడ్రా నువ్వు? పనీపాట లేదా నీకు పొద్దున్నే కాల్ చేశావ్..” అని అంటాడు విజ్జు కోపంగా..
“ఎక్కడ ఉన్నావ్..” అన్న వాయిస్ వినిపించగానే విజ్జు దెబ్బకి బెడ్ పైనుంచి లేచి కూర్చుంటాడు..
“బా.. బా.. బావ..” అని కొంచెం భయం భయంగా అంటాడు..
“ఇంకొక 30 మినిట్స్ లో నువ్వు ఆఫీసులో లేకపోతే.. ఆ తర్వాత ఈ భూమి మీద ఉండవు,” అని కోపంగా వినిపిస్తుంది అటువైపు నుంచి..
“లే.. లేదు బావ నేను వచ్చేస్తాను..” అని చెప్పి విజ్జు లేచి ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ వైపు కార్ స్టార్ట్ చేస్తాడు..
అనుకున్నట్లుగానే 30 మినిట్స్ లో ఆఫీస్ లో ఉంటాడు విజ్జు..
ఫాస్ట్ గా వాళ్ళ బావ ఛాంబర్ కి వెళ్ళీ, “నువ్వు ఎప్పుడు వచ్చావు బావ?” అని అడుగుతాడు విజ్జు..
“మార్నింగ్ వచ్చాను, కానీ నువ్వేంటి ఆఫీస్ టైమ్ అయినా కూడా ఇంకా ఆఫీస్ కి రాలేదు?” అని అడుగుతాడు ఆ వ్యక్తి..
“అది.. బావ నిన్న న్యూ ప్రాజెక్ట్ క్లయింట్స్ వచ్చారు కదా! వాళ్ళతో మీటింగ్ కొంచెం లేట్ అయ్యింది.. అందుకే మార్నింగ్ మెలుకువ రాలేదు,” అని కొంచెం భయపడుతూ చెప్తాడు విజ్జు..
“సరే.. సరే.. ఇప్పటికి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైమ్ ఇలా ఆఫీస్ కి లేట్ గా వస్తే అస్సలు ఊరుకోను..” అని సీరియస్ గా చెప్పి, విజ్జు ముందు ఒక ఫైల్ ఇస్తాడు..
అది తీసుకుని చూస్తూ, “ఏంటిది బావ?” అని అడుగుతాడు..
“న్యూ డిజైన్స్.. వాటిని త్వరగా రెడీ చేయించు.. అలాగే వాటికి ఎప్పుడూ ఉండే మోడల్స్ కాకుండా న్యూ మోడల్ తో షూట్ తియ్యండి,” అని అంటాడు ఆ వ్యక్తి..
“బావ, డ్రెస్ డిజైన్ అంటే ఒకే కానీ న్యూ మోడల్ అంటే కొంచెం కష్టం అనుకుంట.. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎవ్వరు కొత్తవాళ్ళు లేరు..” అని అంటాడు విజ్జు..
“లేకపోతే.. కొత్త మోడల్స్ ని వెతికే పనిలో ఉండండి.. అలాగే ఈ వర్క్ అంతా కూడా 2 వీక్స్ లో జరిగిపోవాలి,” అని అంటాడు ఆ వ్యక్తి..
“బావ..” అని విజ్జు అంటుంటే..
“ఎనీ డౌట్స్…?” అని సీరియస్ గా అంటాడు విక్రమ్..
“లేదు.. లేదు..” అని తల అడ్డంగా ఊపి, ఆ ఫైల్ పట్టుకుని బయటకి వస్తాడు విజ్జు..
విజ్జు బయటకి వచ్చిన వెంటనే విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది…
స్క్రీన్ మీద ఉన్న నంబర్ ఒకసారి చూసి లిఫ్ట్ చేస్తాడు..
“నాన్న విక్రమ్, ఊరు నుంచి వచ్చావంటగా ఒకసారి ఇంటికి రా.. నాన్న..” అని అటువైపు నుంచి విక్రమ్ వాళ్ళ నానమ్మ గారు అడుగుతారు..
“సరే నానీ.. ఈవెనింగ్ వస్తాను..” అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.. తరువాత తన వర్క్ లో పడిపోతాడు..
బయటకి వచ్చిన విజ్జు తన ఛాంబర్ కి వెళ్ళీ తన కుర్చీలో కూర్చుని, ‘ఇప్పటికిప్పుడు న్యూ మోడల్ అంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి?’ అని అనుకుంటాడు.. వెంటనే కంపెనీ వెబ్‌సైట్ లో న్యూ మోడల్ గురించి ఇంటర్వ్యూ పెడతాడు..
