New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రతి జన్మ నీతోనే 🦚 – 1

ప్రతి జన్మ నీతోనే 🦚 – 1

హైదారాబాద్ ఉదయం ఏడు గంటలు ఒక చిన్న ఇంట్లో బుల్లి కిచెన్ లో కుక్కర్ విజిల్ మోగుతూనే ఉంది….

 

అదే ఇంటి బెడ్ రూమ్ లో ఆగకుండా అలారం కూడా మోగుతూనే ఉంది….

 

కిచెన్ లో టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ కడుతూ రుచి…. ఇంకా లేవలేదా… టైం అవుతుంది అని తన పదేళ్ల కూతురిని నిద్ర లేపుతుంది మహా.

 

గదిలో నుండి ఫ్యాన్ సౌండ్ అలారం సౌండ్ తప్ప ఇంకేం వినబడకపోవడంతో చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ

 

ఈ పిల్లకి రోజు ఇదే అలవాటు అయిపోయింది…. ఏడు దాటే వరకు లేవదు తర్వత స్కూల్ కి టైం అవుతుంది అంటూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతుంది అంటూ రూమ్ లోకి వెళ్తుంది మహా.

 

ఆ చిన్న గదిలో ఒక బెడ్ పక్కనే టేబుల్ మీద ఒక ఫుట్బాల్ ఆ రూమ్ నిండా టెడ్డి బేర్స్ ఫుట్బాల్స్ మెడల్స్ గోడకు ఫుట్బాల్ గేమ్ కి సంబంధించిన పోస్టర్స్ తల్లి కూతుళ్ళ ఫోటో ఫ్రేమ్స్

 

దుప్పటి ముసుగు వేసుకొని అంతపెద్ద అలారం సౌండ్ లో కూడా ప్రశాంతంగా పడుకున్న కూతురిని చూసి దీనికి ఇంత సౌండ్ లో ఎలా నిద్ర పడుతుంది అనుకోని రుచి టైం అవుతుంది లే అని దుప్పటి లాగింది.

 

రుచి మళ్ళీ ముసుగు పెట్టి మమ్మీ ప్లీజ్… ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంటాను అంది.

 

నో వే టైమ్ ఇప్పటికే ఏడు అయింది… ఈ రోజు నీకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది మర్చిపోయావా అంది మహా.

 

“అయ్యో… మ్యాచ్!” అంటూ ఒక్కసారిగా దుప్పటి మొత్తం పక్కకి విసిరేసి బెడ్ మీద నుంచి లేచింది రుచి.

 

అలా రుచి లేవగానే బెడ్ మీద ఉన్న ఇంకో బాల్ కింద పడిపోవడంతో అయ్యో నా బాయ్ అంటూ బాల్ ను తీస్కొని కిస్ చేసి టేబుల్ మీద పెట్టింది.

 

నీ బాల్ మీద ఉన్న లవ్ మీ యూనిఫాం మీద ఉంటే చాలా బాగుటుంది అని అక్కడే కింద పడిన యూనిఫాం తీసి పక్కన పెట్టింది మహా.

 

మమ్మీ… అని బుగ్గలు నొక్కుకుంటూ తన బట్టలు తీస్కొని వాష్రూమ్ లోకి వెళ్ళింది రుచి.

 

వెళ్తున్న కూతురిని చూసి చిన్నగా నవ్వుకొని బయటికి వచ్చి టిఫిన్ ప్లేట్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది మహా.

 

అదే సమయంలో బెంగళూరు

 

రేయ్ యష్ లేరా ఆఫీస్ కి టైం అవుతుంది… అని ఆగమరిచి నిద్ర పోతున్న ఫ్రెండ్ ని లేపుతాడు ఆర్య.

 

ఆఫీస్… ప్చ్ నాకు ఇప్పుడు మూడ్ లేదు నన్ను పడుకోనివ్వు అని మగతగా చెప్పాడు యష్.

 

అంకుల్ ఇప్పటికే పది సార్లు కాల్ చేశాడు…. రాత్రిళ్ళేమో ఆ మూడ్ లో ఉండడం

 

పగలేమో మూడ్ లేదు అనడం అమ్మాయి పక్కన ఉంటే తప్ప నీకు మూడ్ సెట్ అవ్వదు అనుకుంటా అని వెటకారంగా అన్నాడు ఆర్య.

 

అతని మాటలు విని పైకి లేచి పక్కన ఉన్న పిల్లో విసిరి నేనేం నాతో డేట్ కి రండి అని వాళ్ళని అడగను

 

నాకున్న అందానికి వాళ్ళే నా వెంట పడుతున్నారు… నీకు తెలుసు కదా నాది కైండ్ హార్ట్ అని ఎవరైనా అడిగితే నేను కాదనలేను అన్నాడు యష్.

 

హహ నువ్వొక మన్మధుడు మరి నీతో డేట్ చేయడానికి అందరూ నీ వెంట పడుతున్నారు అన్నాడు ఆర్య.

 

అది నువ్వు ఇప్పటికైనా ఒప్పుకున్నావ్… చాలా సంతోషంగా ఉంది అంటూ యష్ బెడ్ మీద నుంచి లేచి బాత్‌రూమ్ వైపు నడిచాడు

 

వెళ్తున్న యష్ వైపు చూసి రేయ్ ఆగు అసలు నువ్వు ఎప్పటికీ మారతావు

 

ఇలా ప్రతీ అమ్మాయి తో డేట్ కి వెళ్తుంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఎప్పుడూ పెళ్ళి చేసుకుంటావ్ అని అడిగాడు ఆర్య.

