హైదరాబాద్‌లోని శివ మల్టీనేషనల్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ అంతా చాలా సీరియస్‌గా ఉంది. యూఎస్ నుండి వచ్చిన పెద్ద క్లయింట్లు టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. శివ బ్లేజర్ వేసుకుని ప్రాజెక్ట్ హెడ్‌గా చాలా గంభీరంగా నిలబడగా, పక్కనే అసిస్టెంట్ మేనేజర్ కావ్య తన చేతిలోని ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తూ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
“శివ బావా! పెన్‌డ్రైవ్ ఇవ్వు, అందులోనే కదా క్లయింట్‌కి చూపించాల్సిన మెయిన్ ఆర్కిటెక్చర్ కోడింగ్ డేటా మొత్తం ఉంది” అంది కావ్య చాలా ఉత్సాహంగా.