New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మనసు మెచ్చిన వయ్యారి – 1

మనసు మెచ్చిన వయ్యారి – 1

అబ్బా వదలండి నన్ను ఎందుకు  బలవంతంగా తీసుకొని వస్తున్నారు అసలు నేను ఎందుకు ఇదంతా చేయాలి అని తనని పట్టుకున్న చేతులను విదిలిస్తూ కోపం భయం కలగలిపిన గొంతు తో అంటుంది ఒక అమ్మాయి

లేదు నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ మెడలో ఈరోజు నేను తాలి కట్టి తీరాల్సిందే అని అంటూ ఒక అబ్బాయి తనని తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే అతడు కూడా కూర్చొని పంతులు వైపు కోపంగా చూస్తాడు పూజ చేయమన్నట్టు

అతడీ చూపులకు భయపడి ఎవరైతే నాకేంటి సంభావన వస్తుంది కదా అని అనుకోని పూజ ప్రారంభించి గోత్రనామాలు మంత్రాలు చదువుతుంటే అవన్నీ ఎందుకు అయ్యా తాళి కట్టడానికి మాంగల్యం తంతు నానేనా మమ దీవెన హేతున అని ఏవో చదువుతారు కదా అవి ఒకటి చదివేయండి చాలు ఏ అలా జరిగితే పెళ్లి కాదా ఏంటి అని వెటకారంగా అంటాడు ఆ అబ్బాయి

ఎందుకు కాదు బాబు ఎలా జరిగినా పెళ్లి పెల్లే…అసలు తాళిబొట్టు మెడలో వేయకుండా రెండు సంతకాలు పెట్టి ఉంగరాలు తొడుక్కుంటేనే పెళ్ళంటున్నారు బాబు అని అంటూనే ఇంకాసేపు లేట్  చేస్తే ఎక్కడ కొడతాడు అని భయం వేసి తాళి బొట్టుకు పూజ చేసి అతడి చేతికి కట్టమని అందిస్తాడు

ఆ అమ్మాయి వద్దని ఎంత గింజుకుంటున్న….కళ్ళల్లో  నీళ్లు ఇంకిపోయేలా ఏడుస్తున్న… పట్టించుకోకుండా తన మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఆ అబ్బాయి

నో….. అలా జరగడానికి వీల్లేదు  అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది ఆ అమ్మాయి

భయంగా చుట్టూ చూసేసరికి అప్పటివరకు తను కల కన్నాది అని అర్థం అయ్యి ఒక్క క్షణం ఆగిపోయిన గుండె  కొట్టుకుంటుందా అన్నట్లు గుండే మీద చేయి వేసుకొని ఫీల్ అవుతుంది

నుదురు మీద అరచేతులలో మొత్తం చమట పట్టేసి తడిచిపోయి ఉండడం చూసి బాబోయ్ ఇలాంటి కల వచ్చిందేంటి అని అనుకుంటూ టైం చూసేసరికి ఒంటిగంట చూపిస్తుంది గోడ మీద ఉన్న గడియారం

హమ్మయ్య ఇంకా తెల్లవార లేదు తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు కానీ ఇది మిడ్ నైట్ పోనీలే… అయినా అసలు ఇలాంటి కల వచ్చిందేంటి నన్ను అంతలా బలవంతంగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరే ఉంటారు అని మళ్లీ భయంగా ఆ కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది

అలా ఆలోచిస్తూ ఎందుకో తలతిప్పి పక్కకు చూసినా తనకి కాళీ బెడ్ దర్శనం ఇవ్వడంతో ఇదేంటి అని అనుకొని చుట్టూ చూస్తుంది

చీకటిగా ఎటువంటి అలికిడి  లేకపోవడంతో వాష్రూమ్లో గాని ఉందేమో అని డోర్ నొక్ చేస్తుంది అక్క అని పిలుస్తూ

అయినా ఎటువంటి అలికిడి లేకపోవడంతో డోర్ మీద చేయి వేసేసరికి అది తెరుచుకోగానే అప్పుడు అర్థమైంది వాష్ రూమ్ లో కూడా తను లేదన్న సంగతి

