New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షస బాబు – 3

రాక్షస బాబు – 3

 

అధర్వ ఆ రౌడీలు అందరినీ ఫినిష్ చేసి కార్ దగ్గర అటుగా తిరిగి పార్ధు తో కాల్ మాట్లాడుతూ ఉండగా కింద పడిన రౌడీల లో ఒకడు వచ్చి అధర్వ నీ వెనుక నుంచి కడుపులో పొడుస్థాడు…

 

 

ఆ కత్తి నిండా ఎర్రటి రక్తం బొట్లు బొట్లు గా కారి కింద నేల మీద పడుతూ ఉంది…

 

 

తన కడుపులో దిగిన కత్తి పోటును చూసి కోపంతో వెనక్కి తిరిగి అధర్వ కడుపు లో కత్తితో పొడిచిన వాటిని చూస్తూ…..

 

 

ఒక్కే ఒక షాట్ తో వాడిని నేల కరిపించి , రక్తం వల వలా కారిపోతూ ఉంటే….దానికి కర్చీఫ్ అడ్డు పెట్టుకొని అప్పటికే టెండర్ సబ్మిట్ చేసే టైం దాటి పోవడంతో…

 

 

ఫాస్ట్ గా కార్ నీ టెండర్ ఆఫీసు కి తీసుకొని వెళ్తాడు…

 

 

అధర్వ టెండర్ ఆఫీసు కి రీచ్ అయ్యే సరికి అక్కడ టెండర్ వెయ్యడానికి వచ్చిన మిగిలిన బిజినెస్ మన్స్ అందరు విశాల్ కి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు…

 

 

కానీ విశాల్ అవి ఏవీ పట్టించుకునే మూడ్ లో లేడు…అతని మనసు , ఆలోచనలు అన్నీ జాస్మిన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి…

 

 

అధర్వ కార్ లో నుంచి దిగి , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తూ ఉంటే పార్ధు అతనికి ఎదురు వెళ్లి ఇలా అంటాడు…

 

 

” టెండర్ టైం అయిపోయింది అధర్వ…. ఈ టెండర్ కూడా విశాల్ గాడికే వెళ్లిపోతుంది… ఈ టెండర్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో చూసి ఇది ఎలాగైనా నికే రావాలి అని కోరుకున్నా..

 

 

కానీ బ్యాడ్ లక్ విశాల్ గాడికి వెళ్ళిపోయింది…” అని పర్వాలేదు లే వాడు కూడా మన ఫ్రెండ్ ఏ కదా…? అని పార్ధు నోటిలో నుంచి మన అనే మాట రాగానే చురుక్కున చూసాడు అధర్వ.

 

 

అధర్వ చూపుకి భయపడి అది … అంటే మనం ముగ్గురం కాలేజ్ టైం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా…! అందుకే ఫ్లో లో అలా అనేశా సారీ..! ” అని అంటాడు.

 

 

అప్పుడే టెండర్ గెలుచుకున్న వల్ల పేరు మైక్ లో అనౌన్స్ చేస్తారు…

 

 

అందరి కన్నా అతి తక్కువ కోడ్ చేసి ఈ గవర్నమెంట్ ప్రాజెక్టు నీ AV కన్స్ట్రక్షన్ ( అధర్వ వేధాంత్ )  సొంతం చేసుకున్నారు ” అని అనౌన్స్ మెంట్ విని అక్కడ ఉన్న అందరు షాక్ అయ్యి నోరు తెరిస్తే…

 

 

అధర్వ మాత్రం ఈవిల్ స్మైల్ ఇస్తూ…కోట్ లో నుంచి రక్తం కారుతూ కోట్ అంతా తడిగిగా మారిపోతూ ఉన్న కూడా పట్టించుకోకుండా …..

 

 

నడుచుకుంటూ వెళ్లి విశాల్ ముందు నిలబడి వెటకారం నవ్వుతూ….

