శివ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలవుతోంది. రోజంతా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన కావ్యకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరించడం, మీటింగులు అటెండ్ అవ్వడంతో శివ బాగా అలసిపోయాడు. కార్ పార్కింగ్ చేసి, లిఫ్ట్ ఎక్కి తన ఫ్లాట్ ముందు నిలబడ్డాడు. ఉదయం కావ్య విషయంలో సాహిత్య ఎంతలా కుళ్ళుకుందో అతనికి గుర్తుంది.
“అబ్బా.. ఈరోజు రౌడీ మరదలు ఇంట్లో ఎలాంటి ప్లాన్ వేసిందో ఏంటో! కాస్త జాగ్రత్తగా ఉండాలి” అనుకుంటూ శివ డోర్ బెల్ కొట్టాడు.