ఆరోజు.. ప్రతాప్ ప్రేమ ని ఏమాత్రం ఆలోచించకుండా సరే అన్నాను.. ఎందుకంటే నేనూ అప్పటికే అతడిని ఇష్టపడ్డాను కాబట్టి.
ఆ తరువాత యుగమొక క్షణంలా గడచింది.. కాలేజీ అయ్యాక ఇద్దరం బయటికి వెళ్ళేవాళ్ళం.. ఇంట్లో నాకిచ్చిన స్వేచ్ఛ మూలంగా ప్రతాప్ తో నా ప్రేమ కూడా ధైర్యం గా చెప్పగలను అనుకున్నా.. పరీక్షలు ముగిసాయి.. ఒకరి నొకరు విడిచి ఉండలేక పోయాం.. అందుకే డిగ్రీ అయ్యాక ఉద్యోగ ప్రయత్నం అంటూ ఇంటికి దూరంగా ఉన్నా.. ఆనంద్ ఒక ఇల్లు చూసాడు.. కానీ పెళ్లి కాకుండా అతనితో ఉండేంత కుసంస్కారం నాకు లేదు.. అందుకే నేను అందుకు ఒప్పుకోలేదు.