New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 3

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 3

గంట ప్రయాణం తర్వాత వాళ్ళు ఇంటర్ వ్యూ కి వెళ్ళాల్సిన విక్రమ్ సౌల్యూషన్ ఆఫీసు బిల్డింగ్ ముందు స్కూటీ ఆపి , దిగి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు.

తళ తళా మెరుస్తున్న 30 అంతస్తుల బిల్డింగ్ మిద టాప్ లో విక్రమ్ సొల్యూషన్స్ అనీ కంపెనీ పేరు స్టైలిష్  గా రాసి ఉంటుంది.

అంత పెద్ద బిల్డింగ్ చూసి అక్కడ ఎంత మంది ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని ముందే భయపట్టుకుంది జాను పాపకి.

బెదురు బెదురుగా ఆ కంపెనీ బిల్డింగ్ చూస్తూ మైధిలి చెయ్యి పట్టుకొని నలిపేస్తూ ” మైథి నాకు భయంగా ఉంది. ఆఫీసు చాలా పెద్దగా ఉంది ” అని భయం భయంగా చూస్తూ చెప్పింది.

కుట్టి పాప..! నేను ఉన్నాను కదా..? అయినా జస్ట్ బిల్డింగ్ చూసి భయపడితే ఎలా రా..! ” అంటూ జాను భుజం చుట్టూ చెయ్యి పట్టుకొని ఆఫీసు లోపలికి తీసుకొని వెళ్ళింది.

అక్కడ రిసెప్షన్ లో అడిగి ఇంటర్ వ్యూ జరిగే ఫ్లోర్ కి వెళ్తారు.

అక్కడ వెయిటింగ్ ఏరియాలో ఒక పది మంది జాబ్ కోసం వచ్చిన క్యాండిడేట్స్ కూర్చొని ఉంటారు.

జాను చెయ్యి పట్టుకొని మైధిలి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంది.

ఒకరి తర్వాత ఒకరిని ఇంటర్ వ్యూ కోసం మేనేజర్ క్యాబిన్ లోకి పంపిస్తూ ఉన్నాడు ఒక అబ్బాయి

అలా నలుగురు వెళ్ళకా తర్వాత మైధిలి పేరు పిలిచారు…మైధిలి జాను నీ భయపడకుండా ఉండమని చెప్పి ఇంటర్ వ్యూ కోసం మేనేజర్ రూం లోకి వెళ్ళింది.

మైధిలి వెళ్లిపోవడంతో జాను కంగారు పడుతు తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న చిన్న శివలింగం నీ  బయటికి తీసి …

దాన్ని అరచేతిలో పెట్టుకొని ” శివ్వయ్య…నువ్వే నా భయాన్ని పోగొట్టి ధైర్యం వచ్చేలా చెయ్ ” అని ఆ లింగాన్ని గట్టిగా పట్టుకుని మనసులో శివ నామ స్మరణ చేసుకుంటూ ఉంటుంది.

అలా ఒక పది హెను నిమిషాల తర్వాత మైధిలి నవ్వుతూ బయటికి వచ్చి జాను నీ హగ్ చేసుకొని అటు ఇటు ఊపుతూ…

కుట్టి పాప..! నాకు జాబ్ వచ్చేసింది…” అని అరిచింది.

మైధిలి అరుపుకి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు వింతగా వాళ్ళని చూడడంతో సారీ చెప్పి వెళ్లి చైర్ లో కూర్చుని జాను బూరి బుగ్గలు పట్టుకొని లాగుతూ ..

” నాకు జాబ్ వచ్చేసింది కుట్టి పాప….” అని నవ్వుతు చెప్పింది.

జాను కూడా హ్యాపీగా నవ్వుతూ ” కంగ్రాట్స్ మైది ” అంటూ విష్ చేసింది .

అప్పుడే జాను పేరు పిలవడంతో అప్పటి వరకు నవ్వుతున్నది కాస్త భయంతో ఏడుపు మొహం పెట్టుకుంది.

అది చూసిన మైధిలి తల కొట్టుకుంటూ ” కుట్టి పాప..! భయపడకు…అక్కడ నిన్ను ఎవరు కొట్టరు , తిట్టరు. జస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పు , తెలియకపోతే వదిలేయ్ అంతే సింపుల్ ” అని చెప్పి

ఆల్ ది బెస్ట్ చెప్పి , అలాగే రెండు మోటివేషన్ మాటలు చెప్పి ఇంటర్ వ్యూ కోసం మేనేజర్ రూంలోకి పంపించింది.

@@@@@@@

డైరెక్ట్స్ అందరు భయంతో వాళ్ళ చైర్స్ లో నుంచి లేచి దూరంగా వెళ్లి నిలబడితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆ చైర్ లోనే కూర్చొని వుంటాడు.

