New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షస బాబు – 2

రాక్షస బాబు – 2

 

చెప్పు….ఎవరు నువ్వు…? కావాలి అని నన్ను ట్రాప్ చేసి ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు…? 

 

 

ఆ వికాస్ కోసమే కదా…? ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు….? ” అని ఇంకా ఇంకా జాస్మిన్ మిద ప్రేసెర్ పెంచుతూ అడిగాడు అధర్వ.

 

 

అంతకంతకూ జాస్మిన్ మిద అధర్వ పట్టు బిగుసుకుంటూ ఉంటే…… జాస్మిన్ కళ్ళల్లో నీళ్ళు ధారాళంగా కారిపోతూ ఉంటాయి….

 

 

” నేను ఎవరో మీకు తెలియదా అధర్వ గారు….? నేను ఎవరో తెలియకుండానే నాతో ఒక్కటిగా కలిసారా…? 

 

నేను ఎవరో తెలియకుండానే నా కోసం రోజు మా పీజీ కి వచ్చారా…? 

 

 

నేను ఎవరో తెలియకుండానే ఇప్పుడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారా…? ” అని అడిగింది జాస్మిన్.

 

అందరినీ కోల్పోయి ఏకకిలా ఉన్న నా లైఫ్ లోకి వచ్చిన దేవత వి నువ్వు అనుకున్నాను కానీ నువ్వు నా లైఫ్ నీ అందంగా మార్చడానికి కాదు…

 

 

నా లైఫ్ నీ ఇంకా చీకటిలో చిదిమెయ్యడానికి , నన్ను ఇంకా ఇంకా ఒంటరి వాడిగా మార్చి , ఆ వికాస్ తో కలిసి నన్ను అన్నీ విధాలుగా దెబ్బ తియ్యడానికి వచ్చిన రాక్షసివి అని ఇప్పుడే అర్ధం అయ్యింది..

 

 

నిన్ను గుడ్డిగా నమ్మి నా లైఫ్ లోకి ఇన్వైట్ చేసాను చూడు నాది బ్లెండర్ మిస్టేక్…

 

 

ఇంకా ఆ మిస్టేక్ నీ ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటాను…నన్ను నాశనం చెయ్యాలి అని వచ్చిన నీ లైఫ్ నీ కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తా…అంటూ

 

 

జాస్మిన్ నీ బర బారా ఈడ్చుకొని వెళ్లి స్టోర్ రూం లో పడేసి , లైట్స్ అన్నీ ఆఫ్ చేసి , ఆ రూం డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు అధర్వ.

 

 

జాస్మిన్ ఆ నైట్ అంతా స్టోర్ రూం లో చిమ్మ చీకటిలో , ఆ డోర్ కి జారబరి కూర్చొని ఏకధాటిగా ఏడుస్తూ ….

 

 

విశాల్ గారికి మీకు గొడవలు ఉంటే మధ్యలో నాకు ఎంటి సంబధం…? నేను విశాల్ గారితో మాట్లాడుతున్నాను అని నన్ను అపార్థం చేసుకొని ఇలా బలవంతంగా పెళ్లి చేసుకొని …..

 

 

నా గురించి న్యూస్ లో ఎందుకు అలా తప్పుగా వచ్చేలా చేశారు…ఇప్పుడు ఆ న్యూస్ మా అమ్మ చూస్తే గుండె ఆగి చచ్చిపోతుంది ” అని అనుకుంటూ బాధ పడుతూ ఉంటుంది.

 

 

నెక్స్ట్ డే….

 

 

నైట్ అంతా ఏవేవో ఆలోచనలతో ఫుల్ గా తాగి బార్ రూం లోనే పడిపోయిన అధర్వ కి అతని ఫ్రెండ్ పార్ధు ఫోన్ కాల్ తో మెలుకువ వస్తుంది.

 

 

మత్తుగా కళ్ళు మూతలు పడ్తు ఉంటే కాల్ లిఫ్ట్ చేసి ” చెప్పు పార్ధు ”  అని అంటాడు…

 

 

” ఎక్కడ ఉన్నావ్ రా…? ఇక్కడ టెండర్ ఆఫీసు లో మేము అంతా నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం…!

 

 

టెండర్ ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఇప్పటి వరకు ఆఫీసు కి రాలేదు…ఇక్కడ టెండర్ సబ్మిట్ చేసే టైం ఏమో అయిపోతుంది ” అని కంగారుగా చెప్తాడు పార్ధు.

 

 

అధర్వ ఒకసారి క్లాక్ లో టైం చూసి ఫిఫ్టీన్ మినిట్స్ లో అక్కడ ఉంటా..! ” అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి , రెడీ అయ్యి …..

 

 

జాస్మిన్ ఉన్న స్టోర్ రూం నీ ఒకసారి చూసి అక్కడ నుంచి టెండర్ ఆఫీసు కి స్టార్ట్ అయ్యాడు…

 

 

ఇంకో ఐదు నిమిషాల్లో టెండర్ ఆఫీసు కి రీచ్ అవుతాడు అనగా మధ్యలో కొంత మంది రౌడీలు అధర్వ కార్ కి అడ్డుగా నిలబడతారు.

 

 

ఆ రౌడీలను ఎవరు పంపించి ఉంటారో అర్ధం అయ్యి… , స్టైల్ గా కార్ దిగి , కోట్ సరి చేసుకుంటూ… కార్ బ్యాబెట్  కి జార బడి నుంచిని “ఇంకో టెన్ మినిట్స్ లో టెండర్ ఆఫీసు లో ఉండాలి నేను …

 

 

సో ల్యాగ్ చెయ్యకుండా అందరూ ఓకే సారి రండి” అంటాడు చేతి వేళ్ళు విరుచుకుంటూ..

 

 

అధర్వ మాటకలు ఆ పది మంది రౌడీలు ఒకేసారి అధర్వ మీదకు వెళ్తారు.

 

 

కరెక్ట్ గా ఐదు అంటే ఐదు నిమిషాల్లో పది మందిని పడుకోబెట్టి కార్ ఎక్కగబోతు ఉండగా……మళ్ళీ పార్ధు నుంచి కాల్ వస్తూ ఉంటే దాన్ని ఆన్సర్ చేస్తూ ఉండగా….

 

 

ఇందాక కింద పడిన వాళ్ళలో ఒకడు పైకి లేచి , వాడి పక్కన పడి ఉన్న కత్తి నీ తీసుకొని …….. సైలెంట్ గా వెనుక నుంచి అధర్వ నీ ఒక్క పొటు పొడుస్తాడు…

 

 

ఆ కత్తి నిండా ఎర్రటి రక్తం బొట్లు బొట్లు గా కారి కింద నేల మీద పడుతూ ఉంది…

 

 

అసలు ఆ రౌడీలను పంపించింది ఎవరు…? 

 

ఇప్పుడు ఆ టెండర్ ఎవరికి వెళ్తుంది….? 

 

 

అసలు జాస్మిన్ నీ అధర్వ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు….? 

 

 

ప్రేమతో చేసుకున్నాడా..? లేదా పగతో నా…? 

 

స్టోరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి 

 

To be continued….