మనసు మెచ్చిన వయ్యారి – 3
అయ్య బాబోయ్ ఇప్పుడు అక్క లేదన్న సంగతి ఎలా చెప్పాలి వచ్చింది అమ్మో పెద్దమ్మ… పెద్దమ్మని అయినా కన్విన్స్ చేయొచ్చు కానీ అమ్మని మాత్రం కన్విన్స్ చేయలెం అక్క వెళ్ళిపోతుంటే నువ్వు హెల్ప్ చేసావా అని నన్నే అంటుందేమో అని మనసులోనే అనుకుంటూ భయపడుతూనే డోర్ తీస్తుంది అప్పటికే వాళ్ళ అమ్మగారు రెండు మూడు సార్లు డోర్ నాక్ చేయడం వల్ల
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇంకా ఇంత మత్తు నిద్ర ఏంటి? నువ్వు ఒక్కదానివేనా నీతో పాటు యొక్షి కూడా లేవలేదా అని అంటూ లోపలికి వచ్చి చుట్టూ చూసిన ఆవిడకి అక్కడ యోక్షిత కనిపించకపోయేసరికి
సరే సరే అక్క వాష్ రూమ్ లో ఉన్నట్టుంది రాగానే ఈ చీర కట్టుకోమను తనకి నువ్వు హెల్ప్ చెయ్యు ఈ లోపు నేను నగలు జడకి కావలసినవి తీసుకొని వస్తాను అని అంటారు నీలిమ గారు
అది అది అక్క బాత్రూంలో లేదు అని అంటుంది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అక్షరం కూడా బలుక్కొని
ఏంటి అక్కడ లేదా మరి ఇంకెక్కడ ఉంది అని అంటారు చుట్టూ చూస్తూనే
తెలియదమ్మా ఎక్కడా లేదు రాత్రి నుంచి అక్క కనిపించడం లేదు అని యెక్షిత రాసిన లెటర్ తెచ్చి ఆవిడ చేతిలో పెడుతుంది ఆశ్రిత
డియర్ ఫ్యామిలీ మెంబర్స్
ఈ లెటర్ మీరు చదువుతున్నారు అంటే నేను పెళ్లి నుంచి వెళ్ళిపోయాను అనే సంగతి మీకు అర్థమయ్యే ఉంటుంది కాకపోతే ఎందుకు వెళ్ళిపోతున్నాను అనే విషయం మీకు తెలియదు కదా అది తెలియడం కోసమే ఈ లెటర్ రాసాను
నేను ప్రేమించిన ఆదర్శ్ తో పెళ్లి చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే అంతకన్నా నాకు ముఖ్యమైనది నాకెంతో ఇష్టమైన యాక్టింగ్ ప్రొఫెషన్
చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని మీ అందరికీ చెప్పినా తాతయ్య నానమ్మ ఒప్పుకోరని నన్ను అటు సైడ్ పంపించలేదు కానీ నా ఇంటరెస్ట్ ని నేను వదులుకోలేక మీకు తెలియకుండా నేను కోచింగ్ తీసుకున్నా
ఇప్పుడు నాకు ఒక మూవీ లో ఆఫర్ వచ్చింది అది వదులుకుంటే నేను మళ్ళీ ఆ ప్రొఫెషన్ వైపు వెళ్లలేను అని ఆలోచించి తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాను
మీ మాటకి ఎదురు చెప్పి నేను చేసిన మొదటి తప్పు యాక్టింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్లడం రెండవ తప్పు ఇప్పుడు పెళ్లి వదిలేసి మరి వెళ్లడం
కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు ఆదర్శ్ నే పెళ్లి చేసుకుంటాను అంతవరకు నా గురించి వెతకకండి
