పరవశం – 2
ఇంటికి వెళ్ళిన మేఘ స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్తుంది..
అది ఒక అందమైన చిన్న ఇల్లు.. చుట్టూ గార్డెన్.. మధ్యలో లోపలికి వెళ్ళటానికి దారి చూడటానికే చాలా బాగుంటుంది..
మేఘ వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. తన తండ్రి సురేష్, తల్లి రోజీ ఇద్దరి గారాల పట్టి మేఘన..
”అమ్మా! నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.. కొంచెం కాఫీ పెట్టవా..” అని అంటూ ఇంట్లోకి వస్తున్న మేఘకి, అక్కడ సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది..
వెంటనే ఫాస్ట్ గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళీ, “అత్తా!” అంటూ ఆవిడ పక్కన సెటిల్ అయిపోతుంది..
”వావ్.. అత్తా వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వేంటి ఉరుము లేని పిడుగులా ఇలా వచ్చావు? నువ్వు వచ్చావంటే ఏదో కారణం ఉంటుందిలే.. నాకు తెలుసు, కానీ ఏంటి విషయం?” అని అడుగుతుంది మేఘ.. ఆవిడ బుగ్గలు పట్టుకుని లాగుతూ..
”అంటే ఏంటే.. నేను ఏదైనా పని ఉంటేనే ఇక్కడికి వస్తానా? లేకపోతే రాను అనే కదా నువ్వు అంటుంది!” అని అంటుంది భవానీ..
”అబ్బబ్బా అత్తా.. నేను ఏమి చెప్పకపోయినా కూడా నువ్వు మాత్రం నిజాలు భలే ఒప్పేసుకుంటావు.. అందుకే నాకు నువ్వంటే చాలా ఇష్టం!” అని అంటుంది మేఘ నవ్వుతూ..
”అంటే నువ్వు నన్ను అలాగే అన్నావు అనే కదా! సర్లే నేను వెళ్తున్నా.. ఏదో నా కోడలిని చూసి చాలా రోజులు అయ్యింది, చూద్దాం అని వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు..” అని మూతి తిప్పుతూ అంటుంది భవానీ..
”అబ్బో అత్తా, ఇప్పుడు నువ్వు అలగకు.. బుజ్జగించటం నా వల్ల కాదు.. హ్మ్ చెప్పటం మర్చిపోయా, అత్తా నీ చేతి మిరపకాయ బజ్జీ వేయవా నా కోసం..” అని అంటుంది మేఘ..
”సరే.. వేస్తాను.. మరి నాకేంటి?” అని అడుగుతుంది ఆవిడ నవ్వుతూ..
”నీకా.. హ్మ్..” అని ఆలోచిస్తూ బుగ్గన ముద్దు పెట్టి, “ఇది నా తరఫున గిఫ్ట్!” అని అంటుంది నవ్వుతూ మేఘ..
”అల్లరి పిల్ల..” అని మేఘ బుగ్గలు లాగి, “సరే, నువ్వు వెళ్ళీ ఫ్రెష్ అయ్యి రా.. ఈలోపు నేను వెళ్ళీ బజ్జీ వేస్తాను,” అని అంటారు..
”థాంక్యూ అత్తా!” అని చెప్పి ఫాస్ట్ గా తన రూమ్ వైపు వెళ్తుంది మేఘన..
వెళ్తున్న మేఘని చూసి చిన్నగా నవ్వుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళీ,
“వదిన, నా బంగారు తల్లి బజ్జీ అడిగింది..” అని అంటారు ఆవిడ..
”నాకు తెలుసు భవానీ, అది వస్తే నిన్ను కచ్చితంగా వేయమని అడుగుతుందని.. అందుకే అన్నీ అక్కడ సిద్ధం చేశాను,” అని అక్కడ బజ్జీకి కావాల్సినవన్నీ పెట్టినవి చూపిస్తారు మేఘ వాళ్ళ అమ్మ రోజీ గారు..
”థాంక్యూ వదిన,” అని చెప్పి ఆవిడ బజ్జీ వేయటం స్టార్ట్ చేస్తారు..
అది చూసి రోజీ గారు చిన్నగా నవ్వుకుంటారు..
రూమ్‌కి వెళ్ళిన మేఘ ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి, తన గది పక్కనే ఉన్న తన స్టడీ రూమ్‌కి వెళ్తుంది..
అక్కడ రకరకాల బుక్స్.. ఎలా అంటే లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ అక్కడే ఉన్నాయా అన్నట్లు ఉంటాయి..మేఘకి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం.. ఎక్కువ బుక్స్ చదువుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది.. అలాగే అక్కడక్కడ కొన్ని చేతితో వేసిన స్కెచెస్ కూడా ఉన్నాయి..
అవి కూడా మేఘన వేసినవే.. చాలా అందంగా ఉన్నాయి.. ఆ స్కెచెస్ అన్నిటిలో కూడా ఒక స్పెషల్ స్కెచ్ ఉంటుంది..
ఆ స్కెచ్ దగ్గరకు వెళ్ళిన మేఘ ఆ స్కెచ్ మీద చెయ్యి వేసి తడుముతూ..
”హాయ్ సర్! ఎలా ఉన్నారు? హహ్హ.. మార్నింగ్ అడిగింది మళ్ళీ అడుగుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? అదేంటో.. మిమ్మల్ని నేను ఆ పరిస్థితిలో చూసిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ మీరు ఎలా ఉన్నారు అనే ఆలోచనలే వస్తాయి..
