భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 2
ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు….
అలాంటిది ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడం, మెసేజ్ లూ చేస్కోవడం తప్ప కాలేజ్ లో చూసుకోవడం, మాట్లాడుకోవడం లేదు గా సో ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు….
అందుకే వీకెండ్స్ లో వినీల ఇంట్లో వాళ్ళతో ఏదో ఒక వంక చెప్పి బయటకి వచ్చి విక్కీ తో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండడం మొదలు పెట్టింది …
అలా డైలీ చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం సెలవు రోజుల్లో బయట కలవడం, సినిమాలు, షికార్లు చేస్తున్నారు….
అలా అలా ఒక సంవత్సరం గడిచిపోయింది….
వినీల b. Tech కూడా కంప్లిట్ అయిపొయింది…
ఈ ఒన్ ఇయర్ లో విక్కీ తన సొంతంగా చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు…..
కొద్ది నెలల్లోనే ఆ బిసినెస్ లో మంచిగా నిలదొక్కుకుంటాడు…. దాంతో ఒకరోజు విక్కీ వినీల మీట్ అయినపుడు ఎలాగూ నా చదువు పూర్తయింది.. నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యావ్ సో ఇంక మనం ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుని, వాళ్ళ లవ్ మ్యాటర్ ఇళ్లల్లో చెప్పాలి అని నిర్ణయించుకుంటారు…
వాళ్ళు అనుకున్నట్టే ఇద్దరు ఒకరోజు ధైర్యం చేసి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తారు…
ముందుగా పెద్దలు ప్రేమ వివాహం వద్దన్న, తర్వాత కాస్త నిదానం గా ఆలోచిస్తారు…
ఎలాగూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు… వాళ్ళ ఇష్టాన్ని కాదనడం ఎందుకు అని ఇద్దరి ఫ్యామిలీ మెంబెర్స్ బాగా ఆలోచించి, కొన్ని డేస్ తరువాత వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు….
పెద్దలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడంతో విక్కీ, వినీల లూ ఎగిరి గేంతులేస్తారు ఎంతో సంతోషం గా….
ఇరుకుటుంబ సభ్యులు త్వరగానే మంచి ముహూర్తం చూసి వేదమంత్రాల సాక్షిగా ఇరువురికి పెళ్ళి జరిపించేస్తారు…..
పెళ్ళి అయినప్పటి నుండీ విక్కీ, వినీల ఎంతో హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు….
విక్కీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లేవరకు వినీల అతనికి కావాల్సినవి అన్నీ దగ్గరుండి మరీ అందించేది….
ఇంట్లో అత్త, మామల్ని జాగ్రత్తగా చూసుకునేది…
విక్కీ కి లంచ్ బాక్స్ రెడీ చేసేది…. తనే తన చేతుల్తో విక్కీ కి టిఫిన్ తినిపించేది…
అతను ఆఫీస్ కి బయలుదేరేటపుడు నవ్వుతూ ఎదురొచ్చేది…
విక్కీ ప్రేమగా విన్నీ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ బుజ్జి ఈవెనింగ్ త్వరగా వస్తా రెడీ గా ఉండు అంటూ కన్ను కొట్టి ఆఫీస్ కి వెళ్ళేవాడు…..
వినీల విక్కీ అల్లరి చేష్టలకు నవ్వుకుంటూ మిగిలిన పనిలో పడేది….అలా రోజులు ఎంతో సంతోషం గా గడిచిపోతున్నాయి…..
విక్కీ, వినీల లూ ఎంతో ప్రేమగా, అన్యోన్యం గా వాళ్ళ దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నారు….
అలా పెళ్లయిన సంవత్సరం లోనే వినీల ప్రెగ్నెంట్ అవుతుంది…..ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు ఎంతగానో సంతోషిస్తాయి….
విక్కీ వినీల ప్రెగ్నెంట్ అయినప్పటి నుండీ ఆమెని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చాలా జాగ్రత్త గా చూసుకునేవాడు..
ఇంట్లో పని చేయడానికి వర్కర్స్ ని పెట్టించాడు….
తను ఈవెనింగ్ ఆఫీస్ నుండీ త్వరగా వచ్చి వినీల తో కబుర్లు చెప్తూ టైమ్ స్పెండ్ చేస్తుండేవాడు….
అలా నెలలు గడిచి వినీల కి 5 వ నెలలో సీమంతం కూడా చేస్తారు….సీమంతం చేసాక వినీల ని పుట్టింటికి తీసుకెళ్తాము అని అడుగుతారు వినీల పేరెంట్స్….
విక్కీ ముందు నో చెప్పిన వినీల ప్లీజ్ అండీ ఎందుకో నాకు అమ్మ వాళ్ళతో ఉండాలని ఉంది వెల్తాను పంపించండి అనని అడగడంతో విక్కీ ఇంకేం అనలేక కష్టం గానే వినీల ని తన పేరెంట్స్ తో పాటు పుట్టింటికి పంపడానికి ఒప్పుకుంటాడు ….
విక్కీ కష్టంగానే ఆమెని పుట్టింటికి పంపడానికి ఒప్పుకోవడంతో వినీల వాళ్ళ అమ్మ, నాన్నలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది….
వినీల వాళ్ళది కూడా అదే ఊరు కావడంతో విక్కీ మార్నింగ్ నుండీ ఈవెనింగ్ వరకు ఆఫీస్ లో వర్క్ చేసుకున్న,ఈవెనింగ్ అవగానే ఇంటికి రాకుండా నేరుగా వినీల పుట్టింటికి వెళ్లి భార్య తో సరదాగా గడిపేవాడు…
విక్కీ కి తన మీద ఉన్న ప్రేమ చూసి వినీల మురిసిపోయేది….
వినీల పేరెంట్స్ కూడా అల్లుడు కూతురి మీద చూపించే ప్రేమకి ఎంతో ఆనందపడిపోతు ఇంత మంచి అల్లుడు మనకి దొరకడం మన అదృష్టం అనుకుంటారు….
అలా మరో 4 నెలలు గడిచిపోతాయి….
ఒకరోజు మధ్యాహ్నం వినీల కి నెప్పులు రావడం, తన పేరెంట్స్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం, వినీల కి డెలివరీ అయి విక్కీ, వినీల ప్రేమ కి గుర్తుగా పండంటి మగ బిడ్డ పుట్టడం అన్ని త్వర త్వరగా జరిగిపోతాయి …..
వినీల ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అని తెల్సిన విక్కీ, అతని పేరెంట్స్ కూడా హాస్పిటల్ కి చేరుకుంటారు…
అందరు పుట్టిన బాబు ని చూసి ఎంతో సంతోషం గా బాబు ని ఎత్తుకుని ముద్దు చేస్తారు…..
విక్కీ, వినీల ల ఆనందం అయితే చెప్పనవసరం లేదు….ఇద్దరు బాబు ని ముద్దుల్తో ముంచేస్తారు…. నార్మల్ డెలివరీ కావడంతో అలా ఒన్డే హాస్పిటల్ లో ఉండి నెక్స్ట్ డే డిస్టార్జ్ అయి వినీల వాళ్ళింటికి వెళ్తుంది….
continued….
Swipe left/right or tap the sides to turn pages