ఆ రాత్రి వల్లీకి అస్సలు నిద్ర పట్టలేదు. “మన జీవితానికి అడ్డుగా ఉన్న వాళ్లు తొలగిపోవాలి…” కరుణ పంపిన ఆ సందేశం మళ్లీ మళ్లీ గుర్తొస్తోంది. ఆ మాటలు చదివిన క్షణం నుంచి ఆమె గుండెల్లో ఒక తెలియని భయం మొదలైంది. ఇప్పటి వరకు రాఘవ తనని ప్రేమించడం లేదేమో అనుకుంది. కానీ… ఇప్పుడు విషయం అంతకంటే పెద్దదిగా కనిపిస్తోంది. ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨ ఉదయం అయింది. వెలుతురు రాకముందే వల్లీ లేచింది. ఎప్పటిలాగే ఇంటి పనుల్లో పడిపోయ…