తరువాత ఆ వర్క్ అంతా కూడా టీమ్ మెంబెర్స్ కి ఇచ్చి, ఇంకా విక్రమ్ ఇచ్చిన డిజైన్స్ రెడీ చేయించే పనిలో పడతాడు..
అదే సమయంలో ఒక పార్క్ దగ్గర ఒక నలుగురు అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు..
అందులో ఒక అమ్మాయి విజ్జు పెట్టిన పోస్ట్ చూసి, “హేయ్ రాజీ చూడవే.. వీకేఆర్ డిజైన్స్ కంపెనీలో న్యూ మోడల్స్ కావాలంట, దానికి ఇంటర్వ్యూ పెట్టారు..” అని అంటుంది..
“అవును.. సుజ్జీ అయితే నేను ట్రై చేస్తానే,” అని అంటుంది రాజీ..
“ఏంటేంటి, ఇంకోసారి ఆ మాట అనవమ్మా.. ఇది ఏమైనా ఫుడ్ కాంపిటీషన్ అని అనుకున్నావా.. మోడల్ కాంపిటీషన్..” అని నవ్వుతూ అంటుంది దీపిక..
“హలో మేడమ్.. నేను ఎంత తిన్నా కూడా చాలా సన్నగా స్లిమ్ గా ఉంటాను, ఆ విషయం మర్చిపోయారా..” అని అంటుంది రాజీ, కళ్ళు ఎగరేసి ఇద్దరి వైపు చూస్తూ..
“హ్మ్.. అదే కదా నీకు ప్లస్ పాయింట్.. మేము చూడు ఏమి తినకుండానే ఇలా ఉంటాము.. సర్లే, ఇప్పుడు మా గురించి ఎందుకు కానీ నీకు మోడల్స్ ఎలా ఉంటారో తెలియదు కదా! ఎలా ట్రై చేస్తావు?” అని అడుగుతుంది సుజ్జీ..
“అబ్బో.. అదేదో పెద్ద విషయం అనుకుంటున్నావా, నెట్ లో కొడితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది,” అని అంటుంది రాజీ..
“హ్మ్.. అవును అది నిజమే, అయితే మనం నలుగురం ట్రై చేద్దామా?” అని అంటుంది దీపిక..
అప్పటివరకు సైలెంట్ గా ఉన్న నాలుగో అమ్మాయి, “హేయ్, మీ ముగ్గురు ఇలాంటివి ట్రై చేస్తే చేయండి, మధ్యలో నన్ను మాత్రం లాగకండి.. నాకు ఇలాంటివి నచ్చవు..” అని అంటుంది..
“హేయ్ మేఘ.. జస్ట్ ట్రై చేద్దాం అని అంటున్నా, అయినా అక్కడ మనకి వచ్చేస్తుందా ఏంటి? ఏదో అక్కడికి వెళ్తే విక్రమ్ ని చూడవచ్చు అని.. తెలుసా, అస్సలు ఇప్పటివరకు విక్రమ్ ఎలా ఉంటాడో ఎవ్వరికి సరిగ్గా తెలియదంట.. ఆఫీస్ లో కూడా మాస్క్ వేసుకుని ఉంటాడంట..” అని అంటుంది దీపు..
“అలాంటప్పుడు ఎలా చూస్తావే?” అని అంటుంది సుజ్జీ..
“ఎలాగో ట్రై చేద్దాం.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అండ్ నంబర్ వన్ బిజినెస్ మ్యాన్, ఇటు ఫ్యాషన్ డిజైన్ మాత్రమే కాకుండా అటు వాళ్ళ ఫాదర్ కంపెనీ కూడా చూసేది విక్రమ్ అని అంటారు.. అలాంటి వ్యక్తిని చూడాలని ఉంటుంది కదా!” అని దీపు అనగానే..
“అయితే మీరు ట్రై చేయండి.. మధ్యలో నన్ను లాగకండి.. ఇంకా నేను వెళ్తున్నా, బాయ్! డాడీ వచ్చే టైమ్ అయ్యింది,” అని అంటుంది మేఘ తన స్కూటీ దగ్గరికి వెళ్తూ..
“ఇదొకటి.. ఇది రాదు, మనల్ని వెళ్లనివ్వదు..” అని అంటుంది రాజీ..
“దాని గురించి తెలుసు కదా! మనం ట్రై చేద్దాం,” అని అంటుంది సుజ్జీ..
“ఓకే,” అని ముగ్గురు అనుకుంటూ ఎవరి స్కూటీ మీద వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు..
ఇంకా ఉంది…
Swipe left/right or tap the sides to turn pages