 

యష్ వెనక్కి తిరిగి ఏంటి పెళ్ళా…. అది కూడా నేను అని గట్టిగా నవ్వాడు.

 

హ నువ్వే నువ్వు కాక నేను మళ్ళీ పెళ్ళి చేసుకుంటే బాగోదు కదా… అన్నాడు ఆర్య.

 

యష్ ఆర్య వైపు ఒక లుక్ వేసి సీ… మిస్టర్ ఆర్య ఈ పెళ్ళి పిల్లలు మన వల్ల కాదు

 

ఒక అమ్మాయిని చూసామా… నచ్చిందా ఎంజాయ్ చేశామా నా వరకు తెలిసింది అంతే…. అన్నాడు యష్.

 

నువ్వు అలా అనుకుంటున్నావ్ నీతో తిరిగే అమ్మాయిలు కూడా అలానే అనుకోవాలని లేదు కదా వాళ్ళలో ఎవరో ఒకరికి నువ్వంటే ఇష్టముండే ఉంటుంది నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారేమో

 

నువ్వు అసలే బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ జయదేవ్ గారి కొడుకువి పైగా ఫుట్బాల్ ఛాంపియన్ వి అన్నాడు ఆర్య.

 

అది అసలు జరగదు బికాస్ నేను వాళ్ళకి హోప్స్ ఇవ్వను డోంట్ ఎక్స్పెక్ట్ మ్యారేజ్ ఫ్రం మీ…. అని వాళ్ళకి ముందే చెప్తాను ఇష్టమున్న వాళ్ళు వస్తారు ఇష్టం లేని వాళ్ళు పోతారు అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళాడు యష్.

 

ఆర్య నిట్టూర్చి వీడిని మార్చే అమ్మాయి ఎక్కడ ఉందో… ఐ హోప్ నువ్వు కూడా సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్తావు అనుకుంటున్న అనుకున్నాడు.

 

మరో వైపు మహా తన కూతురికి స్పీడ్ గా టిఫిన్ తినిపించి స్కూల్ కి రెడీ చేసి తన ఫుట్బాల్ జెర్సీ స్పోర్ట్స్ బ్యాగ్ కూడా రెడీ చేసి ఇంటికి తాళం వేసి రుచితో బయటికి నడిచింది.

 

రుచి తల్లి చేతిని పట్టుకొని నడుస్తూ మమ్మీ… ఈసారి మ్యాచ్ మా టీమ్ విన్ అవుతుంది

 

కోచ్ నన్ను కెప్టెన్ చేస్తాను అని కూడా చెప్పారు ఈ మ్యాచ్ విన్ ఐతే నేను స్టేట్ లెవెల్ కి కూడా సెలెక్ట్ అయిపోతాను నువ్వు ఫుట్బాల్ ఫీజ్ కట్టాలి గుర్తుందా అని అడిగింది.

 

కూతురు ఫీజ్ అడగగానే మహా మొఖం మాడిపోయింది కడతాను తల్లి నీ ఫీజ్ కట్టకుండా ఎలా ఉంటాను….

 

మూడు రోజుల్లో కట్టేసాను ట్యూషన్ ఫీజ్ కూడా కట్టేసాను ఈ మంత్ కొంచెం లేట్ అయింది అంతే అని చెప్పింది.

 

మమ్మీ నీ దగ్గర మనీ లేకపోతే నేను ఫుట్బాల్ ఆపేస్తాను…. నువ్వు ఇబ్బంది పడకు అంది రుచి.

 

చిన్న వయసులోనే తనని అర్ధం చేసుకున్న కూతురి వైపు సంతోషంగా చూస్తూ… అదేం లేదు బంగారం నాకు ఇబ్బందిగా ఎందుకు ఉంటుంది

 

డబ్బు గురించి నువ్వు ఆలోచించకు నేను చూసుకుంటాను అని చెప్పి బస్ ఎక్కించడానికి రోడ్ మీద నిల్చుంది మహా.

 

అదే ఏరియాలో ఉండే కొంత మంది ఆడవాళ్లు కూడా వాళ్ళ పిల్లల్ని బస్ ఎక్కించడానికి నిల్చుని మహా రుచి వైపు చూస్తూ ఇప్పుడు పిల్ల తల్లే కనిపిస్తుంది పిల్ల తండ్రి కనిపించట్లేదు ఏంటి మీనాక్షి అడిగింది అంజలి.

 

నీకు తెలీదా ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదు…. అని మహా వైపు చూసింది మీనాక్షి.

 

ఆ మాట విన్న మహా రుచిని వాళ్ళ వైపు నుంచి తన వైపు కి మార్చుకొని నిల్చుంది.

 

మూడేళ్ల నుంచి చూస్తున్న పిల్ల తల్లి ఒక్కరే కనిపిస్తుంటే తండ్రి విదేశాల్లో ఉంటున్నాడని అనుకున్న పిల్లకు తండ్రి గురించి తెలీదా కనీసం తల్లికైన ఆ పిల్ల తండ్రి ఎవరో తెలుసా… అని సాగదీసింది అంజలి.

 

వాళ్ళకి మహా ఏం సమాధానం చెప్పబోతుంది….?

 

ఇంకా ఉంది….

 

స్టోరీ నచ్చితే రేటింగ్ తో పాటు మీ అమూల్యమైన కామెంట్ ఇచ్చి ఫాలో అవ్వడం మర్చిపోకండి గాయ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సారీ….💗

 

హాయ్ బడ్డీస్ కథ వర్ణికలో ఇది నా మొదటి స్టోరీ చదివి ఎలా ఉందో చెప్పి రేటింగ్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్