అందుకే ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా ముందు నేను ఈ ప్రశ్న అడుగుతాను.. ఎందుకంటే ఇప్పటివరకు నేను మిమ్మల్ని మళ్ళీ కలవలేదు కదా! కలుస్తాను అన్న ఆశ కూడా లేదు..
కానీ ఏదో చిన్న ఆశ.. నేను మిమ్మల్ని కలిసి నా మనసులోని మాట మీకు చెప్పాలని.. హ్మ్ సర్లే, జరగని వాటి గురించి ఆలోచించటం వేస్ట్ కానీ.. ఏమి చేస్తున్నారు సర్? అసలు మీకు నేను గుర్తు ఉన్నానా? మీకు నేను గుర్తు లేకపోయినా మీరు మాత్రం నాకు అనుక్షణం గుర్తుకు వస్తూనే ఉంటారు.. అంతగా నా అణువణువూ నిండిపోయారు.. హా.. సర్, మీకు చెప్పటం మర్చిపోయాను.. ఈ రోజు మా ఫ్రెండ్స్ వీకేఆర్ కంపెనీ గురించి మాట్లాడారు.. ఏమనో తెలుసా.. ఆ కంపెనీలో న్యూ మోడల్ కావాలంట..
నిజం చెప్పనా.. వాళ్ళు అలా చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది.. ఆశ్చర్యం ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకో వాళ్ళు అలా చెప్పగానే నాకు అందులో పార్టిసిపేట్ చేయాలి అనిపించింది..
కానీ ఇలాంటివి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా! అందుకే నేను పట్టించుకోలేదు..” అని ఇంకా మాట్లాడుతూ ఉండగా…
బయట నుంచి వాళ్ళ అమ్మ మాటలు వినిపించి, “హా.. వస్తున్నానమ్మా..” అని చెప్పి మళ్ళీ ఆ స్కెచ్ వైపు చూస్తూ..
”అమ్మ పిలుస్తుంది.. మళ్ళీ వస్తాను, బాయ్!” అని ఆ ఫోటోకి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
బయటకి వచ్చి స్టడీ రూమ్ డోర్ వేసి కిందకి వెళ్తుంది..
”ఏంటిమ్మా.. పిలిచావు?” అని అడుగుతుంది మేఘ..
మేఘ వైపు చూస్తూ, “మళ్ళీ ఆ ఫోటోతో మాటల్లో
మునిగిపోయావా?” అని కొంచెం సీరియస్ గా అడుగుతారు..
మేఘన చిన్నగా నవ్వి, “తెలిసి కూడా అడగటం ఎందుకు?” అని అంటూ ఆవిడ బుగ్గలు లాగుతుంది..
”అబ్బా.. ఇదేం అలవాటే బాబు! నీకు, మీ నాన్నకి ఈ బుగ్గలు లాగటం అలవాటు ఏంటో..” అని అంటూ, “అత్త పిలుస్తుంది, వెళ్ళు..” అని అంటారు..
”సరే..” అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది మేఘ..
వెళ్తున్న మేఘన వైపు చూస్తూ ఒక చిన్న నిట్టూర్పు విడుస్తారు రోజీ గారు..
***
”రేయ్ బావ.. నువ్వు చెప్పిన పని మొత్తం చేశారు.. అలాగే మోడల్స్ కోసం ఇంటర్వ్యూ పెట్టాను,” అని అంటాడు విజ్జు, విక్రమ్ క్యాబిన్ లోకి వచ్చి..
”వాట్? మోడల్ కోసం ఇంటర్వ్యూనా.. ఇదేమైనా జాబ్ ఇంటర్వ్యూ అనుకున్నావా?” అని అంటాడు విక్రమ్ సీరియస్ గా..
”అబ్బా బావ, ఎందుకు అంత సీరియస్ అవుతావు! ఇప్పటికిప్పుడు న్యూ మోడల్ అంటే కష్టం.. అందుకే ఇంటర్వ్యూ పెట్టాను.. వాళ్ళల్లో టాలెంట్ ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసి మన డిజైన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేవాళ్ళని చూడవచ్చు,” అని అంటాడు..
”ఏదో ఒకటి చెయ్యి, కానీ తేడా వచ్చిందో.. నా చేతిలో చస్తావు జాగ్రత్త!” అంటాడు విక్రమ్..
”సర్లే, ఏమి తేడా రాకుండా చూస్తానులే,” అంటాడు విజ్జు..
”సరే, నీ వర్క్ అయ్యిందా?” అని అడుగుతాడు విక్రమ్..
”హా.. బావ,” అని అంటాడు విజ్జు..
”సరే, వెళ్ళీ కార్ తియ్యి వస్తున్నా.. నానమ్మ కాల్ చేసింది,” అని అంటాడు..
”సరే..” అని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్తాడు విజ్జు..
విజ్జు వెళ్ళిన 5 మినిట్స్ కి తన వర్క్ ఫినిష్ చేసి కిందకి వెళ్దాం అని లేచిన విక్రమ్ కి ఎందుకో ఒక్కసారిగా గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది..
గుండె మీద చెయ్యి వేసుకుని అలాగే చైర్ లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్..
కొంచెం సమయం తరువాత అంతా నార్మల్ అవ్వటంతో, అది అంతా తనకి నార్మల్ అన్నట్లు.. తన దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుని వేసుకుని అక్కడి నుంచి కిందకి వెళ్తాడు..
విక్రమ్ వచ్చి కార్ లో కూర్చోగానే.. విజ్జు కార్ ని స్టార్ట్ చేసి విక్రమ్ మ్యాన్షన్ వైపు వెళ్తాడు..
ఇంకా ఉంది…
Swipe left/right or tap the sides to turn pages