New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 3

మిస్టర్ మాన్స్టర్ – 3

మాల్ లోపల అడుగుపెట్టగానే కీర్తి, స్నేహ డ్రెస్సుల సెక్షన్ వైపు పరుగెత్తారు. మైరా మాత్రం వాళ్ళని ఆపుతూ, ముందు విండో షాపింగ్ చేద్దాం రండి, డబ్బులు తక్కువ ఉన్నాయి..

 

చూసి చూసి మంచిది సెలెక్ట్ చేసుకోవాలి అని నవ్వింది. ఒక బ్రాండెడ్ షోరూమ్ ముందు ఆగి అక్కడ ఉన్న రేట్ టాగ్స్ చూసి అమ్మ బాబోయ్.ఈ ఒక్క డ్రెస్ రేటుతో మా నాన్న వారం రోజులు ఇల్లు గడుపుతారు. 

 

మనకి ఇది వద్దు కానీ, పక్కన ఉన్న లోకల్ షాప్ కి వెళ్దాం పదండి అని తన ప్రాక్టికల్ మైండ్‌సెట్ చూపించింది.

అక్కడ వాళ్ళు తిరుగుతున్నప్పుడు, 

 

ఇషాంత్ తన కంపెనీ డీల్ కోసం అదే మాల్ పై అంతస్తులో ఉన్న ఒక ప్రైవేట్ లాంజ్ లో మీటింగ్ లో ఉన్నాడు. 

 

షాపింగ్ ముగించుకుని, అందరూ హాయిగా తమ స్కూటీల మీద తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో రోడ్డు పక్కన ఒక ఫేమస్ పానీపూరి బండి కనిపించింది.

 

అరేయ్.. ఆపండిరా.పానీపూరి తినకుండా ఇంటికి వెళ్తే నా ప్రాణం పోతుంది అని మైరా బ్రేక్ వేసింది.ఐదుగురు ఆ బండి చుట్టూ నిలబడ్డారు.

 

అన్నయ్యా ఐదు ప్లేట్లు ఇవ్వండి. నాది మాత్రం ఫుల్ స్పైసీ ఉండాలి అని ఆర్డర్ ఇచ్చింది మైరా.వంశీ పానీపూరి తింటూ మైరా…..

 

రేపు జాబ్స్ వస్తే మనం ఇలాగే కలుస్తామా రా అని ఎమోషనల్ అయ్యాడు.మైరా నోట్లో పూరి పెట్టుకుని కష్టపడి నములుతూ, 

 

ఎక్కడికి వెళ్తాం రా? మీరు ఎక్కడున్నా సండే రోజు నా ఇంటికి రాకపోతే కాళ్లు విరగ్గొడతాను. మన ఫ్రెండ్‌షిప్ ఏమైనా ఆషామాషీ అనుకుంటున్నారా అని గట్టిగా చెప్పింది.

 

పానీపూరి తింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, అయినా మైరా ఆ కారాన్ని ఎంజాయ్ చేస్తోంది. జీవితం అంటే ఇదే రా.. 

 

ఈ చిన్న చిన్న సంతోషాల్లోనే అసలైన కిక్కు ఉంది. ఆ ఏసీ గదుల్లో ఉండే వాళ్ళకి ఈ టేస్ట్ ఏం తెలుస్తుంది అని ఒక డైలాగ్ వేసింది.

 

సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. అందరూ ఒకరికొకరు బాయ్ చెప్పుకుని విడిపోయారు. మైరా తన స్కూటీ మీద నెమ్మదిగా ఇంటికి వెళ్తోంది.

 

గాలి తన ముఖాన్ని తాకుతుంటే, ఏదో తెలియని ప్రశాంతత.మైరా తన ఇంటికి చేరుకుని, పద్మ చేసిన వేడి వేడి అన్నం తింటూ, తమ్ముడితో గొడవ పడుతూ ఆ రోజుని ముగించింది.

 

సమయం ఉదయం 5:00 గంటలు. హైదరాబాద్‌లోని భూపతి విల్లా బయట  నలుపు రంగు రేంజ్ రోవర్ కార్లు సిద్ధంగా ఉన్నాయి.

