New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 22

రావమ్మా.. మహాలక్ష్మి – 22

ఆమె విరక్తిగా నవ్వింది. వాళ్లు తెలివైన వాళ్లు మహా.. ప్రతిసారి ఎదుటి వాళ్ళని దెబ్బ తీయాలి అంటే కత్తులు, గొడ్డళ్ళు పట్టుకుని నరకాల్సిన అవసరం లేదు మహా.. అంత కంటే పదునైన ఆయుధాలు కూడా ఉంటాయి. అంజనీదేవి.. మీ నాయనమ్మ.. ఎంతో తెలివైన దాన్ని అనుకున్న నాతోనే.. నా భర్త నాకు వద్దు అనేలా చేసింది. నా గొయ్యి నేనే తవ్వుకుని ఆ గోతిలో నా జీవితాన్ని నేనే సజీవ సమాధి చేసుకునేలా చేసింది.. జీవితం నాశనం అయిపోయి.. ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపల మీ నాన్న కి నాకు మధ్య చెరిగిపోని దూరం.. వచ్చి చేరువయిపోయింది మహా.. అందరి కళ్ళకి సీత తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది అని మాత్రమే తెలుసు.. కానీ కొందరికి ఎదుటి వాళ్ళ వేలితోనే వారి కళ్ళల్లో పొడుచుకునేలా చేయడం తెలుసు.. మీ నాయనమ్మ ఆ కోవ కే వస్తుంది… అంది బాధగా సీత. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue