మనసు మెచ్చిన వయ్యారి – 2
తెల్లవారు నాలుగు గంటలు
లేవండి అప్పుడే తెల్లారిపోయింది మీకు ఏమో ఇంకా నిద్రమత్తు వదలడం లేదు అయినా ఇంకొన్ని గంటల్లో కూతురు పెళ్లి పెట్టుకొని ఎలా ఇంత మనశాంతిగా పడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని మంచం మీద పడుకొని ఉన్న నలబ్బై ఏళ్ల ఆయనని నిద్ర లేపుతూ అంటారు వాళ్ళ ఆవిడ
ఏంటి సుచి పడుకున్నదే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంకొక గంట పడుకుంటే ఏమైంది అయినా నువ్వు నీ కంగారు కానీ అన్ని ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనం ఇంత టెన్షన్ పడటం ఎందుకు అని కళ్ళు తెరవకుండానే ఆవిడ మాటలు కి బదులుగా అంటారు ఆయన
ఏంటి అన్నిటికి ఆర్డర్ ఇచ్చేస్తే మాత్రం ప్రశాంతంగా పడుకుంటారా… వాళ్లకి మనం డబ్బులు ఇస్తాం కదా అన్ని వాళ్లే చూసుకుంటారులే అని పనులు మొత్తం వాళ్లకు వదిలేయకూడదు అలా అయితే రేపు ఏదైనా తక్కువ అయితే మాట ఎవరికి పడుతుంది
మనకే కదా అప్పుడు నలుగురిలో తలదించుకోవాల్సింది మనం వాళ్లు కాదు కదా వాళ్లకేంటి ఎవరు ఏమనుకున్నా డబ్బులు తీసుకొని చేతులు దులిపెసుకొని వెళ్ళిపోతారు
అసలకే అత్తయ్య మామయ్య ఎవరి దగ్గర చిన్న మాట కూడా పడని వాళ్ళు కాబట్టి లేచి అన్ని దగ్గరుండి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోండి అని బలవంతంగా ఆయనని లేపి ఫ్రెష్ అవ్వమని బాత్రూం లోకి తోస్తారు సుచిత్ర గారు
పెద్దోడా ఉదయం ఎనిమిది గంటలకు ముహూర్తం అన్ని సిద్ధమే కదా ఎక్కడ ఏది తక్కువ లేదు కదా….. అసలే మనం ఆడపిల్ల వాళ్ళం మనమే పెళ్లి చేస్తాము అని హామీ ఇచ్చాక మగ పెళ్లి వారికి ఏదైనా తక్కువ అయితే చాలా చిన్న చూపుగా చూస్తారు
కాబట్టి ఎవరూ వేలెత్తి చూపకుండా అన్ని తగినంతలో సమకూర్చాలి అంటే మాటల తో పని కాదు కాబట్టి ఒకటికి రెండుసార్లు అన్నీ చూసి ఇంకా ఏమైనా తక్కువ అయితే వెంటనే తెప్పించు అని అంటారు హరి నారాయణ గారు
సరే నాన్న భోజనానికి కావలసిన ఏర్పాట్లు తమ్ముడు చూసుకుంటున్నాడు కాబట్టి నేను మండపం దగ్గర అన్ని చూసుకుంటున్నాను మీరేం టెన్షన్ పడకండి మీకు అలాంటి మాట రాకుండా చూసుకునే బాధ్యత మాది అని హామీ ఇస్తారు సత్యదేవ్ గారు
కానీ వాళ్ళు ఊహించనీ పెను తుఫాన్ ఎదురవ్వబోతుందని వాళ్ళు మాట తప్పబోతున్నారు అని ఆ క్షణం ఆయనకు తెలియదు
అన్నయ్య మగ పెళ్లి వాళ్ళు బయలుదేరి పోయారు అంట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు వదిన మీరు ఆహ్వానం పలకడానికి రెడీగా ఉండండి అని అంటారు ఆయన తమ్ముడు కామేష్ గారు
అక్కా మగ పెళ్లి వారికి ఆహ్వానం పలకడానికి బావ గారు నిన్ను రమ్మంటున్నారు వెళ్ళు ముందు ఈ పనులన్నీ నేను చూసుకుంటాను అని అంటూ ఆవిడ చేతిలో ఉన్న పళ్ళెం అందుకుంటూ అంటారు నీలిమ గారు ( కామేష్ గారి భార్య )
సరే అయితే నువ్వు ముందు యోక్షి ( యోక్షిత ) లేచిందో లేదో వెళ్లి చూడు అసలే దానికి వాళ్ళ నాన్న లా నిద్ర మత్తు ఎక్కువా అని చిరు కోపంగా కూతురు నీ తిడుతూ అంటారు సుచిత్ర గారు ( సత్యదేవ్ గారి భార్య )
సరే సరే పెళ్లి కూతురు సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లేట్ అయింది అంటే మళ్ళీ బావ గారు కొప్పడతారు అని అంటూ పెళ్లి కూతురు గది దగ్గరకి వెళ్తారు నీలిమ గారు
ఏంటో ఈ పిల్లలు… అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ హాయిగా పడుకొని ఉన్నట్టున్నారు అని అనుకుంటూ తలుపు కొడతారు నీలిమ గారు
తలుపు చప్పుడు వినిపించగానే ఉల్లిక్క్కిపడి లేస్తుంది ఆశ్రిత వాళ్ళ అమ్మ మాట తన చెవులకి చేరగానే అక్క లేదన్న సంగతి గుర్తుకు వచ్చి అప్పటి వరకు ఉన్న నిద్ర మత్తు వదిలిపోయి భయం స్టార్ట్ అవుతుంది
ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపించేసరికి మత్తుగా నిద్రపోతున్న ఆశ్రిత ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది
అయ్య బాబోయ్ ఇప్పుడు అక్క లేదన్న సంగతి ఎలా చెప్పాలి వచ్చింది అమ్మో పెద్దమ్మ… పెద్దమ్మని అయినా కన్విన్స్ చేయొచ్చు కానీ అమ్మని మాత్రం కన్విన్స్ చేయలెం అక్క వెళ్ళిపోతుంటే నువ్వు హెల్ప్ చేసావా అని నన్నే అంటుందేమో అని మనసులోనే అనుకుంటూ భయపడుతూనే డోర్ తీస్తుంది అప్పటికే వాళ్ళ అమ్మగారు రెండు మూడు సార్లు డోర్ నాక్ చేయడం వల్ల
స్టోరీ కంటిన్యూస్….
మరి ఆశ్రిత కి కల వచ్చినట్టు నిజంగా జరుగుతుందా ?
అలా అయితే ఎవరు ఆ అబ్బాయి ? ఎందుకు తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు ?
యొక్షిత ఎందుకు వెళ్ళిపోయింది పెళ్లి ఇష్టం లేదా ? పెళ్లి కూతురు వెళ్లి పోయింది అని తెలిస్తే పెద్దవాళ్న రీ యాక్షన్మీ ఎలా ఉంటుందో…?? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలి అనుకుంటే స్టోరీని మిస్ అవ్వకుండా చదివేయండి
ప్లీజ్ ట్యాగ్ యువర్ రేటింగ్స్ అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్
Swipe left/right or tap the sides to turn pages