 

ఇషాంత్ తన పర్సనల్ గెస్ట్ హౌస్ నుండి నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాడు. ఇషాంత్ కి ట్రాఫిక్ అంటే నచ్చదు, అందుకే అతను వెళ్లే దారిలో సిగ్నల్స్ అన్నీ క్లియర్ చేయబడ్డాయి.

 

అతను తన ప్రైవేట్ జెట్‌లో కూర్చుని వైజాగ్ ఫైల్స్ చూస్తున్నాడు. వైజాగ్‌లో ఉన్న భూపతి మాల్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. 

 

అక్కడ ఏదో కొత్త ప్రాజెక్ట్ డీల్ కుదుర్చుకోవడానికి అతను స్వయంగా వెళ్తున్నాడు.సర్.. వైజాగ్‌లో సెక్యూరిటీ అంతా టైట్ చేశాం. 

 

మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకి మాల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉంటుంది అని అతని సెక్రటరీ దిలీప్ చెప్పాడు.

ఇషాంత్ విండో నుంచి బయటకి చూస్తూ, 

 

దిలీప్ వైజాగ్ అంటే నాకు ఇష్టం లేదు.. కానీ అక్కడ నా సామ్రాజ్యం విస్తరించాలి. భూపతి ఇండస్ట్రీస్ అడుగు పెడితే అక్కడ ఇంకే కంపెనీ బతకకూడదు అన్నాడు ఆ గర్వంతో.

 

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇషాంత్ జెట్ ల్యాండ్ అయింది. అతను కిందకి దిగగానే వైజాగ్ బ్రాంచ్ మేనేజర్లు అందరూ చెమటలు కక్కుతూ లైన్‌లో నిలబడ్డారు.

 

ఇషాంత్ ఒక్కసారి గాలి పీల్చి, తన సన్ గ్లాసెస్ సర్దుకున్నాడు. అతని చూపుకి అక్కడ ఉన్న వాళ్ళు గజగజ వణికిపోతున్నారు

 

కార్ల కాన్వాయ్ బీచ్ రోడ్డు గుండా భూపతి మాల్ వైపు దూసుకుపోతోంది. మాల్ దగ్గర వేలమంది జనం ఉన్నారు.

 

కానీ ఇషాంత్ వస్తున్నాడని తెలిసి పోలీసులు సెంట్రల్ గేట్ దగ్గర ఎవరినీ రానివ్వడం లేదు. ఇషాంత్ కారు ఆగగానే, రెడ్ కార్పెట్ మీద అతను అడుగు వేశాడు.

 

మాల్‌లోని 5వ అంతస్తు. అది పూర్తిగా ఇషాంత్ కోసం కేటాయించబడింది. లోపల ఏసీ చల్లగా ఉన్నా, ఇషాంత్ అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం వేడెక్కినట్టు అనిపించింది.

 

ముందుగా మాల్ సేల్స్ రిపోర్ట్స్ చూశాడు. ఏంటిది లాస్ట్ మంత్ కంటే 2% సేల్స్ తగ్గాయి. రీజన్ ఏంటి అని గర్జించాడు.

 

మేనేజర్ తడబడుతూ, సర్ లోకల్ షాప్స్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి అని మేనేజర్ చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఇషాంత్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ ని విసిరి కొట్టాడు.

 

ఆ ముక్కలు మేనేజర్ కాళ్ల దగ్గర పడ్డాయి. డిస్కౌంట్స్ కాదు.వాళ్ళని తొక్కేయండి. భూపతి మాల్ కి రాని కస్టమర్ ఇంకెక్కడికీ వెళ్లకూడదు. 

 

ఆ లోకల్ వెండర్స్ అందరినీ ఖాళీ చేయించండి అని ఆర్డర్ వేసి అక్కడ నుంచి వేరే మాల్ కి వెళ్ళిపోయాడు.

 

                         కొనసాగుతుంది…..

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్..