New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరవశం – 3
పరవశం 4 min read

పరవశం – 3

విక్రమ్, విజ్జు ఇద్దరు కూడా విక్రమ్ వాళ్ళ నానమ్మ దగ్గరకు బయలుదేరారు..

 

​కార్ లో కూర్చున్న విక్రమ్, విజ్జు వైపు చూస్తూ, “ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆమె గురించి ఏమైనా తెలిసిందా?” అని అడుగుతాడు..

 

​”లేదు బావ.. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి ఆచూకీ తెలియలేదు.. ఇంకా నువ్వు ఇచ్చిన చైన్ మోడల్ ద్వారా తెలుసుకుందాం అని కూడా ట్రై చేశాను.. కానీ అది చాలా పాతకాలం నాటి చైన్ అంట.. దాని గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియలేదు,” అని అంటాడు విజ్జు..

 

​ఆ మాటలు విన్న విక్రమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు..

 

​అలా కొంత సమయం తరువాత మళ్ళీ మాట్లాడుతూ, “ఇంట్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?” అని అడుగుతాడు.. అలాగే కళ్ళు మూసుకుని ఉండి..

 

​ఆ మాటకి విజ్జు వెంటనే కంగారుగా, “నాకు తెలియదు బావ!” అని అంటాడు..

 

​”మరి నేను ఇండియా వచ్చినట్లు నానమ్మకి ఎలా తెలిసింది?” అని అడుగుతాడు సీరియస్ గా విజ్జు వైపు చూస్తూ..

 

​”అది.. అది.. మార్నింగ్ నువ్వు కాల్ చేసిన తరువాత నానమ్మ నార్మల్ గా కాల్ చేసింది.. అప్పుడు నీ గురించి చెప్పాను.. అలా తెలిసింది,” అని అంటాడు విజ్జు కొంచెం భయం భయంగా విక్రమ్ వైపు చూస్తూ..

 

​ఆ మాటకి విక్రమ్, విజ్జు వైపు ఒకసారి చూసి మళ్ళీ సీట్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకుంటాడు..

 

​విజ్జు, విక్రమ్ వైపు చూస్తూ, ‘బాబోయ్ సింహం ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది.. ఈ సైలెన్స్ ఏ ప్రళయానికి దారి తీస్తుందో! అసలే అక్కడ నానమ్మ ఏదోదో ప్లాన్స్ వేస్తుంది.. ఏ ప్లాన్ చేసినా కానీ ఏ ప్రళయంలో నేను ఉండకుండా ముందే జారుకోవటం మంచిది,’ అని అనుకుంటూ సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ రాథోడ్ మ్యాన్షన్ లోపలికి వెళ్తాడు..

 

​కార్ గేట్ లోకి ప్రవేశించగానే అప్పటివరకు కళ్ళు మూసుకుని ఉన్న విక్రమ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి కార్ విండో గ్లాస్ కిందకి దించుతాడు..

 

​అలా లోపలికి వెళ్తుంటే తన ఫేస్ పై చల్లటి గాలి వీస్తుంటే విక్రమ్ ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఆ ఫీలింగ్ ని హ్యాపీగా ఫీల్ అవుతాడు..

 

​అది గమనించిన విజ్జు వెంటనే కార్ ని అక్కడే ఆపేస్తాడు.. అది గమనించిన విక్రమ్ చిన్నగా నవ్వుతూ కార్ దిగుతాడు..

 

​అలా దిగగానే ఒక చల్లటి స్పర్శ తనని తాకి వెళ్ళినట్లు విక్రమ్ కి అనిపించింది.. అలా అనిపించిన వెంటనే విక్రమ్ మనసులో, ‘మిస్ యూ సో మచ్ అమ్మ…’ అని అనుకుంటూ ముందుకు వెళ్తాడు..

​అలా కొంత దూరం వెళ్ళిన విక్రమ్ డైరెక్ట్ గా అక్కడే ఉన్న ఒక జామ చెట్టు దగ్గరికి వెళ్తాడు..

 

​చుట్టూ ఎన్నో రకాల పూల మొక్కలు, ఇంకా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నా కూడా విక్రమ్ మాత్రం ఎప్పుడు మ్యాన్షన్ లోపలికి రాగానే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళటం విక్రమ్ అలవాటు..

