New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 3

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 3

వినీల పేరెంట్స్ తనని, తన బాబు ని ఎంతో బాగా చూసుకునేవారు….అలా ఒక 3 నెలలు పుట్టింట్లో ఉండి తర్వాత విక్కీ దగ్గరకి వెళ్ళిపోతుంది.. 

 

ఇంటికి వచ్చిన వినీల ని., బాబు ని విక్కీ పేరెంట్స్ ఎంతో ప్రేమగా చూసేవారు…

 

విక్కీ అయితే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లెవరకూ బాబు తో ఆడి ఆఫీస్ టైమ్ అవుతుంది అనగా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి వెళ్ళేవాడు….

 

ఎందుకంత హడావిడి ఆఫీస్ మనదే కదా కాస్త ఆలస్యం అయితే ఏంటి అని తన పేరెంట్స్ అడిగితే ఆఫీస్ మనదే అయిన సరే మనమే టైం కి కరెక్ట్ గా వెళ్లకపోతే వర్కర్స్ ఎలా టైమ్ కి వస్తారు…

 

అందుకే నేను టైమ్ కి వెళ్ళాలి అని చెప్పి భార్య కి, బాబు కి బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్తుండేవాడు….

 

అలా ఇంకో సంవత్సరం గడిచింది…. విక్కీ బిజినెస్ మంచి పొజిషన్ లో ఉంది….అందుకే బెంగుళూరు లో  కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు…

 

అక్కడ అతని బిజినెస్ చాలా బాగా జరుగుతుండడంతో  అతని కంపనీ వర్క్ కోసం వినీల అండ్ బాబు ని తీస్కుని బెంగులూరు వెళ్లాలి అనుకుంటాడు…

 

తమతో పాటు తన పేరెంట్స్ ని కూడా రమ్మంటే వాళ్ళు ఉన్న ఇంటిని వదిలి రాలేము మీరు వెల్లేసి అప్పుడప్పుడు వచ్చిపోతు ఉండండి అని చెప్పి పంపుతారు…

 

విక్కీ, వినీల ఇద్దరు కూడా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టలేక ఓకే మ జాగ్రత్త.. మీకేం అవసరం  వున్నా మాకు కాల్ చేయడం మర్చిపోవద్దు  అని  ఎన్నో జాగ్రత్త లు చెప్పి బాబుతో కలిసి బెంగుళూర్ వెళ్ళిపోతారు….

 

అక్కడికి వెళ్ళాక  అన్ని సౌకర్యాలు ఉన్న మంచి ఇల్లు తీసుకుని విక్కీ, వినీల లూ బాబు తో సంతోషం గా జీవనం సాగిస్తూ ఉంటారు….బెంగుళూర్ లో విక్కీ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది….

 

విక్కీ కొంచెం వర్క్ లో బిజి అయిపోయాడు… కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాంచ్ కావడంతో వర్క్ ఎక్కువయి  అతను క్రమేపి వినీల తో టైమ్ స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది.. 

 

విక్కీ తనతో టైం స్పెండ్ చేయకపోయినా కూడా వినీల ఆఫీస్ లో బిజి లే అని విక్కీని అర్ధం చేస్కుని ఏమి అనేది కాదు…

 

విక్కీని బయటకు తీసుకెళ్లండి అని గాని, నాతో, బాబు తో టైమ్ స్పెండ్ చేయండి అని గాని ఎప్పుడు అడిగేది కాదు….గొడవ పడేది కాదు.. అర్థం చేసుకుని అన్నిటికీ సర్దుకుపోతూ ఉండేది…

 

విక్కీ అంత కష్టపడేది మాకోసమే కదా అని,,మా కోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడో మా బంగారం అని మనసులోనే విక్కీ ని మెచ్చుకునేది వినీల….

 

అలా కాలం గిర్రున తిరిగి మరో రెండేళ్లు గడిచిపోయాయి…..

 

ఒకరోజు విక్కీ పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి…

 

వాళ్ళు దగ్గర బంధువులు…సో రాకుంటే బాగుండదు కాబట్టి వీలుచేసుకుని వచ్చి పోండి అని చెప్తారు వినీల తో….

 

వినీల ఈవెనింగ్ ఇంటికి వచ్చిన విక్కీతో అత్త, మామలు చెప్పిన మాటల్ని వివరంగా చెప్తుంది….అప్పుడు విక్కీ అయ్యో విన్నీ నాకు న్యూ ప్రాజెక్ట్స్ వచ్చున్నాయి…..

 

నేను ప్రెసెంట్ చాలా బిజి రా.. ఆ ప్రాజెక్ట్స్ ఇన్ టైమ్ లో కంప్లిట్ చేయకుంటే మన కంపెనీ గుడ్ విల్ దెబ్బతింటుంది…..

 

అందుకే నేను రాలేను బుజ్జి..అమ్మ, నాన్న లకి నేను రాలేనని చెప్తాను గాని నువ్వు, బాబు వెళ్లాలనుకుంటే వెళ్లి రండి అని చెప్తాడు …..

 

భర్త మాటలు అన్నీ విన్న వినీల  భర్త  తోడు లేకుండా వెళ్లడం ఇష్టం లేకున్నా సరే, కంపెనీలో అతనికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్  వున్నాయి అనేసరికి ఇంకేం మాట్లాడలేక సరే మీ ఇష్టం ఒకసారి  మీరు అత్తమ్మ వాళ్ళతో మాట్లాడండి అని చెప్తుంది…

 

విక్కీ వినీల తన మాటలు విని ఒప్పుకున్నందుకు హ్యాపీగా వినీల ని హగ్ చేస్కుని థాంక్యూ విన్ని… థాంక్యూ సో మచ్ బుజ్జి…

 

నువ్వు నన్ను ఎప్పుడు చాలా బాగా అర్ధం చేస్కుంటావ్ ఆమ్ సో లక్కీ… నీలాంటి అందమైన, అర్ధం చేస్కునే భార్య దొరికినందుకు అంటాడు ఆమె బుగ్గ మీద ముద్దులు పెడుతూ…

 

విక్కీ మాటలకి, చేష్టలకి వినీల చిన్నగా నవ్వుతూనే హ్మ్ ఇవన్నీ మళ్ళీ చేద్దురుగాని ముందు కాల్ చేయండి అంటూ తన ఫోన్ తీసి విక్కీ పేరెంట్స్ కి కాల్ చేసి విక్కీకి ఇస్తుంది…

 

విక్కీ వినీల ని పట్టుకునే అమ్మ, నాన్నలకి తను చాలా బిజీ అని తను రాలేకపోతున్నాను ఏమి అనుకోవద్దు అని వినీల, బాబు ని పంపిస్తాను అని చెప్తాడు…

 

విక్కీ పేరెంట్స్ చేసేదేమి లేక హ్మ్ ఎప్పుడు నీకు నీ ఆఫీస్ గోలే ఇంకేం పట్టదు.. సరేలే కోడల్ని, మనవడిని అయిన ముందుగా పంపు నేను ఏదో ఒకటి చెప్తాలే వాళ్లకి అంటూ కాల్ కట్ చేస్తారు….

 

continued….