ఇంత అర్ధరాత్రి ఇది ఎక్కడికి వెళ్ళింది…. ఓహో బావగారితో ఫోన్లో మాట్లాడుతుందేమో బాల్కనీలో కూర్చొని అని అనుకుంటుంది మళ్ళీ అంతలోనే

అయినా తెల్లవారే పెళ్లి పెట్టుకొని ఇప్పుడు కూడా వీళ్ళు కబుర్లు తగ్గలేదు అని మనసులోనే అనుకుంటూ బాల్కనీలోకి వెళ్లి చూసేసరికి అక్కడ కూడా తను లేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగింది

ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా ఎక్కడికి వెళ్ళిందో అని అనుకొని రూమ్ లోకి వచ్చి బేడ్ లాంప్ టేబుల్ పై ఫోన్ కోసం చూసేసరికి గాలికి రెపరెపలాడుతున్న ఒక పేపర్ కనిపిస్తుంది

దాన్ని చూడగానే ఎందుకో ఆమె మనసులో ఒక కలవరం

చిన్న టెన్షన్ మొదలై  కంగారుగానే పేపర్ తీసుకొని దానిలో ఉన్నది చదివేసరికి ఒక్కసారి గా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది

అంటే అక్క వెళ్ళిపోయిందా…. అని అనుకోగానే ఆమె కళ్ళముందు తెల్లవారు జరగవలసిన పెళ్లి…. తనకి వచ్చిన కళ కళ్ళ ముందు మెదులుతాయి

అంటే నాకు వచ్చిన కళ దేనికి సూచికం కొంపతీసి అలా జరుగుతుందా ఏంటి ?

లేదు లేదు అలా ఎందుకు జరుగుతుంది నా చుట్టూ నా వాళ్లంతా ఉంటారు కదా వాళ్ళందరూ ఉండగా నన్ను బలవంతంగా ఎవరు పెళ్లి చేసుకుంటారు అని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది కానీ మనసులో మాత్రం ఏదో మూల చిన్న భయం ఉండి పోయింది

ముందు అక్క ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలి అని గబగబా తన ఫోన్ తీసుకొని ఆమె నెంబర్ కి డయల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది

తనకి తెలిసిన వాళ్ళ అక్క ఫ్రెండ్స్ నెంబర్ కి కాల్ చేసి అందరినీ అడిగి కనుక్కొని వాళ్ళందరూ కూడా తెలియదు అని  చెప్పడంతో నిరాశ ఎదురవుతుంటే ఆమెలో ఉన్న భయం అంతకంతకు పెరిగిపోతుంది

అలా తెల్లవార్లు కూడా ఆమె కోసం కంగారుపడుతూ ఎలా వెతకాలి ఎక్కడ వెతకాలో కూడా తెలియక  టెన్షన్ పడి ఎప్పుడో తెల్లవారుజామున కోడి కోసే వేల అలసిన కళ్ళతో భారమైన మనసుతో తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది

పాపం మన చుట్టూ ఎంత మంది ఉన్నా మనకి ఎంత రక్షణగా ఉన్నా కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరగకూడదు అనుకున్నవి జరుగుతూనే ఉంటాయి వాటిని మనం ఆపలేము అనే విషయం గ్రహించలేక పోతుంది…. విధి రాత ఎలా నడిపిస్తే అలా మనం కూడా నడవక తప్పదు అని అర్థం చేసుకోలేక పోయింది ఆ అమ్మాయి 

 

స్టోరీ కంటిన్యూస్…

 

హలో ఫ్రెండ్స్… అగ్రిమెంట్ వైఫ్ స్టోరీ కంప్లీట్ అయింది కదా దాని ప్లేస్ లో ఈ స్టోరీ రెగ్యులర్ గా వస్తుంది.

 

మంచి సస్పెన్స్ తో కూడా లవ్, ఫ్యామిలీ డ్రామా , రొమాన్స్ తో మిమ్మల్ని అలరిస్తుంది.

 

అక్క వెళ్ళిపోతే ఆ ప్లేస్ లో ఇరుక్కున్న చెల్లి పరిస్తితి ఏంటి..?? తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి 

 

డైలీ మార్నింగ్ 10 కి న్యూ అప్డేట్ వస్తుంది డోంట్ మిస్ గాయ్స్… బాయ్