 

 

” నువ్వు ఎన్ని ప్లాన్స్ చేసి నన్ను ఆపాలి అనుకున్న కూడా లాస్ట్ కి నేనే గెలిచాను… అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను గెలవాలి అనుకున్నావా…? షేమ్ ఆన్ యూ మిస్టర్ విశాల్ వర్ధన్… ” అని అంటూ  బొట్టు బొట్టుగా కోట్ చివర నుంచి రక్తం కారుతున్నది చూపిస్తూ అంటాడు.

 

 

రక్తం చూడగానే విశాల్ ఒక్క క్షణం బాధగా రేయ్ ఆది  ఏం అయ్యింది అంటూ కంగారుగా అధర్వ కోట్ దగ్గర పట్టుకోబోతు ఉంటే…

 

 

అధర్వ దూరం జరుగుతూ ” డోంట్ టచ్ మీ..” అని అక్కడ అంతా రి సౌండ్ వచ్చేలా అరుస్ధాడు…

 

 

అక్కడ అప్పటి వరకు ఆ ప్రాజెక్టు కోడ్ ఫైల్ కూడా సబ్మిట్ చెయ్యకుండా అధర్వ కి ఎలా వచ్చింది అని జుట్టు పీక్కుంటూ ఉన్న అందరు ….

 

 

అధర్వ అరుపుకి ఉలిక్కి పడి విశాల్ , అధర్వ వైపు చూస్తారు.

 

 

నన్ను టెండర్ ఆఫీసు కి రాకుండా చెయ్యాలి అని రౌడీలను పంపించి నన్ను చంపించాలి అని ట్రై చేసి…ఇప్పుడు ఏమి తెలియనట్లు డ్రామా ప్లే చెయ్యకు… ” అని అరుస్థాడు…

 

 

అధర్వ మాటలకి షాక్ ప్లస్ అయోమయంలో చూస్తూ.. ” నేను ఎందుకు నిన్ను చంపించలి అని ట్రై చేస్తాను ” అని అడుగుతాడు విశాల్.

 

 

నీ ముద్దుల చెల్లి నీ బలవంతంగా పెళ్లి చేసుకొని నీకు దూరం చేసినందుకు….నన్ను  అడ్డు తప్పించి నా ఆస్తి అంతా కొట్టేసి ఈ వైజాగ్ లో నువ్వే నెంబర్ వన్ గా ఉండాలి అని….

 

 

ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో….నిన్ను , నీ చెల్లిని , నీ ఫ్యామిలీ అంతటినీ ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చే , రోడ్డు మిద నిలబెట్టకపోతే నేను అధర్వ నే కాదు…

 

 

నన్ను డైరెక్ట్ గా ఎదురుకోలేక నీ చెల్లిని నా దగ్గరికి పంపి నన్ను ట్రాప్ చేయించి దానితో ఒక్కటి అయ్యేలా చేసి , నన్ను ఫుల్ చేస్తావా…?

 

 

నన్ను నమ్మించి మోసం చేసి నా తల్లి తండ్రుల చావుకి కారణం అయిన నిన్ను , నా లైఫ్ నీ స్పాయిల్ చెయ్యడానికి వచ్చిన నీ చెల్లి జాస్మిన్ నీ ఇద్దరినీ వదలను…” అని కసిగా , ఎర్రటి నిప్పులు కక్కే కళ్ళతో చెప్పి ..

 

 

అక్కడ నుంచి ఆఫీసు లోకి వెళ్లి , ప్రాజెక్టు ఫైల్ మిద సైన్ చేసి అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు అధర్వ…

 

 

ఇంటికి వెళ్లి నేరుగా స్టోర్ రూం లోకి వెళ్లి అక్కడ కింద పడిపోయి ఉన్న జాస్మిన్ నీ కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్తాడు….

 

 

ఇప్పుడు జాస్మిన్ నీ అధర్వ ఏం చేస్తాడు….? 

 

 

జాస్మిన్ ,  వికాస్ బ్రదర్ అండ్ సిస్టర్…. కానీ ఓన్ బ్లడ్ కాదు…స్టెప్ మదర్ పిల్లలు…

 

 

 

To be continued…..