పరువే ప్రాణంగా బ్రతుకుతూనే తాతయ్య నానమ్మకి ఈ విషయం చాలా బాధగా కోపంగా అనిపించొచ్చు కానీ మీరైనా అర్థం చేసుకోండి అమ్మ నా జీవితాన్ని నాకు నచ్చుకున్నట్టుగా నన్ను సెలెక్ట్ చేసుకొనివ్వండి అని ఉంటుంది ఆ లెటర్ లో
మొత్తం చదివి పేపర్ నెల మీద వదిలేశారు కళ్ళనిండా నీళ్లతో ఆశు వైపు చూస్తూ ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతారు జీరబోయిన గొంతుతో
లేదమ్మా నాకు కూడా రాత్రి తెలిసింది అని అసలు రాత్రి తనకి ఎలా తెలిసిందో మొత్తం వివరంగా చెప్తుంది ఆశ్రిత
@@@@@
ఏంట్రా మొహం వెలిగిపోతుంది పెళ్లి కళ మొత్తం నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది ఎంతైనా మనసారా ప్రేమించిన అమ్మాయి కదా త్వరలోనే సొంతం కాబోతుంది కాబట్టి ఆ మాత్రం సంతోషం ఉంటుందిలే అని అంటాడు పెళ్లి కొడుకు పక్కనే ఉన్న అతని ఫ్రెండ్
అవున్రా అది నిజమే అసలు ఊరు పేరు తెలియకుండా ప్రేమించి…..చివరికి తన డీటెయిల్స్ మొత్తం సాధించి…. వాళ్ల పేరెంట్స్ ని వీడి పేరెంట్స్ ని ఒప్పించి…. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు మొత్తానికి సాధించాడు రా మన ఆదర్శ్ అని అంటాడు ఇంకొక ఫ్రెండ్ ఆదర్శ్ షోల్డర్ మీద చేయి వేసి తడుతూ
అంతే కాదురా అన్నిటికీ హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా వీడ్ని ప్రేమించేలా చేసుకోవడం సూపర్ కదా ఎంతైనా వీడికి అన్ని అలా కలిసి వస్తాయి అదేంటో
వీడి మాటలకి విలువనిచ్చి వీడి కంటూ ఒక స్పేస్ ని వదిలేసిన పేరెంట్స్ అంతేకాకుండా వీడిని ప్రేమగా , ఫ్రెండ్స్ లా చూసుకుని నాన్నగారు…. వీడు కోరుకున్న జాబ్…. మంచి స్టేటస్….నలుగురిలో ఒక గుర్తింపు….. మంచివాడు అనే బిరుదు…. వీటన్నిటికీ మించి ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు భార్య కాబోతుంది ఎంతైనా మన గ్రూపులో ఇంటిలిజెంట్ వీడే కదా అని అంటాడు ఇంకొక ఫ్రెండ్
ఒరేయ్ ఆపండ్రా? ఏంటి ఇప్పుడు ఈ సన్మాన సభ పెట్టారు అని చిరుకోపంగా చూస్తూ అంటాడు ఆదర్శ్
సన్మాన సభ కాదు బాబు పొగడ్తలు అంతకన్నా కాదు వాస్తవం చెప్తున్నాను మాలో లేనిది నీలో ఉన్నది టాలెంట్ ఆ టాలెంట్ ని మేము గుర్తించి మీకు వివరిస్తున్నాము అని నాటకీయంగా అంటాడు మొదటి వాడు
సరిగ్గా అప్పుడే ఆదర్శ్ కి ఒక ఫోన్ వస్తుంది జస్ట్ ఎ మినిట్ అని చెప్పి పక్కకు వెళ్లి సీరియస్ గా కాసేపు మాట్లాడి అక్కడికి వస్తాడు
స్టోరీ కంటిన్యూస్….
ఆదర్శ్ అంత సీరియస్ గా ఎవరితో మాట్లాడి ఉంటాడు తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీని మీస్ అవ్వకుండా చదివేయండి
ప్లీజ్ ట్యాగ్ యువర్ రేటింగ్స్ అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్
Swipe left/right or tap the sides to turn pages