 

​అలా కొంచెం సేపు అక్కడే గడిపి ఆ చెట్టుకి ఉన్న ఒక కాయ కోసుకుని, అక్కడే ఉన్న వాటర్ పైప్ లో కడిగి కాయ తినుకుంటూ లోపలికి వెళ్తాడు..

 

​అది విక్రమ్ కి ఉన్న అలవాటు.. ఆ చెట్టుని విక్రమ్ తప్ప ఎవ్వరు ముట్టుకున్నా అతను ఊరుకోడు..

 

​డైలీ ఆ మొక్కకి నీళ్ళు పోసి చుట్టూ శుభ్రం కూడా తానే చేస్తాడు.. ఎప్పుడైనా తను లేకపోతే విక్రమ్ నాన్నగారైన సూర్య గారు చేస్తారు..

 

​ఎందుకంటే ఆ చెట్టు విక్రమ్ వాళ్ళ అమ్మగారైన సులోచన గారు.. ఆవిడ బ్రతికి ఉండగా ఎంతో ప్రేమగా నాటిన చెట్టు, అందుకే! అది అంటే విక్రమ్ కి అయినా, ఇంట్లో ఉన్న అందరికి కూడా చాలా ఇష్టం..

 

​విక్రమ్ ఎక్కువగా ఆ చెట్టు దగ్గరే టైమ్ స్పెండ్ చేస్తాడు.. ఎందుకంటే తనకి అక్కడ ఉంటే వాళ్ళ అమ్మతో ఉన్నట్లు అనిపిస్తుంది.. అందుకే అక్కడే ఒక బెంచ్ ఉంటుంది, దాని మీద కూర్చుని టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు..

 

​లోపలికి వెళ్ళిన విక్రమ్ డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు..

​ముందుగా ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని తన పర్సనల్ రూమ్ కి వెళ్తాడు..

 

​లోపలికి వెళ్ళిన విక్రమ్ లైట్స్ ఆన్ చేయగానే ఆ గదిలో చాలా వరకు విక్రమ్, సులోచన గారి పిక్స్ ఉంటాయి..

​ఆ ఫోటోస్ లో ఉన్న సులోచన గారి ఫోటో మీద చెయ్యి వేసి, “మిస్ యూ సో మచ్ అమ్మ.. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నా..” అని అంటూ..

 

​”సారీ మా, నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టలేకపోతున్నా.. ఎంతగా ప్రయత్నం చేసినా కూడా ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోతున్నా.. కానీ ఎప్పటికి అయినా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను,” అని అనుకుంటూ అలాగే అక్కడ కొంత సమయం టైమ్ స్పెండ్ చేస్తాడు..

 

​అలా అన్ని ఫోటోస్ చూస్తున్న విక్రమ్ చూపు ఆ ఫోటోస్ మధ్యలో ఉన్న ఒక ఫోటో మీద పడుతుంది..

 

​ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తాడు.. ఆ ఫోటో ఎలా ఉందంటే ఫేస్ మొత్తం కవర్ చేసి కేవలం కళ్ళు మాత్రమే కనిపించేటట్లు డ్రా చేశారు..

 

​కానీ ఆ కళ్ళు చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి.. చూసేకొద్దీ చూడాలి అనిపించే కళ్ళు.. విక్రమ్ ఆ కళ్ళ వైపు అలాగే చూస్తూ..

 

​”ఎక్కడ ఉన్నావు.. నీ కోసం ఇక్కడ రెండు ప్రాణాలు కొట్టుకుంటున్నాయి తెలుసా.. నువ్వు నాకు కనిపించటం ఆలస్యం చేసే కొద్దీ నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది..

​మా అమ్మ కోరిక ఇంకా బలపడుతుంది గుర్తు పెట్టుకో.. అలాగే నువ్వు కనిపించిన మరుక్షణం నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చేస్తాను,” అని అనుకుంటూ అక్కడే కొంచెం సేపు ఉండి.. ఇంకా రూమ్ నుంచి బయటకు వస్తాడు..

 

​అప్పటివరకు నార్మల్ గా ఉన్న విక్రమ్ ఫేస్ మెట్ల దగ్గరికి రాగానే సీరియస్ గా మారిపోతుంది.. కోపంగా “నానమ్మా!” అని గట్టిగా అరుస్తాడు..

 

 

​ఇంకా ఉంది…