అతను పైకి లేవాలి అని ఎంత ట్రై చేస్తున్న కూడా ఆ చైర్ లో నుంచి పైకి లేవలేక పోతున్నాడు.

ఎంటా అని కిందకి చూసిన ఆ వ్యక్తి తలకి ఒక బాడీ గార్డ్ గన్ గురి పెట్టీ ఉంటే…. ఆ వ్యక్తి కూర్చున్న చైర్ కింద టైం బాంబ్ ఫిక్స్ చేసి ఉంటుంది.

ఆ బాంబ్ చూసిన ఆ వ్యక్తి కళ్ళు ఊడి బయటికి వచ్చేలా చూస్తూ భయంతో చెమటలు కారిపోతూ ఉంటే స్ట్రెస్ ఎక్కువ అయ్యి గుండె ఆగిపోయి అక్కడికి అక్కడే చచ్చిపోయాడు ఆ వ్యక్తి.

అతను చచ్చిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకొని ” బాస్ వీడు భయంతో గుండె ఆగి చచ్చిపోయాడు ” అని చెప్పాడు ఆ బాడీ గార్డ్.

ఆ మాట వినగానే వైల్డ్ గా సాగాయి రూత్ లెస్ రాఖి బాబు పెదాలు.

రాఖి వైలెంస్ కంటే భయంతోనే అతనికి ఎదురు తిరిగిన వాళ్ళకి సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా పైకి పంపిస్తూ ఉంటాడు.

కత్తి కానీ గన్ కానీ వాడకుండా అసలు ఎలాంటి వైలెన్స్ లేకుండా కూల్ గా భయంతోనే గుండె ఆగి చచ్చేలా చేసిన రాఖి నీ చూస్తుంటేనే కింద తడిసిపోతుంది అక్కడ ఉన్న మిగిలిన బోర్డు మెంబర్ కి.

రాఖి నీ చూస్తూ ఉంటె నిలువెత్తు రాక్షసుడు వాళ్ళ కళ్ళముందే ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి.

గజ గజ వనిపోతు ఉంటారు..వాళ్ళని చూసి ” నన్ను మోసం చెయ్యాలి అని  ట్రై చేస్తే పనిష్మెంట్ ఇలానే ఉంటుంది ” అని చెప్పి ఒక పవర్ ఫుల్ లుక్ వాళ్ళందరికీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాఖి.

రాఖి ఆ రూం దాటి బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న సగం మంది బోర్డు మెంబెర్స్ అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ కాళి చేసి బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

మీటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చిన రాఖి అతని ఫ్రెండ్ విజయ్ కాల్ చెయ్యడంతో క్లయింట్ మీటింగ్ ఉంది అని అతన్ని పిక్ అప్ చేసుకొని  ఫైవ్ స్టార్ట్ హోటల్ కి వెళ్ళాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

రాఖి ఒకసారి తన వాచ్ చెక్ చేసుకొని ఆఫీసు నుంచి రెస్టారెంట్ కి వెళ్తూ మధ్యలో విజయ్ నీ పిక్ ఉప్ చేసుకోడానికి విక్రమ్ సొల్యూషన్స్ ఆఫీసు కి వెళ్తాడు.

సరిగ్గా ఇరవై నిమిషాల్లో విక్రమ్ సొల్యూషన్స్ బిల్డింగ్ ముందు కార్ దిగి లోపలికి వెళ్తాడు.

కట్ చేస్తే…

మేనేజర్ రూంకి ఇంటర్ వ్యూ కోసం వెళ్లిన జాను నీ లొంగదీసుకోడానికి ఒక వ్యక్తి ట్రై చేస్తూ ఉంటే…జాను పెద్ద పెద్ద గా అరుస్తూ , ఏడుస్తూ ఉంటుంది.

ఆ వ్యక్తి జాను డ్రెస్ అంతా చించి ఆమె తనకి సహకరించడం లేదు అని రెండు చెంపలు ఎర్రగా కందిపోయేలా కొట్టి తన మిద పడిపోతాడు.

అప్పుడే ఒక ఖరీదు అయిన బూటు కాల్ వచ్చి జాను మిద ఉన్న వ్యక్తి మొహాన్ని తన్నడం తో అతను జాను నుంచి దూరం గా పడతాడు.

ఇంతకీ ఆ వ్యక్తిని కొట్టింది ఎవరు అంటారు..? రాఖి బాబే నా…?

ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ
బంగారాలు…..

కామెంట్స్ ముఖ్యం బిగులూ🔥🔥

To be continued….